రాజ్యసభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మంగళవారం ప్రవేశపెట్టిన ట్రిపుల్ తలాక్ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. ట్రిపుల్ తలాక్ బిల్లుపై చర్చలో భాగంగా సభలో మాట్లాడిన ఆయన.. పార్టీ వైఖరిని తెలిపారు. బిల్లులోని పలు అంశాలను తాము పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ట్రిపుల్ తలాక్ సివిల్ కాంట్రాక్ట్ కిందకు వచ్చే అంశమని, వాటికి క్రిమినల్ పనిష్మంట్ ఎలా ఇస్తారని విజయసాయి రెడ్డి సభలో ప్రశ్నించారు. చట్టంలో లేని అంశాల ఆధారంగా కఠిన శిక్ష ఎలా విధిస్తారని ప్రశ్నలను లేవనెత్తారు.