రేపు వైఎస్ జగన్ గుంటూరు పర్యటన | Ys Jagan Guntur Tour On February 4th | Sakshi
Sakshi News home page

రేపు వైఎస్ జగన్ గుంటూరు పర్యటన

Feb 3 2026 6:51 PM | Updated on Feb 3 2026 7:56 PM

Ys Jagan Guntur Tour On February 4th

సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రేపు(ఫిబ్రవరి 4, బుధవారం) గుంటూరులో పర్యటించనున్నారు. అంబటి రాంబాబు కుటుంబాన్ని వైఎస్‌ జగన్‌ పరామర్శించనున్నారు. టీడీపీ గూండాల దాడిలో ధ్వంసమైన ఇల్లు, ఆఫీసుని వైఎస్‌ జగన్‌ పరిశీలించనున్నారు.

టీడీపీ గూండాలు అంబటి నివాసంపై దాడి చేసి.. ఆయన్ని, కుటుంబ సభ్యులను హత్య చేయాలని ప్రయత్నించిన సంగతి తెలిసిందే. అంబటి రాంబాబు కుటుంబాన్ని వైఎస్‌ జగన్‌ పరామర్శించి ఓదార్చనున్నారు. దాడి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి.. కుటుంబ సభ్యుల నుంచి వివరాలు అడిగి తెలుసుకోనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement