చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పాలి: ఎంపీ విజయసాయి రెడ్డి | YSRCP MP Vijaya sai Reddy Serious On Chandrababu | Sakshi
Sakshi News home page

చంద్రబాబుకు తగిన గుణపాఠం చెప్పాలి: ఎంపీ విజయసాయి రెడ్డి

Published Sat, May 4 2024 10:32 AM | Last Updated on Sat, May 4 2024 11:43 AM

YSRCP MP Vijaya sai Reddy Serious On Chandrababu

సాక్షి, నెల్లూరు: చంద్రబాబు కూటమికి మైనార్టీలు ఎన్నికల్లో గట్టిగా గుణపాఠం చెప్పాలన్నారు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి. మైనార్టీలకు మోసం చేసేందుకు చంద్రబాబు రెడీ అవుతున్నారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్‌ వేదికగా..‘ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్‌ను వ్యతిరేకిస్తున్న చంద్రబాబు కూటమికి మైనార్టీలు ఎన్నికల్లో గట్టిగా గుణపాఠం చెప్పాలి. ఆ పార్టీలకు ఓటేయటమంటే రిజర్వేషన్‌ రద్దుకు అంగీకరించినట్లే. టోపీ పెట్టుకుని మసీదులకు వెళ్తున్న చంద్రబాబు ఇప్పటికే అనేకసార్లు మైనారిటీలను మోసం చేశాడు. ఉపాధి పథకాలు, ఉపకార వేతనాలు, విదేశీ విద్యలో వారికి ఫలాలు అందకుండా చేసిన చరిత్ర బాబుది. ఇప్పుడు వేమిరెడ్డి, నారాయణ ద్వారా నెల్లూరు అర్బన్‌ అభ్యర్థి ఖలీల్ అహ్మద్‌ను డబ్బు సంచులతో ఓడించాలని చూస్తున్నాడు’.

 

మానవత్వం మచ్చుకైనా లేని పచ్చ పాము చంద్రబాబు కాటుకు ఇప్పటి వరకు 30 మంది వృద్ధులు ప్రాణాలు వదిలారు. నెలనెలా ఇంటి దగ్గరే జరిగే పెన్షన్ల పంపిణీని అడ్డుకునేందుకు తన నమ్మకస్తుడు నిమ్మగడ్డ రమేష్ చౌదరి ద్వారా ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదులు చేయించాడు. మొదటి ఫిర్యాదుతో వలంటీర్ల సేవలు నిలిచిపోయాయి. ఇప్పుడు పంచాయతీ సెక్రటేరియట్లో సైతం పెన్షన్లు పంపిణీని అడ్డుకుని బ్యాంకుల్లో పెన్షన్ సొమ్ము జమ చేయించడంతో బ్యాంకుల దగ్గర పడిగాపులుకాస్తూ వడదెబ్బతో వయోవృద్ధులు పిట్టల్లా రాలిపోతున్నారు. బాబు ముఖంలో పశ్చాతాపానికి బదులు మందహాసం కనిపిస్తోంది. పేదల ఉసురు నీకు తప్పక తగులుతుంది బాబూ

 

 

 

‘నెల్లూరు సమగ్రాభివృద్ధి కోసం  100 శాతం కమిట్మెంట్‌తో రూపొందించినదే నెల్లూరు మేనిఫెస్టో. మన నెల్లూరు అని ప్రతి ఒక్కరూ సగర్వంగా చెప్పుకునేలా దేశంలోనే అగ్రగామి ప్రాంతంగా నెల్లూరును అభివృద్ధి చేస్తామని మాటిస్తూ మే 13న జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటువేసి అఖండ మెజారిటీతో నన్ను ఎంపీగా గెలిపించాలని కోరుతున్నాను’ అని కామెంట్స్‌ చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement