సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీల అమలుకు సంబంధించి వైఎస్సార్సీపీ ఎంపీ మార్గాని భరత్‌రామ్ శుక్రవారం లోక్‌సభలో ప్రైవేటు మెంబరు బిల్లు ప్రవేశపెట్టారు. ప్రత్యేక హోదా, పోలవరం సవరించిన అంచనాలతో సహా పలు హామీల అమలుకు సంబంధించిన అంశాలను ఆయన బిల్లులో పొందుపరిచారు. అనంతరం ఏపీ భవన్‌లో భరత్ మీడియాతో మాట్లాడారు. విభజన హామీలను అమలుచేయాలంటూ రాజ్యసభలో ప్రైవేటు మెంబరు బిల్లును పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి ప్రవేశపెట్టారని.. ద్రవ్య బిల్లు అని చెప్పడంతో లోక్‌సభలో ప్రవేశపెట్టామని తెలిపారు.
బిల్లులో ప్రత్యేక హోదాను ప్రధానంగా ప్రస్తావించామని, వెనకబడిన జిల్లాలకు ప్యాకేజీ, రైల్వేజోన్ తదితర అంశాలు ఇందులో ఉన్నాయన్నారు. గతంలో చంద్రబాబు తప్పిదాలను సవరిస్తూ ఏపీకి రావాల్సినవి తీసుకొస్తున్నామని భరత్ వివరించారు. అలాగే, పోలవరం సవరించిన అంచనాల ఆమోదానికి సంబంధించి లోక్‌సభాపక్షనేత మిథున్‌రెడ్డి మరో బిల్లు ప్రవేశపెడతారని భరత్‌రామ్ తెలిపారు. ప్రజాప్రయోజన బిల్లులకే పార్లమెంటులో మద్దతిస్తున్నామన్నారు. ప్రైవేటు మెంబరు బిల్లులు ఎందుకు ప్రవేశపెడుతున్నామో కేంద్రం ఆలోచించాలని ఎంపీ భరత్ తెలిపారు. ఏపీ విభజన చట్టాన్ని గౌరవించాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా అని ప్రశ్నించారు. కృష్ణా, గోదావరి బేసిన్‌లో ఒక పెట్రో కెమికల్ రిఫైనరీ తీసుకురావాల్సి ఉందని, దానికి వయబిలిటీ గ్యాప్ ఫండ్ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పెట్టుకోవాలన్నారు.
గోడ మీద పిల్లిలా టీడీపీ..
ఢిల్లీ ఆర్డినెన్స్ బిల్లుపై టీడీపీ వ్యవహారం గోడ మీద పిల్లిలా ఉందని భరత్ ఎద్దేవా చేశారు. రాష్ట్ర అప్పులపై పార్లమెంటులో ప్రశ్నలు వేసి టీడీపీ ఎంపీలు అభాసుపాలయ్యారన్నారు. లోకేశ్‌కు ధైర్యముంటే తనపై ఎంపీగా పోటీచేయాలని సవాల్ విసిరారు.
Comments
Please login to add a commentAdd a comment