
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్‌సీపీ ఎంపీ వి. విజయసాయిరెడ్డికి మరో గౌరవం దక్కింది. రాజ్యసభ పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీలో ఆయన చోటు దక్కించుకున్నారు. అయితే, రాజ్యసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ ఎన్నిక మంగళవారం జరిగింది.
ఈ ఏడాది మే 1వ తేదీ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 30వ తేదీ వరకు ఉండే ఈ రెండు కమిటీల్లో ఇద్దరు తెలుగు ఎంపీలకు అవకాశం దక్కింది. పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి.విజయసాయిరెడ్డి, పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో డాక్టర్ కె.లక్ష్మణ్ చోటు దక్కించుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment