v vijay sai reddy
-
వాడీవేడిగా జేపీసీ తొలి భేటీ
న్యూఢిల్లీ: పార్లమెంట్లో లోక్‌సభ, రాష్ట్రాల్లో శాసనసభలకు జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లును సమీక్షిస్తున్న సంయుక్త పార్లమెంటరీ కమిటీ తొలి సమావేశమే వాడీవేడి చర్చకు వేదికగా మారింది. బిల్లులపై చర్చ సందర్భంగా రాజ్యాంగం మౌలిక రూపాన్ని మార్చే కుట్ర జరిగిందని, ఈ బిల్లుకు సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధమని విపక్ష పార్టీల సభ్యులు గట్టిగా వ్యతిరేకించారు. ప్రజాభీష్టం మేరకే ఈ బిల్లులను తెచ్చామని మూడోసారి పీఠంపై కూర్చున్న ఎన్డీఏ కూటమి సభ్యులు తేల్చి చెప్పారు. దీంతో 39 మంది సభ్యులతో కొలువైన జేపీసీ తొలి భేటీ ఆద్యంతం తీవ్రస్థాయిలో వాదోప వాదాలతో కొనసాగింది. బుధవారం ఢిల్లీలో జేపీసీ సమావేశం తొలిరోజు సందర్భంగా సభ్యులందరికీ కేంద్ర న్యాయ శాఖ ఉన్నతాధికారులు సంబంధిత బిల్లుల్లోని కీలక అంశాలు, నియమనిబంధనలను పూర్తిగా విడమరచి చెప్పారు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ వాద్రా మాట్లాడారు. జమిలి ఎన్నికలు ఎలా ఎన్నికల ఖర్చుగా భారీగా తగ్గించగల్గుతాయని నిలదీశారు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 543 స్థానాల్లో తొలిసారిగా ఈవీఎంలను వాడినప్పుడు ఖర్చు భారీగా తగ్గిందనడానికి ఆధారాలున్నాయా? అని ప్రశ్నించారు.దీటుగా బదులిచ్చిన ఎన్డీఏ కూటమిదీనిపై బీజేపీ సభ్యులు సమాధానం ఇచ్చే ప్రయ త్నం చేశారు. ‘‘ 1957లో ఇలాగే ఏకకాల ఎన్ని కల కోసం అప్పుడు ఏడు రాష్ట్రాల అసెంబ్లీలను కాలపరిమితి ముగిసేలోపే కుదించారు. అప్పు డు రాష్ట్రపతిగా రాజేంద్రప్రసాద్ ఉన్నారు. ఆయ నే నాడు రాజ్యాంగ పరిషత్‌కు చైర్మన్ కూడా. ఆనాడు ఇలాంటి నిర్ణయం తీసుకున్న దిగ్గజ ఎంపీలంతా నాడు నెహ్రూ హయాంలో పనిచేసిన వాళ్లే. ఆ లెక్కన వీళ్లంతా ఆనాడు రాజ్యాంగ ఉల్ల ంఘనకు పాల్పడినట్టా? అని బీజేపీ సభ్యుడు సంజయ్ జైశ్వాల్ ఎదురు ప్రశ్న వేశారు. తీవ్రంగా తప్పుబట్టిన విపక్షాలుబిల్లులను విపక్ష పార్టీల సభ్యులు తప్పు బట్టారు. ‘‘ విస్తృతమైన అంశాలపై సుదీర్ఘంగా చర్చించాలి. బిల్లులపై చర్చించేందుకు కనీసం ఏడాదిపాటు సమయం ఇవ్వాలి’’ అని కమిటీకి సారథ్యం వహిస్తున్న మాజీ కేంద్ర మంత్రి పీపీ చౌదరిని విపక్ష సభ్యులు కోరారు. ఈవీఎంల స్థానంలో బ్యాలెట్ పేపర్ విధానం తేవాలని వైఎస్సార్సీపీ సభ్యులు వి.విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. -
‘బాబు సంపద సృష్టి.. రెండు లక్షలు కొట్టు.. బెల్ట్ షాపు పెట్టు!’
సాక్షి, తాడేపల్లి: ఏపీలో కూటమి సర్కార్ పాలనపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సెటైరికల్ కామెంట్స్ చేశారు. చంద్రబాబు సంపద సృష్టిలో భాగంగా గ్రామాల్లో బెల్ట్ షాపుల లైసెన్స్ ఇచ్చేస్తున్నారని ఆరోపించారు. దీని కోసం టీడీపీ సిండికేట్ వ్యాపారులు జనాభా ప్రాతిపదికన ధర నిర్ణయం చేస్తున్నారని చెప్పుకొచ్చారు.ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా..‘చంద్రబాబు సంపద సృష్టిలో భాగంగా గ్రామాల్లో మద్యం దుకాణాల కోసం జనాభా ప్రాతిపదికన ధర నిర్ణయం చేస్తున్నారు.. అధిక మొత్తం వెచ్చించి మద్యం దుకాణాలను దక్కించుకున్న టీడీపీ సిండికేట్ వ్యాపారులు గ్రామాలలో బెల్ట్ షాపులు లైసెన్స్ ఇచ్చేస్తున్నారు. బెల్ట్ షాపులు కోసం జనాభా.. మద్యం విక్రయాల.. స్థాయిని బట్టి రెండు లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారు.. ఇందులో స్థానిక టీడీపీ నాయకులే మొత్తం ప్రక్రియలు చక్రం తిప్పుతున్నారు.. ఎక్సైజ్ అధికారులు అటువైపు చూడకుండా.. దరిదాపుల్లో మరో బెల్ట్ షాపు ఏర్పడకుండా.. సిండికేట్ వ్యాపారులే అన్నీ చూసుకుంటున్నారు.. అందుకే అనేది ఈ టీడీపీ ప్రభుత్వాన్ని దొంగ ప్రభుత్వం.. దోపిడీ ప్రభుత్వం అని’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. రెండు లక్షలు కొట్టు...బెల్ట్ షాపు పెట్టు..!"చంద్రబాబు సంపద సృష్టి" లో భాగంగా గ్రామాల్లో మద్యం దుకాణాల కోసం జనాభా ప్రాతిపదికన ధర నిర్ణయం చేస్తున్నారు..అధిక మొత్తం వెచ్చించి మద్యం దుకాణాలను దక్కించుకున్న టిడిపి సిండికేట్ వ్యాపారులు గ్రామాలలో బెల్ట్ షాపులు లైసెన్స్…— Vijayasai Reddy V (@VSReddy_MP) October 28, 2024 -
‘నారా లోకేషే సుప్రీం.. టీడీపీలో ఇదే జరుగుతోందా?’
సాక్షి, ఢిల్లీ: జమిలి ఎన్నికల తర్వాత టీడీపీ జెండా పీకేయ్యడమేనా? అని వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. ఇదే సమయంలో బీజేపీలో టీడీపీ విలీనమవుతోందా? అని ప్రశ్నించారు. తానే చక్రవర్తి అన్నట్టు నారా లోకేష్ వ్యవహరిస్తున్నారా? అని కామెంట్స్ చేశారు.కాగా, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా.. ఏపీలో టీడీపీ పరిస్థితి రోజురోజుకి దిగజారిపోతోందా?పార్టీలో ప్రభుత్వంలో సర్వం తానే చక్రవర్తి అన్నట్టు నారా లోకేష్ వ్యవహార శైలితో సీనియర్లు, సన్నిహితులు సహా విసిగిపోతున్నారా? మొన్న బాగున్న పార్టీ, అధికారంలోకి వచ్చిన 100 రోజులకే అనామకంగా అవ్వబోతోందా?జనం 135 స్థానాలు ఇచ్చి నీరాజనాలు పలికితే వంద రోజుల్లో పార్టీలో కుంపట్లతో అసంతృప్తులా! ఎందుకని ? మొన్న మస్తాన్ రావు, మోపిదేవి, నిన్న బాలినేని, సామినేని.. లిస్ట్ ఇంకా ఉందా! ఇంకెంతమందిని అవినీతి సొమ్ముతో కొంటారు ? రాష్ట్ర అభివృద్ధికి నోచుకోక, సంక్షేమ పథకాలు అమలులో వైఫల్యంతో ఇక జమిలి ఎన్నికల తర్వాత టీడీపీ జెండా పీకేయ్యడమేనా?టీడీపీ బీజేపీలోకి విలీనమౌతుందా? బై.. బై బాబు...బై..బై బాబు అంటూ కామెంట్స్ చేశారు. ఏపీలో టీడీపీ పరిస్థితి రోజురోజుకి దిగజారిపోతోందా?పార్టీలో ప్రభుత్వంలో సర్వం తానే చక్రవర్తి అన్నట్టు నారా లోకేష్ వ్యవహార శైలితో సీనియర్లు, సన్నిహితులు సహా విసిగిపోతున్నారా? మొన్న బాగున్న పార్టీ, అధికారంలోకి వచ్చిన 100 రోజులకే అనామకంగా అవ్వబోతోందా?జనం 135 స్థానాలు ఇచ్చి…— Vijayasai Reddy V (@VSReddy_MP) September 20, 2024ఇది కూడా చదవండి: ‘ఏపీని భగవంతుడే కాపాడాలి’ -
చంద్రబాబుకు విజయసాయిరెడ్డి సవాల్
సాక్షి, ఢిల్లీ: ఏపీలో కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలన పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంతో పలు ప్రశ్నలు సంధించారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. విపత్తు నిర్వహణలో పూర్తి వైఫల్యం అనిపించుకున్న చంద్రబాబు స్ట్రైక్ రేట్ ఎంత?. అలాగే, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలులో ఎందుకు పూర్తి వైఫల్యం చెందింది! అని ఎక్స్ వేదికగా ఓ సందేశం ఉంచారు. ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా..ఏపీలో పాలన వంద రోజుల ప్రోగ్రెస్ రిపోర్ట్!ఏపీకి తిరిగి ఊపిరి తీసిన ఎవరికి ఎన్ని మార్కులు..?100 రోజుల్లో వెయ్యి అడుగులు వేసామన్న సర్కార్ బడుగు బలహీన వర్గాల మనస్సులు గాయపర్చిందా!ప్రభుత్వ పాలనతో రైతులు, యువత, మహిళలు, ఉద్యోగులు, తీవ్ర అసంతృప్తి చెందారా..?మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలులో ఎందుకు పూర్తి వైఫల్యం చెందింది!40 సంవత్సరాల ఇండస్ట్రీగా స్వయంప్రకటిత చంద్ర బాబుకు ఐపీఎస్, ఐఏఎస్ బదిలీల్లో కుల ప్రాతిపదికే ప్రామాణికంగా జరిగాయన్న విమర్శలు ఎందుకు వచ్చాయి..?అసంతృప్తితో రగిలిపోతున్న కూటమి నేతలను పట్టించుకోవడం లేదా!విపత్తు నిర్వహణలో పూర్తి వైఫల్యం అనిపించుకున్న చంద్రబాబు స్ట్రైక్ రేట్ ఎంత?ఆరంభమే ప్రభుత్వ వ్యతిరేకత ఎందువల్ల!ప్రజలదే అంతిమ నిర్ణయం! అంటూ కామెంట్స్ చేశారు. ఏపీలో పాలన వంద రోజుల ప్రోగ్రెస్ రిపోర్ట్! ఏపీకి తిరిగి ఊపిరి తీసిన ఎవరికి ఎన్ని మార్కులు..?100 రోజుల్లో వెయ్యి అడుగులు వేసామన్న సర్కార్ బడుగు బలహీన వర్గాల మనస్సులు గాయపర్చిందా! ప్రభుత్వ పాలనతో రైతులు, యువత, మహిళలు, ఉద్యోగులు, తీవ్ర అసంతృప్తి చెందారా..?మేనిఫెస్టోలో ఇచ్చిన…— Vijayasai Reddy V (@VSReddy_MP) September 19, 2024ఇదే సమయంలో అమరావతిపై చంద్రబాబుకు విజయసాయిరెడ్డి సవాల్ విసిరారు. ట్విట్టర్లో.. ఏపీ సీఎం చంద్రబాబుకు సవాల్ విసురుతున్నాను. చంద్రబాబు.. వరదల సన్నద్దత, అమరావతి భవిష్యత్‌పై శ్వేతపత్రం విడుదల చేయాలి. ఒకరి కలల కోసం లక్షల కోట్లు ఖర్చు పెట్టే స్థోమత ఏపీకి లేదు. విజయవాడలో వరదల తర్వాత అమరావతిపై ప్రజలు, పెట్టుబడిదారుల విశ్వాసం సన్నగిల్లింది’ అంటూ కామెంట్స్ చేశారు. I challenge AP CM @ncbn to come out with a White Paper on flood preparedness and the future of Amaravati. AP cannot afford to spend lakhs of crores for someone’s pipe dream. The confidence of people and investors in Amaravati is at its lowest after #VijayawadaFloods.— Vijayasai Reddy V (@VSReddy_MP) September 19, 2024 ఇది కూడా చదవండి: సూపర్ సిక్స్-నారావారి వంచన ఫిక్స్.. జనం ఏమంటున్నారంటే.. -
పాపం బాబు మంత్రులు ఇలా.. ఫొటో షేర్ చేసిన విజయసాయి రెడ్డి
సాక్షి, ఢిల్లీ: ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో మంత్రులను ఓ ఐఏఎస్ అధికారి శాసిస్తున్నారని అన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఈ క్రమంలో నలుగురు మంత్రుల ఎదుట సీనియర్ ఐఏఎస్ అధికారి ఆర్పీ సిసోడియా కాలుపై కాలు వేసుకుని కూర్చున్న ఫొటోను ఆయన షేర్ చేశారు.కాగా, విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా సిసోడియా, మంత్రుల ఫొటోను షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆయన.. చంద్రబాబు నాయుడు హయాంలో ఇదే జరుగుతోంది. బాబు పాలన అంటే ఇలాగే ఉంటుంది. మంత్రుల ముందు ఐఏఎస్ అధికారి కాలు మీద కాలువేసుకుని రాజులా కూర్చున్నాడు. మంత్రులు పొంగూరు నారాయణ, పయ్యావుల కేశవ్, వంగలపూడి అనిత, అనగాని సత్య ప్రసాద్ జూనియర్ ఆఫీసర్లలా ఆయన ముందు కూర్చున్నారు. బాబు పాలనలో అన్నింటికీ సమాధానం ఈ ఫొటోనే చెబుతుంది’ అని కామెంట్స్ చేశారు. This is what’s happening under Chandrababu Naidu’s @ncbn’s regime. Special Chief Secretary (Revenue) R P Sisodia sits like a king, with his legs crossed, while ministers Ponguru Narayana, Payyavula Keshav, Vangalapudi Anitha, and Anagani Satya Prasad sit before him like junior… pic.twitter.com/jBfLQfE7p7— Vijayasai Reddy V (@VSReddy_MP) September 14, 2024 ఇది కూడా చదవండి: కూటమి నేతలు గాడిదలు కాస్తున్నారా?: వడ్డే శోభనాద్రీశ్వరరావు -
టీడీపీ భరత్, పల్లా.. మిమ్మల్ని ప్రజలు క్షమించరు: ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, ఢిల్లీ: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విషయంలో కూటమి ప్రభుత్వం తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఈ క్రమంలో గంటా శ్రీనివాసరావును మాదిరిగానే విశాఖ టీడీపీ ఎంపీ భరత్, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ వెంటనే రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.తాజాగా, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా..‘విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయాలనే కేంద్రం నిర్ణయానికి నిరసనగా అప్పటి తెలుగుదేశం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు 2021 ఫిబ్రవరిలో తన శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను 2024 జనవరిలో స్పీకర్ ఆమోదించారు. అప్పటి గంటా శ్రీనివాసరావు గారిని ఆదర్శంగా తీసుకుని ప్రస్తుత వైజాగ్ పార్లమెంటు సభ్యుడు భరత్ మతుకుమల్లి, స్థానిక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు వెంటనే రాజీనామా చేయాలి. వారు అలా రాజీనామా చేయకపోయినా, ప్రభుత్వంపై ఒత్తిడి చేయకపోయినా చరిత్ర వారిని ద్రోహులుగా, మోసగాళ్లుగా పరిగణిస్తుంది. ప్రజలు వారిద్దరినీ క్షమించరు. వారు చేసిన ద్రోహానికి వారిద్దరికీ గట్టి గుణపాఠం జనం చెబుతారు అంటూ కామెంట్స్ చేశారు. The then MLA, Sri Ganta Srinivas Rao, resigned in February 2021 in protest against the decision to privatize the Vizag Steel Plant, and his resignation was accepted in January 2024. Taking inspiration from him, Vizag Lok Sabha MP Bharat Mathukumilli (@sribharatm) and local MLA…— Vijayasai Reddy V (@VSReddy_MP) September 13, 2024 అయితే, నిన్న కూడా స్టీల్ ప్లాంట్ విషయంలో ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు హయాంలో వైజాగ్ స్టీల్ మూసివేత/ప్రైవేటీకరణ ప్రక్రియ మొదలైంది. బ్లాస్ట్ ఫర్నేస్-3 ను నిలిపివేయడం స్టీల్ ఫ్యాక్టరీ ఉద్యోగుల గొంతు కోయడమే. తెలుగు జాతికి ఇది అతి పెద్ద ద్రోహం. గతంలో చంద్రబాబు గారు ఇచ్చిన హామీలన్నీ యధావిధిగా గాలికి కొట్టుకుపోయినట్టే. ఈ సంక్షోభం సమయంలో ఆయన మౌనం ఎన్డీయే కేంద్రప్రభుత్వానికి ఉక్కు మంత్రిత్వ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంగా భావించవచ్చు. కేంద్రంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు స్టీల్ ఫ్యాక్టరీని కొనసాగించే ప్రయత్నం చేయకపోవడం క్షమించరాని ద్రోహం. వేల మంది కార్మికుల జీవితాలు రోడ్డున పడ్డట్టే. స్టీల్ ఫ్యాక్టరీ ఆలంబనగా వైజాగ్ లో ఎగిసి పడిన ఒక ఆర్థిక వ్యవస్థ (ఎకానమీ) ఇక ఛిద్రమైనట్టే. చంద్రబాబు మోసాన్ని, కాపాడే శక్తి ఉన్నా నిర్లిప్తంగా ఉండటాన్ని రాష్ట్ర ప్రజలు క్షమించరు. టీడీపీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రయోజనాలను కేంద్రానికి తాకట్టు పెట్టింది’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. (1/7) భయపడినంతా అయింది. చంద్రబాబు@ncbn గారి హయాంలో వైజాగ్ స్టీల్ మూసివేత/ప్రైవేటీకరణ ప్రక్రియ మొదలైంది. బ్లాస్ట్ ఫర్నేస్-3 ను నిలిపివేయడం స్టీల్ ఫ్యాక్టరీ ఉద్యోగుల గొంతు కోయడమే. తెలుగు జాతికి ఇది అతి పెద్ద ద్రోహం. గతంలో చంద్రబాబు గారు ఇచ్చిన హామీలన్నీ యధావిధిగా గాలికి…— Vijayasai Reddy V (@VSReddy_MP) September 12, 2024 ఇది కూడా చదవండి: ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఏలేరు వరదలు: వైఎస్ జగన్ -
ఎల్లో ‘కుల’ మీడియాపై విజయసాయి రెడ్డి సీరియస్
సాక్షి, ఢిల్లీ: ఏపీలో ఎల్లో కుల మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. సీఎం చంద్రబాబు తృప్తిపరిచి ఆయన మెప్పు పొందేందుకు స్వార్థంతో నీచంగా పవిత్రమైన పాత్రికేయ వృత్తికే కళంకం చేస్తున్నారని మండిపడ్డారు. అత్యంత దుర్మార్గంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆరోపించారు.కాగా, ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా..‘చంద్రబాబును సంతృప్తిపరచి మెప్పు పొంది, ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు సాధించుకునేందుకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5, మహా న్యూస్, ఈటీవీ, ఆర్ టీవీ, వంటి కుల మీడియా యజమానులు తీవ్రంగా పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో నీతిబాహ్యమైన రీతిలో దుష్ట పన్నాగాలతో బరితెగించి వైఎస్సార్సీపీ నాయకులపై విషం చిమ్ముతూ అబద్దపు వార్తలతో దాడికి పాల్పడుతున్నాయి.వాస్తవాలను పట్టించుకోకుండా అత్యంత దుర్మార్గంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ జర్నలిజం నిబద్ధతను గాలికొదిలి కట్టుకథలను ప్రసారం చేస్తున్న క్రమంలో పవిత్రమైన పాత్రికేయ వృత్తికే కళంకం తెస్తూ చరిత్రహీనులుగా మిగిలిపోతున్నారు. నిస్సిగ్గుగా అబద్ధాలనే నిజాలుగా చిత్రీకరిస్తూ విలువలకూ తిలోదకాలు ఇచ్చి సత్యానికి పాతరేస్తున్నారు. ఈ కుల మీడియా యజమానుల దుర్మార్గమైన ప్రవర్తన పాత్రికేయ సూత్రాలను మంటగలుపుతూ రాజకీయ వాతావరణాన్ని స్వార్ధంతో నీచానికి ఒడికడుతూ కలుషితం చేస్తున్నారు. చంద్రబాబు గారిని సంతృప్తిపరచి మెప్పు పొంది, ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు సాధించుకునేందుకే ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5, మహా న్యూస్, ఈ టీవీ, ఆర్ టీవీ, వంటి కులమీడియా యజమానులు తీవ్రంగా పోటీపడుతూ నీతిబాహ్యమైన రీతిలో దుష్టపన్నాగాలతో బరితెగించి వైస్సార్సీపీ నాయకులపై విషం చిమ్ముతూ అబద్దపు…— Vijayasai Reddy V (@VSReddy_MP) August 14, 2024 -
విజయసాయి రెడ్డిపై తప్పుడు కథనాలు.. ఎల్లో మీడియాపై హైకోర్టు సీరియస్!
సాక్షి, ఢిల్లీ: ఢిల్లీ హైకోర్టులో ఎల్లో మీడియాకు బిగ్ షాక్ తగిలింది. వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డికి వ్యతిరేకంగా ప్రసారం చేసిన కథనాలను వెంటనే తొలగించాలని తొమ్మిది మీడియా సంస్థల(ఈటీవీ, ఆంధ్రజ్యోతి, టీవీ-5, మహాన్యూస్, ఆర్ టీవీ సహా మరో నాలుగు ఛానెల్స్)ను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. ఈ క్రమంలో ఎల్లో మీడియాపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కాగా, ఏపీ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి వ్యవహారంలో ఎంపీ విజయసాయిరెడ్డిపై ఎల్లో మీడియా తప్పుడు కథనాలు ప్రచారం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తన పరువుకు భంగం కలిగించినందుకు రూ.10 కోట్ల నష్ట పరిహారం చెల్లించాలని విజయసాయిరెడ్డి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై హైకోర్టులో మంగళవారం విచారణ జరిగింది.ఇక, విచారణ సందర్బంగా.. ఎంపీ విజయసాయిరెడ్డి పరువుకు భంగం కలిగించే విధంగా తొమ్మిది మీడియా సంస్థలు(ఈటీవీ, ఆంధ్రజ్యోతి, టీవీ-5, మహాన్యూస్, ఆర్ టీవీ సహా మరో నాలుగు ఛానెల్స్) వ్యవహరించాయి. వదంతుల ఆధారంగా తప్పుడు కథనాలు ప్రసారం చేశారు. ఆయన ప్రతిష్టకు, రాజకీయ భవిష్యత్‌కు భంగం కలిగే విధంగా మీడియాలో తప్పుడు ప్రసారాలు అందించారు. ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డికి వ్యతిరేకంగా ప్రసారం చేసిన కథనాలను, వీడియోలను వెంటనే తొలగించాలని హైకోర్టు ఆదేశించింది. ఆయనకు వ్యతిరేకంగా ఉన్న కథనాలన్నింటినీ వెంటనే బ్లాక్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తప్పుడు కథనాలను ప్రజలకు అందించవద్దని ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఢిల్లీ ఘటన కారకులపై చర్యలు తీసుకోవాలి: ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఓల్డ్ రాజేంద్రనగర్‌లో రావుస్ ఐఏఎస్ స్టడీ సెంటర్ బేస్మెంట్లోకి వరద నీరు పోటెత్తి ముగ్గురు విద్యార్థులు మృతిచెందిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందించారు. విద్యార్థులు ఇలా జల సమాధి కావడం ఆందోళనకరమని ఆవేదన వ్యక్తం చేశారు.కాగా, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా..‘సివిల్స్ విద్యార్థులు ముగ్గురు జల సమాధి కావడం ఆందోళనకరం. వేలాదిమంది విద్యార్థులు ఎంతో ఖర్చుపెట్టి తమ కలలను నెరవేర్చుకునేందుకు ఢిల్లీకి వస్తున్నారు. వారికి సరైన వసతులు కల్పించాల్సిన బాధ్యత ఉంది. విద్యార్థుల ఆందోళనకు మద్దతిస్తున్నాం. ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలి’ అంటూ కామెంట్స్ చేశారు. The death of 3 UPSC aspirants in Old Rajinder Nagar due to drowning in the basement of a coaching institute is a matter of concern. Thousands of students come to Delhi and spend lakhs to fulfil their dream. They deserve better. Extending support to their protest. The concerned…— Vijayasai Reddy V (@VSReddy_MP) July 29, 2024 -
కూటమి సర్కార్ కారణంగా భయం గుప్పిట్లో ఏపీ: ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, ఢిల్లీ: ఏపీలో కూటమి ప్రభుత్వంలో పచ్చ మూకలు రెచ్చిపోతున్నాయి. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతున్నారు. ఈ నేపథ్యంలో శాంతి భద్రతల విషయంలో కూటమి ప్రభుత్వం విఫలమైందన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. అలాగే, దాడులకు నైతిక బాధత్య వహించి హోం మంత్రి అనిత రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.కాగా, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా..‘హోం మంత్రి మాటలు కోటలు దాటుతున్నా చేతలు గడప దాటడం లేదు. 'బొల్లి' మాటలతో కాలక్షేపం చేయడం వల్లనే, రాష్ట్రం భయం గుప్పిట్లోకి వెళ్ళిపోయింది. బయటకు వస్తే, ఏమవుతుందో తెలియని దారుణ స్థితి నెలకొంది. దీనికి బాధ్యత హోం మంత్రిదే. హత్యలు జరగకుండా చూడడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది ఇది హోం మంత్రి వైఫల్యం. నైతిక భాద్యత వహించి రాజీనామా చెయ్యాలి. ప్రభుత్వ వైఫల్యంపై కూడా గవర్నర్ విచారణకు ఆదేశించాలి’ అంటూ కామెంట్స్ చేశారు. హోమ్ మంత్రి మాటలు కోటలు దాటుతున్నా చేతలు గడప దాటడం లేదు, 'బొల్లి' మాటలతో కాలక్షేపం చేయడం వల్లనే, రాష్ట్రం భయం గుప్పిట్లోకి వెళ్ళిపోయింది, బయటకు వస్తె, ఏమవుతుందో తెలియని దారుణ స్థితి, దీనికి బాధ్యత హోమ్ మంత్రిదే. హత్యలు జరగకుండా చూడడంలో కూటమి ప్రభుత్వం విఫలమైంది ఇది హోం మంత్రి…— Vijayasai Reddy V (@VSReddy_MP) July 28, 2024 -
బాబూ.. ప్చ్.. నాలుగు సీట్లేనా!: విజయసాయిరెడ్డి
సాక్షి, తాడేపల్లి: ఏపీలో ఎన్నికలకు పోలింగ్‌కు ముగిసింది. ఇక, జూన్ నాలుగో తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. కాగా, సర్వేలన్నీ ఏపీలో మళ్లీ వైఎస్సార్సీపీనే ఘన విజయం సాధిస్తుందని చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబుపై వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైరికల్ కామెంట్స్ చేశారు.కాగా, విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా..‘చంద్రబాబు..!!పోయినసారి 23 మంది మా పార్టీ ఎమ్మెల్యేలను కొన్నావు2019 ఎన్నికలలో వచ్చింది 23 స్థానాలేఈసారి మా వాళ్ళను నలుగురిను (కోటంరెడ్డి, ఆనం, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి) కొన్నావుజూన్ 4న కౌంటింగ్ జరగబోతున్నదిఈసారి ఎన్ని సీట్లకు పరిమితం కాబోతున్నావో ఈపాటికి నీకు అర్థమై ఉంటుంది కదా చంద్రబాబూ?ఈ లెక్కన నువ్వు నాలుగు స్థానాలకే పరిమితం కాబోతున్నావని తెలిసి.. నీ మీద జాలేస్తోంది’ అంటూ కామెంట్స్ చేశారు. చంద్రబాబూ...!పోయినసారి 23 మంది మా పార్టీ ఎమ్మెల్యేలను కొన్నావు. 2019 ఎన్నికలలో (మే 23న జరిగిన కౌంటింగ్‌లో) నీకు వచ్చింది 23 స్థానాలే.ఈసారి మా వాళ్ళను నలుగురిను ( కోటంరెడ్డి, ఆనం, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి) కొన్నావు. జూన్ 4న కౌంటింగ్ జరగబోతున్నది. ఈసారి…— Vijayasai Reddy V (@VSReddy_MP) May 24, 2024 -
చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పాలి: ఎంపీ విజయసాయి రెడ్డి
సాక్షి, నెల్లూరు: చంద్రబాబు కూటమికి మైనార్టీలు ఎన్నికల్లో గట్టిగా గుణపాఠం చెప్పాలన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. మైనార్టీలకు మోసం చేసేందుకు చంద్రబాబు రెడీ అవుతున్నారు ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా..‘ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్‌ను వ్యతిరేకిస్తున్న చంద్రబాబు కూటమికి మైనార్టీలు ఎన్నికల్లో గట్టిగా గుణపాఠం చెప్పాలి. ఆ పార్టీలకు ఓటేయటమంటే రిజర్వేషన్ రద్దుకు అంగీకరించినట్లే. టోపీ పెట్టుకుని మసీదులకు వెళ్తున్న చంద్రబాబు ఇప్పటికే అనేకసార్లు మైనారిటీలను మోసం చేశాడు. ఉపాధి పథకాలు, ఉపకార వేతనాలు, విదేశీ విద్యలో వారికి ఫలాలు అందకుండా చేసిన చరిత్ర బాబుది. ఇప్పుడు వేమిరెడ్డి, నారాయణ ద్వారా నెల్లూరు అర్బన్ అభ్యర్థి ఖలీల్ అహ్మద్‌ను డబ్బు సంచులతో ఓడించాలని చూస్తున్నాడు’.ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్‌ను వ్యతిరేకిస్తున్న చంద్రబాబు కూటమికి మైనార్టీలు ఎన్నికల్లో గట్టిగా గుణపాఠం చెప్పాలి. ఆ పార్టీలకు ఓటేయటమంటే రిజర్వేషన్ రద్దుకు అంగీకరించినట్లే. టోపీ పెట్టుకుని మసీదులకు వెళ్తున్న చంద్రబాబు ఇప్పటికే అనేకసార్లు మైనారిటీలను మోసం చేశాడు. ఉపాధి పథకాలు,…— Vijayasai Reddy V (@VSReddy_MP) May 4, 2024 మానవత్వం మచ్చుకైనా లేని పచ్చ పాము చంద్రబాబు కాటుకు ఇప్పటి వరకు 30 మంది వృద్ధులు ప్రాణాలు వదిలారు. నెలనెలా ఇంటి దగ్గరే జరిగే పెన్షన్ల పంపిణీని అడ్డుకునేందుకు తన నమ్మకస్తుడు నిమ్మగడ్డ రమేష్ చౌదరి ద్వారా ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదులు చేయించాడు. మొదటి ఫిర్యాదుతో వలంటీర్ల సేవలు నిలిచిపోయాయి. ఇప్పుడు పంచాయతీ సెక్రటేరియట్లో సైతం పెన్షన్లు పంపిణీని అడ్డుకుని బ్యాంకుల్లో పెన్షన్ సొమ్ము జమ చేయించడంతో బ్యాంకుల దగ్గర పడిగాపులుకాస్తూ వడదెబ్బతో వయోవృద్ధులు పిట్టల్లా రాలిపోతున్నారు. బాబు ముఖంలో పశ్చాతాపానికి బదులు మందహాసం కనిపిస్తోంది. పేదల ఉసురు నీకు తప్పక తగులుతుంది బాబూ మానవత్వం మచ్చుకైనా లేని పచ్చ పాము చంద్రబాబు కాటుకు ఇప్పటి వరకు 30 మంది వృద్ధులు ప్రాణాలు వదిలారు. నెలనెల ఇంటి దగ్గరే జరిగే పెన్షన్ల పంపిణీని అడ్డుకునేందుకు తన నమ్మకస్తుడు నిమ్మగడ్డ రమేష్ చౌదరి ద్వారా ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదులు చేయించాడు. మొదటి ఫిర్యాదుతో వలంటీర్ల సేవలు…— Vijayasai Reddy V (@VSReddy_MP) May 4, 2024 ‘నెల్లూరు సమగ్రాభివృద్ధి కోసం 100 శాతం కమిట్మెంట్తో రూపొందించినదే నెల్లూరు మేనిఫెస్టో. మన నెల్లూరు అని ప్రతి ఒక్కరూ సగర్వంగా చెప్పుకునేలా దేశంలోనే అగ్రగామి ప్రాంతంగా నెల్లూరును అభివృద్ధి చేస్తామని మాటిస్తూ మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటువేసి అఖండ మెజారిటీతో నన్ను ఎంపీగా గెలిపించాలని కోరుతున్నాను’ అని కామెంట్స్ చేశారు. -
టీడీపీని కబళిస్తున్న చంద్రబాబు తప్పిదాలు: ఎంపీ విజయసాయి
సాక్షి, నెల్లూరు: టీడీపీ అధినేత చంద్రబాబు చేస్తున్న తప్పిదాలే ఆ పార్టీని కబళించి వేస్తున్నాయన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందిస్తున్న సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధిని చూసి టీడీపీ నేతలు వైఎస్సార్సీపీలో చేరుతున్నారని చెప్పుకొచ్చారు. కాగా, ఎంపీ విజయసాయిరెడ్డి క్యాంపు కార్యాలయంలో పండుగ వాతావరణం నెలకొంది. తాజాగా టీడీపీకి రాజీనామా చేసి మాజీ జడ్పీటీసీ రుక్మిణి, మాజీ ఎస్సీ కమిషన్ మెంబర్ రవీంద్ర వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్బంగా వారికి పార్టీ కండువాలు కప్పి ఎంపీ అభ్యర్థి విజయసాయి రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదాల ప్రభాకర్ రెడ్డి వైఎస్సార్సీపీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా విజయసాయి మాట్లాడుతూ.. ‘1982 నుంచి టీడీపీలో ఉన్న నేతలు అందరూ ఆ పార్టీకి గుడ్ బై చెప్పి వైఎస్సార్సీపీలో చేరుతున్నారు. సీఎం జగన్ సంక్షేమ పాలన వల్లే టీడీపీ నేతలు ఆకర్షితులు అవుతున్నారు. వాలంటీర్ వ్యవస్థపై ఫిర్యాదులు చేసి.. పెన్షన్‌దారులకు వారిని దూరం చేయడం చంద్రబాబు చేసిన ఘోర తప్పిదం. చంద్రబాబు చేస్తున్న తప్పిదాలు తెలుగుదేశం పార్టీనే కబళించి వేస్తున్నాయి. వాలంటీర్ మీద ఆధారపడిన ప్రతీ కుటుంబం చంద్రబాబు కుట్రలను వ్యతిరేకిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీలో చేరిన అందరికీ ప్రాధాన్యత ఇస్తామన్నారు. -
YSRCP: మేనిఫెస్టో ప్రకటనకు ముహూర్తం ఖరారు
సాక్షి, ప్రకాశం: బాపట్ల జిల్లాలోని మేదరమిట్ల వద్ద సిద్ధం సభకు సంబంధించిన ఏర్పాట్లను వైఎస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్, ఎంపీ విజయసాయిరెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఇక, ఈ సభలోనే వైఎస్సార్సీపీ పార్టీ మేనిఫెస్టోను విడుదల చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. ఈ క్రమంలోనే సిద్ధం సభకు సంబంధించిన పోస్టర్‌ను వైఎస్సార్సీపీ నేతలు విడుదల చేశారు. ఈ సందర్భంగా విజయసాయిరెడ్డి మాట్లాడుతూ..‘మేదరమీట్లలో సిద్ధం సభను ఈనెల పదో తేదీన నిర్వహిస్తున్నాం. ఈ సభలో నాలుగు సంవత్సరాల పదినెలల్లో మేము చేసిన అభివృద్ధి, సంక్షేమానికి సంబంధించిన విషయాలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వివరిస్తారు. ఈ సభలోనే వైఎస్సార్సీపీ ఎన్నికల మేనిఫెస్టోను కూడా ప్రకటిస్తాం. గతంలో ఏం చేశాం.. రాబోయే కాలంలో ఏం చేస్తామో సీఎం జగన్ వివరిస్తారు. ఈ సిద్దం సభకు 15లక్షల మంది హాజరవుతారని అంచనా వేస్తున్నాం. సిద్ధం సభలకు ప్రజల నుంచి స్పందన బాగా ఉంది. ఒక దానిని మించి ఇంకో సభకు ప్రజలు పోటెత్తుతున్నారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం వైఎస్సార్సీపీ ఏం చేసిందో ప్రజలకు బాగా తెలుసు. బీసీల కోసం పాటుపడిందెవరో బీసీలకు బాగా తెలుసు. సిద్ధం సభకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా సభను నిర్వహిస్తాం. మార్చి పదో తేదీ తర్వాత ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది’ అని కామెంట్స్ చేశారు. -
ఎంపీ విజయసాయిరెడ్డికి ‘సంసద్ మహారత్న’ అవార్డు
