విభజన హామీల అమలుపై వైఎస్ఆర్ సీపీ ఎంపీలు పార్లమెంట్ లో తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. వాయిదా అనంతరం శుక్రవారం మధ్యాహ్నం రాజ్యసభ ప్రారంభం కాగానే వైఎస్ఆర్‌సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి వెల్ లోకి దూసుకెళ్లారు. ఏపీకి న్యాయం చేయాలని, విభజన హామీలను అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి సుజనా చౌదరి రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని పేర్కొన్నారు. సుజనా చౌదరి మంత్రిగా ఉండి ప్రభుత్వానికి సలహాలు ఇచ్చారని, అలా సలహాలు ఇవ్వడంలో తప్పులేదని చైర్మన్ అన్నట్లు విజయసాయిరెడ్డి గుర్తుచేశారు. సుజనా చౌదరి ప్రభుత్వంలో ఉన్నారా.. లేదా చెప్పాలన్నారు. ఒకవేళ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడాలనుకుంటే మంత్రి పదవికి సుజనా రాజీనామా చేయాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. రాజీనామా చేయకుండా ప్రభుత్వాన్ని ఎలా వ్యతిరేకిస్తారని ప్రశ్నించారు.