yadagiri konda
-
రైతుల గురించి మాట్లాడే హక్కు కేసీఆర్‌కు లేదు
యాదగిరికొండ : రైతుల గురించి మాట్లాడే హక్కు సీఎం కేసీఆర్‌కు లేదని మాజీ రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు అన్నారు. ఆదివారం ఆయన యాదాద్రి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఉన్న ప్రతి వాగ్థానాన్ని మరిచిపోయి ఎన్నికలు దగ్గరకు రాగానే రైతులపై కుల సంఘాలపై ఎక్కడ లేని ప్రేమ చూపిస్తున్నాడని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఒక దొంగ అని పేర్కొన్నారు. గడిచిన నాలుగేళ్లలో పీజు రీయింబర్స్‌మెంట, డబుల్ బెడ్రూం వంటి ఎన్నో పథకాలు ప్రజల దరి చేరలేదన్నారు. రైతుబంధు పథకం చిన్న , సన్నకారు రైతుల కోసం కాదని, లాభపడేది అగ్రకులాలేనన్నారు. చిన్నకారు రైతుల వద్ద కేవలం ఒక ఎకరం లేదంటే, 30 గుంటల వరకు భూమి ఉంటుందని, అగ్రకులాల వద్ద 20 ఎకరాలు, 40 ఎకరాల వరకు ఉందన్నారు. ఈ పథకం ద్వారా అగ్రకులాలే లబ్ధి పొందుతారని పేర్కొన్నారు. -
చినజీయర్ స్వామిని కలిసిన వైటీడీఏ అధికారులు
యాదగిరికొండ : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలోని ప్రధానాలయం విస్తరణపై వైటీడీఏ వైస్ చైర్మెన్ కిషన్‌రావు, ఈఓ గీతారెడ్డిలు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్న జీయర్‌స్వామిని మంగళవారం విజయవాడలోని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా పనుల గురించి చినజీయర్ స్వామి ఈఓను అడిగి తెలుసుకున్నారు. ఆలయ విస్తరణ పనుల విషయంలో స్వామీజీ కొన్ని సూచనలు చేశారు. అధికారులు అక్కడి నుంచి గుంటూరు జిల్లా గురిజాపల్లికి వెళ్లి ఆలయ విస్తరణకు కావాల్సిన రాయిని పరిశీలించారు. జీయర్‌స్వామిని కలిసిన వారిలో ఆర్కిటెక్టు ఆనంద్‌సాయి, బడే రవి, స్థపతి సుందర్రాజన్, దేవస్థాన అధికారి దోర్భల భాస్కరశర్మ, అర్చకులు సురేంద్రాచారి ఉన్నారు.