private member bill
-
లోక్‌సభలో వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి ప్రైవేట్ మెంబర్ బిల్లు
సాక్షి, ఢిల్లీ: లోక్‌సభలో వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టారు. పోలవరం ప్రాజెక్ట్ సవరించిన అంచనాలు రూ.55 వేల కోట్లకు ఆమోదం తెలపాలని బిల్లులో ప్రతిపాదించారు. ఏపీ విభజన చట్టంపై సెక్షన్ 90ఏ చేర్చాలని బిల్లులో పేర్కొన్నారు.కాగా, లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లును వైఎస్సార్సీపీ వ్యతిరేకించింది. ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టే ముందు ముస్లిం అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవాలని వైఎస్సార్సీపీ లోక్‌సభ పక్షనేత మిథున్‌రెడ్డి కేంద్రాన్ని కోరారు. అలాగే, ఈ బిల్లుపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ లేవనెత్తిన అభిప్రాయాలతో తాము ఏకీభవిస్తున్నామని వెల్లడించారు. -
35 ఏళ్లలోపు యువతకు 10 శాతం సీట్లు రిజర్వ్ చేయాలి
ఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. లోక్‌సభలో కొందరు చట్టసభ్యులు ప్రైవెట్ మెంబర్ బిల్లును ప్రవేశపెడుతున్నారు. దీనిలో భాగంగా లోక్‌సభలో 10 శాతం స్థానాలను 35 ఏళ్లలోపు వారికి రిజర్వ్ చేయాలని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఓ ప్రైవేట్ మెంబర్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. పార్లమెంటులో యువత స్పష్టంగా మైనారిటీగా ఉందని, ఇది ప్రజాస్వామిక లోటుకు దారి తీస్తుందని ఆ బిల్లులో పేర్కొన్నారు. మన దేశ జనాభాలో 35 ఏళ్లలోపు వయస్సు గలవారు 65 శాతానికిపైగా ఉన్నారని తెలిపారు. మన దేశంలో యువ ఎంపీలు తగిన సంఖ్యలో లేరని పేర్కొన్నారు. లోక్‌సభలో యువత కోసం కొన్ని స్థానాలను కేటాయించడం వల్ల యువతకు కూడా రాజకీయాల్లో భాగస్వామ్యం కల్పిస్తున్నామనే సందేశాన్ని పంపవచ్చని చెప్పారు.అసలు ప్రైవేట్ మెంబర్ బిల్లు అంటే ఏమిటి? శాసన ప్రక్రియలో భాగంగా పార్లమెంట్లో రెండు రకాల బిల్లులను చట్ట సభ్యులు ప్రవేశపెడతారు. అవి ఒకటి పబ్లిక్ బిల్లు, మరోకటి ప్రైవేట్ బిల్లు. పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లును మంత్రి కాకుండా అధికార, ప్రతిపక్ష ఎంపీలు ఎవరైనా ప్రవేశపెట్టవచ్చు. ఇక.. పబ్లిక్ బిల్లులను ప్రభుత్వంలో ఉన్న మంత్రులు మాత్రమే ప్రవేశపెడతారు. అందుకే ఈ బిల్లును ప్రభుత్వ బిల్లు అని కూడా పిలుస్తారు. ప్రైవేట బిల్లు ప్రవేశపెట్టడానికి నోటీసు పీరియడ్ నెల రోజులు ఉంటుంది. చట్ట సభ్యలు ఈ బిల్లును ముసాయిదా రూపంలో మాత్రమే ప్రవేశపెడతారు. ఈ ప్రైవేట్ బిల్లును శుక్రవారం రోజు మాత్రమే ప్రవేశపెట్టి చర్చ జరుపుతారు. పార్లమెంట్ సమావేశాల్లో కేవలం మూడు ప్రైవేట్ బిల్లులను మాత్రమే ప్రవేశపెట్టే అవకాశం ఉంటుంది. తాజాగా జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లో శుక్రవారం ముగ్గురు ఎంపీలు మూడు ప్రైవేట్ మెంబర్ బిల్లులను ప్రవేశపెట్టారు. ప్రైవేటు సెక్టార్లో రిజర్వేషన్లు కోరుతూ ప్రైవేట్ బిల్లుబీమ్ ఆర్మీ చీఫ్, ఎంపీ చంద్ర శేఖర్ ఆజాద్ ప్రైవేట్ సెక్టార్లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ శుక్రవారం ప్రైవెట్ మెంబర్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు.ప్రైవేట్ రంగంలోని విద్యాసంస్థలు, కనీసం 20 మందితో కూడిన పలు సంస్థల్లో కూడా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలో రిజర్వేషన్లు ఇవ్వాలని బిల్లులో కోరారు. ఇప్పటివరకు ప్రభుత్వం కల్పించే రిజర్వేషన్లు.. పబ్లిక్ సెక్టార్లోనే అమలు అవుతున్న విషయం తెలిసిందే.విమాన ఛార్జీల నియంత్రణపై ప్రైవేట్ బిల్లుకాంగ్రెస్ ఎంపీ షఫీ పరంబిల్ ప్రైవేట్ విమాన ఛార్జీల నియంత్రణపై ప్రైవేట్ మెంబర్ బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టారు. విమాన ఛార్జీల పర్యవేక్షణ , నియంత్రణ కోసం ఓ రెగ్యూలేటరీ బోర్డును ఏర్పాటుచేయాలని బిల్లులో పేర్కొన్నారు. కొన్ని విమానయాన సంస్థలు అధిక ఛార్జీల పేరుతో ప్రజలను దోచుకోవటం వల్ల అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు ప్రయాణించే అవకాశాలను తగ్గిస్తాయని తెలిపారు. -
విభజన హామీలకు ప్రైవేటు మెంబర్ బిల్లు
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ శుక్రవారం లోక్‌సభలో ప్రైవేటు మెంబరు బిల్లు ప్రవేశపెట్టారు. ప్రత్యేక హోదా, పోలవరం సవరించిన అంచనాలతో సహా పలు హామీల అమలుకు సంబంధించిన అంశాలను ఆయన బిల్లులో పొందుపరిచారు. అనంతరం ఏపీ భవన్లో భరత్ మీడియాతో మాట్లాడారు. విభజన హామీలను అమలుచేయాలంటూ రాజ్యసభలో ప్రైవేటు మెంబరు బిల్లును పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రవేశపెట్టారని.. ద్రవ్య బిల్లు అని చెప్పడంతో లోక్‌సభలో ప్రవేశపెట్టామని తెలిపారు. బిల్లులో ప్రత్యేక హోదాను ప్రధానంగా ప్రస్తావించామని, వెనకబడిన జిల్లాలకు ప్యాకేజీ, రైల్వేజోన్ తదితర అంశాలు ఇందులో ఉన్నాయన్నారు. గతంలో చంద్రబాబు తప్పిదాలను సవరిస్తూ ఏపీకి రావాల్సినవి తీసుకొస్తున్నామని భరత్ వివరించారు. అలాగే, పోలవరం సవరించిన అంచనాల ఆమోదానికి సంబంధించి లోక్‌సభాపక్షనేత మిథున్‌రెడ్డి మరో బిల్లు ప్రవేశపెడతారని భరత్‌రామ్ తెలిపారు. ప్రజాప్రయోజన బిల్లులకే పార్లమెంటులో మద్దతిస్తున్నామన్నారు. ప్రైవేటు మెంబరు బిల్లులు ఎందుకు ప్రవేశపెడుతున్నామో కేంద్రం ఆలోచించాలని ఎంపీ భరత్ తెలిపారు. ఏపీ విభజన చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా అని ప్రశ్నించారు. కృష్ణా, గోదావరి బేసిన్లో ఒక పెట్రో కెమికల్ రిఫైనరీ తీసుకురావాల్సి ఉందని, దానికి వయబిలిటీ గ్యాప్ ఫండ్ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పెట్టుకోవాలన్నారు. గోడ మీద పిల్లిలా టీడీపీ.. ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై టీడీపీ వ్యవహారం గోడ మీద పిల్లిలా ఉందని భరత్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర అప్పులపై పార్లమెంటులో ప్రశ్నలు వేసి టీడీపీ ఎంపీలు అభాసుపాలయ్యారన్నారు. లోకేశ్‌కు ధైర్యముంటే తనపై ఎంపీగా పోటీచేయాలని సవాల్ విసిరారు. -
‘ఉమ్మడి స్మృతి’పై రాజ్యసభలో ప్రైవేట్ బిల్లు
న్యూఢిల్లీ: ఉమ్మడి పౌరస్మృతిని సిద్ధం చేసేందుకు ఓ ప్యానల్ ఏర్పాటు చేయాలని కోరుతూ వివాదాస్పద ప్రైవేట్ మెంబర్ బిల్లు శుక్రవారం రాజ్యసభ ముందుకొచ్చింది. విపక్ష సభ్యుల తీవ్ర అభ్యంతరాల మధ్య బీజేపీ ఎంపీ కిరోడీలాల్ మీనా దీన్ని ప్రవేశపెట్టారు. కాంగ్రెస్‌తో పాటు తృణమూల్ కాంగ్రెస్, ఎన్సీపీ, డీఎంకే, సమాజ్‌వాదీ, సీపీఎం, సీపీఐ, ఆర్జేడీ తదితర విపక్షాలు బిల్లును తీవ్రంగా వ్యతిరేకించాయి. ఉమ్మడి స్మృతి దేశ సామాజిక నిర్మాణాన్ని నాశనం చేస్తుందంటూ ఆందోళన వెలిబుచ్చాయి. ‘‘ఆరెస్సెస్ అజెండాను అమలు చేసేందుకు పాలక బీజేపీ ప్రయత్నిస్తోంది. కశ్మీర్ అంశాన్ని ముగించేశారు. ఇప్పుడిక ఉమ్మడి స్మృతిపై పడ్డారు. ఈ బిల్లు పూర్తిగా అనైతికం. ప్రజా వ్యతిరేకం. రాజ్యాంగవిరుద్ధం. దీన్ని తక్షణం ఉపసంహరించాలి’’ అంటూ విపక్ష సభ్యులు ముక్త కంఠంతో డిమాండ్ చేశారు. దాంతో చైర్మన్ జగ్దీప్ ధన్‌ఖడ్ ఓటింగ్ నిర్వహించారు. 63–23 తేడాతో బిల్లును ప్రవేశపెట్టడానికి ఆమోదం లభించింది. అనంతరం రాజ్యసభ నాయకుడు పీయూష్ గోయల్ మాట్లాడుతూ విపక్షాల అభ్యంతరాలు, ఆరోపణలను తోసిపుచ్చారు. ‘‘ఏ అంశాన్నైనా లేవనెత్తడం సభ్యుని హక్కు. ఉమ్మడి స్మృతిపై సభలో చర్చ జరగనిద్దాం’’ అని సూచించారు. ఉమ్మడి స్మృతిపై గతంలోనే బిల్లును లిస్ట్ చేసినా సభ దాకా రాలేదు. గవర్నర్ పాత్రపై సీపీఎం బిల్లు గవర్నర్ పాత్ర, అధికారులు, విధులను స్పష్టంగా నిర్వచిస్తూ రాజ్యాంగాన్ని సవరించాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్టీ ఎంపీ వి.సదాశివన్ రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టారు. రాష్ట్రాల్లో తన అజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు గవర్నర్ల వ్యవస్థను కేంద్రం దారుణంగా దుర్వినియోగం చేస్తోందని ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు. ‘‘చరిత్రే ఇందుకు సాక్ష్యం. గవర్నర్ పదవి వలస పాలన సమయంలో భారతీయులను అణచేసేందుకు సృష్టించినది. గవర్నర్లు చాలావరకు ఇప్పటికీ అదే వలసవాద భావజాలంతో పని చేస్తున్నారు’’ అని విమర్శించారు. గవర్నర్‌ను కేంద్రమే నియమించేట్టయితే సంబంధిత రాష్ట్ర ముఖ్యమంత్రికి మూడు పేర్లు ప్రతిపాదించి ఆయన సూచన మేరకు నడచుకోవాలన్నారు. ఇదీ చదవండి: ‘సీఎం పీఠం మా నేతకే..’ హిమాచల్‌లో ఆశావహుల మద్దతుదారుల డిమాండ్ -
