retweet
-
రాజమౌళి అసహనం.. బదులిచ్చిన ఎయిర్పోర్ట్ యాజమాన్యం
కరోనా నేపథ్యంలో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో కనీస వసతలను కూడా ఏర్పాటు చేయకపోవడంపై ప్రముఖ దర్శకుడు రాజమౌళి అసహనం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా జక్కన్న ట్వీట్‌కు ఢిల్లీ ఎయిర్పోర్ట్ యాజమాన్యం స్పందిస్తూ రీట్వీట్ చేసింది. అందులో.. ‘డియర్ రాజమౌళి, ఫీడ్‌బ్యాక్ ఇచ్చినందుకు థాంక్యూ. ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించేందుకు ఇది ఎంతగానో తోడ్పడుతుంది. ఆర్టీపీసీఆర్ వివరాలకు డెస్క్‌లు ఉన్నాయి. మరిన్నీ ఏర్పాటు చేస్తాం. ప్రయాణికులకు కనిపించేలా బోర్డులు ఏర్పాటు చేస్తామని బదులిచ్చింది. శుక్రవారం తెల్లవారు జామున రాజమౌళి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోగా, కరోనా నిబంధనల ప్రకారం ఆర్టీపీసీఆర్ పరీక్ష చేసుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో ఆర్టీపీసీఆర్ కోసం పత్రాలు నింపేందుకు అక్కడ సరైన సౌకర్యాలు లేవని ట్వీట్ రూపంలో తెలిపాడు జక్కన్న. ప్రస్తుతం ఈ దర్శకధీరుడు రామ్ చరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా ‘ఆర్ఆర్ఆర్’ చిత్ర పనుల్లో బిజీగా ఉన్నారు. అక్టోబరులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. Dear Mr. Rajamouli, thank you for your valuable feedback and this provides us the opportunity for improvement. We have desks at the designated areas for RT-PCR-related purposes; however, increased number of desks and visibility at other locations will improve experience on (1/2) — Delhi Airport (@DelhiAirport) July 2, 2021 -
మనీషా కోయిరాలా ట్వీట్‌పై విమర్శలు
న్యూఢిల్లీ: ప్రముఖ బాలీవుడ్ నటి, నేపాల్ పౌరురాలు మనీషా కోయిరాలా చేసిన ఓ ట్వీట్ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకోవడంతో ఆమెపై ట్రోల్స్ ప్రారంభమయ్యాయి. కాలాపానీ, లిపులేఖ్ ప్రాంతాలను తమ భూభాగంలో చూపించుకుంటూ నేపాల్ మంత్రి పోస్ట్ చేసిన మ్యాప్ ట్వీట్‌ను మనీషా కోయిరాలా రీట్వీట్ చేశారు. ‘మన చిన్న దేశ గౌరవాన్ని నిలబెట్టినందుకు ధన్యవాదాలు. మూడు గొప్ప దేశాల మధ్య చర్చలన్నీ ప్రశాంతంగా జరగాలని కోరుకుంటున్నాను’ అంటూ ట్వీట్లో పేర్కొన్నారు. దీంతో భారత్‌లో ఆమెపై ట్రోల్స్ మొదలయ్యాయి. భారత్ ఆమెకు సినీ జీవితం ప్రసాదిస్తే ఇప్పుడు భారత్ మీదే వివక్ష చూపుతున్నారని, ఆమెను బహిష్కరించాలని ట్రోల్స్ వచ్చాయి. -
బాహుబలిగా అదరగొట్టిన ట్రంప్
-
వైరల్ : బాహుబలిగా అదరగొట్టిన ట్రంప్
భారతీయ చలన చిత్ర పరిశ్రమలో బాహుబలి సినిమా చేసిన రచ్చ అంత తేలిగ్గా ఎవరు మరిచిపోరు. బాహుబలి: ది బిగినింగ్ , బాహుబలి : ది కన్‌క్లూజన్ అంటూ రెండు భాగాలతో వచ్చిన ఈ సినిమా బారతీయ చలనచిత్ర రికార్డులను తిరగరాసింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైన బాహుబలి సిరీస్ దాదాపు 2వేల కోట్లకు పైగా రికార్డు కలెక్షన్స్ సాధించి భారతీయ చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పింది. అయితే ఇదంతా ఇప్పుడు మళ్లీ ఎందుకు మాట్లాడుతున్నారనేగా మీ సందేహం.. ఏం లేదండి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోమవారం(ఫిబ్రవరి 24న) భారతగడ్డ మీద అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. (ట్రంప్ విందు.. పసందు..!) ఈ నేపథ్యంలో ట్రంప్ పర్యటనకు ఒక్కరోజు ముందు బాహుబలి టైటిల్ సాంగ్‌తో ట్రంప్‌పై రూపొందించిన ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. దాదాపు నిమిషం 20 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియోలో ప్రబాస్ ముఖానికి ట్రంప్ ముఖాన్ని అతికించి బ్యాక్‌గ్రౌండ్‌లో 'జియోరే బాహుబలి' సాంగ్‌ను పెట్టారు. దీంతో పాటు ట్రంప్ భార్య మెలానియా, కుమార్తె ఇవాంకా ట్రంప్, కుమారుడు జూనియర్ డొనాల్డ్ ట్రంప్‌ను వీడియోలో చూపించారు. అలాగే ఇవాంకా ట్రంప్, డొనాల్డ్ ట్రంప్ జూనియర్‌ను తండ్రి ట్రంప్ భుజాల మీద ఎత్తుకున్నట్లు చూపించారు. ఇక చివర్లో సినిమాకు శుభం కార్డు లాగా ఈ వీడియోలో కూడా 'యుఎస్ఏ అండ్ ఇండియా యునైటెడ్' అని చూపించడం ఆసక్తిని కలిగిస్తుంది. అయితే ఈ వీడియోపై ట్రంప్ స్పందిస్తూ.. 'భారత్‌లో తనకు గొప్ప స్నేహితులు ఉన్నారంటూ' రీట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. (హౌడీ X నమస్తే) కాగా రెండు రోజుల పాటు ఇండియాలో గడపనున్న ట్రంప్ సోమవారం(ఫిబ్రవరి 24) న అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విమానాశ్రయానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు స్వాగతం పలుకుతారు. అనంతరం భారీ సందోహం నడుమ దాదాపు 22 కిలోమీటర్లు ప్రయాణించి సబర్మతీ ఆశ్రమం వద్దకు చేరుకుంటారు. గాంధీకి అనుబంధంగా ఉన్న సబర్మతీ ఆశ్రమం వద్ద మోదీ, ట్రంప్‌లు కలసి నివాళులు అర్పిస్తారు. అనంతరం ట్రంప్‌కు గాంధీ చరిత్రకు సంబంధించిన పుస్తకాలను బహూకరించనున్నారు.తర్వాత మొటెరా స్టేడియానికి ట్రంప్, మోదీ కలసి వెళ్తారు. ఇక్కడ జరగనున్న బహిరంగ సభలో దాదాపు 1.25 లక్షల మంది ప్రజలు హాజరవుతారని అధికారుల అంచనా. భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే పలు కార్యక్రమాలను ఇక్కడ ప్రదర్శిస్తారు. Look so forward to being with my great friends in INDIA! https://t.co/1jdk3AW6fG — Donald J. Trump (@realDonaldTrump) February 22, 2020 -
1.17 లక్షల రీట్వీట్లు..4.2లక్షల లైక్‌లు
న్యూఢిల్లీ: 2019 లోక్‌సభ ఎన్నికల్లో విజయాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ చేసిన ట్వీట్ రికార్డుల మోత మోగించింది. భారత్‌లో అత్యంత ఎక్కువ సార్లు (1.17 లక్షలు) రీట్వీట్, అత్యంత ఎక్కువ లైక్ (4.2 లక్షలు)లు సాధించిన ట్వీట్ ఇదేనని ట్విట్టర్ తెలిపింది. అందులో మోదీ ‘సబ్కా సాథ్+సబ్కా వికాస్ + సబ్కా విశ్వాస్ = విజయీ భారత్’ అని పేర్కొన్నారు. ఈ సంవత్సరపు గోల్డెన్ ట్వీట్ ఇదేనని తెలిపింది. ఈ యేడాది ‘లోక్‌సభ ఎలక్షన్స్ 2019’, ‘చంద్రయాన్–2’, ‘సీడబ్ల్యూసీ–19’, ‘పుల్వామా’, ‘ఆర్టికల్–370’ అనే హాష్‌టాగ్‌లపై ఎక్కువ ట్వీట్లు నమోదైనట్లు తెలిపింది. ఎక్కువ సార్లు మెన్షన్ అయిన జాబితాలో పురుషుల్లో బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ నిలవగా, మహిళల జాబితాలో సోనాక్షి సిన్హాలు నిలిచారు. క్రీడల్లో ధోనీ పుట్టిన రోజు సందర్భంగా విరాట్ కోహ్లి పోస్ట్ చేసిన ట్వీట్ ఏకంగా 45 వేల సార్లు రీట్వీట్ కాగా, 4.12లక్షల లైక్‌లను అందుకుంది. -
మోదీని మించిన రాహుల్
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ సోషల్ మీడియా ట్విటర్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పోటీ పడేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రీట్వీట్ల విషయంలో మొదటి సారి ఆయన్ని అధిగమించారు. గత జనవరి నుంచి ఏప్రిల్ వరకు ఈ ఇరువురికి వచ్చిన రీట్వీట్లపై మిచిగాన్ యూనివర్శిటీ అధ్యయనం జరపగా ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. ట్విట్టర్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి 4.40 కోట్ల మంది ఫాలోవర్లు ఉన్నప్పటికీ కేవలం 76 లక్షల ఫాలోవర్లు కలిగిన రాహుల్ గాంధీకి రీట్వీట్లు ఎక్కువ రావడం విశేషమని మిచిగాన్ యూనివర్శిటీ తరఫున ఈ అధ్యయనం నిర్వహించిన ప్రొఫెసర్ జోయోజీత్ పాల్, డాక్టోరల్ అభ్యర్థి లియా బొజార్ట్ వ్యాఖ్యానించారు. కేవలం హిందీలో చేసిన ట్వీట్లపైనే వారు ఈ అధ్యయనం జరిపారు. రాహుల్ గాంధీ ట్వీట్లలో ప్రాస, వ్యంగ్యం, ఎత్తిపొడుపు మాటలు ఉండడం అందుకు కారణమని అధ్యయనకారులు తేల్చారు. ఉదాహరణకు వస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ని కాంగ్రెస్ పార్టీ జనరల్ సేల్స్ టాక్స్‌గా భావిస్తే మోదీ ప్రభుత్వం దాన్ని ‘గబ్బర్ సింగ్ టాక్స్’గా మార్చిందంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేయడం. ఇక మోదీ ట్వీట్లు చప్పగా, పేలవంగా, సూటిగా ఉండడం వల్ల రీట్వీట్లలో ఆయన వెనకబడ్డారని వారు తెలిపారు. మోదీ ఎక్కువగా ఇంగ్లీషులో, ఆయనకన్నా ఎక్కువగా హిందీలో రాహుల్ గాంధీ ట్వీట్లు చేయడం కూడా రాహుల్ గాంధీకి కలసి రావచ్చని వారంటున్నారు. దేశవ్యాప్తంగా 274 మంది రాజకీయ నాయకల ట్విట్టర్ ఖాతాలపై వీరు అధ్యయనం జరిపారు. వారిలో ఎవరు ఏ భాషలో ఎక్కువగా ట్వీట్లు చేస్తున్నారో కూడా గుర్తించారు. ఎక్కువ మంది ఇంగ్లీషు, ఆ తర్వాత హిందీ భాషలను ఉపయోగిస్తుండగా, కొందరు కేవలం ప్రాంతీయ భాషలను మాత్రమే ఉపయోగిస్తున్నారు. 2013 నుంచి ఇప్పటి వరకు ప్రధాని నరేంద్ర మోదీ తన మొత్తం ట్వీట్లలో 73.7 శాతం ఇంగ్లీషులో ట్వీట్ చేయగా, రాహుల్ గాంధీ (2015 నుంచి ఇప్పటి వరకు) 68 శాతం మాత్రమే హిందీలో ట్వీట్లు చేశారు. పి. చిదంబరం, కిరణ్ బేడీ, మనోహర్ పారికర్, సుబ్రమణియన్ స్వామీ, శశి థరూర్, స్మృతి ఇరానీ, అఖిలేష్ యాదవ్‌లు మోదీ కన్నా ఎక్కువ శాతంలో (సంఖ్యలో కాదు) ఇంగ్లీషులో ట్వీట్లు చేస్తున్నారు. సుశీల్ మోదీ, రఘుబార్ దాస్, యోగి ఆదిత్యనాథ్‌లు ప్రాంతీయ భాషనే ఎక్కువగా ఆశ్రయిస్తున్నారు. యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ట్వీట్లలో 8 శాతం ట్వీట్లు మాత్రమే ఇంగ్లీషులో ఉంటున్నాయి. 2014 సార్వత్రిక ఎన్నికల్లో సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగించుకున్న నరేంద్ర మోదీ ఇప్పటికీ ఎక్కువనే వాడుతున్నారు. ప్రపంచంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తర్వాత మోదీకే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్నారు. అందుకనే మోదీ తన పార్టీ పార్లమెంట్ సభ్యులందరిని సోషల్ మీడియాను ఎక్కువగా ఉపయోగించుకోవాలని ఆదేశించడంతోపాటు ప్రతి ఒక్కరిని ఫేస్బుక్లో కనీసం మూడు వేల లైక్స్ కూడా రావాలని షరతు విధించారు. -
వర్మకు నాగార్జున ఓదార్పు
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ నటి శ్రీదేవి అకాలమరణంపై దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తీవ్ర విచారంలో మునిగిపోయి చేస్తున్న ట్వీట్‌కు ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున స్పందించారు. ఆయన పరోక్షంగా రామ్‌గోపాల్ వర్మను ఓదార్చే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా 'అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని' అంటూ నాగార్జున ట్వీట్ చేశారు. తన తండ్రి అలానాటి దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు నటించిన మురళీకృష్ణ చిత్రంలోని నీ సుఖమే నే కోరుకున్నా అనే గీతంలోని రెండులైన్లను ప్రత్యేకంగా పోస్ట్ చేశారు. శ్రీదేవి చుట్టూ నెగిటివ్ వాతావరణం సృష్టిస్తున్నారని, ఈ సందర్భంలో కొంత సానుకూలత కోసం తాను నాగార్జున హీరోగా నిర్మిస్తున్న కొత్త చిత్రం ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను, రిలీజ్ డేట్‌ను విడుదల చేస్తున్నానంటూ రామ్‌గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. అంతకుముందు కూడా ఆయన శ్రీదేవిపై ఉన్న అభిమానంతో తీవ్ర వేదనకు గురవుతూ ట్వీట్లను చేశారు. దీంతో కాస్తంత ఓదార్పునిద్దామనుకున్నారేమో నాగార్జున పై విధంగా ట్వీట్ చేశారు. I know what you mean @RGVzoomin 😔remembering a line from a famous song ‘ఆనుకునంమని జరగవు అన్ని అనుకోలేదని ఆగవు కొన్ని ‘ https://t.co/gbLK24BeKD — Nagarjuna Akkineni (@iamnagarjuna) 27 February 2018 -
తప్పులో కాలేసిన కేజ్రీ.. జవాబుకు నో
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మరోసారి సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్లో పొరపాటు చేశారు. ఆయన చెప్పిన వాటికి సంబంధం లేని ఫొటోలను పెట్టి వాటికి కొత్త అంశాన్ని ఆపాదించి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. అనంతరం అసలు విషయం తెలిసి వెంటనే తన ఖాతా నుంచి తొలగించారు. ఇదేమిటని ప్రశ్నించినా ఆయన ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఆదివారం సీఎం కేజ్రీవాల్ తన ఖాతాలో రెండు ఫొటోలు పోస్ట్ చేశారు. అందులో ఒకటి సిరియా శరణార్ధుల ఫొటో కాగా, ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకున్న రైలు ప్రమాద స్థలం వద్ద గాయాలతో కనిపిస్తున్న చిన్నారులు అంటూ ఫొటో రైటప్ పెట్టి పోస్ట్ చేశారు. ఆ తర్వాత ఓ యువకుడు సాత్నా ఉరేసుకున్న ఫొటోను పోస్ట్ చేశారు. దానికి క్యాప్షన్ గా పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో నాలుగు రోజులుగా బ్యాంకు వద్ద పడిగాపులు కాసి చివరకు డబ్బు అందకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడిన యువకుడు అంటూ పెట్టారు. దీని గురించి ఇప్పటికైనా ఆలోచించండి మోదీ గారు అంటూ ఆయన ప్రశ్నించారు. అయితే, వాస్తవానికి ఆ ఫొటోలో ఉన్న వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు కానీ, డబ్బు లభించక కాదు. బేలా అనే గ్రామంలో అలహాబాద్ బ్యాంకు వద్దకు వచ్చిన యువకుడు దొంగతనానికి ప్రయత్నించాడు. అయితే, పోలీసులు చుట్టుముట్టడంతో తానిక వారి నుంచి తప్పించుకోలేనని భావించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన శనివారం తెల్లవారు జామున 3గంటల ప్రాంతంలో చోటు చేసుకుంది. ఈ ఫొటోను కేజ్రీవాల్ పోస్ట్ చేసి దానికి వేరే తప్పుడు క్యాప్షన్ పెట్టారు. చివరకు అసలు విషయం తెలిసి ఆ రెండు ఫొటోలు క్యాప్షన్ తీసేశారు. గతంలో కూడా కేజ్రీవాల్ ఇలా తప్పులో కాలేశారు. -
టాప్ ట్రెండ్స్ 2015
ఈ ఏడాదికి వీడ్కోలు పలికే సమయం ఆసన్నమవుతోంది. ఈ సందర్భంగా ట్విట్టర్ ఇండియా 2015 సంవత్సరంలో ట్విట్టర్ టాప్ ట్రెండ్స్‌ను, ఎక్కువగా రీట్వీట్ చేసిన ట్వీట్స్,మోస్ట్ పాపులర్ ట్వీట్లను వెల్లడించింది. చెన్నై వర్షాలు..వరదలు..పునరావాస, సహాయ కార్యక్రమాల నిర్వహరణ దగ్గర నుంచి ఢిల్లీ, బిహార్ రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల ఫలితాలు, మోదీ పిలుపిచ్చిన 'మేకిన్ ఇండియా'.ఇలా అనేక విషయాలు ట్విట్టర్ ట్రెండ్స్‌లో చోటు సంపాదించాయి. ఆ విశేషాలు తెలుసుకుందాం. గోల్డెన్ ట్వీట్..షారూఖ్దే గోల్డెన్ ట్వీట్ ఘనత బాలీవుడ్ బాద్షా షారూక్‌ఖాన్‌కు దక్కింది. లండన్‌లో జరిగిన ఏషియన్ అవార్డుల కార్యక్రమంలో షారూఖ్‌ఖాన్ ప్రముఖ ఇంగ్లిష్ గాయకుడు జైన్ మాలిక్‌తో సెల్ఫీ దిగి ట్విట్టర్లో పోస్ట్ చేశారు. దీనికి అత్యధికంగా 1,41,000పైగా రీట్వీట్స్, 18.3 మిలియన్ వ్యూస్, 2 లక్షలకుపైగా లైక్స్ వచ్చాయి. ఏప్రిల్ 17న చేసిన ఈ ట్వీట్ గోల్డెన్ ట్వీట్‌గా నిలిచింది. కీ మూవ్మెంట్స్ ఇన్ ఇండియా ప్రజలపై ఎక్కువగా ప్ర భావం చూపించిన అంశాలు..ఎక్కువగా ప్రజలు భాగస్వాములై ట్వీట్లు చేసిన సందర్భాలు.. ♦ క్రికెట్ ప్రపంచ కప్‌లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌లు-1.7 మిలియన్ ట్వీట్లు ♦ ఢిల్లీ ఎన్నికలు-10.8 మిలియన్ ట్వీట్లు ♦ దీపావళి శుభాకాంక్షలు-1.8 మిలియన్ ట్వీట్లు ♦ చెన్నై వర్షాలు(డిసెంబర్ 1 నుంచి 4వరకు కురిసిన వర్షాలు)-1.4 మిలియన్ ట్వీట్లు ♦ భారత స్వాతంత్య్ర దినోత్సవం-లక్ష ట్వీట్లు మోస్ట్ ఫాలోడ్ యూజర్స్ 'ఇయర్ ఇన్ ట్విట్టర్ 2015'నివేదిక ప్రకారం బాలీవుడ్ హీరో అమితాబ్ బచ్చన్ 18.1 మిలియన్ల ఫాలోవర్లతో తొలిస్థానంలో ఉన్నారు. షారూఖ్ ఖాన్ 16.5 మిలియన్ల ఫాలోవర్లతో రెండోస్థానంలో నిలిచారు. ప్రధాని నరేంద్ర మోదీ 16.4 మిలియన్ల ఫాలోవర్లతో మూడోస్థానంలో ఉన్నారు. అమీర్‌ఖాన్, సల్మాన్ ఖాన్ వరసగా 15.5 మిలియన్లు, 15 మిలియన్ల ఫాలోవర్లతో నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నారు. భారత్‌లో మోస్ట్ ఫాలోవుడ్ టాప్ టెన్ పర్సన్స్‌లో 9 ట్విట్టర్ అకౌంట్లు బాలీవుడ్ స్టార్లకు చెందినవే కావటం విశేషం. మోస్ట్ పాపులర్ హాష్‌ట్యాగ్ ట్రెండ్స్ ట్విట్టర్లో మోస్ట్ పాపులర్ హాష్‌ట్యాగ్ ట్రెండ్స్ క్రీడలు, వినోదం, రాజకీయం, సామాజిక కార్యక్రమాల మిశ్రమంగా ఉన్నాయి. ♦ ఐపీల్-9 మిలియన్ ట్వీట్లు ♦ సెల్ఫీవిత్డాటర్-3,75,000 ట్వీట్లు ♦ బిహార్ ఎన్నికల ఫలితాలు-2,60,000 ట్వీట్లు ♦ నరేంద్ర మోదీ ఏడాది పాలన-1,79,000 ట్వీట్లు ♦ దిల్వాలే దుల్హనియా లేజాయింగే సినిమాకు 20 ఏళ్లయిన సందర్భం-1,40,000 ట్వీట్లు అమెరికా బ్రాండ్ కాకుండా సొంతంగా ట్విట్టర్ ఇమోజీ పొందిన తొలి హ్యాష్‌ట్యాగ్ 'మేకిన్ ఇండియా' ప్రపంచవ్యాప్తంగా టాప్ ట్రెండ్స్ ట్విట్టర్ ఈ ఏడాదిని 'సంఘీభావ సంవత్సరం' గా పేర్కొంది. టర్కీ సముద్రతీరంలో శవమై పడిఉన్న..సిరియాకు చెందిన మూడేళ్ల బాలుడి చిత్రం ప్రపంచాన్ని కదిలించింది. సిరియా, ఇతర మధ్యప్రా చ్య దేశాల నుంచి వచ్చే శరణార్థులను యూరప్ దేశాల్లోకి అనుమతించాలంటూ అనేక మంది ప్రజలు చేసిన ట్వీట్లు..ట్విట్టర్లో ఎక్కువ చర్చిం చుకున్న అంశాల్లో నాలుగోస్థానంలో నిలిచింది. పారిస్‌పై ఉగ్రదాడి సంఘటన.. ప్రపంచవ్యాప్తంగా ట్విట్టర్లో ఎక్కువగా చర్చించుకున్న విషయంగా నిలిచింది. అమెరికాలో జరిగిన 'బ్లాక్ లైవ్స్ మ్యాటర్ మూవ్మెంట్' ట్విట్టర్లో ఎక్కువగా చర్చించుకున్న విషయాల్లో రెండోస్థానంలో నిలిచింది. అమెరికాలోని ఫెర్గూసన్, చార్లెస్టన్,బ్లాతిమోర్లలో పోలీసులు నల్లజాతీయులను కాల్చి చంపటంతో ఈ ఉద్యమం ప్రారంభమైంది. అమెరికాకు చెందిన 14ఏళ్ల బాలుడు అహ్మద్ మొహమ్మద్ అనే బాలుడు రూపొందిన హోమ్మేడ్ క్లాక్‌ను బాంబుగా భావించి స్కూలు పోలీసులు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు అహ్మద్‌ను అరెస్ట్ చేశారు. 'ఐ స్టాండ్ విత్ అహ్మద్'అనే హ్యాష్‌ట్యాగ్‌లతో ప్రపంచం మొత్తం అహ్మద్‌కు మద్దతు పలికింది. చివరికి అధ్యక్షుడు ఒబామా స్పందించి. అహ్మద్‌ను వైట్‌హౌస్‌కు ఆహ్వానించారు. ఈ సంఘటన ఐదోస్థానంలో నిలిచింది. అమెరికా, ఐర్లాండ్‌లు స్వలింగ సంపర్కుల వివాహాన్ని చట్టబద్ధం చేశాయి. ఈ విషయం ఎక్కువ మంది చర్చించిన అంశంగా మూడోస్థానంలో నిలిచింది. స్వలింగ సంపర్కుల విహహానికి సంబంధించిన చట్టాన్ని యూఎస్ సుప్రీం కోర్టు జూన్ 26న ధ్రువపరిచింది. ఇంగ్లండ్, కెనడా, ఇండియాలో జాతీయస్థాయిలో జరిగిన ఎన్నికలు..ట్వీట్లు, హ్యాష్‌ట్యాగ్‌లతో ట్విట్టర్ టైమ్ లైన్లను హోరెత్తించాయి. ఈ అంశం ఆరోస్థానంలో నిలిచింది.