పార్టీ ఫిరాయింపుల నిరోధంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి శుక్రవారం రాజ్యసభలో ప్రయివేట్ బిల్లు ప్రవేశపెట్టనున్నారు.
న్యూఢిల్లీ : పార్టీ ఫిరాయింపుల నిరోధంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి శుక్రవారం రాజ్యసభలో ప్రయివేట్ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. ఫిరాయింపులపై చట్టాన్ని కఠినతరం చేసే విధంగా ఆర్టికల్ 361బి సవరించాలని, పార్టీ ఫిరాయించిన సభ్యుడికి ఎలాంటి పదవి రాకుండా చట్టాన్ని సవరించాలని విజయ సాయిరెడ్డి ఆ ప్రయివేట్ బిల్లులో పేర్కొన్నారు. 10వ షెడ్యూల్కు సవరణ ప్రతిపాదిస్తూ విజయసాయిరెడ్డి విజయ సాయిరెడ్డి ఈ ప్రైవేట్ మెంబర్ బిల్లు పెడుతున్నారు.
కాగా లోక్సభలో చర్చ సందర్భంగా ప్రత్యేక హోదాపై ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ సమాధానం చెప్పాలని వైఎస్ఆర్ సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఇవాళ పట్టుబట్టారు.