రాజ్యసభలో 2 ప్రైవేటు బిల్లులు ప్రవేశపెట్టిన వైఎస్సార్సీపీ
న్యూఢిల్లీ: పార్లమెంట్ శీతాకాల సమావేశాలలో భాగంగా శుక్రవారం రాజ్యసభలో వైఎస్సార్సీపీ రెండు కీలక ప్రైవేటు బిల్లులు ప్రవేశపెట్టింది. బీసీ జనగణన చేసేలా రాజ్యాంగ సవరణ ప్రైవేటు మెంబర్ బిల్లు సహా సెస్, సర్‌ఛార్జీల ఆదాయంలో రాష్ట్రాలకు వాటా ఇచ్చేలా మరో బిల్లును వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ మేరకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 270, 271, 278లను సవరించాలని ప్రతిపాదించారు. సభ అనుమతితో డిప్యూటీ చైర్మన్ హరివంశ్రాయ్ సమక్షంలో బిల్లును విజయసాయిరెడ్డి ప్రవేశపెట్టారు. ఇదీ చదవండి: ఆ డాక్యుమెంట్ ఆధారాలు లేనందునే జాప్యం.. ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నలకు కేంద్రమంత్రి జవాబు -
‘జాతీయ రైతు కమిషన్ ఏర్పాటు చేయాలి’
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో రైతుల ప్రయోజనాలు, సంక్షేమం కోసం జాతీయ రైతు కమిషన్ ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. ఇందుకోసం రాజ్యంగాన్ని సవరించాలని ప్రతిపాదిస్తూ విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు. రైతు ప్రతినిధులతో ఏర్పాటు చేసే కమిషన్ రైతాంగం సంక్షేమం, సంరక్షణ కోసం చేసే సిఫార్సులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సక్రమంగా అమలు చేసేలా పర్యవేక్షించే అధికారం కూడా ఆ కమిషన్‌కే ఉంటుందన్నారు. దీంతో పాటు ప్రాక్టీసు చేసే న్యాయవాదుల సామాజిక భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం తగిన పథకాలకు రూపకల్పన చేయడంతోపాటు.. న్యాయవాదుల సామాజిక భద్రత ఫండ్‌ను నెలకొల్పేందుకు వీలు కల్పించేలా 1961 నాటి అడ్వకేట్స్ చట్టాన్ని సవరించాలని కోరుతూ రెండో బిల్లును ప్రవేశపెట్టారు. అలాగే మహిళల నుంచి గొలుసులు, అభరణాలు, ఇతర విలువైన వస్తువులను దొంగిలించే చర్యను విస్పష్టమైన నేరంగా నిర్వచిస్తూ.. ఇటువంటి నేరాలకు పాల్పడే వారికి 5 నుంచి 10 ఏళ్ల కఠిన జైలు శిక్ష విధించేలా 1960 నాటి భారతీయ శిక్షాస్మృతిని సవరించాలని ప్రతిపాదిస్తూ మూడో బిల్లును ప్రవేశపెట్టారు. తద్వారా మహిళల నుంచి చైన్లు దొంగిలించే నేరాలను సమర్థవంతంగా ఆరికట్టే అవకాశం ఉంటుందని చెప్పారు. -
విజయసాయిరెడ్డి రెండు కీలక ప్రైవేట్ బిల్లులు
న్యూఢిల్లీ : వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి రెండు ప్రైవేట్ మెంబర్ బిల్లులను రాజ్యసభలో ప్రవేశపెట్టారు. శుక్రవారం రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లుల్లో మొదటిది రాజ్యాంగంలోని ఆర్టికల్ 19కి సవరణ అంశం. ఆర్టికల్ 19లోని క్లాజ్ 3, 4లో ఉన్న భారతదేశం సమగ్రత, సార్వభౌమత్వం అనే పదాన్ని తొలగించాలన్న ఈ బిల్లు ఉద్దేశం. ఈ పదం వల్ల రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 కింద కల్పించిన ప్రాథమిక హక్కులు పరిమితం అవుతున్నాయని, అందుకే సవరణ ద్వారా ఆ పదాన్ని తొలగించాలన్నదే సదరు బిల్లు లక్ష్యం. ఇక ఆయన ప్రవేశపెట్టిన రెండో బిల్లు క్రిమినల్ లా (సవరణ)కు సంబంధించినది. సమాజంలో వైవాహిక బంధం చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తున్నాం. దీనిని కాపాడటానికి లింగ వివక్ష లేకుండా మహిళలకు స్వేచ్ఛ, సమానత్వం కల్పించాల్సిన ఆవశ్యకత ఉన్నందున క్రిమినల్ లా లోని 497 సెక్షన్‌ను సవరించాలన్నది ఈ బిల్లు ఉద్దేశమని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. వారికి జీతభత్యాలు ఇవ్వరాదు లోక్‌సభను రాజ్యసభతో పోల్చి చూడొద్దని ఈ సందర్భంగా ఆయన కోరారు. రాజ్యసభ సిట్టింగ్స్ అనేవి లోక్‌సభతో అనుసంధానం చేసి చూడటం సరికాదన్నారు. పార్లమెంట్ ఏడాదికి 120 రోజులు నడపాలన్నారు. చిన్న పార్టీలకు మాట్లాడేందుకు సరైన సమయం ఇవ్వడం లేదని, రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా సభ్యులందరికీ మాట్లాడేందుకు సమయం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సభ సజావుగా సాగకుండా అడ్డుకునే వారికి జీతభత్యాలు ఇవ్వకూడదు అన్నారు. అంతరాయం కలిగిన సభా సమయానికి నష్టపరిహారంగా అంతే సమయాన్ని పొడిగించాలని విలువైన సూచన చేశారు. సెక్షన్ 497 నిరంకుశం..! -
విజయసాయిరెడ్డి రెండు కీలక ప్రైవేట్ బిల్లులు
-
ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టిన విజయసాయిరెడ్డి
న్యూఢిల్లీ: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయసాయి రెడ్డి శుక్రవారం రాజ్యసభలో రెండు ప్రయివేట్ బిల్లులు ప్రవేశపెట్టారు. పరువు హత్యల నివారణ చట్టాన్ని తీసుకురావాలని, స్విస్ ఛాలెంజ్‌ను నియంత్రించాలంటూ ఆయన ప్రయివేట్ మెంబర్ బిల్లు పెట్టారు. పరువు హత్యల నిరోధం, భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ ఉండేలా చట్టం తేవాలంటూ విజయసాయిరెడ్డి ప్రయివేటు బిల్లు ప్రతిపాదించారు. ‘పరువు పేరుతో నేరాల నిరోధం–భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛలో జోక్యం నిరోధం బిల్లు–2017’ను విజయసాయిరెడ్డి ప్రయివేటు మెంబర్ బిల్లుగా ప్రతిపాదించారు. ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి గల ఉద్దేశాలు, కారణాలను వివరిస్తూ.. యువత వివాహం చేసుకునేందుకు భాగస్వామిని ఎంచుకున్నప్పుడు కుటుంబం, కులం, మతం చూపుతూ పరువు పేరుతో వాటిని నిరాకరించడమే కాకుండా నేరాలకు పాల్పడటం ఇటీవల కాలంలో పెరిగిపోయిందని పేర్కొన్నారు. ఈ నేరాలు పౌరుల ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తున్నాయని పేర్కొన్నారు. పరువు పేరుతో యువతీ యువకుల వివాహ భాగస్వామి ఎంపిక స్వేచ్ఛను హరిస్తున్నారని, ఈ తరహా నేరాలు ఆర్టికల్ 16(1)(బి)ని ఉల్లంఘిస్తున్నాయని వివరించారు. ప్రస్తుతం ఉన్న చట్టాలు ఈ తరహా ఇబ్బందులు ఎదుర్కొంటున్న జంటలకు రక్షణ కల్పించలేకపోతున్నాయని తెలిపారు. ప్రస్తుత బిల్లు ఇలా ఇబ్బందులు ఎదుర్కొనే వారికి జీవించే హక్కును కల్పించడంతోపాటు వేధింపులు, హింస, స్వేచ్ఛాయుత ఎంపికలో జోక్యాన్ని నిరోధిస్తుందని పేర్కొన్నారు. స్విస్ ఛాలెంజ్ విధాన నియంత్రణ బిల్లు.. స్విస్ ఛాలెంజ్ విధానంలో ఇచ్చే కాంట్రాక్టులలో అయాచిత ప్రతిపాదనలు ఆమోదించడాన్ని నియంత్రించేందుకు గాను రాజ్యసభలో విజయసాయిరెడ్డి బిల్లును ప్రతిపాదించారు. మౌలిక వసరుల ప్రాజెక్టుల అభివృద్ధిలో ప్రయివేటు రంగం పాత్ర ఇటీవల బాగా పెరిగిపోయిందని, కాంట్రాక్టులు ఇవ్వడంలో పారదర్శకతను ఇది సవాలు చేస్తోందని బిల్లు ప్రతిపాదనకు గల కారణాలు, ఉద్దేశాలు శీర్షికన వివరించారు. స్విస్ ఛాలెంజ్ విధానంలో ప్రాజెక్టు ప్రతిపాదిత సంస్థకు ఎలాంటి అదనపు ప్రయోజనం ఒనగూరకుండా రాష్ట్రాలు తగిన అధ్యయనం ద్వారా పరామితులు విధించాలన్నది ఈ బిల్లు ముఖ్య ఉద్దేశంగా వివరించారు. మౌలిక వసతుల ప్రాజెక్టులను కాంట్రాక్టుగా ఇచ్చినప్పుడు వాటిలో పారదర్శకతో ఉండేలా ఈ స్విస్ ఛాలెంజ్ విధానాన్ని నియంత్రించాలని పేర్కొన్నారు. -
ఏపీకి హోదా కోసం ప్రైవేట్ మెంబర్ బిల్లు
వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి సాక్షి, న్యూఢిల్లీ: ఏపీకి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం లోక్‌సభలో ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఆ రోజు లోక్‌సభ ఎజెండాలో ఈ బిల్లును తొమ్మిదవ అంశం గా పొందుపర్చారు. అనాథ పిల్లలకు సాంఘిక భద్రత కల్పించడం లక్ష్యంగా టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్, జంతువుల చట్టంలో సవరణలు తేవాలని టీడీపీ ఎంపీ జయదేవ్ గల్లా ప్రైవేట్ మెంబర్ బిల్లులు ప్రవేశపెడుతున్నారు. ఉచిత విద్యా చట్టం, 2009లో సవరణలను ప్రతిపాదిస్తూ ఎంపీ టి. సుబ్బరామిరెడ్డి రాజ్యసభలో ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెడతారు. రాజ్యాంగంలో సవరణలను ప్రతిపాదిస్తూ కాంగ్రెస్ ఎంపీలు కేవీపీ రామచందర్ రావు, పాల్వాయి గోవర్ధన రెడ్డి వేర్వేరుగా ప్రైవేట్ మెంబర్ బిల్లులను ప్రవేశపెట్టనున్నారు. -
పెళ్లి ఖర్చు 5 లక్షలు దాటితే....
-
పెళ్లి ఖర్చు 5 లక్షలు దాటితే....
న్యూఢిల్లీ : ఈరోజుల్లో పెళ్లి అనగానే... బోలెడంత ఖర్చు. వేలు, లక్షలు, కోట్లలోకి కూడా వెళ్లింది. పెళ్లి అనగానే హంగులు, ఆర్భాటలెక్కువయ్యాయి. ఒకరిని చూసి మరొకరు అన్నట్టు... ఆ మాత్రం ఖర్చు చేయకపోతే ఎలా? వచ్చిన అతిథులంతా ఏమనుకుంటారు? అన్న చందంగా పెళ్లిళ్ల ధోరణిలోనే మార్పులొస్తున్నాయి. తల తాకట్టు పెట్టి అన్న చందంగా.. పెళ్లి అనగానే ఎన్నో అప్పులు చేసి మరీ ఆర్బాటాలకు పోతున్నారు. పెళ్లిలో పెడుతున్న ఖర్చుల్లో ఎంత మేరకు ఉపయోగపడుతున్నాయి. నిజానికి ఇందులో వృధా అయ్యే ఖర్చే బోలెడంత. ఉదయం పెళ్లంటే... అలంకరణ కోసం వెచ్చిస్తున్న లక్షలాది రూపాయలు సాయంత్రానికి ఖర్చయిపోతున్నాయి. ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి. ఇలా పెళ్లిళ్ల ఖర్చులు పెరుగుతూ పోతే ఎలా మరి? వీటిని ఎలా నియంత్రించాలి? ఇలాంటి ధోరణులకు స్వస్తి చెప్పాల్సిన సమయం వచ్చిందంటూ... కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ, పప్పూ యాదవ్ సతీమణి రంజీత్ రంజన్ లోక్ సభలో ఒక ప్రతిపాదన చేశారు. దీనికి సంబంధించి బుధవారం లోక్ సభలో ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రతిపాదించారు. పెళ్లి ఖర్చు 5 లక్షలు దాటితే ఆ మొత్తంలో 10 శాతం పేద యువతుల వివాహానికి విరాళంగా అందజేయాలి. వివాహాలు (నిర్బంధ రిజిస్ట్రేషన్ - అనవసరపు ఖర్చుల నియంత్రణ) బిల్లు ను ఆమె ప్రతిపాదించారు. పెళ్లిళ్లు ఎలాంటి ఆర్భాటాలు లేకుండా చాలా సింపుల్ గా జరగాలని ఆమె ప్రతిపాదించారు. పెళ్లిళ్లలో ముఖ్యంగా వృధా అవుతున్న ఆహారం పట్ల ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పెళ్లిళ్లకు అతిథులను ఆహ్వానించడంలో సంఖ్యను పరిమితం చేయాలని, ఆహార పదార్థాల సంఖ్యపైన పరిమితులు విధించాలని ఆ బిల్లు లో ప్రతిపాదించారు. పెళ్లిళ్లలో విపరీతంగా ఖర్చు చేయడం ఒక వ్యాధిలా మారుతోందని, దీన్ని నియంత్రించాల్సిన అవసరం ఉందన్న అంశంపై భారతదేశంలో ఎప్పటినుంచో చర్చ సాగుతోంది. ఎంతో మంది నిపుణులు అనేక సలహాలు, సూచనలు కూడా చేశారు. అయితే అవేవీ అమలులోకి రాకపోగా, పెళ్లిళ్లు అనగానే... ఎంగేజ్ మెంట్, సంగీత్, రిసెప్షన్లు... అంటూ ఇలా అనేక రకాలుగా జోడించి ఖర్చును బారెడు చేశారు. ఇలాంటి తరుణంలో ప్రస్తుతం రంజీత్ రంజన్ ప్రతిపాదించిన ఈ ప్రైవేటు మెంబర్ బిల్లు లోక్ సభలో ఏ రూపం తీసుకుంటుందో వేచిచూడాల్సిందే. -
లోక్ సభలో వైఎస్ఆర్ సీపీ ప్రైవేటుబిల్లు
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని కొనసాగిస్తోంది. పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇవాళ (శుక్రవారం) లోక్ సభలో ఏపీకి ప్రత్యేక హోదా కోసం ప్రైవేటు మెంబర్ బిల్లును ప్రవేశపెట్టనున్నారు. లోక్‌సభ బిజినెస్ లో 9వ ఐటమ్‌గా ఆ బిల్లు లిస్ట్ అయింది. అలాగే పునర్ విభజన చట్టంలో ఇచ్చిన హమీలపై సభలోపట్టుబడతామని, పోలవరం,రైల్వే జోన్ సహా అన్ని అంశాలను పార్లమెంట్లో లేవనెత్తనున్నట్లు ఆపార్టీ ఎంపీలు తెలిపారు. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. కాగా పార్లమెంట్ శీతాకాల సమావేశాలు బుధవారం నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. -
ఫిరాయింపులపై విజయ సాయిరెడ్డి ప్రైవేట్ బిల్లు
-
ఫిరాయింపులపై విజయ సాయిరెడ్డి ప్రైవేట్ బిల్లు
న్యూఢిల్లీ : పార్టీ ఫిరాయింపుల నిరోధంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి శుక్రవారం రాజ్యసభలో ప్రయివేట్ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. ఫిరాయింపులపై చట్టాన్ని కఠినతరం చేసే విధంగా ఆర్టికల్ 361బి సవరించాలని, పార్టీ ఫిరాయించిన సభ్యుడికి ఎలాంటి పదవి రాకుండా చట్టాన్ని సవరించాలని విజయ సాయిరెడ్డి ఆ ప్రయివేట్ బిల్లులో పేర్కొన్నారు. 10వ షెడ్యూల్‌కు సవరణ ప్రతిపాదిస్తూ విజయసాయిరెడ్డి విజయ సాయిరెడ్డి ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడుతున్నారు. కాగా లోక్‌సభలో చర్చ సందర్భంగా ప్రత్యేక హోదాపై ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సమాధానం చెప్పాలని వైఎస్ఆర్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇవాళ పట్టుబట్టారు. -
'ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు'
ఢిల్లీ: ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని కాంగ్రెస్ రాజ్యసభసభ్యుడు కేవీపీ రామచంద్రరావు అన్నారు. కేంద్రప్రభుత్వం ప్రైవేట్ మెంబర్ బిల్లు అడ్డుకోవడంపై కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్ సింగ్, జైరాం రమేష్, కేవీపీ, రఘువీరా ఢిల్లీలో గురువారం మాట్లాడారు. కేవీపీ మాట్లాడుతూ..ప్రైవేట్ మెంబర్ బిల్లు ఓటింగ్‌కు రాకుండా బీజేపీ కుట్ర చేసిందని ఆరోపించారు. యూపీఏ మిత్రపక్షాలన్నీ ప్రైవేట్ మెంబర్ బిల్లుకు మద్దతు తెలిపాయని చెప్పారు. ఇప్పుడు అడ్డుకున్న వచ్చే వర్షాకాల సమావేశాల్లో బిల్లు పాసవుతుందన్నారు. ఆంధ్రుల ప్రయోజనాల కోసం శక్తి ఉన్నంత వరకు పోరాడుతామని కేవీపీ తెలిపారు. ప్రత్యేక హోదా లేదని చెబుతున్నా కేంద్ర మంత్రివర్గంలో టీడీపీ కొనసాగడం సిగ్గుచేటని దిగ్విజయ్ సింగ్ అన్నారు. శుక్రవారం ప్రైవేట్ బిల్లు ఓటింగ్‌కు రాకుండా కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అడ్డుకున్నారన్నారు. ప్రత్యేక హోదాకు చట్టం అవసరం లేదు, కేబినేట్ నిర్ణయమే సరిపోతుందని దిగ్విజయ్ అన్నారు. జైరాం రమేష్ మాట్లాడుతూ...ఏపీ, తెలంగాణలో నిస్సిగ్గుగా పార్టీ ఫిరాయింపులు జరుగుతున్నాయన్నారు. సీట్ల సంఖ్య పెంపును ఫిరాయింపుల కోసం ఉపయోగించకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు సీట్ల పెంపుపైనే ఉన్నంతా ధ్యాస ప్రత్యేక హోదాపై లేదన్నారు. టీడీపీ, బీజేపీ రాజద్రోహానికి, ప్రజాద్రోహానికి పాల్పడుతున్నారని ఏపీసీసీ చీఫ్ రఘువీరా అన్నారు. ప్రైవేట్ మెంబర్ బిల్లు ఓటింగ్‌కు రాకుండా వెంకయ్యనాయుడు సర్వశక్తులూ ఒడ్డుతున్నారని విమర్శించారు. -
'పోలవరాన్ని కేంద్రమే పూర్తి చేయాలి'
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై శుక్రవారం రాజ్యసభలో చర్చ వాడీవేడిగా కొనసాగుతోంది. ఏపీకి ప్రత్యేక హోదాపై ప్రైవేట్ మెంబర్ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఈ నేపథ్యంలో ఏపీ రెవిన్యూ లోటును కేంద్రం భర్తీ చేయాలంటూ రాజ్యసభ సభ్యుడు జేడీ శీలం డిమాండ్ చేశారు. న్యూఢిల్లీలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పోలవరాన్ని కేంద్రమే పూర్తి చేయలన్నారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లైనా ఇంకా ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. ముంపు మండలాలను ఏపీలో చేర్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.