సాక్షి, ఢిల్లీ: వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి సంసద్ మహారత్న అవార్డు అందుకున్నారు. ఎంపీ విజయసాయిరెడ్డికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హాన్స్‌రాజ్ అహిర్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ అవార్డును ప్రదానం చేశారు. కాగా, టూరిజం, రవాణా, సాంస్కృతిక శాఖ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా విజయసాయిరెడ్డి అత్యుత్తమ పనితీరుకు గాను అవార్డు దక్కింది. ఇక, మాజీ చైర్మన్ టీజీ వెంకటేష్‌తో కలిపి ఎంపీ విజయసాయి రెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. అలాగే, మహారాష్ట్ర సదన్‌లో జరిగిన కార్యక్రమంలో అవార్డులను ఎంపీలు అధిర్ రంజన్ చౌదరి, సుప్రియ సులే, శ్రీకాంత్ ఏక్ నాథ్ షిండే, హీనా గవిట్, జయంత్ సిన్హా తదితరులు ఈ అవార్డులను అందుకున్నారు. ఈ సందర్బంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ..‘మహిళలకు అన్ని రంగాల్లో సరైన అవకాశాలు కల్పించాలి. చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్ పాస్ చేయడం చరిత్రాత్మకం. పార్లమెంట్లో జరిగే చర్చల ఆధారంగా చట్టాల ఉద్దేశం తెలుస్తుంది. తెలంగాణ కొత్త రాష్ట్రానికి యంగ్ గవర్నర్ ఎలా పని చేస్తారని నా మీద విమర్శలు వచ్చాయి. కానీ, నా పనితీరుతో రెండో రాష్ట్రానికి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అవకాశం వచ్చింది. గైనకాలజిస్ట్‌గా కొత్త శిశువు డెలివరీ చేసినట్లుగా తెలంగాణ కొత్త రాష్ట్రాన్ని కూడా సరిగ్గా నిర్వహించాను. పురుషులతో పాటు మహిళలకు సమాన ప్రాతినిధ్యం కల్పించాలి. అప్పుడే దేశం మరింత అభివృద్ది చెందుతుంది అని కామెంట్స్ చేశారు. జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్సరాజ్ ఆహిర్ మాట్లాడుతూ.. పార్లమెంట్లో వివిధ పద్దతుల్లో ప్రజా సమస్యలు లేవనెత్తాలి. ప్రభుత్వాన్ని సరైన దిశలో నడిపేందుకు ఎంపీలు నిరంతరం ప్రశ్నించాలి అని అన్నారు. -
‘వచ్చే ఎన్నికల్లో ఘనవిజయం దిశగా వైఎస్సార్సీపీ పరుగులు’
సాక్షి, అమరావతి: వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక ప్రకృతి వైపరీత్యాలు, అవాంతరాలు, కష్టాలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నిరాటంకంగా కొనసాగిస్తున్నారని, జనరంజక పాలన సాగిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించడానికి వైఎస్సార్సీపీ ముందుకు సాగుతోందని ఆయన బుధవారం తాడేపల్లిలో విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో శాసనసభ ఎన్నికల్లో కేవలం పనితీరుతో ప్రజల మనసుల్ని గెల్చుకునే మొదటి రాజకీయపక్షంగా వైఎస్సార్సీపీ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టబోతోందని తెలిపారు. ఆ ప్రకటనలో ఆయన ఏమన్నారంటే.. సీఎం వైఎస్ జగన్ రైతులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను ఎన్నో విధాలుగా ఆదుకుంటున్నారు. రాజ్యసభకు నలుగురు బీసీలను పంపించారు. ఇంకా 17 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎమ్మెల్సీ పదవులిచ్చారు. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆ పదవులు కూడా ఇచ్చారు. గతంలో పాలకులు పేదలను ఓటర్లుగానే చూశారు. అదే సీఎం జగన్ పాలనలో సచివాలయ, వలంటీరు వ్యవస్థలతో ప్రజలకు ఊళ్లోను, ఇళ్లవద్దే పథకాలు అందుతున్నాయి. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుని ప్రజల్లో పూర్తి విశ్వాసం కలిగించిన నేత జగన్. తన పాలనతో అందరి కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు. ఈ నాలుగేళ్లలో డీబీటీ ద్వారా రూ.2.11 లక్షల కోట్లు.. పైసా లంచం లేకుండా పారదర్శకంగా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేశారు. 31 లక్షల ఇళ్లపట్టాలు ఇవ్వడంతో పాటు దాదాపు 22 లక్షల ఇళ్లు కట్టించి ఇస్తున్నారు. ఇది కూడా చదవండి: కేంద్ర చట్టం పాటించం.. రాష్ట్ర చట్టం వర్తించదు.. రామోజీ తీరు.. -
రాజ్యసభ పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ సభ్యుడిగా ఎంపీ విజయసాయిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్సీపీ ఎంపీ వి. విజయసాయిరెడ్డికి మరో గౌరవం దక్కింది. రాజ్యసభ పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీలో ఆయన చోటు దక్కించుకున్నారు. అయితే, రాజ్యసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ, పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీ ఎన్నిక మంగళవారం జరిగింది. ఈ ఏడాది మే 1వ తేదీ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ 30వ తేదీ వరకు ఉండే ఈ రెండు కమిటీల్లో ఇద్దరు తెలుగు ఎంపీలకు అవకాశం దక్కింది. పబ్లిక్ అండర్ టేకింగ్స్ కమిటీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు వి.విజయసాయిరెడ్డి, పబ్లిక్ అకౌంట్స్ కమిటీలో డాక్టర్ కె.లక్ష్మణ్ చోటు దక్కించుకున్నారు. -
రాజ్యసభ వైస్ చైర్మన్‌గా విజయసాయిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: రాజ్యసభ వైస్ చైర్మన్‌గా వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డిని ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ నియమించారు. విజయసాయిరెడ్డితో పాటు మరో ఏడుగురికి వైస్ చైర్మన్ ప్యానల్లో అవకాశం కల్పించారు. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. తనకు వైస్ చైర్మన్‌గా అవకాశమిచ్చిన ఉప రాష్ట్రపతికి విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. -
చంద్రబాబు వంటి చెలికాడు ఈ ముజ్జగాలలో ఎక్కడున్నాడు?
ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీని చంద్రబాబు కలవడంపై ఎల్లో మీడియాలో వచ్చిన వార్తలు రాజకీయంగా చర్చనీయాంశమవుతున్నాయి. గత కొన్నాళ్లుగా అన్ని రకాల ఎన్నికల్లో ఓడి ప్రజల్లో పూర్తిగా విశ్వసనీయత కోల్పోయిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబుకు ఢిల్లీలో ఎంత ఘనకీర్తి ఉందో టీడీపీ కార్యకర్తలే అడగకముందే చెబుతారు. అంతేందుకు సొంత పార్టీ ఎంపీలే చంద్రబాబుకు స్వాగతం పలికేందుకు ముందుకు రావడానికి కూడా ఇబ్బంది పడ్డారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు పట్ల మోదీ అపారమైన వినయ విధేయతలు ప్రదర్శించారంటూ ఎల్లో మీడియాలో వార్తలు రావడంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటనపై రాసిన వార్తలకు సంబంధించి ఎల్లో మీడియాకు చురకలంటించారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఇంకెన్నాళ్లు అబద్దాలు చెప్పి జాకీలేసి లేపుతారంటూ నేరుగా ప్రశ్నించారు. ఎన్నిఎలివేషన్స్ ఇస్తారు? ఎన్ని అబద్దాలు చెప్పి జాకీలేసి లేపుతారు? ప్రధాని బతిమిలాతున్నట్లు…బాబుకే టైంలేక ఢిల్లీ వెళ్ళనట్లు పచ్చ మీడియా ప్రచారం. "అక్క"ఆరాటమే తప్ప "బావ" బతకడన్నట్లుంది పచ్చ మీడియా పరిస్థితి. #KickBabuSaveAP pic.twitter.com/UcfDE8xVXq — Vijayasai Reddy V (@VSReddy_MP) August 7, 2022 మరో రాజకీయ విశ్లేషకులు ఇలపావులూరి మురళీ మోహన రావు తనదైన శైలిలో చంద్రబాబు పర్యటనను విశ్లేషించారు. బాబును చూడగానే మోదీ ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు. కళ్ళు జలపాతాలయ్యాయి. దేహం మీదున్న అన్ని వెంట్రుకలు లేచి నిలబడ్డాయి. "బాబూ...." అని పెద్దగా అరిచాడు. చంద్రబాబు మాత్రం పట్టించుకోలేదు. మామూలుగా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో, ఇతర నాయకులతో మాట్లాడుతున్నారు. ఫరూక్ అబ్దుల్లా అయితే బాబు చేయిని వదలలేదు. "వంకాయవంటి కూరయు, పంకజముఖి సీతవంటి పత్నియు, చంద్రబాబు వంటి చెలికాడు ఈ ముజ్జగాలలో ఎక్కడున్నాడు?" అంటూ శివరంజని రాగంలో పాటను ఆలపించారు. అక్కడున్న జాతీయనాయకులు అందరూ బాబును చుట్టుముట్టారు. అభినందలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. అయితే బాబు మాత్రం చలించలేదు. చాల గుంభనంగా ఉండిపోయారు. ఇక అక్కడ తనకు బాబును కలవడానికి వీలుకాదని భావించిన మోదీ బాబు చేయిని ఆప్యాయంగా పట్టుకుని తెరవెనక్కు తీసుకెళ్లారు. "బాబూ..స్నేహితుల దినోత్సవం రోజున అక్కడినుంచి ఇంతదూరం వచ్చి నన్ను కలిసి నిజమైన స్నేహితుడివి అనిపించుకున్నావు. గతంలో నువ్వు నన్ను అనేకంగా ఛండాలంగా తిట్టావు. నా భార్యను, అమ్మను కూడా దూషించావు. నన్ను మోసగాడిని అన్నావు. అయినా నేను గత ఐదేళ్లలో నిన్ను ఒక్కమాట కూడా అనలేదు. ఎందుకంటే నీ సంగతి నాకు తెలుసు. స్నేహానికి, బంధుత్వానికి ప్రాణం ఇచ్చేవాడివి నీవు. నీ మనసు హెరిటేజ్ వెన్న అని నాకు బాగా తెలుసు. అందుకే నీ స్నేహం కోసం అయిదేళ్లనుంచి తపస్సు చేస్తున్నాను. ఇన్నాళ్లకు నన్ను కరుణించావా బాబూ....రాబోయే ఎన్నికల్లో నువ్వు నాకు ఒక్క సీటు ఇచ్చినా సరే, నేను, నా పార్టీ మొత్తం నీవెంటే ఉంటాము. పొత్తులు కాల్చి తిని అవతలపారేసే మొక్కజొన్నపొత్తులు అని నాకు తెలుసు. నువ్వంటే నాకు ఎంతో ఇష్టం. నువ్వు కనీసం వారానికొకమారైనా ఢిల్లీ రావాలి. నాకు ఏపీకి వద్దామని ఉంది కానీ నాలుగేళ్లక్రితం "మోడీ గో బాక్" అని హోర్డింగులు పెట్టావు కదా.. అందుకే నీ మాటను గౌరవించి నేను విజయవాడ రాలేదు. ఏమీ అనుకోవద్దు " అంటూ బాబును వాటేసుకుని గిరగిరా తిప్పారు మోడీ. చంద్రబాబు మాత్రం ఏమీ బదులివ్వకుండా "ఆలోచిస్తా" అన్నట్లుగా తలఊచి తన ఎంపీలతో బయటకు వెళ్లిపోయారు! ఇక నెటిజన్లు కూడా చంద్రబాబు పర్యటనపై తమ స్థాయిలో స్పందించారు. ఈసారికి రాష్ట్రపతిని , ఉపరాష్ట్రపతిని మీకు చెప్పకుండా ఎంపిక చేసినందుకు మమ్మల్ని మన్నించండి బాబు ... గతంలో మీరు ఎందరో రాష్ట్రపతులను, ప్రధానులను తయారు చేసేవారు.... కానీ ఈ మధ్య మీకు వయసు మీద పడిందని .. దానికి తోడుగా కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి తరువాత మతి చెడిందని.... వేళకు సరిగా మందులు కూడా వేసుకోవడం లేదని విన్నాం... అందుకే ఈ వయసులో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం భావ్యం కాదని... మేమే రాష్ట్రపతిని , ఉపరాష్ట్రపతిని ఎంపిక చేసుకున్నాం... మరేమీ అనుకోవద్దు బాబు...అని... మోదీ గారు బ్రతిమలాడేసరికి ఐదు నిమిషాలు అయిపోయిందట ... సరే .... మీకు నేను ఇచ్చిన ఐదు నిమిషాల సమయం అయిపోయింది... మీరు ఇంకా ఏదైనా నాతో చెప్పాలి అనుకుంటే మరో సారి కలిసినప్పుడు చెప్పండి... నాకు ఇప్పుడు సమయం లేదని ... బాబు గారు బయటకు వచ్చేశారట.. ! ఇక చంద్రబాబు మోదీని కలవడం ఒక చరిత్రాత్మక భేటీ అన్నట్టుగా… వచ్చిన వార్తలను ఆటాడుకున్నారు నెటిజన్లు. చంద్రబాబు గుణం అర్థమయ్యాక మోదీ, షా కిలోమీటర్ల దూరం ఉంచుతున్నారు తనను… గత ఎన్నికల ముందు… దేశంలో చంద్రబాబు స్థాయిలో మోదీని అన్నిరకాలుగా అవమానించి, వ్యతిరేకించిన నాయకుడు ఇంకొకరు లేరు… అడ్డగోలుగా ఓడిన తరువాత గానీ బాబుకు తత్వం బోధపడలేదు… సారీ, ఆ తత్వమే అది కదా… ఇప్పుడు మోదీకి వ్యతిరేకంగా పోలేడు… జడుపు… మోదీ ఇక జన్మలో నమ్మడు… ప్రత్యేకంగా మోడీ చంద్రబాబును పక్కకు పిలిచి అయిదు నిమిషాలు మాట్లాడాడట… మీరు మమ్మల్ని మరిచిపోయారు, ఇలాగైతే మేం ఏమైపోవాలి, దేశం కోసమైనా మీరు అప్పుడప్పుడూ ఢిల్లీ వస్తుండాలి… మీ ఇల్లు అనుకొండి, మీతో చాలా మాట్లాడాల్సి ఉంది, ప్లీజ్ అని మోడీ పదే పదే మొహమాటపెట్టేశాడు. సర్లే, మరీ అంతగా బతిమిలాడకు, అప్పుడప్పుడూ వస్తుంటాలే అని చంద్రబాబు మోదీకి అభయహస్తం చూపి, ధైర్యాన్నిచ్చాడు అన్నట్టుగా ఉన్నాయి . థాంక్ గాడ్, చంద్రబాబు తిరిగి వచ్చేస్తున్నప్పుడు కారు దాకా నడిచివచ్చి వీడ్కోలు పలికాడని రాయలేదు..!! మొత్తమ్మీద చంద్రబాబు పర్యటన, ప్రధానిని కలవడంపై ఎల్లో మీడియా అతిగా స్పందించి నవ్వులపాలయ్యారన్న విమర్శలు వెల్లువెత్తాయి. ఇదీ చదవండి: ఢిల్లీ వెళ్లిన చంద్రబాబుకు షాక్.. ఎంపీ కేశినేని వైఖరితో నిర్ఘాంతపోయిన బాబు -
‘జలశక్తి శాఖలో పోలవరం ప్రాజెక్టు డీపీఆర్ ఏదీ పెండింగ్‌లో లేదు’
సాక్షి, న్యూఢిల్లీ: పోలవరం సవరించిన అంచనా వ్యయం ప్రతిపాదనలను అడ్వైజరీ కమిటీ 2011లో ఒకసారి, ఆ తర్వాత ఫిబ్రవరి 2019లో ఆమోదించిందని కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా సోమవారం రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్ర మంత్రి షేకావత్ సమాధానం ఇస్తూ.. జలశక్తి శాఖలో పోలవరం ప్రాజెక్టు డీపీఆర్ ఏదీ పెండింగ్‌లో లేదని తెలిపారు. పోలవరం ప్రాజెక్టుకు 2005-06 లెక్కల ప్రకారం రూ.10,151.04 కోట్ల అచనాలతో డీపీఆర్‌ను ఆమోదించామని తెలిపారు. 2009 జనవరి 20న ఈ డీపీఆర్‌ను జలశక్తి శాఖలోని ఫ్లడ్ కంట్రోల్ అండ్ మల్టీపర్పస్ ప్రాజెక్ట్ 95వ మీటింగ్‌లో ఆమోదించిందని తెలిపారు. -
విశాఖపై చంద్రబాబు విషం
దొండపర్తి (విశాఖ దక్షిణ): అమరావతిపై ప్రేమతో ప్రతిపక్ష నాయకుడు నారా చంద్రబాబునాయుడు విశాఖపై విషం చిమ్ముతున్నాడని వైఎస్సార్సీపీ జాతీయ ప్రధానకార్యదర్శి, ఉత్తరాంధ్ర ఇన్చార్జి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి మండిపడ్డారు. నగరంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలు.. ♦ విభిన్న సంస్కృతుల ప్రజలతో మినీ భారత్‌ను తలపిస్తున్న విశాఖ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ♦ విశాఖ సర్వతోముఖాభివృద్ధికి సీఎం వైఎస్ జగన్ చేస్తున్న ప్రయత్నాలను చంద్రబాబు కుటిల రాజకీయాలు, లిటిగేషన్ల పేరుతో అడ్డుకుంటున్నారు. ♦ఉమ్మడి రాష్ట్ర సీఎంగా చంద్రబాబు ఉన్నపుడు హైదరాబాద్ భూములపై కన్నేసినట్లే.. తర్వాత అమరావతిని రియల్ ఎస్టేట్ వెంచర్‌గా మార్చారు. చంద్రబాబు తన ఐదేళ్ల కాలంలో అమరావతి గ్రాఫిక్స్ చూపించి కాలయాపన చేసి అందరినీ మాయచేశారు. ♦ పెట్టుబడుల సదస్సుల పేరుతో చేసిన వందల కోట్ల ఖర్చులో సగం కూడా పెట్టుబడులు రాష్ట్రానికి రాలేదు. ♦ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్నడూ లేని విధంగా విశాఖ నగరాభివృద్ధి కోసం రూ.1300 కోట్లు కేటాయించారు. ♦ విశాఖలో ప్రైవేటు యూనివర్సిటీ కోసం.. ప్రజా యూనివర్సిటీగా వర్ధిల్లుతున్న ఆంధ్రా యూనివర్సిటీ ప్రతిష్టనుమసకబార్చారు. ♦ 14 ఏళ్లుగా సీఎంగా చేసినపుడు చంద్రబాబు ఎప్పుడూ విశాఖను పట్టించుకున్న పాపాన పోలేదు. ఉత్తరాంధ్ర టీడీపీ అడ్డా అంటూ చెప్పకోవడం మినహా చేసింది ఏమీ లేదు. రాష్ట్ర విభజన తరువాత కూడా అభివృద్ధిని కాగితాలకే పరిమితం చేసి, ఫైవ్‌స్టార్ హోటళ్లలో మీటింగ్లకే పరిమితం చేశారు. ♦ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అవసరం లేదంటూ కేంద్రానికి లేఖలు రాసిన చంద్రబాబు.. హోదా కోసం ఎవరైనా మాట్లాడితే జైల్లో పెడతానంటూ బెదిరించారు. ♦ విశాఖకు ఐటీ కారిడార్‌ను తెచ్చింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌రాజశేఖరరెడ్డే. ఆయన అధికారంలో ఉన్నపుడు 18 వేల మంది విశాఖలో ఐటీ పరిశ్రమలో పనిచేసేవారు. ♦ ఆయన మరణం తరువాత ఐటీ పరిస్థితి విశాఖలో దిగజారింది. ♦విశాఖలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నుంచి బీఆర్టీఎస్ రోడ్లు, 14 కొత్త కాలనీలు, ఏపీ సెజ్ ఏర్పాటు, బ్రాండిక్స్ కంపెనీ, తద్వారా వేలాది మంది ఉద్యోగావకాశాలు ఇవన్నీ వైఎస్ఆర్ చలవే. ♦ చంద్రబాబు మాత్రం విశాఖలో భూములు దోచుకొని బినామీలకివ్వడం, హుద్‌హుద్ పేరు చెప్పి రికార్డులు మాయ చేయడం వంటివి చేశారు. ♦ విశాఖ జిల్లాలో అపార ఖనిజ సంపదను ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టడానికి చంద్రబాబు ప్రయత్నించారు. అడ్డువచ్చిన వారిని మావోయిస్టు అని, రౌడీషీటర్ అని ముద్రవేసేవారు. ♦ అటువంటి తప్పులు సరిదిద్దడంతో పాటు విశాఖ జిల్లా అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి చర్యలు చేపడుతున్నారు. విశాఖలో మెట్రో, ట్రామ్ కారిడార్ల ఏర్పాటుతో పాటు అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ♦ పెట్టుబడులను ఆకర్షించడానికి కూడా ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నారు. -
ఢిల్లీలో సీఎం బిజీబిజీ
సాక్షి, న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వంలోని పలువురు ఉన్నతాధికారులు, వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సీఎంను ఆయన అధికారిక నివాసంలో కలిసి పలు అంశాలపై చర్చించారు. అలాగే, పలువురు వైఎస్సార్సీపీ ఎంపీలు కూడా వైఎస్ జగన్‌తో సమావేశమయ్యారు. వీరిలో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి, లోక్‌సభ పక్ష నేత మిథున్‌రెడ్డి, ఎంపీలు బాలశౌరి, ప్రభాకర్‌రెడ్డి, రఘురామకృష్ణంరాజు, వైఎస్ అవినాష్ రెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు, మార్గాని భరత్ తదితరులు ఉన్నారు. కాగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం కేంద్ర న్యాయ, ఐటీ శాఖల మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో సమావేశం కానున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలవనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. -
‘తెలంగాణలో ఓడిన బాబు, బాలకృష్ణ’
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రజాఫ్రంట్ ఓడిపోవడం పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి తనదైన శైలిలో స్పందించారు. తెలంగాణ ఎన్నికల్లో ఓడిన ప్రముఖుల జాబితా ఇదిగో అంటూ ట్విటర్లో పోస్ట్ చేశారు. ఇందులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేరు ముందుగా ఉంది. బాలకృష్ణ, లగడపాటి రాజగోపాల్, వేమూరి రాధాకృష్ణ, రామోజీరావు, కాంగ్రెస్ పార్టీ పేర్లు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ‘తెలంగాణ ప్రజానీకం తిరుగులేని తీర్పుతో సైకిల్‌కు ముందు చక్రం ఊడిపోయింది. నాయుడుబాబుకు చావుతప్పి కన్నులొట్టబోయింది. సైకిల్ వెనుక చక్రం కూడా పీకి చంద్రబాబు పీడను ఎంత త్వరగా ఒదిలించుకోవాలా అని ఆంధ్ర ప్రజలు కసిగా ఎదురుచూస్తున్నార’ని ట్వీట్ చేశారు. పవిత్ర కర్తవ్యాన్ని నెరవేర్చాల్సిన పత్రికలు టీడీపీ కరపత్రాలుగా మారాయి. ఈసీ నిబంధన ప్రకారం నియోజక వర్గంలో రూ.28 లక్షలు మాత్రమే ఖర్చు పెట్టాలి. నాయుడు బాబు దాన్ని 28 కోట్లకు తీసుకు వెళ్లారు. కూకట్‌పల్లిలో వంద కోట్లు వెదజల్లారు. ఫలితాన్ని1% కూడా మార్చలేక పోయారు. బాబూ యూ ఆర్ అవుట్.’ అని ట్విటర్లో పేర్కొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్-టీడీపీ పొత్తును ప్రజలు తిరస్కరించారని విజయసాయిరెడ్డి ఢిల్లీలో అన్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ హిమాలయ శిఖరం అంత తప్పు చేసిందని అభిప్రాయపడ్డారు. చంద్రబాబు తన స్వప్రయోజనాల కోసం పొత్తు పెట్టుకున్నారని ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు దేశంలోను రిపీట్ అవుతాయన్నారు. ఎన్నికల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. చంద్రబాబు దోపిడీ కక్కిస్తే ప్రతి కుటుంబానికి 20 లక్షల రూపాయల పంచవచ్చని, చంద్రబాబు కబ్జా చేసిన భూములను తీసుకుంటే ప్రతి కుటుంబానికి 3 ఎకరాల భూమి ఉచితంగా ఇవ్వచ్చని పేర్కొన్నారు. తెలంగాణ ఎన్నికల్లో ఓడిన ప్రముఖుల జాబితా.... 1)చంద్రబాబు నాయుడు 2)బాలకృష్ణ 3)లగడపాటి రాజగోపాల్ 4)ఏబీఎన్-ఆంధ్రజ్యోతి రాదాకృష్ణ 5)ఈనాడు-ఈటీవి రామోజీ 6)మునుగుతున్న చంద్రబాబు తోకపట్టుకుని ఈదటానికి ప్రయత్నించిన కాంగ్రెస్. — Vijayasai Reddy V (@VSReddy_MP) 11 December 2018 -
తప్పుడు పనుల పై నిఘా పెట్టాలి
-
చంద్రబాబుపై నిఘా పెట్టాలి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో విపక్ష ఎమ్మెల్యేలను అధికార టీడీపీ ప్రలోభాలకు గురి చేస్తోందని కేంద్ర ఎన్నికల సంఘానికి వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. ఎంపీ వి. విజయసాయిరెడ్డి శుక్రవారం ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓపీ రావత్‌ను కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఏపీ ప్రభుత్వం విచ్చలవిడిగా అవినీతి పాల్పడుతూ, ఆ సొమ్ముతో ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొంటోందని ఆరోపించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలపై తప్పుడు కేసులు పెడుతూ వేధిస్తోందన్నారు. రాజ్యసభ ఎన్నికల సమయంలో కొంత మంది ఎమ్మెల్యేలను అరెస్ట్ చేయాలని కుట్ర పన్నుతోందని వెల్లడించారు. ‘మా పార్టీకి చెందిన 67 మంది ఎమ్మెల్యేల్లో 23 మందిని రూ. 10 నుంచి 20 కోట్లు ఇచ్చి టీడీపీ ప్రభుత్వం కొనుగోలు చేసింది. మిగతా 44 మందిలో కనీసం నలుగుర్ని కొనాలని ప్రయత్నిస్తోంది. ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 25 కోట్లు ఆఫర్ చేసినట్టు మా దృష్టికి వచ్చింది. ఈ విషయాన్ని సీఈసీ దృష్టికి తీసుకెళ్లాం. రాజ్యసభ ఎన్నికల సమయంలో పోలింగ్ బూత్‌లను ఉమ్మడి రాజధాని హైదరాబాద్‌లో పెట్టాలని, కేంద్ర బలగాలతో ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించాలని కోరాం. తప్పుడు కేసులు పెట్టకుండా చూడాలని, ప్రత్యేక పరిశీలకుడిని నియమించి ఎన్నికలను పర్యవేక్షించాలని విజ్ఞప్తి చేశాం. గతంలో తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబు ఇరుకున్నారు. అలాగే ఏపీ ప్రభుత్వ చట్టవ్యతిరేక కార్యకలాపాలపై కేంద్రం నిఘా పెట్టాలని కోరామ’ని విజయసాయిరెడ్డి తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి (సీఈసీ)కి రాజ్యసభ సభ్యులు వి.విజయసాయి రెడ్డి సమర్పించిన వినతిపత్రం -
'నాకే ముడుపులిస్తామన్నారు'
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలో జరుగుతున్న భూ పోరాటాన్ని విరమించుకుంటే తనకే ముడుపులిస్తామని భూ బకాసురులు దూతల ద్వారా రాయబారం పంపారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి వెల్లడించారు. వెంకట రామరాజు అనే వ్యక్తి స్వయంగా మొబైల్లో తనకు సంక్షిప్త సందేశం పంపించారని చెప్పారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం ముదపాక అసైన్డ్ భూములను అఖిలపక్ష నేతలతో కలిసి సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమను ఎంత ప్రలోభపెట్టినా, భయపెట్టినా ప్రజల పక్షాన పోరాడటం ఆపేదిలేదని స్పష్టంచేశారు. విశాఖలో జరుగుతున్న భూ కుంభకోణాలు, బాధితులపై తప్పుడు కేసులకు వ్యతిరేకంగా త్వరలో అఖిలపక్షం ఆధ్వర్యంలో విశాఖ కలెక్టరేట్ వద్ద మహాధర్నా నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ముదపాకలో కొండల మధ్య ఉన్న వెయ్యి ఎకరాల్లో దాదాపు 450 ఎకరాలను పేదలు, దళితులకు ఇచ్చారని, వాటిని హైదరాబాద్‌లో ఉంటున్న వెంకట రామరాజు అలియాస్ జలవిహార్ రాజు ఆక్రమించుకోవడానికి రాత్రికి రాత్రే రోడ్లు వేసేశారని విజయసాయిరెడ్డి తెలిపారు. ఆయన సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌లకు బినామీ అనే విషయం జగమెరిగిన సత్యమన్నారు. ఎకరం రూ.పది లక్షలకు పైగా విలువుంటే రూ.లక్ష ఇచ్చి వారి నుంచి భూములు లాక్కున్నారని చెపాపరు. చంద్రబాబు, లోకేశ్‌ల ప్రోత్సాహంతో మంత్రి గంటా శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్‌బాబు, బండారు సత్యనారాయణ, వెలగపూడి రామకృష్ణ, వంగలపూడి అనితలు ఈ భూ అక్రమణల్లో పాలుపంచుకున్నారని ఆరోపించారు. ఐకమత్యంగా ఈ ఉద్యమాన్ని నడుపుతాం. ఎవరి దగ్గరి నుంచి లాక్కున్నారో వారికి ఆ భూములను తిరిగి ఇప్పిస్తామన్నారు. ఇంతటితో ఈ భూ కబ్జాను ఆపకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ తనను బ్రోకర్ అన్నారని, కాని తానింత వరకు ఎలాంటి బ్రోకర్ పని చేయలేదన్నారు. నిన్నటికి నిన్న చంద్రబాబు, లోకేశ్‌ల ప్రోద్బలంతో రామరాజు తనకు మెసేజ్ పంపిచారని, ఉద్యమాన్ని ఆపేస్తే తన ప్రయోజనాలు చూసుకుంటానన్నారని ఆయన తెలిపారు. ఈ రెండేళ్లు ప్రజా సమస్యలపై పోరాడటంతో పాటు, అధికారంలోకి రాగానే కబ్జా దారులందరిపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. విశాఖలో త్వరలో జరిగే మహాధర్నాకు అన్ని పార్టీల నాయకులు హాజరై దళితులకు, పేదలకు న్యాయం చేయాలని కోరారు. విశాఖలో రూ.రెండులక్షల కోట్ల విలువైన భూములపై కొందరు అక్రమార్కులు గద్దల్లా వాలారని వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. చంద్రబాబు, లోకేశ్‌ల కనుసన్నల్లోనే కబ్జా పర్వం సాగుతోందన్నారు. విశాఖలో ల్యాండ్ పూలింగ్ కోసం చట్ట విరుద్ధంగా ప్రభుత్వం 304 జీవోను విడుదల చేసిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్ నర్సింగరావు అన్నారు. ముదపాక భూములు లేకపోయినా తొలి ఫేజ్ తర్వాత ఈ భూములు తీసుకుంటారనే కారణంతో కొందరు ఇక్కడ కబ్జాకు పాల్పడుతున్నారని చెప్పారు. ల్యాండ్ పూలింగ్ అనేదే తప్పని, భూములు తీసుకోవాలంటే 2013 భూ అధీకరణ చట్టం ప్రకారం తీసుకోవాలన్నారు. కావున వెంటనే ఈ జీవోను ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నడింపల్లి వెంకటరమణ రాజు అనే వ్యక్తి దళితుల్ని మోసం చేసి దౌర్జన్యంగా రోడ్లు వేస్తుంటే కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే బండారు ఎందుకు అడ్డుకోలేదని సీపీఐ జిల్లా కార్యదర్శి స్టాలిన్ ప్రశ్నించారు. అసలు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అనే అనుమానం కలుగుతోందన్నారు. భూ కుంభకోణాలను అడ్డుకునేందుకు ప్రతిపక్షంతో కలిసి పోరాడతామని లోక్‌సత్తా రాష్ట్ర అధ్యక్షుడు బీసెట్టి బాబ్జి చెప్పారు. అక్రమ జీవోలతో రాష్ట్ర ప్రభుత్వ పెద్దల సహకారంతోనే ఈ కుంభకోణాలు యథేచ్ఛగా సాగుతున్నాయన్నారు. దళితులకు చంద్రబాబు ప్రభుత్వం వ్యతిరేకంగా పనిచేస్తోందని బహుజన్ సమాజ్‌వాదీ పార్టీ జిల్లా అధ్యక్షుడు జార్జీ బంగారి ఆగ్రహం వ్యక్తం చేశారు. అఖిలపక్ష పార్టీ నేతల క్షేత్ర స్థాయి పరిశీలన గురించి తెలుసుకున్న ప్రభుత్వం రైతులను వారి వద్దకు రానివ్వలేదు. ముందు రోజే పోలీసులతో అందరినీ బెరించింది. అఖిలపక్ష నాయకులను స్థానిక టీడీపీ ఎంపీటీసీ రాంబాబు, సర్పంచ్ మల్లీశ్వరమ్మ భర్త రమణలు ఘోరావ్ చేయాలని ప్రయత్నించారు. వారిని పోలీసులు, వైఎస్సార్సీపీ నాయకులు అడ్డుకున్నారు. అనంతరం టీడీపీ నా‘ుకులు విలేకరులతో మాట్లాడుతూ తమ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ దేవుడని, జైలుకెళ్లి వచ్చిన వారు తమ సమస్యలపై పోరాటమేమీ చేయనవసరం లేదన్నారు. -
'తొలిసారిగా రాజ్యసభకు ఎన్నికవడం ఆనందంగా ఉంది'
న్యూఢిల్లీ : తొలిసారిగా రాజ్యసభకు ఎన్నికవడం ఆనందంగా ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి తెలిపారు. మంగళవారం న్యూఢిల్లీలో రాజ్యసభ సభ్యునిగా ఆయన ప్రమాణం చేశారు. అనంతరం విజయసాయిరెడ్డి మాట్లాడుతూ... వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున నేనే మొదటివాడిగా రాజ్యసభలో అడుగుపెట్టడం సంతోషంగా ఉందన్నారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలకు విజయసాయిరెడ్డి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. రాజ్యసభ సభ్యత్వాన్ని అలంకారంగా భావించడం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తానని విజయసాయిరెడ్డి వెల్లడించారు. -
జగన్ రిమాండ్ 3 వరకు పొడిగింపు
తన కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో వైఎస్.జగన్మోహన్రెడ్డి రిమాండ్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు అక్టోబరు 3 వరకు పొడిగించింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఆడిటర్ వి.విజయసాయిరెడ్డి, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, ఐఆర్ఏఎస్ అధికారి కేవీ.బ్రహ్మానందరెడ్డిల రిమాండ్‌ను కూడా కోర్టు వచ్చే నెల 3 వరకు పొడిగించింది. వీరి రిమాండ్ గడువు ముగియడంతో శుక్రవారం చెంచల్‌గూడ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు ఎదుట హాజరుపర్చారు. అలాగే ఇతర ఛార్జిషీట్లలో నిందితులుగా ఉన్న మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి, ఐఏఎస్ అధికారి బీపీ.ఆచార్య, రాంకీ సంస్థల అధినేత అయోధ్యరామిరెడ్డి, గనుల శాఖ మాజీ డెరైక్టర్ వీడీ రాజగోపాల్, నిమ్మగడ్డ ప్రకాష్, ఈశ్వర్ సిమెంట్స్ పూర్వ ఎండీ సజ్జల దివాకర్‌రెడ్డి, దాల్మియా సిమెంట్స్ ఎండీ పునీత్దాల్మియా, ఉద్యోగులు సంజయ్ ఎస్.మిత్రా, నీల్‌కమల్‌బేరి, జయ్‌దీప్‌బసు తదితరులు కోర్టు ఎదుట హాజరుకాగా...సీనియర్ ఐఏఎస్ అధికారులు వెంకట్రామిరెడ్డి, మన్మోహన్సింగ్, శ్యామూల్, శ్రీలక్ష్మి, ఫార్మా కంపెనీల ప్రతినిధులు హాజరునకు మినహాయింపు కోరుతూ వారి తరఫు న్యాయవాదులు పిటిషన్లు దాఖలు చేయగా కోర్టు అనుమతించింది. ఈ కేసు తదుపరి విచారణను కోర్టు వచ్చేనెల 3కు వాయిదా వేసింది. ఇదిలా ఉండగా ఇదే కేసులో నిందితుడు, మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణారావుకు వెన్నునొప్పి చికిత్స కోసం ప్రత్యేక కోర్టు ఇటీవల 45 రోజులు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. వైద్యం కోసం ఆసుపత్రిలో చేరిన కారణంగా కోర్టుకు హాజరుకాలేకపోతున్నట్లు మోపిదేవి తరఫు న్యాయవాది కోర్టుకు నివేదించారు. ఇదిలా ఉండగా అన్ని చార్జిషీట్లను కలిపి విచారించాలంటూ జగన్ దాఖలు చేసిన పిటిషన్, దర్యాప్తు పూర్తయ్యే వరకూ అభియోగాల నమోదు ప్రక్రియను ఆపాలంటూ ఇతర నిందితులు దాఖలు చేసుకున్న పిటిషన్లపై విచారణను కోర్టు ఈనెల 23కు వాయిదా వేసింది.