morphing
-
విశాఖలో లోన్ యాప్ వేధింపులకు యువకుడు బలి
-
యువతి ఫొటోలు మార్ఫింగ్!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు/తెనాలి రూరల్: ఒకవైపు కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై హత్యాచారం మీద దేశవ్యాప్తంగా దుమారం కొనసాగుతోంది. మరోవైపు మహిళలకు రక్షణ కల్పిస్తామని, వేధింపులను అరికడతామని సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత రోజుకొక ప్రకటన చేస్తున్నారు. కానీ, వైద్య రంగంలోనే ఉన్న ఓ యువతి ఫొటోలను టీడీపీ నాయకుడి తమ్ముడు, మరో ఇద్దరు కలిసి మార్ఫింగ్ చేసి బెదిరించడం సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు... తెనాలికి చెందిన ఓ యువతి వైద్య రంగంలో స్పీచ్ అండ్ హియరింగ్ టెక్నీషియన్‌గా చేస్తున్నారు. ఆమె ఫొటోలను కొందరు మార్ఫింగ్ చేశారు. వాటిని కొరియర్ ద్వారా ఆమెకు పంపి బెదిరించారు. దీంతో బాధితురాలు రెండు వారాల కిందట తెనాలి టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు విచారణ చేపట్టిన పోలీసులు ప్రకాశం జిల్లా కంభం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడి సోదరుడు అబ్దుల్ సత్తార్, మార్కాపురానికి చెందిన కరుణాకర్, గుంటూరులోని గోరంట్లకు చెందిన భరత్‌ను ఐదు రోజులు కిందట అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కానీ, హార్డ్‌వేర్ ఇంజినీర్ అయిన భరత్‌ను శనివారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మిగిలిన ఇద్దరినీ గుట్టుగా తమ స్వస్థలాలకు పంపినట్టు సమాచారం. ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతానికి చెందిన ఓ ఎమ్మెల్యే ఒత్తిడి మేరకు ఇద్దరు నిందితులను వదిలేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంలో గుంటూరు జిల్లాలో పనిచేస్తున్న ప్రకాశం జిల్లాకు చెందిన ఓ పోలీసు అధికారి కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది.హైదరాబాద్ లింక్‌పై విచారణ ఏదీ? అబ్దుల్ సత్తార్, కరుణాకర్, భరత్ హైదరాబాద్ కేంద్రంగా కొన్నేళ్ల నుంచి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు సమాచారం. తెనాలి పోలీసుల విచారణలో వీరి వద్ద అనేకమంది యువతులు, మహిళల నగ్న చిత్రాలు లభించినట్లు తెలిసింది. హైదరాబాద్‌కు చెందిన ఒక మహిళ ఈ ముఠాలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. నిందితుల్లో ఒకరు ఆమెతో సహజీవనం చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. టీడీపీ నాయకుల ప్రమేయంతోనే పూర్తి స్థాయిలో విచారణ చేయకుండానే నిందితులను వదిలిపెట్టినట్లు సామాజిక మధ్యమాల్లో ప్రచారం సాగుతోంది.కేసు దర్యాప్తు పూర్తి కాలేదు ఈ కేసు దర్యాప్తు ఇంకా పూర్తి కాలేదు. కేసులో ఎవరినీ వదిలిపెట్టలేదు. ప్రధాన నిందితుడిని మాత్రమే అరెస్టు చేశాం. ఇంకా దర్యాప్తు కొనసాగుతోంది. మరింతమంది నిందితులు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ కేసులో సున్నితమైన అంశాలు ఉండడంతో పూర్తి వివరాలను అప్పుడే వెల్లడించే అవకాశం లేదు. – ఎ.సుధాకర్, తెనాలి టూ టౌన్ సీఐ -
అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు.. సీపీ శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో విచారణను తెలంగాణ పోలీసులు వేగవంతం చేశారు. ఈ క్రమంలో కేసు విచారణపై హైదరాబాద్ సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.తాజాగా సీపీ శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసులో విచారణ వేగంగా జరుగుతోంది. ఈ కేసులో సోషల్ మీడియాకి చెందిన ఐదుగురిని అరెస్ట్ చేశాం. సైబర్ క్రైమ్ పోలీసులు ట్విట్టర్‌కు లేఖ రాసి సమాచారం తీసుకున్నారు. ఏ అకౌంట్ నుంచి వీడియో అప్లోడ్ అయ్యిందో ట్విట్టర్ ఇచ్చిన సమాచారం ద్వారా పోలీసులు తెలుసుకున్నారు. వీడియో మార్ఫింగ్ ఎక్కడ జరిగిందనేది పరిశీలిస్తున్నారు.మార్ఫింగ్ వీడియోను ఫోరెన్సిక్‌కు పంపించాము. ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చిన తర్వాత కేసులో పురోగతి ఉంటుంది. ఢిల్లీ పోలీసుల కంటే ముందే మేము కేసు నమోదు చేసి విచారణ చేశాము. మా వద్ద ఉన్న వివరాలను ఢిల్లీ పోలీసులకు అందజేశాం. ఒకే కేసులో రెండు విచారణలు చేస్తే కన్ఫ్యూజ్ క్రియేట్ అవుతుంది అని వ్యాఖ్యలు చేశారు.ఎన్నికల కోసం ఫుల్ బందోబస్తు..ఇదే సమయంలో ఎన్నికల బందోబస్తు గురించి కూడా వివరించారు. ఈ క్రమంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 13,500 పోలీసులు, సీఏపీఎఫ్ నుంచి 13, సీఆర్పీఎఫ్ నుంచి 22 కంపెనీలు ఎన్నికల బందోబస్తులో ఉంటారు. పోలింగ్ రోజు క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ వద్ద సెంట్రల్ బలగాలను వాడుతాం. అసెంబ్లీ ఎన్నికలకు ఇచ్చిన దాని కంటే తక్కువ సెంట్రల్ బలగాలు ఈసారి హైదరాబాద్‌కి వచ్చాయి. మరిన్ని బలగాలను పంపాలని కోరాం.పోలింగ్ స్టేషన్స్, పోలింగ్ లోకేషన్స్ వద్ద బందోబస్తు ఏర్పాటు చేశాం. ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ టీమ్స్ నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి నడుస్తున్నాయి. హైదరాబాద్ పోలీసుల నుంచి క్విక్ రియాక్షన్ టీమ్స్ కూడా పని చేస్తున్నాయి. 85 మంది ఏసీపీలకు ప్రత్యేక టీమ్స్ ఉన్నాయి. పోలింగ్ రోజు ఈ టీమ్స్ పనిచేస్తాయి. స్ట్రాంగ్ రూమ్స్ వద్ద మూడు లేయర్ల బందోబస్తు ఏర్పాటు చేస్తాం. ఎన్నికల కోడ్ వచ్చిన రోజు నుంచి 18 కోట్ల అక్రమ నగదుని ఇప్పటివరకు పట్టుకున్నాం. అలాగే, 12 కోట్ల విలువైన బంగారం, ఇతర వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు. -
అలాంటి వీడియోలపై దృష్టి పెట్టాం: కేంద్ర మంత్రి
సాక్షి, హైదరాబాద్: నటి రష్మిక మందన్న పేరిట వైరల్ అవుతున్న మార్ఫింగ్ వీడియోల ఉదంతంపై కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందించారు. తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా నగరానికి వచ్చిన ఆయన.. ఈ అంశంపై మాట్లాడారు. డీప్ ఫేక్ వీడియోలపై కేంద్రం దృష్టిసారించిందని.. కారకులపై కఠినంగా చర్యలు తీసుకుంటామని అన్నారాయన. శుక్రవారం సోమాజిగూడ బీజేపీ మీడియా సెంటర్లో ఆయన విలేఖరులతో మాట్లాడుతూ.. ‘‘డీప్ ఫేక్ వీడియోలపై దృష్టి పెట్టాం. ఇలాంటి ఘటనలకు పాల్పడిన వారిపై కఠినంగా వ్యవహరిస్తాం. చిన్న పిల్లలు, మహిళలపై ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరం. మార్ఫింగ్ లాంటివి జీవితాలపై తీవ్ర ప్రభావం చూపెడుతాయి. ఈ పరిస్థితులు ప్రమాదకరం’’ అని అన్నారాయన. ఈ తరహా ఘటనలపై రెండేళ్లుగా కేంద్రం దృష్టిసారించిందని చెప్పిన మంత్రి రాజీవ్.. సోషల్ మీడియా నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. అంతేకాదు.. వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి సోషల్ మీడియా నిబంధనలు మరింత కఠినతరం చేస్తామని అన్నారు. కాంగ్రెస్‌కు బీఆర్ఎస్కు తేడా లేదు పదేళ్లలో కేసీఆర్ తెలంగాణకు చేసిందేమీ లేదు. కాంగ్రెస్ హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్ , ఛత్తీస్‌గఢ్, కర్ణాటక లో మాదిరిగా గ్యారంటీల పేరుతో ఎన్నికలకు వస్తోంది. ప్రజలు కాంగ్రెస్ మేనిఫెస్టో ను నమ్మట్లేదు. అందుకే గ్యారంటీ ల పేరుతో ప్రజలను మోసం చేస్తోంది. ఏ రాష్ట్రంలో కూడా తన గ్యారంటీలను కాంగ్రెస్ సరిగా అమలు చేయలేదు. కాంగ్రెస్ కర్ణాటకలో గెలిచిన అనంతరం ఇచ్చిన గ్యారంటీ లో మెలిక పెట్టింది. కర్ణాటకలో 200 యూనిట్ల వరకు ఫ్రీ పవర్ అన్నారు. కానీ అక్కడ కరెంట్ ఉండట్లేదు. తెలంగాణలో కాంగ్రెస్ కు అధికారం ఇస్తే తెలంగాణను ఏటీఎంలా వాడుకుంటుంది. అధ్యధిక నిరుద్యోగ రెట్ కాంగ్రెస్ పాలిస్తున్న రాజస్థాన్ , ఛత్తీస్ ఘడ్, హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. కాంగ్రెస్‌కు బీఆర్ఎస్కు తేడా లేదు. దొందూ దొందే. రాష్ట్రాన్ని కాంగ్రెస్ 65 ఏళ్ళు దోచుకుంటే.. బీఆర్ఎస్ పదేళ్లు దోచుకుంది. రెండూ కుటుంబ పార్టీలే. తెలంగాణలో బీజేపీ రావాల్సి అవసరం ఉంది. -
అశ్లీల కంటెంట్‌పై ఆలస్యంగా మన తారలు!
‘ఫన్ కోసం ఫేస్ మార్చేయండి’.. ఓ నాలుగైదేళ్లుగా ఎడిటింగ్ సాంకేతికత ద్వారా నడుస్తున్న సరదా ట్రెండ్. అయితే తెర వెనుక జరిగే తతంగం వేరే ఉంటోంది. సాధారణ జనాలు వీటిని సరదా వ్యవహారంగానే చూస్తున్నప్పటికీ.. అశ్లీల కంటెంట్ విపరీతంగా పుట్టుకురావడానికి ఈ టెక్నాలజీనే ఒకరకంగా కారణం అవుతోంది. సగటున రోజుకి లక్షల మార్ఫింగ్ వీడియోలు, కోట్లలో మార్ఫింగ్ ఫొటోలు ఇంటర్నెట్లో అప్లోడ్ అవుతున్నట్లు ఒక అంచనా. అయితే మన దగ్గర సెలబ్రిటీలు ఇంతకాలం ఈ వ్యవహారాన్ని తేలికగా తీసుకున్నప్పటికీ.. వేరే దేశాల్లో మాత్రం ఈ ఫేక్ కంటెంట్ కట్టడి కోసం ఎప్పటి నుంచో పెద్ద ఉద్యమమే నడుస్తోంది. సెలబ్రిటీలు ఏ పని చేసినా.. అదో వైరల్ న్యూసే!. ముఖ్యంగా గ్లామర్ ప్రపంచంలోని ఫీమేల్ సెలబ్రిటీల విషయంలో ఇది ఎక్కువ. వాళ్ల దృష్టిలో ఇంటర్నెట్ అనేది అధికప్రచార సాధనం. అందుకే తమ క్రేజ్‌ను నిలబెట్టుకునేందుకు ఫొటో.. వీడియో ఆధారిత కంటెంట్‌ను ఫాలోవర్లతో, యూజర్లతో పంచుకుంటారు. ఉదయం లేచింది మొదలు ఫిట్నెస్ మొదలుకుని.. తినడం, తిరగడం, సరదా కబుర్లు ఇలా.. రోజూవారీ అప్డేట్లు ఇస్తుంటారు. అయితే వాళ్లకు తెలియకుండానే ఆ కంటెంట్ తప్పుడు దోవలో దూసుకుపోతోంది. ఇంటర్నెట్ నిండా ఫేక్ ఫొటోలు, వీడియోలతో నిండిపోతోంది. దాదాపు పాత, కొత్త తరం తారలంతా ఫేక్ కంటెంట్ బాధితులుగానే ఉన్నారు. అశ్లీలత గురించి ఓపెన్‌గా చర్చించడం మన హీరోయిన్లకు ఇప్పటికీ నామోషీనే. అయితే తమను నెట్టింటికీడుస్తున్న వ్యవహారాలపై కూడా పోరాడటానికి కూడా ఎందుకనో వెనుకంజ వేస్తున్నారు. విదేశాల్లో మాత్రం ఇలాంటి కంటెంట్‌ను హీరోయిన్లు ఏమాత్రం సహించడం లేదు. టైటానిక్ హీరోయిన్ కేట్ విన్స్లెట్, సీనియర్ హీరోయిన్ జెస్సికా ఆల్బా ఈ విషయంలో ఫిర్యాదులు చేయడంతో పాటు సోషల్ మీడియాలో బహిరంగంగా తమ తమ మీద నడుస్తున్న మార్ఫింగ్ కంటెంట్ మీద చర్చించారు. ‘వండర్ వుమెన్’ ఫేమ్ గాల్ గాడోట్ అయితే ఏకంగా అశ్లీల కంటెంట్ కట్టడి కోసం చిన్నసైజు ఉద్యమాన్నే నడిపిస్తోంది. ఈజిప్ట్ నటి నెల్లీ కరీం.. ఓ అడుగు ముందుకు వేసి తన పేరుతో వైరల్ అవుతున్న కంటెంట్‌ను సోషల్ మీడియాలో స్క్రీన్ షాట్స్ షేర్ చేసి మరీ నిరసన వ్యక్తం చేసింది. కొందరు బ్రిటిష్ నటీమణులు సైతం ఇలాంటి అశ్లీల కట్టడి విషయంలో ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తూ వస్తున్నారు. ఈ తతంగాన్ని తీవ్రంగా పరిగణించి.. ప్రత్యేక చట్టాలు చేయాలని ఆ దేశాల ప్రభుత్వాలను కోరుతున్నవాళ్లు లేకపోలేదు. అవకాశం ఉన్నా గప్‌చుప్.. కానీ, మన దగ్గర పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది. బాలీవుడ్, మాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్.. ఇలా భాషలకతీతంగా సినీ తారలు బాధితులవుతున్నారు. గూగుల్‌లో వాళ్ల ఎడిటింగ్ కంటెంట్(అసభ్యతతో కూడుకున్నది) కుప్పలుగా కనిపిస్తోంది. దారుణమైన విషయం ఏంటంటే.. ‘ఎక్స్’, ఫేస్బుక్ లాంటి ప్రముఖ సోషల్ మీడియా సైట్లలోనూ వేల కొద్దీ అకౌంట్ల ద్వారా అలాంటివి వ్యాప్తి చెందుతుండడం, అలాంటి పేజీలకు వేల నుంచి లక్షల్లో ఫాలోవర్స్ ఉండడం!. ఈ తరహా వ్యవహారంలో వ్యక్తిగతంగా ఫిర్యాదులు చేయడానికి ఆస్కారం ఉందని చెప్తున్నారు న్యాయ నిపుణులు. ఐసీసీలోని సెక్షన్ 292(అశ్లీల కంటెంట్‌ను సర్క్యులేట్ చేయడం), 354సీ(అనుమతి లేకుండా అసభ్య వీడియోల్ని చిత్రీకరించడం), 499(వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీయడం), 509(మహిళా గౌరవానికి భంగం కలిగించడం), వీటితో పాటు ఐటీ యాక్ట్‌లో 66ఈ, 67, 67ఎ, 72 సెక్షన్లు ఇలాంటి ఫేక్ వీడియో, ఫొటోల సర్యులేషన్ పై కఠిన చర్యలుంటాయనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. చిన్నతారలు ధైర్యంగా.. ఇంటర్నెట్లో దాదాపు అగ్ర హీరోయిన్ల ఫేక్ వీడియోల, ఫొటో కంటెంట్ ఎక్కువగా చక్కర్లు కొడుతుంటాయి. కానీ, ఈ విషయంలో అగ్ర తారల కంటే చిన్న ఆర్టిస్టులే ధైర్యం చేసి ఫిర్యాదులు చేస్తున్నారు. కొన్ని నెలల క్రితం తమిళ చలన చిత్ర పరిశ్రమకు చెందిన ఓ చిన్న నటి.. ట్విటర్లో హీరోయిన్ల ఫేక్ ఫొటోల్ని షేర్ చేస్తున్న ఓ అడల్ట్ అకౌంట్‌కు ఫాలో రిక్వెస్ట్ పెట్టింది. అది చూసి సంబురంగా ఆ స్క్రీన్ షాట్‌ను షేర్ చేసి మరీ ఆమె ఫాలో రిక్వెస్ట్‌ను యాక్సెప్ట్ చేశాడు ఆ అకౌంట్ అడ్మిన్. వెంటనే సైబర్ విభాగానికి ఫిర్యాదు చేసి అతన్ని కటకటాల వెనక్కి నెట్టించింది ఆమె. అలా.. కొందరు ఈ-సెలబ్రిటీలు(సోషల్ మీడియా ద్వారా పాపులర్ అయిన వాళ్లు), షార్ట్‌ఫిల్మ్ తారలు, చిన్నాచితకా క్యారెక్టర్లు చేసే నటీమణులు ఫిర్యాదుల విషయంలో ముందుకొచ్చిన సందర్భాలు ఉన్నాయి. రష్మిక వీడియో.. అసలేం జరిగిందంటే.. ఫొటో మార్ఫింగ్, ఎడిటింగ్లు సరదా కోసం చేయడం సాధారణమైన వ్యవహారం. కానీ, టెక్నాలజీ అప్డేట్ మూలంగా అది మరీ శ్రుతి మించిపోతోంది. అందులో ప్రముఖంగా చెప్పుకోదగింది.. ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది డీప్‌ఫేక్ టెక్నాలజీ. నేషనల్ క్రష్‌గా పేరుండి.. సోషల్ మీడియాలోనూ విపరీతంగా ఫాలోయింగ్ ఉన్న రష్మిక మందన్నకు సంబంధించిన ఓ వీడియో ఈ మధ్య వైరల్ అయ్యింది. అయితే ఎక్స్ మాధ్యమం ద్వారా ఆ వీడియో పలువురు ప్రముఖుల దృష్టికి వెళ్లింది. ఫైనల్‌గా అందులో ఉంది రష్మిక కాదని.. జారా పటేల్ అనే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అని తేలింది. అయితే అప్పటికే ఆ వీడియో గురించి విపరీతమైన చర్చ నడిచింది. రష్మికతో గతంలో ఓ చిత్రంలో నటించిన బాలీవుడ్ బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ సైతం స్పందించడంతో ఈ వ్యవహారం వార్తల్లోకి ఎక్కింది. మరోవైపు ఈ వీడియో వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం సైతం స్పందించింది. ఇంటర్నెట్ ను వినియోగించే వాళ్ళందరికీ భద్రత కల్పించే విషయంలో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ వ్యవహారంలో బాధ్యత ఆ సోషల్ మీడియా ప్లాట్ఫారమ్దేనని, ఏ వినియోగదారు కూడా తమ అకౌంట్ నుంచి తప్పుడు సమాచారాన్ని పోస్ట్ చేస్తే దాని 36 గంటల్లోగా సదరు ఫ్లాట్‌ఫారమ్ తొలగించాలని, ఈ నిబంధనలు పాటించకపోతే చట్టపరమైన చర్యలకు గురి కావలసి వస్తుందని హెచ్చరించారు. ఇక తాజాగా ఈ డీప్ ఫేక్ వీడియో పై రష్మిక మందన సైతం స్పందించింది. ఇలాంటి ఓ ఘటనపై స్పందించాల్సి రావడం నిజంగా ఎంతో బాధ కలిగిస్తుందని చెప్పుకొచ్చింది రష్మిక. డీప్ ఫేక్‌తో పాటు ఫేస్ స్వాప్ కూడా.. డీప్‌ఫేక్ ఫీచర్.. ఇది ఒకరకంగా మార్ఫింగ్ లాంటిదే. ఆర్టిఫిషియల్ ఇంటలిజెంట్ టూల్‌ను ఉపయోగించి ఇతర వ్యక్తుల ఫోటోల్లో, వీడియోల్లో నచ్చని వారి ఫోటోలను చొప్పించి, నకిలీ చిత్రాలను, విడియోలను తయారు చేసే సింథటిక్ మీడియా. డీప్‌ఫేక్ ఫీచర్ సాయంతో అల్రెడీ మొబైల్లో ఉన్న వీడియోతోగానీ, అప్పటికప్పుడు చేసే వీడియోతో ఫన్నీ వీడియోల్ని క్రియేట్ చేయొచ్చు. ఒక వీడియోలోగానీ, ఫొటోలోగానీ ముఖాన్ని ఈ ఫీచర్ ద్వారా మార్చేయొచ్చు. ఆ ప్లేస్‌లో యూజర్ తన ఫేస్‌ని లేదంటే తనకు కావాల్సిన ముఖాన్ని అప్డేట్ చేసి ఓ కొత్త వీడియో క్రియేట్ చేసుకోవచ్చు. ఇదంతా ఒక సరదా వ్యవహారం. ఇందుకోసం కోట్లు ఖర్చు చేసి ఏఐ(ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్సీ) టెక్నాలజీ సాయం తీసుకుంటున్నారు. కానీ, సినీ ఫీల్డ్ సెలబ్రిటీలకు ఫేక్ వీడియోలతో ఇప్పుడిది కొత్త తలనొప్పిగా మారింది. మరోవైపు యూట్యూబ్‌లోనూ డీప్‌ఫేక్ టెక్నాలజీ, బాధిత హీరోయిన్ల గురించి టెక్ గురూలు, నిపుణులు దాని గురించి వీడియోలు బోలెడన్ని కనిపిస్తుంటాయి. ఇక అశ్లీలతను వ్యాప్తిచెందిస్తోన్న మరో టెక్నాలజీ ఫేస్ స్వాప్. రివెంజ్ పోర్న్ ద్వారా వార్తల్లోకి ఎక్కిన ఫేస్ స్వాప్.. ఆ తర్వాత ఓ ఎంటర్టైనింగ్ ఫీచర్\టూల్‌గా మారింది. దీనిని ఆసరాగా తీసుకుని ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలను తెర మీదకు తెస్తున్నారు కొందరు. హీరోయిన్ల ఫొటోలను ఎడిట్ చేసి.. ఇంటర్నెట్లో వదులుతున్నారు. -
రావణుడిగా రాహుల్ మార్ఫింగ్ ఫోటో.. తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ నిరసన
సాక్షి, హైదరాబాద్: నేడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలకు టీపీసీసీ పిలుపునిచ్చింది. రాహుల్ గాంధీ ఫోటోలను మార్ఫింగ్ చేసి రావణుడిగా చిత్రీకరించి.. బీజేపీ నేతలు సోషలో మీడియాలో ప్రచారం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీ, మోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేయాలని పిలుపునిచ్చారు. దీంతో అన్ని జిల్లాల్లో నిరసన కార్యక్రమాలకు కాంగ్రెస్ నేతలు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ చేసిన ట్వీట్ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. రావణుడి అవతారంలో రాహుల్ గాంధీ ఫొటోను బీజేపీ ట్విట్టర్లో షేర్ చేసింది. ఇక, రాహుల్ ఫొటోకు మరింత వివాదాస్పదంగా టైటిల్‌ను పెట్టింది. దుర్మార్గుడు, ధర్మ వ్యతిరేకి, రాముడికి వ్యతిరేకి అంటూ కింద క్యాప్షన్ రాసుకొచ్చింది. భారత దేశాన్ని నాశనం చేయడమే రాహుల్ గాంధీ లక్ష్యం అంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతూ కామెంట్స్ చేసింది. ఈ వివాదాస్పద ఫొటోపై కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. చదవండి: 15 నుంచి కాంగ్రెస్ బస్సుయాత్ర! -
వీబీఐటీ కాలేజీలో విద్యార్థినిల ఫోటోలు మార్ఫింగ్ కలకలం
-
అది ‘ఐ–టీడీపీ’ పనే
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష టీడీపీ సోషల్ మీడియా విభాగం ‘ఐ–టీడీపీ’పై ఏపీ సీఐడీ విభాగం కేసు నమోదు చేసింది. మార్ఫింగ్ వీడియోల ద్వారా హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ ప్రతిష్టకు భంగం కలిగించిందన్న ఫిర్యాదుపై టీడీపీ సోషల్ మీడియా విభాగంపై కేసు నమోదు చేశారు. కుట్రపూరితంగా వ్యవహరించడం, దుష్ప్రచారానికి ఒడిగట్టి గౌరవానికి భంగం కలిగించడం, ఫోర్జరీకి పాల్పడిన అభియోగాలపై ఐటీ, ఐపీసీలోని ఫోర్జరీ చట్టాల కింద కేసు నమోదు చేసినట్టు మంగళవారం ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఈ మేరకు ‘ఐ–టీడీపీ’, మరికొందరిపై ఐటీ(66టి), ఐపీసీ 465, 469, 471, 153(ఎ), 505(2), 120(బి) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఎంపీ గోరంట్ల మాధవ్ పేరుతో ఇటీవల ఓ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. దీనిపై ఎంపీ మాధవ్ పోలీసులు, సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. మార్ఫింగ్ వీడియోను వైరల్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. దాంతో అనంతపురం పోలీసులు విచారించగా, అది ఫేక్ వీడియో అని నిర్ధారణ అయ్యింది. ఆ మార్ఫింగ్ వీడియోను ఐ–టీడీపీ సోషల్ మీడియా గ్రూప్ తొలుత సోషల్ మీడియా ద్వారా వైరల్ చేసినట్టు కూడా వెలుగు చూసింది. అది ఒరిజినల్ కానేకాదు.. ఆ వీడియో అసలైనదేనని అమెరికాకు చెందిన ‘ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ’ నిర్ధారించినట్టుగా టీడీపీ నేతలు విలేకరుల సమావేశంలో చెప్పారు. ఆ మేరకు ఎక్లిప్స్ ల్యాబరేటరీ జారీ చేసినట్టుగా ఓ సర్టిఫికెట్‌ను కూడా విడుదల చేశారు. కాగా, ఫోరెన్సిక్ సర్టిఫికెట్ అంశాన్ని పరిశీలించాలని ప్రభుత్వం సీడీఐ విభాగాన్ని ఆదేశించింది. దాంతో సీఐడీ అధికారులు అమెరికాలోని ఎక్లిప్స్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీని సంప్రదించగా అసలు విషయం వెలుగు చూసింది. ఆ వీడియో అసలైందేనని తాము ఎలాంటి సర్టిఫికెట్ జారీ చేయలేదని ఆ ల్యాబొరేటరీ స్పష్టం చేసింది. ఓ సెల్ఫోన్లో ప్లే చేస్తున్న వీడియోను మరో సెల్ ఫోన్ ద్వారా రికార్డు చేసిన క్లిప్‌ను మాత్రమే ప్రసాద్ పోతిని అనే వ్యక్తి తమకు పంపినట్టుగా తెలిపింది. వీడియో కాల్ మాట్లాడుతుండగా మొదట రికార్డు చేసిన వీడియో క్లిప్‌ను పంపిస్తే ఆ వీడియోను మార్ఫింగ్ చేశారో లేదో నిర్ధారించగలం తప్ప.. ఇలా ఒక క్లిప్‌ను మూడో వ్యక్తి సెల్‌ఫోన్ నుంచి రికార్డు చేసిన వీడియోను పరిశీలించి నిర్ధారించలేమని కూడా సీఐడీ విభాగానికి పంపిన ఈ మెయిల్లో స్పష్టం చేసింది. దాంతో ఎంపీ మాధవ్ పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియో మార్ఫింగేనన్నది స్పష్టమైంది. వాస్తవానికి ఓ ల్యాబరేటరీ ఇచ్చిన సర్టిఫికెట్‌ను యథాతథంగా విడుదల చేయాలి. సర్టిఫికెట్లో మార్పులు చేయడం అన్నది చట్ట వ్యతిరేకం. కానీ టీడీపీ నేతలు ఎక్లిప్స్ ల్యాబొరేటరీ సర్టిఫికెట్‌ను ట్యాంపర్ చేసి మీడియాకు విడుదల చేయడం గమనార్హం. దీనిపై ఎంపీ మాధవ్ ఫిర్యాదుతో సీఐడీ అధికారులు దర్యాప్తు చేపట్టారు. -
