సాక్షి, ఢిల్లీ: జమిలి ఎన్నికల తర్వాత టీడీపీ జెండా పీకేయ్యడమేనా? అని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. ఇదే సమయంలో బీజేపీలో టీడీపీ విలీనమవుతోందా? అని ప్రశ్నించారు. తానే చక్రవర్తి అన్నట్టు నారా లోకేష్ వ్యవహరిస్తున్నారా? అని కామెంట్స్ చేశారు.
కాగా, ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా..
ఏపీలో టీడీపీ పరిస్థితి రోజురోజుకి దిగజారిపోతోందా?
పార్టీలో ప్రభుత్వంలో సర్వం తానే చక్రవర్తి అన్నట్టు నారా లోకేష్ వ్యవహార శైలితో సీనియర్లు, సన్నిహితులు సహా విసిగిపోతున్నారా?
మొన్న బాగున్న పార్టీ, అధికారంలోకి వచ్చిన 100 రోజులకే అనామకంగా అవ్వబోతోందా?
జనం 135 స్థానాలు ఇచ్చి నీరాజనాలు పలికితే వంద రోజుల్లో పార్టీలో కుంపట్లతో అసంతృప్తులా! ఎందుకని ?
మొన్న మస్తాన్ రావు, మోపిదేవి, నిన్న బాలినేని, సామినేని.. లిస్ట్ ఇంకా ఉందా! ఇంకెంతమందిని అవినీతి సొమ్ముతో కొంటారు ?
రాష్ట్ర అభివృద్ధికి నోచుకోక, సంక్షేమ పథకాలు అమలులో వైఫల్యంతో ఇక జమిలి ఎన్నికల తర్వాత టీడీపీ జెండా పీకేయ్యడమేనా?
టీడీపీ బీజేపీలోకి విలీనమౌతుందా?
బై.. బై బాబు...బై..బై బాబు అంటూ కామెంట్స్ చేశారు.
ఏపీలో టీడీపీ పరిస్థితి రోజురోజుకి దిగజారిపోతోందా?
పార్టీలో ప్రభుత్వంలో సర్వం తానే చక్రవర్తి అన్నట్టు నారా లోకేష్ వ్యవహార శైలితో సీనియర్లు, సన్నిహితులు సహా విసిగిపోతున్నారా?
మొన్న బాగున్న పార్టీ, అధికారంలోకి వచ్చిన 100 రోజులకే అనామకంగా అవ్వబోతోందా?
జనం 135 స్థానాలు ఇచ్చి…— Vijayasai Reddy V (@VSReddy_MP) September 20, 2024
ఇది కూడా చదవండి: ‘ఏపీని భగవంతుడే కాపాడాలి’