వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి రెండు ప్రైవేట్ మెంబర్ బిల్లులను రాజ్యసభలో ప్రవేశపెట్టారు. శుక్రవారం రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లుల్లో మొదటిది రాజ్యాంగంలోని ఆర్టికల్ 19కి సవరణ అంశం. ఆర్టికల్ 19లోని క్లాజ్ 3, 4లో ఉన్న భారతదేశం సమగ్రత, సార్వభౌమత్వం అనే పదాన్ని తొలగించాలన్న ఉద్దేశం. ఈ పదం వలన రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 కింద కల్పించిన ప్రాథమిక హక్కులను పరిమితం చేస్తున్నందున దీనిని సవరణ ద్వారా తొలగించాలన్నది లక్ష్యం.