మార్ఫింగులతో రాజకీయం దుర్మార్గం
సాక్షి, అమరావతి: టీడీపీ నీచ రాజకీయాలు మరోసారి బయట పడ్డాయని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రాజా అన్నారు. మార్ఫింగ్ వీడియోలతో రాజకీయం చేస్తుండటం దుర్మార్గమని మండిపడ్డారు. వైఎస్సార్సీపీపై, ప్రభుత్వంపై బురదజల్లటానికి టీడీపీ నేతలు ఎంతగా దిగజారి పోయారో ప్రజలందరూ చూశారన్నారు. ఐ టీడీపీ అంటే లోకేశ్ నడిపించే ఓ తప్పుడు ప్రచార విభాగం అని ఆరోపించారు. అందులో మార్ఫింగ్ వీడియోలు అప్లోడ్ చేసి, ప్రభుత్వ ప్రతిష్టతను దెబ్బకొట్టాలనే కుటిలయత్నం బట్టబయలు అయిందన్నారు. బుధవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. ఒక మేనిఫెస్టోతో రాజకీయం చేయాలి కానీ, మార్ఫింగ్ వీడియోలతో కాదని హితవు పలికారు. టీడీపీ అంటే తెలుగు దుష్ప్రచారాల పార్టీ అని అందరూ అనుకొంటున్నారన్నారు. జగన్ లాంటి సీఎం ఉండటం అదృష్టం అని మహిళలు భావిస్తున్నారని తెలిపారు. దీన్ని చూసి సహించలేక.. ఇలాంటి కుట్రలు, కుతంత్రాలు, దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారన్నారు. టీడీపీ హయాంలో మహిళలపై సాగిన దారుణాల గురించి ఆ పార్టీ మహిళా నేత అనిత సమాధానం చెప్పాలని నిలదీశారు. కాల్ మనీ సెక్స్ రాకెట్లో ఆరోపణలు ఎదుర్కొన్న బుద్దా వెంకన్న, బోడే ప్రసాద్‌లను ఎందుకు సస్పెండ్ చేయలేదని ప్రశ్నించారు. ఇసుక మాఫియాను అడ్డుకొన్న మహిళాధికారిపై చింతమనేని ప్రభాకర్ దాడి చేస్తే ఏమి న్యాయం చేశారో చెప్పాలన్నారు. -
వీడియో దుష్టచతుష్టయం సృష్టే: గోరంట్ల మాధవ్
సాక్షి, న్యూఢిల్లీ: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మార్ఫింగ్ వీడియోపై ఎంపీ గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. గోరంట్ల మాధవ్ బుధవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. ఇది రాజకీయ కుట్ర. కొంత మంది దుర్మార్గులు చేసి పని ఇది. ఇది మార్ఫింగ్ చేసిన వీడియో అని ఆరోజే చెప్పాను. చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, ఏబీఎన్, టీవీ-5 కుట్ర చేశారు. ఏబీఎన్ రాధాకృష్ణ ఓ బ్రోకర్. నూటికి నూరు శాతం ఫేక్ వీడియోను క్రియేట్ చేశారు. మీ చరిత్ర హీనమైంది. చంద్రబాబు నీకు కళ్లు కనపడటం లేదా?. ఇకనైనా నీ నీచ రాజకీయాలు మానుకో. ఇలాంటి నీచమైన చర్యలతో నీ పార్టీ బతకదు. తెలుగుదేశం పార్టీ నికృష్టపు ఆలోచనలు చేస్తోంది. నేను కడిగిన ముత్యంలాగే బయటకు వస్తానని తెలుసు. ఫేక్ వీడియో సృష్టించి నన్ను అవమానించాలని చూశారు. ఈ అంశంపై న్యాయపోరాటం చేస్తాను. టీడీపీ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వ్యతిరేక పార్టీ. వెనుకబడిన వర్గాలు ఎదిగితే ఓర్వలేని పార్టీ అది. చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకుంటారు. నాకు మద్దతు తెలిపిన వారందరకీ కృతజ్ఞతలు. ఇక ఈ రాద్దాంతానికి ఫుల్స్టాప్ పెట్టాలి అంటూ కామెంట్స్ చేశారు. ఏదో జరిగిపోతోందని ప్రజలను నమ్మించడానికి ప్రయత్నించారు. అయ్యన్న పాత్రుడు విషం చిమ్మాలని చూశారు. వీడియో వెనుక ఉన్నవారెవరో పోలీసులు తేల్చాలి. ఏబీఎన్, టీవీ5 టీడీపీని ఎంతగా లేపాలని చూసినా ఆ పార్టీ లేవదు. టీడీపీ నేతలకు కనీసం నైతిక విలువలు కూడా లేవు. టీవీ5, ఏబీఎన్ యజమానులు ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలి. అరగుండు అయ్యన్నపాత్రుడి కుమారుడు నాపై విషం చల్లారు అని మండిపడ్డారు. ఇది కూడా చదవండి: ఎంపీ గోరంట్ల వీడియో ఫేక్.. మార్ఫింగ్ లేదా ఎడిటింగ్ చేసి ఉండొచ్చు.. -
మార్పింగ్ కు సచిన్ టెండూల్కర్ బలి
-
Vijayawada: ఉత్సవాలపై ‘పచ్చ’విషం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వంపై బురద జల్లేందుకు రోజుకో దుష్ప్రచారాన్ని తెరపైకి తెస్తున్న విపక్ష టీడీపీ చివరికి పవిత్ర ఉత్సవాలను సైతం విడిచి పెట్టలేదు. దసరా ప్రాశస్త్యం, భక్తుల మనోభావాలను గాయపరుస్తూ అపచారానికి తెగించింది. ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకల కోసం అమ్మవారి ఆలయానికి చేసిన విద్యుద్దీపాలంకరణ ఫొటోలను మార్ఫింగ్ చేసి తనకు అలవాటైన రీతిలో దుష్ప్రచారానికి పాల్పడింది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిర్వహించే దసరా ఉత్సవాల్లో కూడా విపక్షం ఇలా వ్యవహరించడం పట్ల భక్తులు మండిపడుతున్నారు. పోలీసు శాఖ ఫ్యాక్ట్ చెక్ ఈ కుట్రను బట్టబయలు చేసింది. మార్ఫింగ్ ఫొటోలతో దుష్ప్రచారం.. ఇంద్రకీలాద్రిపై విద్యుద్దీపాలంకరణ దృశ్యాలంటూ టీడీపీతోపాటు కొన్ని ప్రతిపక్ష పార్టీలు గురువారం ఓ ఫొటోను సోషల్ మీడియాలో ప్రచారంలోకి తెచ్చాయి. కనకదుర్గమ్మ ఆలయం చుట్టూ కేవలం నీలం రంగు విద్యుద్దీపాలనే అలంకరించినట్లుగా ఆ ఫొటోలో ఉంది. ‘వైఎస్సార్ పార్టీ కార్యాలయం అనుకునేరు.. కాదు... విజయవాడ కనకదుర్గమ్మ గుడి’ అంటూ ఆ ఫొటోపై వ్యాఖ్యను జోడించింది. ఇంద్రకీలాద్రిని వైఎస్సార్సీపీ కార్యాలయంగా మార్చేశారంటూ సోషల్ మీడియాలో ఆ ఫొటోను వైరల్ చేశారు. వాస్తవం ఏమిటంటే... ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసింది. కనకదుర్గమ్మ ఆలయంతోపాటు ఇంద్రకీలాద్రి మొత్తాన్ని రంగుల విద్యుద్దీపాలతో అందంగా అలంకరించించింది. ఆలయ స్వర్ణ గోపురం శోభాయమానంగా భాసిల్లుతుండగా ప్రాకారం చుట్టూ అలంకరించిన విద్యుద్దీపాలు సప్తవర్ణ శోభితంగా కాంతులీనుతూ కన్నుల పండుగ చేస్తున్నాయి. అన్ని రంగుల విద్యుద్దీపాలూ వరుస క్రమంలో(సీరియల్ లైట్లు) వెలుగుతూ సముద్రతీరంలో కెరటాలను తలపించే రీతిలో కాంతి తరంగాలను ప్రసరింపజేస్తూ అనిర్వచనీయమైన ఆధ్యాత్మిక శోభను కలిగిస్తున్నాయి. ఇందులో ఏ ఒక్క రంగూకు ప్రత్యేక ప్రాధాన్యమంటూ లేదు. ఏ ఒక్క రంగూ స్థిరంగా ఉండదు. అన్ని రంగుల్లోనూ విద్యుద్దీపాలు కాంతులీనుతూ ఇంద్రకీలాద్రిపై దసరా వేడుకలను మరింత శోభాయమానం చేస్తున్నాయి. ‘ఫ్యాక్ట్ చెక్’ ఏం తేల్చింది? టీడీపీ, ఇతర ప్రతిపక్ష పార్టీలు సోషల్ మీడియాలో ప్రచారంలోకి తెచ్చిన ఫొటోను గుర్తించిన కొందరు భక్తులు నిజానిజాలు తెలుసుకునేందుకు చొరవ చూపారు. పోలీసు శాఖ ఫ్యాక్ట్ చెక్ విభాగానికి ఈ విషయాన్ని నివేదించడంతో వెంటనే స్పందించింది. ఫ్యాక్ట్‌చెక్ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నిశితంగా పరిశీలించగా అవి మార్ఫింగ్ చేసిన ఫొటోలని నిగ్గు తేలింది. ఇంద్రకీలాద్రిపై సీరియల్ లైట్లతో విద్యుద్దీపాలంకరణలో ఏ ఒక్క రంగుకూ ప్రాధాన్యమివ్వలేదని, సప్త వర్ణాల విద్యుద్దీపాలతో అలంకరించారని వెల్లడైంది. అదే విషయాన్ని పోలీసు శాఖ సోషల్ మీడియా వేదికల ద్వారా వెల్లడించింది. దుష్ప్రచారంపై విచారణ జరిపి కారకులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. -
ఈసారి 'వినయ విధేయ వార్నర్'లా..
మెల్బోర్న్: తెలుగు హీరోలను, సినిమాలను క్రమం తప్పకుండా ఫాలో అవుతూ, వారి ఫోటోలను మార్ఫింగ్ చేస్తూ తరుచూ సోషల్ మీడియాలో షేర్ చేసే ఆసీస్ స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్.. తాజాగా మెగా పవర్ స్టార్ రాంచరణ్‌ను వాడేశాడు. రాంచరణ్, కియారా అడ్వానీ నటీనటులుగా నటించిన వినయ విధేయ రామ సినిమాలోని యాక్షన్ సీన్లతో స్వాపింగ్ వీడియో రూపొందించి, తన ఇన్‌స్టా ఖాతాలో షేర్ చేశాడు. నేను మళ్లీ వచ్చేశాను. ఈ లెజెండ్ ఎవరు? ఇది ఏ సినిమాలో సన్నివేశం అని క్యాప్షన్ జోడించాడు. ఈ పోస్టుకు హీరోలు రాంచరణ్, రానా దగ్గుబాటి, ప్రభాస్‌లను ట్యాగ్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుత నెట్టింట హల్చల్ చేస్తుంది. దీనిపై రాంచరణ్ అభిమానులు భిన్నంగా స్పందిస్తున్నారు. View this post on Instagram A post shared by David Warner (@davidwarner31) కాగా, బుట్టబొమ్మ సాంగ్‌తో స్వాపింగ్ వీడియోలను రూపొందించడం ప్రారంభించిన ఈ ఆసీస్ స్టార్ క్రికెటర్.. ఆతర్వాత చాలా మంది తెలుగు అగ్ర హీరోలకు చెందిన సినిమాల్లోని సీన్లతో వీడియోలు చేశాడు. ఇటీవలే రాజమౌళీ ఆర్ఆర్ఆర్ పోస్టర్‌ను మార్ఫింగ్ చేసిన వార్నర్.. దానికి వచ్చిన రెస్పాన్స్ చూసి వినయ విధేయ రామను వాడాడు. ఈ మధ్యకాలంలో పేస్ ఆఫ్ యాప్‌ను ఉపయోగించి సౌత్ స్టార్స్ సినిమాల్లోని సన్నివేశాల్లో నటిస్తున్న డేవిడ్ భాయ్.. కొంతకాలంగా ఇలాంటి ప్రయోగాలనే చేస్తూ బీజీగా గడుపుతున్నాడు. ఈ ఏడాది ఐపీఎల్ రద్దు కావడంతో ఖాళీగా ఉన్న వార్నర్.. ఎక్కువ శాతం సమయాన్ని మార్ఫింగ్ వీడియోలు చేయడానికి కేటాయించడం విశేషం. -
మార్ఫింగ్‌తోనే ఉమా ట్వీట్.. వాస్తవాల నిగ్గు తేల్చిన ‘ఫ్యాక్ట్ చెక్’
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాటలను వక్రీకరిస్తూ మార్ఫింగ్ వీడియోతో తిరుపతి ఓటర్లను తప్పుదారి పట్టించేందుకు టీడీపీ మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పన్నిన కుట్ర బూమరాంగ్ అయింది. ఆయన దురుద్దేశాలను పటాపంచలు చేస్తూ ఫ్యాక్ట్ చెక్ టీమ్ అసలు వాస్తవాలను నిగ్గుతేల్చి గురువారం వాటిని వెల్లడించింది. ఆ వివరాలు.. ‘‘ఎవరైనా తిరుపతిలో వచ్చి ఉండండి అంటే ఎవరూ రారు. ఏ వ్యక్తి కూడా ఒడిశాలో ఉండడానికో.. బీహార్‌లో ఉండడానికో.. తిరుపతిలో ఉండడానికో ఇష్టపడడు.. అంటూ గతంలో తిరుపతిని కించపరిచిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు తిరుపతి పార్లమెంటులో ఓట్లు అడిగే నైతిక హక్కు ఎక్కడిది?’’ అంటూ సీఎం వైఎస్ జగన్ మార్ఫింగ్ వీడియోతో ఉమా బుధవారం ట్వీట్ చేశారు. ఫ్యాక్ట్ చెక్ టీమ్ రంగంలోకి దిగి ఇందుకు సంబంధించిన వాస్తవాలను వెల్లడించింది. ఆరేళ్ల కాలంలో వేర్వేరు సందర్భాల్లో సీఎం వైఎస్ జగన్ మాట్లాడిన వీడియోలను మార్ఫింగ్ చేసి ఉమా ట్వీట్ చేశారని నిర్ధారించింది. మార్ఫింగ్ వీడియోకు ఆడియో కూడా సరిపోకపోవడంతో ఇది ఉద్దేశపూర్వంగా చేసినదేనని పేర్కొంది. 2014 ఏప్రిల్ 13న వైఎస్సార్సీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసిన సందర్భంలోను, 2019 మే 26న ఢిల్లీ పర్యటన సందర్భంలోను సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన మీడియా సమావేశాల వీడియో క్లిప్‌లను కావాల్సిన మేరకు సేకరించి వాటిని మార్ఫింగ్ చేసి వ్యతిరేక భావన వచ్చేలా రూపొందించినట్లు తేలింది. వాస్తవానికి ఆయా మీడియా సమావేశాల్లో.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం తీసుకోనున్న చర్యలు, వైద్య ఆరోగ్య విభాగంలో ఎక్కడైనా సరే మౌలిక వసతులు ఏర్పాటుచేయకుండా వైద్య నిపుణులు తిరుపతి, ఒడిశా, బిహార్‌లో ఉండటానికి ఇష్టపడరనే విషయాన్ని సీఎం వైఎస్ జగన్ ప్రస్తావించారు. ఆయా వీడియోలను ఉమా ‘స్మార్ట్ ఎడిటర్’తో మార్ఫింగ్ చేశారని, వాటిలోని దృశ్యానికి ఆడియో అనుసంధానం చేస్తూ ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశారని ఫ్యాక్ట్ చెక్ తేల్చింది. ఈ తేడాలను అందరూ గమనించేలా ఒరిజినల్ ఆడియోతో ఉన్న ఒరిజినల్ వీడియోను, ఉమా మార్ఫింగ్ వీడియో క్లిప్‌లను కూడా ఊ్చఛ్టిఇజ్ఛిఛిజు.అ్క.ఎౌఠి.జీn వెబ్సైట్లో ఉంచారు. తిరుపతి ఉపఎన్నికలో ఓటర్లను ప్రభావితం చేయడానికి, మతపరమైన ఉద్రిక్తతలు సృష్టించేందుకు ఉమా మార్ఫింగ్ వీడియోతో చేసిన ట్వీట్‌పై చట్టపరమైన చర్యలకు ఫ్యాక్ట్ చెక్ తగిన ఆధారాలతో సంబంధిత అధికారులకు సిఫారసు చేసింది. -
అకౌంట్ టేకోవర్.. నయా ట్రిక్..
సాక్షి, సిటీబ్యూరో: వ్యాపార సంస్థలను టార్గెట్‌గా చేసుకుని ఈ–మెయిల్స్ హ్యాకింగ్, స్ఫూఫింగ్ ద్వారా వారికి రావాల్సిన డబ్బు కాజేసే నేరాలను అకౌంట్ టేకోవర్ క్రైమ్‌గా పిలుస్తారు. ఈ తరహా నేరాలు చేసే సైబర్ క్రిమినల్స్ ఇప్పుడు కొత్త పంథా అనుసరిస్తున్నారు. సికింద్రాబాద్‌కు చెందిన హేమ ఎలక్ట్రానిక్స్ సంస్థ శుక్రవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వ్యాపారికి అనుమానం రాకుండా.. అకౌంట్ టేకోవర్ చేయడం కోసం తొలుత సైబర్ నేరగాళ్లు వ్యాపార/ఆర్థిక లావాదేవీతో కూడిన సంస్థల ఈ–మెయిల్ ఐడీలను హ్యాక్ చేస్తారు. అందులో ఉండే లావాదేవీలతో పాటు వారి భాషా శైలి, చెల్లింపులు/వసూళ్ల విధానం క్షుణ్ణంగా పరిశీలిస్తారు. హ్యాక్ చేసిన తర్వాత ఏ దశలోనూ సదరు వ్యాపారికి అనుమానం రాకుండా జాగ్రత్తపడుతూ వారికి డబ్బు రావాల్సి వచ్చినప్పుడు స్ఫూఫింగ్‌కు దిగుతున్నారు. నిర్ణీత రుసుం తీసుకుని స్ఫూఫింగ్ సాఫ్ట్వేర్, సదుపాయాన్ని అందించే వెబ్సైట్లు ఇంటర్నెట్లో అనేకం ఉన్నాయి. వీటిలోకి ఎంటర్ అయిన సైబర్ నేరగాడు తన ఈ–మెయిల్ ఐడీతో పాటు ఆ మెయిల్ అందుకోవాల్సిన వ్యక్తిది, రిసీవ్ చేసుకునేప్పుడు అతడి ఇన్‌బాక్స్‌లో ఏది కనిపించాలో అది కూడా పొందుపరుస్తారు. ఆ తర్వాత నగదు తీసుకోవాల్సిన వ్యక్తి పంపినట్లే ఇవ్వాల్సిన వారికి మెయిల్ చేస్తారు. వ్యాపారుల ఈ–మెయిల్స్ అప్పటికే హ్యాక్ చేసి ఉండటంతో వారే పంపిస్తున్నట్లు కస్టమర్లకు లేఖ పంపిస్తున్నారు. బ్యాంకు చెక్కునే మార్ఫింగ్ చేసి.. అనివార్య కారణాల నేపథ్యంలో తమ బ్యాంకు ఖాతా మారిందని, కొత్త అకౌంట్లో నగదు వేయాలని చెప్తూ నేరగాళ్లకు సంబంధించిన నంబర్ ఇస్తున్నారు. దీంతో సదరు వ్యాపారికి చేరాల్సిన డబ్బు వీరి ఖాతాలో పడిపోతోంది. హేమ ఎలక్ట్రానిక్స్ పేరుతో దాని కస్టమర్ సంస్థకు మెయిల్ పంపిన నేరగాళ్లు మరో అడుగు ముందుకు వేశారు. ఎదుటి వారు పూర్తిగా నమ్మడం కోసం తమ బ్యాంకు చెక్కునే మార్ఫింగ్ చేశారు. వారి పేరు ఉండాల్సిన చోట హేమ ఎలక్ట్రానిక్స్ అని రాసి దాన్ని చెల్లింపులు చేసే వారికి పంపిన ఈ–మెయిల్లో అటాచ్ చేశారు. దీన్ని చూసిన ఓ కస్టమర్ హేమ ఎలక్ట్రానిక్స్‌కు చెల్లించాల్సిన రూ.లక్ష సైబర్ నేరగాళ్ల ఖాతాలో వేశాడు. ఈ విషయం తెలుసుకున్న హేమ సంస్థ తరఫు వాళ్లు శుక్రవారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. ఇది నైజీరియన్ నేరగాళ్ల పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. మరో నాలుగు కేసుల్లో.. ♦ గౌలిగూడకు చెందిన యువకుడు కంప్యూటర్ హార్ట్‌వేర్ ఉత్పత్తుల వ్యాపారం చేస్తుంటారు. మదర్ బోర్డులను హోల్‌సేల్‌గా ఖరీదు చేయాలనే ఉద్దేశంతో ఇంటర్నెట్లో సెర్చ్ చేశారు. అందులో కనిపించిన బజాజ్ ఇంజినీర్స్ అనే సంస్థ యాడ్ చూసి వారిని సంప్రదించారు. బోర్డుల సరఫరాకు కొటేషన్లు పంపి, బేరసారాల తర్వాత ఓ ధర ఖరారైంది. అడ్వాన్సుగా రూ.2.25 లక్షలు పంపినా ఆ సంస్థ నుంచి స్పందన లేదు. సంప్రదించడానికి ప్రయత్నించగా ఫోన్లు స్విచ్ఛాఫ్ ఉండటంతో మోసపోయానని గుర్తించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. ♦ కంచన్‌బాగ్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి సైబర్ నేరగాళ్లు రూ.లక్ష స్వాహా చేశారు. అలానే టోలిచౌకి వాసి పేరుతో అతడి ప్రమేయం లేకుండా ధని లోన్ యాప్ నుంచి రూ.35 వేల రుణం తీసుకుని మోసం చేశారు. బోయిన్పల్లి ప్రాంతానికి ఓ వ్యక్తికి ఇటీవల ఆర్బీసీ బ్యాంకు నుంచి డెబిట్ కార్డు వచ్చింది. ఆ తర్వాత బ్యాంకు అధికారుల పేరుతో అతడికి ఫోన్ వచ్చింది. ఆ పేరుతో ఫోన్ చేసిన సైబర్ నేరగాళ్లు సదరు కార్డు పని చేయడం ప్రారంభించాలంటే రిజిస్ట్రేషన్ చేయాలన్నారు. ఆ పేరుతో కార్డు నెంబర్, సీవీవీ కోడ్, ఓటీపీ సహా ఇతర వివరాలు బాధితుడి నుంచి తీసుకుని రూ.1.10 లక్షలు కాజేశారు. -
వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం: తమ్మినేని
సాక్షి, అమరావతి: అసెంబ్లీ వీడియోలను మార్ఫింగ్ చేయడం తీవ్రమైన అంశమని స్పీకర్ తమ్మినేని సీతారం అన్నారు. గురువారం ఆయన మీడియాతో చిట్ చాట్ కార్యక్రమం నిర్వహించారు. సభలో జరుగుతున్న పరిణామాలను తప్పుగా మార్ఫింగ్ చేసి వీడియోలను సృష్టించి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.తాను వేసుకున్న డ్రస్ మార్ఫింగ్ వీడియోలో ఉన్న డ్రస్ కూడా వేరు వేరు అని చెప్పారు. దీనిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సభ్యులు సభ దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. దీనికి సంబంధించి చట్టపరమైన చర్యల అంశాన్ని పరిశీలిస్తున్నట్లు చెప్పారు. మీడియా అయిన సోషల్ మీడియా అయినా సరే మార్ఫింగ్ చేయడం తప్పని తమ్మినేని హితవు పలికారు. (ఏపీ: అసెంబ్లీ నిర్వహణపై కీలక నిర్ణయాలు) -
బాహుబలిగా అదరగొట్టిన ట్రంప్
-
వైరల్ : బాహుబలిగా అదరగొట్టిన ట్రంప్
భారతీయ చలన చిత్ర పరిశ్రమలో బాహుబలి సినిమా చేసిన రచ్చ అంత తేలిగ్గా ఎవరు మరిచిపోరు. బాహుబలి: ది బిగినింగ్ , బాహుబలి : ది కన్‌క్లూజన్ అంటూ రెండు భాగాలతో వచ్చిన ఈ సినిమా బారతీయ చలనచిత్ర రికార్డులను తిరగరాసింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన బాహుబలి సిరీస్ దాదాపు 2వేల కోట్లకు పైగా రికార్డు కలెక్షన్స్ సాధించి భారతీయ చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పింది. అయితే ఇదంతా ఇప్పుడు మళ్లీ ఎందుకు మాట్లాడుతున్నారనేగా మీ సందేహం.. ఏం లేదండి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం(ఫిబ్రవరి 24న) భారతగడ్డ మీద అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. (ట్రంప్ విందు.. పసందు..!) ఈ నేపథ్యంలో ట్రంప్ పర్యటనకు ఒక్కరోజు ముందు బాహుబలి టైటిల్ సాంగ్‌తో ట్రంప్‌పై రూపొందించిన ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దాదాపు నిమిషం 20 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ప్రబాస్ ముఖానికి ట్రంప్ ముఖాన్ని అతికించి బ్యాక్‌గ్రౌండ్‌లో 'జియోరే బాహుబలి' సాంగ్‌ను పెట్టారు. దీంతో పాటు ట్రంప్ భార్య మెలానియా, కుమార్తె ఇవాంకా ట్రంప్, కుమారుడు జూనియర్ డొనాల్డ్ ట్రంప్‌ను వీడియోలో చూపించారు. అలాగే ఇవాంకా ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్‌ను తండ్రి ట్రంప్ భుజాల మీద ఎత్తుకున్నట్లు చూపించారు. ఇక చివర్లో సినిమాకు శుభం కార్డు లాగా ఈ వీడియోలో కూడా 'యుఎస్ఏ అండ్ ఇండియా యునైటెడ్' అని చూపించడం ఆసక్తిని కలిగిస్తుంది. అయితే ఈ వీడియోపై ట్రంప్ స్పందిస్తూ.. 'భారత్‌లో తనకు గొప్ప స్నేహితులు ఉన్నారంటూ' రీట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. (హౌడీ X నమస్తే) కాగా రెండు రోజుల పాటు ఇండియాలో గడపనున్న ట్రంప్ సోమవారం(ఫిబ్రవరి 24) న అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు స్వాగతం పలుకుతారు. అనంతరం భారీ సందోహం నడుమ దాదాపు 22 కిలోమీటర్లు ప్రయాణించి సబర్మతీ ఆశ్రమం వద్దకు చేరుకుంటారు. గాంధీకి అనుబంధంగా ఉన్న సబర్మతీ ఆశ్రమం వద్ద మోదీ, ట్రంప్‌లు కలసి నివాళులు అర్పిస్తారు. అనంతరం ట్రంప్‌కు గాంధీ చరిత్రకు సంబంధించిన పుస్తకాలను బహూకరించనున్నారు.తర్వాత మొటెరా స్టేడియానికి ట్రంప్, మోదీ కలసి వెళ్తారు. ఇక్కడ జరగనున్న బహిరంగ సభలో దాదాపు 1.25 లక్షల మంది ప్రజలు హాజరవుతారని అధికారుల అంచనా. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే పలు కార్యక్రమాలను ఇక్కడ ప్రదర్శిస్తారు. Look so forward to being with my great friends in INDIA! https://t.co/1jdk3AW6fG — Donald J. Trump (@realDonaldTrump) February 22, 2020 -
‘థూ నీ బతుకు చెడా’ వైరల్.. కళాకారుడి ఆవేదన!
సాక్షి, హైదరాబాద్ : విమర్శలు, ప్రతి విమర్శలు.. ఆరోపణలు, ప్రత్యారోపణలు.. దూషణలు, తిట్లు.. ఎన్నికలంటే ఇవి ఎప్పుడూ ఉండేవే. కానీ ఈసారి ఎన్నికల్లో వీటితోపాటు సోషల్ మీడియా కూడా ప్రధాన భూమిక పోషిస్తోంది. సోషల్ మీడియాలో ప్రచారాన్ని ముమ్మరం చేసిన రాజకీయ పార్టీలు.. నెటిజన్లను ఆకట్టుకోవడానికి ఉన్న ఏ చిన్న అవకాశాన్నీ వదిలిపెట్టడం లేదు. ఈ నేపథ్యంలో స్ఫూప్ వీడియోలతో, మార్ఫింగ్ ఫొటోలతో సోషల్ మీడియా హోరెత్తుతోంది. రాజకీయ జోకులు, సెటైర్లకు కొదవే లేదు. ఈ క్రమంలో కళాకారులు, గాయకుల పాటలనూ, వీడియోలనూ వినియోగించుకుంటున్నారు. వాటిని మార్ఫింగ్ చేసి.. దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలా తన అనుమతి లేకుండానే తన పాటకు రాజకీయ దురుద్దేశాలు ఆపాదిస్తూ వైరల్ చేస్తుండటంతో ఓ కళాకారుడు నగరంలోని సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. తప్పుడు ఉద్దేశాలతో సీఎం కేసీఆర్‌ను కించపరిచేలా తన పాటను వైరల్ చేస్తుండటంపై ఆయన తీవ్రంగా కలత చెందుతున్నారు. ఆదేశ్ రవి.. కరీంనగర్ జిల్లాకు చెందిన రచయిత, కళాకారుడు, గాయకుడు. చిత్ర పరిశ్రమలో ఉన్న ఆయన ప్రస్తుతం బిత్తిరి సత్తి హీరోగా తెరకెక్కుతున్న ‘తుపాకీ రాముడు’ సినిమాకు సహా రచయితగా డైలాగ్‌లు అందించారు. ఆ చిత్రంలో కీలక పాత్రలో నటించారు. రవి గత ఏడాది‘థూ.. మీ బతుకు చెడా’ అని ఓ సెల్ఫీ వీడియో పాటను రికార్డు చేసి యూట్యూబ్‌లో పోస్టు చేశారు. సమాజంలో క్షీణిస్తున్న నైతిక విలువల్ని ఎత్తిచూపుతూ.. స్వార్థపూరితంగా వ్యవహరించే మనుషుల ధోరణిని వ్యంగ్యంగా నిలదీస్తూ.. ఆవేదనతో ఈ వీడియో పాటను ఆయన రూపొందించారు. ‘దేవుడికి మొక్కుతవ్.. ప్రజల సొమ్ము నొక్కుతవ్’... ‘కమీషన్లు కొట్టి.. కట్టలుకట్టలు పేర్చి.. సచ్చినప్పుడు పట్టుకుపోతవ్రా.. థూ నీ బతుకు చెడా.. థూ నీ బతుకు చెడా..’ అంటూ ఆయన పోస్టుచేసిన పాటను అప్పట్లో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. ఒరిజనల్ వీడియో సాంగ్ స్క్రీన్ షాట్.. ఇన్సెట్లో (ఆదేశ్ రవి) కానీ, ఎన్నికల నేపథ్యంలో ఆదేశ్ రవి పాటను మార్ఫింగ్ చేసి ‘పీకినవ్ తియ్’ అనే ఫేస్బుక్ పేజీ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. హుస్నాబాద్ ఎన్నికల సభలో ‘థూ.. మీ బతుకులు చెడా’ అని కేసీఆర్ ప్రతిపక్షాలను ఉద్దేశించి విమర్శించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదేశ్ రవి వీడియో పాటను సీఎం కేసీఆర్‌కు ఆపాదిస్తూ.. ఆయనను కించపరిచేలా.. దూషించేలా వీడియోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఈ విషయం తెలియడంతో కలత చెందిన ఆదేశ్ రవి వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. దీంతో సదరు ఫేస్బుక్ పేజీ ఆ పోస్టును డిలీట్ చేసింది. అయితే, వాట్సాప్‌లో ఈ వీడియో చక్కర్లు కొడుతోంది. ‘నా పాటను మార్ఫింగ్ చేసి.. తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి నేను పాడినట్టు కల్పించడం షాక్ గురిచేసింది. రాజకీయ ప్రచారాల కోసం ఇలా కళాకారుల సృజనను దుర్వినియోగపరచడం ఎంతమాత్రం సబబు కాదు’ అని ఆదేశ్ రవి అన్నారు. రాజకీయాలు, ఎన్నికలు ఎలా ఉన్నా వ్యక్తులపై బురద జల్లేవిధంగా, విద్వేషాలు పెంచేవిధంగా వీడియోలు మార్ఫింగ్ చేసి ప్రచారం చేసుకోవడం మంచి పద్ధతి కాదని ఆయన సూచించారు.. ఏదీఏమైనప్పటికీ ఈ ఒక్క వీడియో అనే కాదు.. సోషల్ మీడియాలో ప్రత్యర్థులను కించపరిచేలా అనేకమైన మార్ఫింగ్ వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి. ఆదేశ్ రవి ఒరిజనల్ పాటను ఇక్కడ చూడొచ్చు.. -
‘కాంగ్రెస్ త్రీ ఇడియట్స్’ వివాదం
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో ఈ మధ్య మార్ఫింగ్ వీడియోలు బాగా ప్రచారం అవుతున్నాయి. ఇవి సినీ ప్రముఖులు, మరేవరివో సంబంధించినవి కావు. రాజకీయ నాయకులకు సంబంధించినవి. రెండు రోజుల క్రితమే ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌ను రామాయణంలోని అంగదునిగా చూపిస్తూ, కాంగ్రెస్ పార్టీ నాయకులను రావణాసురునితో పోలుస్తూ మార్ఫింగ్ చేసిన వీడియోను ఒక దాన్ని పోస్టు చేశారు. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. ఈ వ్యవహారం ఇంకా సద్దుమణగకముందే ఇదే తరహా మార్ఫింగ్ వీడియో మరొకటి ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కమల్ నాధ్, మాజీ కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియాలను హిందీ సినిమా ‘త్రీ ఇడియట్స్’ పాత్రలుగా మార్ఫింగ్ చేశారు. వీరు ముగ్గురు ‘త్రీ ఇడియట్స్’ సినిమాలోని ‘ఆల్ ఇజ్ వెల్’ పాటకు కాలు కదుపుతున్నట్లు ఉన్న వీడియోను పోస్టు చేశారు. ఈ పేరడి వీడియోపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేయగా, బీజేపీ ఎప్పట్లానే ఈ వివాదానికి దూరంగా ఉంది. ఈ వీడియో గురించి బీజేపీ నేత రాజినీష్ అగర్వాల్ ‘ఈ పేరడీ వీడియోలతో మాకు ఎటువంటి సంబంధం లేదు. ఈ చర్యకు పాల్పడినవారి మీద కాంగ్రెస్ పోలీసులకు ఫిర్యాదు చేసుకోవచ్చు. మాకు ఎటువంటి అభ్యంతరం లేద’ని తెలిపారు. దీని గురించి కాంగ్రెస్ నేత మానక్ అగర్వాల్ ‘మధ్యప్రదేశ్‌లో శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వానికి బీటలు వారుతున్నాయి అందుకే వారు ఇలాంటి వికారమైన పనులు చేస్తున్నార’ని అన్నారు. ఇదిలావుండగా నిన్ననే బీజేపీ ఐటీ సెల్ ముఖ్య అధికారి అయిన శివరాజ్ సింగ్ దబి తన ట్విటర్లో శివరాజ్ సింగ్ చౌహన్‌ను అంగదునిగా చూపిస్తూ రూపొందించిన రామాయణం మార్ఫింగ్ వీడియోను షేర్ చేశారు. ఈ పేరడీ వీడియోల గురించి కాంగ్రెస్ నాయకులు మధ్యప్రదేశ్ సైబర్ సెల్లో ఫిర్యాదు చేశారు. -
మార్ఫింగ్ ఫోటోలతో యువతులకు వేధింపులు
శ్రీనగర్, నొయిడా: తమ మాట వినటం లేదనే ఆగ్రహంతో మార్ఫింగ్ చేసిన ఫొటోలతో యువతులను వేధించటం మొదలుపెట్టారు. వాటిని భరించలేక బాధిత యువతులు పోలీసులను ఆశ్రయించారు. శ్రీనగర్, నొయిడాలో తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలివీ.. జమ్మూకశ్మీర్‌లో అనంతనాగ్ జిల్లా హిత్మూరా పట్టణానికి చెందిన అబ్రార్ అహ్మద్ స్థానిక యువతిని ప్రేమించాడు. వేరే కారణాలతో కొంతకాలం క్రితం వారిద్దరూ విడిపోయారు. అయితే, ఇది ఇష్టంలేని యువకుడు అహ్మద్ ఫేస్బుక్, వాట్సప్‌లలో ఉంచిన బాధితురాలి ఫొటోలను సేకరించాడు. ఫొటోషాప్ ద్వారా మార్ఫింగ్ చేసి యువతి చేతుల్లో మద్యం బాటిల్‌తోపాటు పిస్టల్‌ను ఉంచి యువతి మిత్రులకు పంపాడు. ఈ విషయం తెలిసిన బాధితురాలు ఈనెల 7వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేసింది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు అహ్మద్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు అతనిపై 354-డి, 506 ఆర్పీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. మరో ఘటనలో...గ్రేటర్ నొయిడా బీటా-1 సెక్టార్‌కు చెందిన ఓ యువతి ఈమెయిల్ అకౌంట్ ఇటీవల హ్యాక్ అయింది. అందులో ఉన్న బాధితురాలి ఫొటోలను గుర్తు తెలియని వ్యక్తి కాపీ చేసుకుని, మార్ఫింగ్ చేశాడు. అశ్లీలకరంగా వాటిని మార్చివేయటంతోపాటు ఓ అసభ్యవీడియోలో కూడా ఆమె ఫొటోతో మార్ఫింగ్ చేసి ఫేస్బుక్లో అప్లోడ్ చేశాడు. విషయం తెలిసిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న సైబర్‌సెల్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితురాలికి బాగా సన్నిహితులైన వారే ఈ చర్యకు ఒడిగట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. -
ప్రేమించకుంటే ఆ ఫొటోలు పోస్ట్ చేస్తా..
చెన్నై: ఫేస్బుక్లో అశ్లీల చిత్రాలతో ఆత్మహత్య చేసుకున్న సేలం జిల్లా యువతి వినుప్రియ దయనీయ ఉదంతం నుంచి తమిళనాడు ఇంకా తేరుకోకముందే మరో యువకుడు అలాంటి బెదిరింపులకే పాల్పడ్డాడు. అయితే పోలీసులు వెంటనే స్పందించడంతో కటకటాల పాలయ్యాడు. తిరునెల్వేలి జిల్లా కడైయనల్లూరు సమీపం కృష్ణాపురానికి చెందిన 23 ఏళ్ల యువతి సెల్‌ఫోన్‌కు కొన్ని నెలల క్రితం దిండుగల్లు జిల్లా సానర్పట్టికి చెందిన కాళిదాస్ (25) అనే యువకుడు మిస్డ్‌కాల్ ఇచ్చాడు. అప్పటి నుంచి స్నేహం పేరుతో తరచూ ఆమెకు ఫోన్లు చేసేవాడు. ఆ యువతి సైతం స్నేహపూర్వకంగా మాటలు కొనసాగించింది. ఈ దశలో తాను ప్రేమిస్తున్నానని గత వారం ఫోన్లో చెప్పగా ఆ యువతి నిరాకరించింది. ఆగ్రహించిన యువకుడు తన ప్రేమను అంగీకరించకుంటే ఫొటోను అశ్లీలంగా మార్ఫింగ్ చేసి ఫేస్బుక్లో పెడతానని యువతిని బెదిరించాడు. భయపడిన యువతి నల్లూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కాళిదాస్‌ను అరెస్ట్ చేసి, పాళయంగోట్టై సెంట్రల్ జైల్లో పెట్టారు. -
కేసీఆర్ ఫోటో మార్ఫింగ్‌పై కేసు నమోదు
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటోను మార్ఫింగ్ చేసి అవమాన పరిచిన ఘటనపై ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. తెలుగుదేశం పార్టీ ఫేస్బుక్లో కేసీఆర్‌ను హిట్లర్‌లా ఫోటో మార్ఫింగ్ చేసి పోస్టు చేశారని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కేసీఆర్ అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధరణిదర్ కులకర్ణి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ముక్తవరం సుశీలారెడ్డి ఈనెల 12న ఎల్బీనగర్ ఠాణాలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఫిర్యాదులో ఎవరి పేర్లు పేర్కొనలేదు. కాగా ఈ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు శుక్రవారం 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఫిర్యాదులో ఎవరి పేర్లు ప్రస్తావించలేదు. (ఇంగ్లీషు కథనం కోసం) -
నన్ను నమ్మించి మోసం చేశారు - ఉదయభాను
‘‘తెలుగు సినిమా గర్వపడే సినిమా ఇదని... ఈ చిత్రంతో జాతీయస్థాయిలో ఉత్తమ నటిగా అవార్డు లభిస్తుందని నమ్మించి ‘మధుమతి’ చిత్ర దర్శకుడు రాజ్‌శ్రీధర్ నన్ను మోసం చేశారు’’ అని ఉదయభాను ఆరోపించారు. ఆమె ప్రధాన పాత్ర పోషించిన ‘మధుమతి’ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. తన ఫొటోలను మార్ఫింగ్ చేసి ప్రచార చిత్రాలు రూపొందించారని, దీనిపై న్యాయపోరాటం చేయబోతున్నానని ఉదయభాను వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో ఆమె పత్రికల వారితో మాట్లాడుతూ -‘‘మంచి కథ అని చెప్పి ఎక్కడా ప్రమాణాలు పాటించకుండా దర్శకుడు సినిమాను చుట్టేశాడు. పైగా పారితోషికం కింద రెండు లక్షల రూపాయలే ఇచ్చారు’’ అని చెప్పారు. ఫొటోలు మార్ఫింగ్ విషయమై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ మొదలు పెట్టారు. మార్ఫింగ్ చేయలేదు: ఈ వివాదం గురించి దర్శకుడు రాజ్‌శ్రీధర్ స్పందిస్తూ... ‘మధుమతి’ ప్రోమోలో తాను ఎలాంటి మార్ఫింగ్‌కూ పాల్పడలేదన్నారు. మంచి భవిష్యత్తు ఉన్న ఉదయభాను ఇలాంటి ఆరోపణలు చేయడం బాధాకరం అన్నారు. తగిన సాక్ష్యాలతో ఆరోపణలు చేయాలని చెప్పారు.