చంద్రబాబుకు విజయసాయిరెడ్డి సవాల్‌ | YSRCP MP VIjaya Sai Reddy Questions Over CBN Govt On 100 Days Rule | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు విజయసాయిరెడ్డి సవాల్‌

Published Thu, Sep 19 2024 9:39 AM | Last Updated on Thu, Sep 19 2024 12:30 PM

YSRCP MP VIjaya Sai Reddy Questions Over CBN Govt On 100 Days Rule

సాక్షి, ఢిల్లీ: ఏపీలో కూటమి ప్రభుత్వం వంద రోజుల పాలన పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంతో పలు ప్రశ్నలు సంధించారు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. విపత్తు నిర్వహణలో పూర్తి వైఫల్యం అనిపించుకున్న చంద్రబాబు స్ట్రైక్  రేట్ ఎంత?. అలాగే, మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలులో ఎందుకు పూర్తి వైఫల్యం చెందింది! అని ఎక్స్‌ వేదికగా ఓ సందేశం ఉంచారు. 

ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌ వేదికగా..

ఏపీలో పాలన వంద రోజుల ప్రోగ్రెస్ రిపోర్ట్!

ఏపీకి తిరిగి ఊపిరి తీసిన ఎవరికి ఎన్ని మార్కులు..?

100 రోజుల్లో వెయ్యి అడుగులు వేసామన్న సర్కార్ బడుగు బలహీన వర్గాల మనస్సులు గాయపర్చిందా!

ప్రభుత్వ పాలనతో రైతులు, యువత, మహిళలు, ఉద్యోగులు, తీవ్ర అసంతృప్తి చెందారా..?

మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలులో ఎందుకు పూర్తి వైఫల్యం చెందింది!

40 సంవత్సరాల ఇండస్ట్రీగా స్వయంప్రకటిత చంద్ర బాబుకు ఐపీఎస్‌, ఐఏఎస్‌ బదిలీల్లో కుల ప్రాతిపదికే ప్రామాణికంగా జరిగాయన్న విమర్శలు ఎందుకు వచ్చాయి..?

అసంతృప్తితో రగిలిపోతున్న కూటమి నేతలను పట్టించుకోవడం లేదా!

విపత్తు నిర్వహణలో పూర్తి వైఫల్యం అనిపించుకున్న చంద్రబాబు స్ట్రైక్  రేట్ ఎంత?

ఆరంభమే ప్రభుత్వ వ్యతిరేకత ఎందువల్ల!

ప్రజలదే అంతిమ నిర్ణయం! అంటూ కామెంట్స్‌ చేశారు. 
 


ఇదే సమయంలో అమరావతిపై చంద్రబాబుకు విజయసాయిరెడ్డి సవాల్ విసిరారు. ట్విట్టర్‌లో.. ఏపీ సీఎం చంద్రబాబుకు సవాల్‌ విసురుతున్నాను. చంద్రబాబు.. వరదల సన్నద్దత, అమరావతి భవిష్యత్‌పై శ్వేతపత్రం విడుదల చేయాలి. ఒకరి కలల కోసం లక్షల కోట్లు ఖర్చు పెట్టే స్థోమత ఏపీకి లేదు. విజయవాడలో వరదల తర్వాత అమరావతిపై ప్రజలు, పెట్టుబడిదారుల విశ్వాసం సన్నగిల్లింది’ అంటూ కామెంట్స్‌ చేశారు. 
 

 

 

 

 ఇది కూడా చదవండి: సూపర్‌ సిక్స్‌-నారావారి వంచన ఫిక్స్‌.. జనం ఏమంటున్నారంటే.. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement