కరోనా నేపథ్యంలో ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో కనీస వసతలను కూడా ఏర్పాటు చేయకపోవడంపై ప్రముఖ దర్శకుడు రాజమౌళి అసహనం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా జక్కన్న ట్వీట్‌కు ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ యాజమాన్యం స్పందిస్తూ రీట్వీట్ చేసింది. అందులో.. ‘డియర్ రాజమౌళి, ఫీడ్‌బ్యాక్ ఇచ్చినందుకు థాంక్యూ. ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించేందుకు ఇది ఎంతగానో తోడ్పడుతుంది. ఆర్‌టీపీసీఆర్ వివరాలకు డెస్క్‌లు ఉన్నాయి. మరిన్నీ ఏర్పాటు చేస్తాం. ప్రయాణికులకు కనిపించేలా బోర్డులు ఏర్పాటు చేస్తామని బదులిచ్చింది.
శుక్రవారం తెల్లవారు జామున రాజమౌళి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకోగా, కరోనా నిబంధనల ప్రకారం ఆర్టీపీసీఆర్ పరీక్ష చేసుకోవాల్సి ఉంది. ఈ క్రమంలో ఆర్టీపీసీఆర్ కోసం పత్రాలు నింపేందుకు అక్కడ సరైన సౌకర్యాలు లేవని ట్వీట్ రూపంలో తెలిపాడు జక్కన్న. ప్రస్తుతం ఈ దర్శకధీరుడు రామ్ చరణ్, ఎన్టీఆర్ కథానాయకులుగా ‘ఆర్‌ఆర్‌ఆర్’ చిత్ర పనుల్లో బిజీగా ఉన్నారు. అక్టోబరులో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
Dear Mr. Rajamouli, thank you for your valuable feedback and this provides us the opportunity for improvement. We have desks at the designated areas for RT-PCR-related purposes; however, increased number of desks and visibility at other locations will improve experience on (1/2)
— Delhi Airport (@DelhiAirport) July 2, 2021
Comments
Please login to add a commentAdd a comment