న్యూఢిల్లీ: 2019 లోక్‌సభ ఎన్నికల్లో విజయాన్ని ప్రస్తావిస్తూ ప్రధాని మోదీ చేసిన ట్వీట్ రికార్డుల మోత మోగించింది. భారత్‌లో అత్యంత ఎక్కువ సార్లు (1.17 లక్షలు) రీట్వీట్, అత్యంత ఎక్కువ లైక్ (4.2 లక్షలు)లు సాధించిన ట్వీట్ ఇదేనని ట్విట్టర్ తెలిపింది. అందులో మోదీ ‘సబ్‌కా సాథ్+సబ్‌కా వికాస్ + సబ్‌కా విశ్వాస్ = విజయీ భారత్’ అని పేర్కొన్నారు. ఈ సంవత్సరపు గోల్డెన్ ట్వీట్ ఇదేనని తెలిపింది.
ఈ యేడాది ‘లోక్‌సభ ఎలక్షన్స్ 2019’, ‘చంద్రయాన్–2’, ‘సీడబ్ల్యూసీ–19’, ‘పుల్వామా’, ‘ఆర్టికల్–370’ అనే హాష్‌టాగ్‌లపై ఎక్కువ ట్వీట్లు నమోదైనట్లు తెలిపింది. ఎక్కువ సార్లు మెన్షన్ అయిన జాబితాలో పురుషుల్లో బాలీవుడ్ ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ నిలవగా, మహిళల జాబితాలో సోనాక్షి సిన్హాలు నిలిచారు. క్రీడల్లో ధోనీ పుట్టిన రోజు సందర్భంగా విరాట్ కోహ్లి పోస్ట్ చేసిన ట్వీట్ ఏకంగా 45 వేల సార్లు రీట్వీట్ కాగా, 4.12లక్షల లైక్‌లను అందుకుంది.
Comments
Please login to add a commentAdd a comment