
శివాజీనగర: కర్ణాటకలో ఎన్నికలు ముగిసిన తరువాతే ముఖ్యమంత్రి ఎంపిక ఉంటుందని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే చెప్పారు. ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ ఎమ్మెల్యేల అభిప్రాయాలు సేకరించి, హైకమాండ్ చర్చించి ముఖ్యమంత్రిని ఎంపిక చేస్తుందని తెలిపారు. ఎన్నికలకు ముందుగా ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడం తమ సంప్రదాయం కాదని చెప్పారు.
సోమవారం చిక్కమగళూరులో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ లింగాయత్ ముఖ్యమంత్రిని ప్రకటించాలన్న బీజేపీ సవాల్‌పై స్పందిస్తూ తమ పార్టీలో కులాల వారీగా సీఎంను ప్రకటించడం లేదన్నారు. బీజేపీలో అవినీతి ప్రభుత్వ వ్యతిరేకంగా ప్రజలు విసుగెత్తారని, అదే ఇతరులపై చిన్న ఆరోపణ వస్తే వెంటనే సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు చేస్తారని ఆరోపించారు.