సాక్షి, ఢిల్లీ: ఏపీలో కూటమి ప్రభుత్వ పాలనలో మంత్రులను ఓ ఐఏఎస్ అధికారి శాసిస్తున్నారని అన్నారు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. ఈ క్రమంలో నలుగురు మంత్రుల ఎదుట సీనియర్ ఐఏఎస్ అధికారి ఆర్‌పీ సిసోడియా కాలుపై కాలు వేసుకుని కూర్చున్న ఫొటోను ఆయన షేర్ చేశారు.
కాగా, విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా సిసోడియా, మంత్రుల ఫొటోను షేర్ చేశారు. ఈ సందర్భంగా ఆయన.. చంద్రబాబు నాయుడు హయాంలో ఇదే జరుగుతోంది. బాబు పాలన అంటే ఇలాగే ఉంటుంది. మంత్రుల ముందు ఐఏఎస్ అధికారి కాలు మీద కాలువేసుకుని రాజులా కూర్చున్నాడు. మంత్రులు పొంగూరు నారాయణ, పయ్యావుల కేశవ్, వంగలపూడి అనిత, అనగాని సత్య ప్రసాద్ జూనియర్ ఆఫీసర్లలా ఆయన ముందు కూర్చున్నారు. బాబు పాలనలో అన్నింటికీ సమాధానం ఈ ఫొటోనే చెబుతుంది’ అని కామెంట్స్ చేశారు.
This is what’s happening under Chandrababu Naidu’s @ncbn’s regime. Special Chief Secretary (Revenue) R P Sisodia sits like a king, with his legs crossed, while ministers Ponguru Narayana, Payyavula Keshav, Vangalapudi Anitha, and Anagani Satya Prasad sit before him like junior… pic.twitter.com/jBfLQfE7p7
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 14, 2024
ఇది కూడా చదవండి: కూటమి నేతలు గాడిదలు కాస్తున్నారా?: వడ్డే శోభనాద్రీశ్వరరావు
Comments
Please login to add a commentAdd a comment