
మాట్లాడుతున్న వి.హనుమంతరావు
యాదగిరికొండ : రైతుల గురించి మాట్లాడే హక్కు సీఎం కేసీఆర్‌కు లేదని మాజీ రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు అన్నారు. ఆదివారం ఆయన యాదాద్రి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న ప్రతి వాగ్థానాన్ని మరిచిపోయి ఎన్నికలు దగ్గరకు రాగానే రైతులపై కుల సంఘాలపై ఎక్కడ లేని ప్రేమ చూపిస్తున్నాడని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఒక దొంగ అని పేర్కొన్నారు.
గడిచిన నాలుగేళ్లలో పీజు రీయింబర్స్‌మెంట, డబుల్ బెడ్‌రూం వంటి ఎన్నో పథకాలు ప్రజల దరి చేరలేదన్నారు. రైతుబంధు పథకం చిన్న , సన్నకారు రైతుల కోసం కాదని, లాభపడేది అగ్రకులాలేనన్నారు. చిన్నకారు రైతుల వద్ద కేవలం ఒక ఎకరం లేదంటే, 30 గుంటల వరకు భూమి ఉంటుందని, అగ్రకులాల వద్ద 20 ఎకరాలు, 40 ఎకరాల వరకు ఉందన్నారు. ఈ పథకం ద్వారా అగ్రకులాలే లబ్ధి పొందుతారని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment