దేశ రాజధానిలో తెలంగాణ ఐటీ, మున్సిపల్ వ్యవహారాలు, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం కేంద్ర జౌళిశాఖ మంత్రి స్మృతి ఇరానీతో భేటీ అయ్యారు. రాష్ట్రంలో చేనేత రంగానికి కేంద్రం సాయం అందించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. వరంగల్లో టెక్స్టైల్ పార్క్ ప్రారంభోత్సవానికి రావాలని ఆయన ఈ సందర్భంగా కేంద్రమంత్రిని ఆహ్వానించారు. కేటీఆర్తో పాటు టీఆర్‌ఎన్ లోక్‌సభ, రాజ్యసభ సభ్యుల బృందం ఈ సమావేశంలో పాల్గొంది. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ చేనేత కార్మికుల కష్టాలను తెలుసుకునేందుకు త్వరలో రాష్ట్రానికి వస్తానని స్మృతి ఇరానీ హామీ ఇచ్చారన్నారు.