'ప్రైవేట్ బిల్లుకు మద్దతు తెలపండి' | congress leader C Ramachandraiah asked to nda for support to private bill over special status | Sakshi
Sakshi News home page

'ప్రైవేట్ బిల్లుకు మద్దతు తెలపండి'

Published Wed, May 11 2016 4:33 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

'ప్రైవేట్ బిల్లుకు మద్దతు తెలపండి' - Sakshi

'ప్రైవేట్ బిల్లుకు మద్దతు తెలపండి'

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ ప్రవేశపెట్టే ప్రైవేట్ మెంబర్ బిల్లుకు బీజేపీ-టీడీపీ ఎంపీలు మద్దతు తెలపాలని శాసనమండలి విపక్ష నేత సి.రామచంద్రయ్య కోరారు. హైదరాబాద్లో బుధవారం ఇందిరాభవన్లో ఆయన మాట్లాడుతూ...కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు ప్రత్యేక హోదా కోసం ప్రవేశపెట్టనున్న ప్రైవేట్ బిల్లు రాజ్యసభలో ఈ నెల 13న చర్చకు రానున్నట్లు తెలిపారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసిందని...ఎన్డీఏ పక్షాలన్నీ మద్దతు తెలపాలని కోరారు.  

కేంద్ర ప్రభుత్వం ఏపీకి కేటాయించిన నిధులపై స్పష్టత ఇవ్వాలని సి.రామచంద్రయ్య డిమాండ్ చేశారు. బీజేపీ నేతలు, కేంద్ర మంత్రులు చెప్పే లెక్కలపై స్పష్టత లేదన్నారు. దీనిపై సీఎం చంద్రబాబు వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలన్నారు. ప్రైవేట్ బిల్లుకు మద్దతుగా ఈ నెల 12న తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో ఏపీసీసీ కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. కరువు సాయం, తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు, ఖరీఫ్కు ముందస్తు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 13 నుంచి మూడు రోజలు పాటు ఏపీసీసీ రెండు బృందాలుగా రైతు యాత్రలు చేపడుతున్నట్లు రామచంద్రయ్య చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement