కేసీఆర్ ఫోటో మార్ఫింగ్పై కేసు నమోదు
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోటోను మార్ఫింగ్ చేసి అవమాన పరిచిన ఘటనపై ఎల్బీనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. తెలుగుదేశం పార్టీ ఫేస్బుక్లో కేసీఆర్ను హిట్లర్లా ఫోటో మార్ఫింగ్ చేసి పోస్టు చేశారని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కేసీఆర్ అభిమాన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ధరణిదర్ కులకర్ణి, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు ముక్తవరం సుశీలారెడ్డి ఈనెల 12న ఎల్బీనగర్ ఠాణాలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే ఫిర్యాదులో ఎవరి పేర్లు పేర్కొనలేదు. కాగా ఈ ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు శుక్రవారం 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఫిర్యాదులో ఎవరి పేర్లు ప్రస్తావించలేదు.