సాక్షి, ఖమ్మం : మహారాష్ట్రలో బీజేపీ అనుసరిస్తున్న పద్ధతి అప్రజాస్వామికమైనదని కాంగ్రెస్ నేత వి. హనుమంతరావు విమర్శించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన ప్రెస్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నా రాజకీయ జీవితంలో ఇటువంటి గవర్నర్‌ను చూడలేదని విస్మయం వ్యక్తం చేశారు. గవర్నర్ బీజేపీకి అనుకూలంగా పనిచేశారని, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూస్తోందన్నారు. దేశం ఎటుపోయినా పర్వాలేదు కానీ, తాము మాత్రం అధికారంలో ఉండాలని బీజేపీ కోరుకుంటోందని మండిపడ్డారు. ఈ వ్యవహారంపై కోర్టులో కేసు దాఖలైనందును తమకు అనుకూలంగా తీర్పు వస్తుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్, శివసేన, ఎన్పీపీ పార్టీలు కలిసి ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment