భారతీయ చలన చిత్ర పరిశ్రమలో బాహుబలి సినిమా చేసిన రచ్చ అంత తేలిగ్గా ఎవరు మరిచిపోరు. బాహుబలి: ది బిగినింగ్ , బాహుబలి : ది కన్‌క్లూజన్ అంటూ రెండు భాగాలతో వచ్చిన ఈ సినిమా బారతీయ చలనచిత్ర రికార్డులను తిరగరాసింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన బాహుబలి సిరీస్ దాదాపు 2వేల కోట్ల రికార్డు కలెక్షన్స్ సాధించి భారతీయ చిత్ర పరిశ్రమ ఖ్యాతిని చాటి చెప్పింది. అయితే ఇదంతా ఇప్పుడు మళ్లీ ఎందుకు మాట్లాడుతున్నారనేగా మీ సందేహం.. ఏం లేదండి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం(ఫిబ్రవరి 24న) భారతగడ్డ మీద అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే.