
సాక్షి, ఢిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబుపై సెటైరికల్ కామెంట్స్ చేశారు వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి. 40 ఏళ్ళ ఇండస్ట్రీగా స్వీయప్రకటన చేసుకున్న చంద్రబాబు.. పాలన తెలియని పామరుడు పదే పదే అధికారాన్ని చేజిక్కించుకోవటం వెనక వున్న మతలబు ఏమిటో ప్రజలు ఆలోచించాలి! అంటూ కామెంట్స్ చేశారు.
విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా..‘విజయవాడ వరదల్లో అందరి ఇళ్లు మునిగాయి, నా ఇళ్ళు మునిగింది. అయితే ఇప్పుడు ఏంటట అంటాడు ముఖ్యమంత్రి చంద్రబాబు. మోదీ సర్కార్ విశాఖ ఉక్కు ప్రైవేటుపరం చెసేదానికి చాప క్రింద నీరులా పనిచేసుకుంటూ పోతుంటే కృష్ణానది కరకట్టపైన కట్టిన అక్రమ ఇంట్లో కుంభకర్ణుడిలా నిద్రపోతున్నాడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు. 40 ఏళ్ళ ఇండస్ట్రీగా స్వీయప్రకటన చేసుకున్న, పాలన తెలియని పామరుడు పదే పదే అధికారాన్ని చేజిక్కించుకోవటం వెనక వున్న మతలబు ఏమిటో ప్రజలు ఆలోచించాలి!. ఆంధ్ర రాష్ట్రాన్ని భగవంతుడే రక్షించాలి. నారాయణ , నారాయణ.. నారాయణ’ అంటూ కామెంట్స్ చేశారు.
విజయవాడ వరదల్లో అందరి ఇళ్లు మునిగాయి, నా ఇళ్ళు మునిగింది. అయితే ఇప్పుడు ఏంటట అంటాడు ముఖ్యమంత్రి చంద్రబాబు @ncbn . మోడీ సర్కార్ విశాఖ ఉక్కు ప్రైవేటుపరం చెసేదానికి చాప క్రింద నీరులా పనిచేసుకుంటూ పోతుంటే కృష్ణానది కరకట్టపైన కట్టిన అక్రమ ఇంట్లో కుంభకర్ణుడిలా నిద్రపోతున్నాడు మన…
— Vijayasai Reddy V (@VSReddy_MP) September 20, 2024
ఇది కూడా చదవండి: హిందూ జాతికి చంద్రబాబు క్షమాపణలు చెప్పాల్సిందే: భూమన