అభివృద్ధి అంధకారం.. మౌనంగా అధికారం | ys jagan fire on ap cm chandrababu naidu | Sakshi
Sakshi News home page

అభివృద్ధి అంధకారం.. మౌనంగా అధికారం

Published Fri, Mar 18 2016 5:01 AM | Last Updated on Wed, Aug 8 2018 5:51 PM

అభివృద్ధి అంధకారం..  మౌనంగా అధికారం - Sakshi

అభివృద్ధి అంధకారం.. మౌనంగా అధికారం

జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలంటూ వైఎస్సార్ సీపీ పోరాటం
పార్లమెంటులో ఎంపీ వైవీ, శాసనసభలో జగన్‌మోహన్‌రెడ్డి
జిల్లా పరిషత్తులో విపక్ష ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు

 పట్టించుకోని అధికారపక్షం
జిల్లాను కరువు కాటేస్తోంది...ఆ కోరల్లోంచి బయట పడలేక జిల్లా ప్రజలు కష్టాలు పడుతున్నారు. పంట కలిసి రాక రైతులు... కూలి దొరక్క రైతుకూలీలు... ఏ ఉపాధి పనులూ లేక కార్మికులు అష్టకష్టాలు పడుతున్నారు. వీరికి అండగా ఉండాల్సిన పాలకపక్షం ప్రేక్షకపాత్ర వహించడంతో వైఎస్సార్ సీపీ క్రియూశీలక పాత్ర పోషించడం ప్రారంభించింది. పార్లమెంటు... అసెంబ్లీ... జిల్లా పరిషత్తు... మండల పరిషత్తు ఇలా ఏ వేదికనూ విడిచిపెట్టకుండా కరువుపై తమ గళాన్ని వినిపిస్తున్నారు. 

 అసెంబ్లీలో జగన్
రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై అసెంబ్లీలో జరిగిన చర్చలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాగా ప్రకటించాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబుబ స్పందించ లేదు. ఇటీవల జరిగిన రెండు జెడ్పీ సమావేశాల్లోనూ అధికార ప్రతిపక్ష పార్టీలు దీన్ని అంగీకరించాయి.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని నిర్ణయించినా అధికార పార్టీ తుంగలో తొక్కింది.

అధికార పక్షం మౌనవ్రతం
అసెంబ్లీలో, పార్లమెంట్‌లో దీనిపై మాట్లాడే తీరికే అధికార పార్టీ సభ్యులకు లేకుండాపోయింది. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడంగానీ, అసెంబ్లీలో దీనిపై మాట్లాడే ప్రయత్నం కూడా అధికార పార్టీ చేయలేదు. ఎవరికివారు జిల్లాలో తమ ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్న వారేగానీ, ప్రజల వెతలు తీర్చలేకపోయారు. .

 పార్లమెంట్‌లో ప్రైవేటు బిల్లు
ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి జిల్లా ఎదుర్కొంటున్న దుర్భిక్షంపై పార్లమెంట్‌లో ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టి కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకువెళ్లారు. ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 46లోని సెక్షన్ 94 ప్రకారం వెనుకబడిన జిల్లాలకు బుందేల్‌ఖండ్ తరహాలో ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని అప్పటి ప్రధానమంత్రి ప్రకటించారు. ఆ ప్రకటన సమయంలో జిల్లాను వెనుకబడిన జిల్లాల్లో చేర్చలేదన్న విషయూన్ని గుర్తు చేశారు.

విషాదమిలా... గత ఏడాది మొత్తం 56 మండలాలను కరువు మండలాలుగా ప్రకటిస్తే, అంతకు ముందు ఏడాది 54 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించారు. గత నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా తక్కువ వర్షపాతం గతేడాది నమోదైంది. సాగర్ నీరు కూడా రాకపోవడంతో ఖరీఫ్, రబీలలో సగం విస్తీర్ణంలో కూడా పంటలు పండలేదు. ఒక్క ఏడాదే 38 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు.  

దొనకొండ పారిశ్రామిక నగరం, మైన్స్ యూనివర్శిటీ, మినరల్ సెన్సైస్, ఒంగోలు ఎరుుర్ పోర్టు, కనిగిరిలో జాతీయ పెట్టుబడులు.. ఉత్పత్తి జోన్, రామాయపట్నం పోర్టు, ఫుడ్ పార్కు, వెలిగొండ-1 ఏడాదిలో పూర్తి, స్మార్ట్ సిటీ, ఆక్వా కల్చర్ ప్రాసెసింగ్ యూనిట్.. ఇవన్నీ ఎక్కడున్నారుు అనుకుంటున్నారా? ఎక్కడా లేవు!! నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అరుున వెంటనే జిల్లాపై కురిపించిన హామీల జల్లులివి. వీటిలో ఏ ఒక్కటీ కార్యరూపం దాల్చలేదు సరికదా.. అసలు ఈ హామీల ఊసెత్తేవారే కరువయ్యూరు. జిల్లాలో గడిచిన మూడేళ్లుగా కరువు కరాళ నృత్యం చేస్తున్నా పాలకులు పట్టీపట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయూలపై అసెంబ్లీలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, పార్లమెంట్‌లో వైవీ సుబ్బారెడ్డి గళమెత్తారు. ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాగా ప్రకటించి ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా సర్కార్ కనికరిస్తుందేమో వేచి చూద్దాం.  - సాక్షి ప్రతినిధి, ఒంగోలు

 ఆక ర్ష్‌పై శ్రద్ధ అభివృద్ధిపై ఏదీ?
ప్రకాశం.. అన్ని రంగాల్లో వెనుకబడిన జిల్లా. ఈ విషయూన్ని ఇటీవల నిర్వహించిన రెండు జెడ్పీ సమావేశాల్లో అధికార ప్రతిపక్ష పార్టీలు అంగీకరించాయి. ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాల జాబితాలో చేర్చాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని నిర్ణయించాయి. అయితే ఆ నిర్ణయాన్ని అధికార పార్టీ తుంగలో తొక్కింది. అసెంబ్లీలో గానీ, పార్లమెంట్‌లోగానీ దీనిపై మాట్లాడే తీరిక అధికార పార్టీ సభ్యులకు లేకుండా పోయింది. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడంగానీ, అసెంబ్లీలో మాట్లాడే ప్రయత్నం గానీ అధికార పార్టీ సభ్యులు చేయలేదు. ఎవరికి వారు జిల్లాలో తమ ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారే గానీ, శాసనసభలో, మంత్రివర్గ సమావేశంలో ఒక్కసారి కూడా జిల్లాను వెనుకబడిన జాబితాలో చేర్చాలని కోరిన దాఖలాలు లేవు. కనీసం దీనిపై చర్చించేందుకు జెడ్పీ సమావేశానికి కూడా మంత్రి శిద్దా రాలేదు. విపక్షంలో ఉన్న వారిని తమవైపు ఆక్షర్షిండమే పనిగా పెట్టుకున్న అధికార పార్టీ నేతలు అభివ ృద్ధి పనులను మాత్రం గాలికొదిలేశారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై అసెంబ్లీలో జరిగిన చర్చలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాగా ప్రకటించాలని కోరారు. అయితే దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించలేదు.

 పార్లమెంట్‌లో ప్రైవేట్ బిల్లు
ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి ఇదే అంశంపై పార్లమెంట్‌లో ప్రైవేట్ బిల్లును ప్రవేశపెట్టిన సంగతి విధితమే. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 46లోని క్లాజ్ 94 ప్రకారం వెనుకబడిన జిల్లాలకు బుందేల్‌ఖండ్ తరహాలో ప్రత్యేక ప్యాకేజి ఇస్తామని అప్పటి ప్రధానమంత్రి ప్రకటించారు. అయితే ఆ ప్రకటన సమయంలో ప్రకాశం జిల్లాను వెనుకబడిన జిల్లాల్లో చేర్చలేదు. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లాను కూడా వెనుకబడిన జిల్లాల్లో చేర్చి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం నిధులు ఇవ్వాలని పార్లమెంట్‌లో బిల్లు ప్రవేశపెట్టారు. త్వరలో ఇది చర్చకు రానుంది.

 ప్రకాశం జిల్లా అంటే ఓ వెనుకబడిన జిల్లా.. కేంద్రం ఉత్తరాంద్ర, రాయలసీమకు ప్యాకేజీలు ఇస్తున్నా ప్రకాశం జిల్లా గురించి పట్టించుకోవడం లేదు. ఈ జిల్లా ఏర్పాటే విచిత్రంగా జరిగింది. గుంటూరు, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లోని వెనుకబడిన ప్రాంతాలను కలిపి ప్రకాశం జిల్లాగా ఏర్పాటు చేశారు. ఒంగోలు డివిజన్ గుంటూరు నుంచి, కందుకూరు డివిజన్‌ను నెల్లూరు జిల్లా నుంచి, మార్కాపురం డివిజన్‌ను కర్నూలు జిల్లా నుంచి వచ్చి చేరింది. జిల్లాలో ఒక్క సాగునీటి ప్రాజెక్టు కూడా లేకపోవడంతో ప్రజలు దుర్బిక్ష పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అనంతపురం తర్వాత తక్కువ వర్షపాతంతోపాటు వెనుకబాటుతనం, వలసలు ఉన్న జిల్లా ప్రకాశం. పేరుకు కోస్తా జిల్లానే అయినా అన్ని రంగాల్లో వెనుకబడే ఉంది.

 గత ఏడాది మొత్తం 56 మండలాలను కరువు మండలాలుగా ప్రకటిస్తే, అంతకు ముందు ఏడాది 54 మండలాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించారు. గడిచిన నాలుగు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా తక్కువ వర్షపాతం గత ఏడాది నమోదైంది. సాగర్ నీరు కూడా రాకపోవడంతో ఖరీఫ్, రబీలో సగం విస్తీర్ణంలో కూడా పంటలు పండలేదు. ఆర్థికంగా పూర్తిగా వెనుకబడి ఉంది. జిల్లాలో ఒక్క ఏడాదిలోనే 38 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. జిల్లాకు ఏకైక ఆదాయ వనరుగా ఉన్న చీమకుర్తి గ్రానైట్ రంగం కూడా సంక్షోభంలో చిక్కుకుంది. దీంతో జిల్లాలో ఆర్థిక ప్రగతి మందగించింది. జిల్లా వ్యాప్తంగా కొత్త పరిశ్రమలకు, జాతీయ విద్యాసంస్థల కోసం లక్షన్నర ఎకరాల వరకు ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. ఇటీవలే ట్రిపుల్ ఐటీకి అబ్దుల్‌కలాం పేరు పెడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించినా, అసలు ఈ సంస్థ ఎప్పుడు మంజూరు అయిందో కూడా తెలియదు. ఒంగోలులో వెటర్నరీ యూనివర్శిటీ, మినరల్ యూనివర్శిటీలు ప్రకటనలకే పరిమితమైంది. కనీసం రాష్ట్ర యూనివర్శిటీ కూడా లేని జిల్లా ప్రకాశం జిల్లానే. ఈ నేపథ్యంలో ప్రకాశంను వెనుకబడిన జిల్లాగా ప్రకటిస్తే కేంద్రం నుంచి నిధులు వచ్చే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement