రాజ్యసభలో వైఎస్సార్ సీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖ నావల్ డాక్‌యార్డ్‌లో అప్రెంటీషిప్ చేసిన వారికి శుభవార్త. నావల్ డాక్‌యార్డ్‌లో గతంలో అప్రెంటీస్‌లుగా పనిచేసిన వారికి ఉద్యోలిస్తామని రక్షణశాఖ సహాయ మంత్రి సుభాష్ భామ్రే హామీ ఇచ్చారు. నావల్ డాక్‌యార్డ్‌లో స్థానికులకు ఉద్యోగ అవకాశం ఇవ్వాలని వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సోమవారం రాజ్యసభలో కేంద్రాన్ని కోరగా.. కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.
2017లో ఆదేశాలు జారీ..
విశాఖపట్నంలోని హిందుస్తాన్ షిప్‌యార్డ్‌కు ఈకేఎం క్లాస్ సబ్‌మెరైన్ల మరమ్మతు కాంట్రాక్టు అప్పగిస్తూ 2017లో ఆదేశాలు జారీ చేసినట్టు మంత్రి సుభాష్ భామ్రే సోమవారం రాజ్యసభలో వెల్లడించారు. ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వక సమాధానం ఇచ్చారు. ఈకేఎం క్లాస్ సబ్‌మెరైన్ల సంపూర్ణ మరమ్మతుల పని పూర్తి కావడానికి 27 నెలలు పడుతుందని చెప్పారు.
మరమ్మతులు పూర్తి చేసుకున్న సబ్‌మెరైన్లు అదనంగా 5 నుంచి 6 ఏళ్లపాటు సేవలందిస్తాయని తెలిపారు. ఈ ప్రాజెక్టును ఆమోదించడానికి గత జూన్‌లో టెక్నికల్ కమిటీ హిందుస్తాన్ షిప్‌యార్డ్‌ను సందర్శిందా అన్న విజయసాయి రెడ్డి ప్రశ్నకు టెక్నికల్ కమిటీ సందర్శన అవసరమే లేదని మంత్రి వెల్లడించారు.
కాగా, మోటార్ వాహన సవరణ బిల్లుపై రాజ్యసభలో విజయసాయిరెడ్డి మాట్లాడారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం రూపొందించిన రూపంలో మోటార్ వాహన సవరణ బిల్లుకు ఆమెదం తెలపలేమని ఆయన స్పష్టం చేశారు. ఈ బిల్లు విషయంలో పార్లమెంటరీ కమిటీ సిఫారసులను ఎందుకు పట్టించుకోలేదని నిలదీశారు. కమిటీ సిఫారసులు ప్రజలకు మేలు చేసేలా ఉన్నాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment