April 25th: ఏపీ ఎన్నికల అప్‌డేట్స్‌ | AP Elections 2024 Political News In Telugu On April 25th Updates | Sakshi
Sakshi News home page

April 25th AP Election News Updates: ఏపీ ఎన్నికల అప్‌డేట్స్‌

Published Thu, Apr 25 2024 6:40 PM | Last Updated on Thu, Apr 25 2024 6:40 PM

 AP Elections 2024 Political News In Telugu On April 25th Updates - Sakshi

April 25th AP Elections 2024 News Political Updates..

5:10 PM, Apr 25, 2024

తాడేపల్లి :

చంద్రబాబుపై సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్

  • వైఎస్ జగన్ రాజకీయ వారసత్వం గురించి మాట్లాడితే… చెల్లెలి పుట్టుక గురించి మాట్లాడారంటూ వక్రీకరించిన మీ వికృతపు ఆలోచలు చూస్తే చంద్రబాబు ఎంతగా దిగజారిపోయారో అర్థం అవుతోంది
  • మీరు పెట్టిన ట్వీట్ చూస్తే… చివరకు పశువులు కూడా అసహ్యించుకునే స్థాయికి వెళ్లిపోయారని స్పష్టమవుతోంది

 

 

4:56 PM, Apr 25, 2024
మాడుగులలో మూడు ముక్కలాటగా మారిన టీడీపీ రాజకీయం

  • టీడీపీ తరఫున నామినేషన్ దాఖలు చేసిన బండారు సత్యనారాయణమూర్తి
  • టీడీపీ రెబల్‌గా నామినేషన్ వేసిన గవిరెడ్డి రామానాయుడు, పైలా ప్రసాద్
  • గవిరెడ్డి, పైలా నామినేషన్‌తో టీడీపీలో ఆందోళన..
  • బండారును తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పైలా ప్రసాద్
  • అధిష్టానం బుజ్జగించిన వెనక్కి తగ్గని రామానాయుడు, పైలా ప్రసాద్

4:12PM, Apr 25, 2024

విజయవాడ:

టీడీపీ మాజీమంత్రి అయ్యన్నపాత్రుడు పై ఈసీ సీరియస్

  • అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు పై చర్యలు తీసుకోవాలని ఈసీ ఆదేశం
  • అనకాపల్లి జిల్లా కలెక్టర్‌కి ఆదేశాలు జారీ చేసిన సీఈఓ ముఖేష్ కుమార్ మీనా
  • సీఎం జగన్‌పై  అనుచిత , నిరాధార వ్యాఖ్యలు చేసిన అయ్యన్నపాత్రుడు
  • అయ్యన్నపాత్రుడు పై ఫిర్యాదు చేసిన వైఎస్సార్ కాంగ్రేడ్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
  • మల్లాది విష్ణు ఫిర్యాదు మేరకు అయ్యన్నపాత్రుడిపై చర్యలు తీసుకోవాలని ముఖేష్ కుమార్ మీనా ఆదేశం

3:39PM, Apr 25, 2024

కృష్ణాజిల్లా: 
2019లో జగన్‌మోహన్‌రెడ్డి  చెప్పిన ప్రతీ మాట కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లారు:
సాక్షి టీవీతో ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి

  • మ్యానిఫెస్టోలో ఎగ్జామ్‌లో సీఎం జగన్‌కు 99 శాతం మార్కులొచ్చాయి
  • పార్టీ తరపున ప్రజల్లోకి వెళ్లే కార్యకర్తలకు కూడా 99% మార్కులొచ్చేలా చేశారు
  • ప్రజలను ఓటడిగే హక్కు మాకు మాత్రమే ఉందనే కాన్ఫిడెన్స్‌ను తీసుకొచ్చారు
  • 175కి 175 గెలుపు అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయ్ 
  • కృష్ణా,గుంటూరులో 35 సీట్లు గెలుస్తాం 
  • ప్రజలకు చెప్పడానికి కూటమి దగ్గర ఏమీ లేదు
  • గతంలో ఇదే కూటమిగా కలిసొచ్చారు... విడిపోయారు
  • ఇప్పుడు మళ్లీ కూటమిగా వస్తున్నారు
  • ఈసారి కూటమిగా కలిసిరావడంలోనే క్యాండెట్ల విషయంలో సమస్యలొచ్చాయి
  • మళ్లీ ఏదో ఒక కథ చెప్పాలి కాబట్టి....ఏదో రకంగా మాపై బురద జల్లుతున్నారు
     

3:13 PM, Apr 25, 2024

వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ మంత్రి అమర్‌నాథ్‌ రెడ్డి సోదరుడు శ్రీనాథ్‌రెడ్డి దంపతులు

  • సీఎం జగన్‌ పులివెందుల పర్యటనలో వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీలో చేరిన శ్రీనాథ్‌రెడ్డి దంపతులు
  • వైఎస్సార్‌సీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్‌
  • గత ఎన్నికల్లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై పుంగనూరులో టీడీపీ తరపున పోటీ చేసిన శ్రీనాథ్‌ రెడ్డి భార్య అనీషా రెడ్డి.

 

2:43 PM, Apr 25, 2024

కృష్ణాజిల్లా :

అవనిగడ్డ ఎన్నికల బరిలో మరో బుద్ధప్రసాద్

  • నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి బోయిన బుద్ధప్రసాద్
  • నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అవనిగడ్డ ఎమ్మెల్యే అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేసిన బోయిన బుద్ధప్రసాద్
  • కూటమి అభ్యర్ధిలో అలజడి రేపుతున్న నవరంగ్ కాంగ్రెస్ పార్టీ నామినేషన్ 
  • కూటమి అభ్యర్ధిగా.. జనసేన పార్టీ నేత మండలి బుద్ధప్రసాద్ 
  • నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పేరు కూడా బుద్ధప్రసాద్ కావడంతో మండలి బుద్ధప్రసాద్‌లో మొదలైన ఆందోళన

2:24 PM, Apr 25, 2024

కృష్ణాజిల్లా: 
గన్నవరం వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన వల్లభనేని వంశీ 

  • నాలుగోసారి ఎమ్మెల్యేగా నిలబడుతున్నాను
  • పేదలకు ఆర్థిక స్వావలంబన చేకూరేలా సీఎం పాలన సాగించారు
  • కేవలం కాగితాలకే పరిమితం కాకుండా చేతల్లో పాలనా విప్లవాన్ని చూపించారు
  • నా సామాజిక బాధ్యతగా అందరూ బావుండాలనే ఉద్దేశంతోనే వైఎస్సార్‌సీపీలో  చేరాను
  • ప్రభుత్వ పాఠశాలల్లో సీఎం జగన్ ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు
  • కరోనా సమయంలో ఏపీ ప్రభుత్వం సమర్ధవంతంగా పనిచేసింది
  • కరోనా సాకు చూపి పథకాలు ఆపలేదు
  • నేను టీడీపీలో 20ఏళ్లు పనిచేశాను
  • కలలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి మంచి పనులు చేయవచ్చని నాకు తెలియదు 
  • జగన్ సీఎం అయిన కొత్తలో ఈ పథకాలు అన్నీ నాలుగు నెలలే ఇస్తారు అన్నారు
  • తర్వాత పథకాల వల్ల శ్రీలంక అవుతుంది అన్నారు
  • ఇప్పుడు జగన్ కంటే ఇంకా ఎక్కువ పథకాలు ఇస్తామంటున్నారు
  • జగన్ నాణ్యమైన విద్య ఇస్తామంటుంటే, చంద్రబాబు నాణ్యమైన నారావారి సారా ఇస్తామంటున్నారు
  • జగన్‌ను రక్షించుకోవాల్సిన అవసరం అన్ని వర్గాలకు చారిత్రాత్మక అవసరం
  • రాష్ట్ర ప్రజల దశ, దిశ మార్చే దమ్ము, శక్తి, సంకల్పం జగన్‌కు మాత్రమే ఉంది
  • జగన్ ఉంటేనే పేద బడుగు బలహీనర్గాలకు న్యాయం జరుగుతుంది
  • చంద్రబాబు ఔట్ డేటెడ్ పొలిటీషియన్
  • విశాఖ స్టీల్ ప్లాంట్ మీద, పోలవరం పునరావాసం మీద కూటమి స్టాండ్ చెప్పాలి
  • పురంధేశ్వరి రాష్ట్రానికి రావాల్సిన హక్కులపైనా మాట్లాడాలి
  • కూటమికి ఎజెండా, స్పష్టత లేదు
  • కూటమి డబుల్ ఇంజిన్‌లోని ఒక ఇంజిన్ తూర్పుకు, మరో ఇంజిన్ పడమరకు వెళ్తున్నాయి

2:00 PM, Apr 25, 2024
చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు: కొడాలి నాని

  • సీఎం జగన్‌ ఆధ్వర్యంలో ఎన్నికలకు మేమంతా సిద్ధం
  • గుడివాడలో మరోసారి వైఎస్సార్‌సీపీ జెండా ఎగురవేస్తాం 
  • టీడీపీకి చెందిన వ్యక్తులు, చంద్రబాబు మనుషులు.. కోడిగుడ్డుపై ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నారు
  • ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు మేం కట్టుబడి ఉన్నాం 
  • టీడీపీ రెచ్చగొట్టినా మేం సంయమనం పాటిస్తున్నాం 
  • చంద్రబాబు చెప్పేవి ఏదీ చేయడు
  • బాబొస్తే జాబొస్తుందన్నాడు ఎవడికిచ్చాడు జాబు
  • నిరుద్యోగులకు ఉద్యోగ భృతి అన్నాడు ఎవరికిచ్చాడు?.
  • 2014లో మోసం చేశాడు. మళ్లీ మోసం చేయడానికే చంద్రబాబు
  • చంద్రబాబుకు అల్జిమర్స్
  • తాను మర్చిపోయాడు కాబట్టి.. ప్రజలు కూడా మర్చిపోయారనుకుంటున్నాడు
  • చంద్రబాబుకి ఇవే చివరి ఎన్నికలు 
  • రాబోయే ఎన్నికల్లో చంద్రబాబుకు మాడు పగిలే తీర్పు ఇవ్వబోతున్నారు. 
  • టీడీపీ వెనక ఉన్న వాళ్లకు సామాజికవర్గం నేతలు మదబలం, ధనబలం, కులపిచ్చితి విర్రవీగుతున్నారు 
  • టీడీపీని గెలిపించడానికి ఓటర్లకు డబ్బులు పడేయాలనుకుంటున్నారు
  • ప్రజాస్వామ్యంలో ఓటును కొని గెలవగలరా?.
  • పరాయిదేశంలో ఉంటూ హాయిగా డబ్బు సంపాదిస్తూ ఇక్కడున్న ఓటర్లను వెధవలంటూ కించపరుస్తున్నారు
  • ఇక్కడి ప్రజలు కాదు.. ఓటర్లను దూషిస్తున్న మీరు వెధవలు
  • పచ్చ కామెర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది
  • చంద్రబాబు, ఆయన మద్దతుదారులకు కుక్కకాటుకి చెప్పుదెబ్బ తప్పదు
  • ఎవరికి ఓటేయాలో ప్రజలకు తెలియదా?.

 

1:18 PM, Apr 25, 2024
టీడీపీకి షాకిస్తూ వైఎస్సార్‌సీపీలోకి వీరశివారెడ్డి

  • వైఎస్సార్‌ జిల్లాలో టీడీపీ పరిస్థితి దారుణం 
  • కమలాపురం మాజీ ఎమ్మెల్యే వీరశివారెడ్డి టీడీపీకి గుడ్ బై 
  • పులివెందులలో ఇవాళ సీఎం జగన్‌ సమక్షంలో YSRCP కండువా కప్పుకున్న వీరశివారెడ్డి
  • సీఎం వైఎస్ జగన్ సంక్షేమ పథకాలు చూసి ఆకర్షితుడినయ్యా.. అందుకే వైఎ‍స్సార్‌సీపీలో చేరా :  వీరశివారెడ్డి
  • సంక్షమే పథకాల్ని సీఎం జగన్ నేరుగా ఇళ్లకే చేర్చారు:  వీరశివారెడ్డి
  • ఈ పథకాలు ఇలాగే అమలవ్వాలంటే మళ్లీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావాలి:  వీరశివారెడ్డి
  • వైఎస్సార్‌సీపీలో ఏ పని అప్పగించినా చేస్తా.. విధేయుడిగా పని చేస్తా:  వీరశివారెడ్డి
  • చంద్రబాబు వల్ల రాష్టానికి ఒక్క ప్రయోజనం లేదు:  వీరశివారెడ్డి
  • ఉమ్మడి కడప జిల్లాలో టీడీపీకి ఒక్క సీటు రాదు:  వీరశివారెడ్డి
  • ఏపీలో మళ్లీ వైఎస్సార్‌సీపీదే అధికారం:  వీరశివారెడ్డి

12:38 PM, Apr 25, 2024

సీఎం జగన్‌ బీసీల పక్షపాతి: YSRCP ఎంపీలు

రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్ వ్యాఖ్యలు

  • బలహీన వర్గాల మద్దతు సీఎం జగన్ కే ఉంది 
  • సామాజిక న్యాయానికి సీఎం జగన్ ఒక రోల్ మోడల్ 
  • బీసీల గురించి టీడీపీ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉంది
  • బీసీలు అందరూ వైస్సార్సీపీతోనే ఉన్నారని వెల్లడి

రాజ్యసభ సభ్యులు కృష్ణయ్య కామెంట్స్

  • బీసీ ముఖ్యమంత్రులు తీసుకోలేని సాహసోపేత నిర్ణయాలను సీఎం జగన్ తీసుకుంటున్నారు
  • బీసీలు అందరూ జగన్ ని దేవుడితో సమానంగా చూస్తున్నారు.. ఒక విజన్ తో పాలన సాగిస్తున్నారు 
  • సీఎం జగన్‌కి మోసం చెయ్యడం రాదు..  ప్రతి ఒక్కర్ని కుటుంబ సభ్యులుగానే చూస్తారాయన
  • చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ బిల్లును  ప్రవేశపెట్టిన ఏకైక ప్రభుత్వం మాదే 
  • బీసీల పక్షపాతిగా ఉన్న జగన్‌ని గెలిపించుకోవాల్సిన బాధ్యత బీసీ, ఎస్సీ, ఎస్టీల మీద ఉంది
  • ఎస్సీ, ఎస్టీ, బీసీల పిల్లలు చదువుకోవడం చంద్రబాబుకి ఇష్టం లేదు.
  • ఆయనకు ఓటేస్తే.. నిరుపేద పిల్లలు చదువుకు దూరం అవుతారు..
  • వైస్సార్సీపీ అభ్యర్థులను భారీ మెజారిటీ తో గెలిపించాలని పిలుపు

12:02 PM, Apr 25, 2024
కాకినాడ ఎంపీగా చలమలశెట్టి సునీల్‌ నామినేషన్‌

  • కాకినాడ వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్ధిగా చలమలశెట్టి సునీల్ నామినేషన్‌
  • ఆనందభారతీ మైదానం నుండి జిల్లా పరిషత్ సెంటర్ వరకు వేలాది మందితో భారీ ర్యాలీ
  • సునీల్‌ నామినేషన్‌ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే లు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కురసాల కన్నబాబు,పిఠాపురం అభ్యర్ధి వంగా గీతా

11:30 AM, Apr 25, 2024
పులివెందులలో నామినేషన్‌ వేసిన సీఎం జగన్‌

  • వైఎస్సార్ జిల్లా: 
  • పులివెందులలో నామినేషన్ దాఖలు చేసిన సీఎం జగన్ 
  • పులివెందుల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 
  • సీఎం జగన్ నామినేషన్ కార్యక్రమానికి భారీగా తరలివచ్చిన ప్రజలు 
  • జై జగన్ నినాదాలతో దద్దరిల్లిన పులివెందుల వీధులు

11:15 AM, Apr 25, 2024
పులివెందులలో సీఎం జగన్‌ ప్రసంగం..

  • సీఎం జగన్‌ మాట్లాడుతూ.. 
  • నా సొంత గడ్డ, నా పులివెందుల, నా ప్రాణం. 
  • ప్రతీ కష్టంలో పులివెందుల నా వెంట నడిచింది. 
  • పులివెందుల అంటే నమ్మ​కం, అభివృద్ధి, ఒక సక్సెస్‌ స్టోరీ. 
  • మంచి మనసు, బెదిరింపులకు లొంగకపోవడం మన కల్చర్‌. 
  • పులివెందుల.. ఒక విజయగాథ. 
  • మంచి చేయడం, మాట తప్పకపోవడం మన కల్చర్‌. 
  • టీడీపీ మాఫియా.. నాలుగు దశాబ్దాల దుర్మార్గాల్ని ఎదురించింది పులివెందుల బిడ్డలే. 
  • కరువు ప్రాంతంగా ఉన్న పులివెందులకు.. కృష్ణా నది నీళ్లు వస్తున్నాయి. 
  • పులివెందుల కల్చర్‌, కడప కల్చర్‌, రాయలసీమ కల్చర్‌ అంటూ మనపై వేలెత్తి చూపిస్తున్నారు. 
  • ఈ అభివృద్ధికి కారణంగా వైఎస్సార్‌. 
  • వైఎస్సార్‌, జగన్‌లపై లేనిపోని ముద్రలు వేసి దెబ్బతీయడానికి చంద్రబాబు, దత్తపుత్రుడు, వదినమ్మ ప్రయత్నిస్తున్నారు. 
  • ఈ మధ్య కాలంలో కొత్తగా వైఎస్సార్‌ వారసులమని.. వారి కుట్రలో భాగంగా ప్రజల మధ్యకు వస్తున్నారు. 
  • వైఎస్సార్‌ కుటుంబాన్ని టార్గెట్‌ చేసింది ఎవరు?. 
  • నాన్నగారిపై కక్షతో, కుట్రతో ఆయనపై కేసులు పెట్టింది ఎవరు?. 
  • ఆ కుట్రలు చేసిన పార్టీలో చేరిన వాళ్లు.. వైఎస్సార్‌ వారసులా?. 
  • ఆ మహానేతకు వారసులు ఎవరిని చెప్పాల్సింది.. ప్రజలే. 
  • వైఎస్సార్‌ లెగసీని లేకుండా చేయాలని చూసింది ఎవరు?. 
  • వైఎస్సార్‌ పేరును సీబీఐ ఛార్జ్‌షీట్‌లో చేర్చింది ఎవరు?. 
  • వైఎస్సార్‌ బాటలో మరో రెండు అడుగులు ముందుకు వేసింది మన ప్రభుత్వం. 
  • వైఎ‍స్సార్‌ కుటుంబాన్ని టార్గెట్‌ చేసింది ఎవరు?. 
  • మీ బిడ్డను ఎదుర్కోలేక.. ఒక్కరి మీదకు ఇంతమంది ఏకమవుతున్నారు. 
  • వైఎస్సార్‌పై కుట్రలు చేసిన వాళ్లు ఇస్తున్న స్క్రిప్ట్‌లు చదువుతున్న వాళ్లు.. వైఎస్సార్‌ వారసులా? 
  • వైఎస్‌ వివేకానందను చంపింది ఎవరో అందరికీ తెలుసు. 
  • వైఎస్‌ వివేకాను నేనే చంపాను అన్న వ్యక్తి బయట తిరుగుతున్నారు. 
  • పసుపు చీర కట్టుకుని వాళ్ల కుట్రలో భాగమైన వీళ్లా వైఎ‍స్సార్‌ వారసులు?.
  • వివేకాను చంపిన నిందితుడికి మద్దతిస్తుంది ఎవరు?. 
  • వివేకాకు రెండో భార్య ఉన్నది వాస్తవం కాదా?. 
  • అవినాష్‌ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలు సహేతుకమే కదా?. 
  • అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నేను నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను. 
  • అవినాష్‌ జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. 
  • చిన్నాన్నను ఓడించిన వారినే.. గెలిపించాలని చూడటం దిగజారడం కాదా?. 
  • జగన్‌ను పరిపాలనలో, పథకాల్లో, సంక్షేమంలోనూ కొట్టలేరు. 
  • నోటాకు వచ్చినన్ని ఓట్లు రాని కాంగ్రెస్‌కు ఎవరైనా ఓటు వేస్తారా?
  • రాష్ట్రాన్ని విడగొట్టిన కాంగ్రెస్‌కు ఎవరైనా ఓటు వేస్తారా?. 
  • హోదాను తుంగలో తొక్కిన కాంగ్రెస్‌కు ఎవరైనా ఓటు వేస్తారా?. 
  • వైఎస్సార్‌ పేరు కనపడకుండా చేయాలని కాంగ్రెస్‌ ప్రయత్నించింది. 
  • కాంగ్రెస్‌కు ఓట్లు వేస్తే బాబుకు, బీజేపీకి లాభమా.. కాదా?.
  • మన ఓట్లు చీలిస్తే చంద్రబాబుకు, బీజేపీకి లాభమా, కాదా?. 
  • పులివెందులవాసుల చిరకాల కల మెడికల్‌ కాలేజీ. 
  • త్వరలోనే పులివెందుల మెడికల్‌ కాలేజీ ప్రారంభిస్తాం. 

10:50 AM, Apr 25, 2024
వైఎస్సార్‌సీపీని విజయాన్ని ఎవరూ ఆపలేరు: ఎంపీ అవినాష్‌ రెడ్డి.

  • ఎంపీ అవినాష్‌ రెడ్డి మాట్లాడుతూ..
  • జగనన్న ఇచ్చిన హామీలను అమలు చేసి చూపిస్తున్నారు.
  • ఐదేళ్ల పాటు రైతులకు ఇబ్బంది లేకుండా సాగునీరు అందించాం.
  • ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాము.
  • సంక్షేమ పథకాలను అందించాం.
  • ఒక్క అబద్ధాన్ని వంద సార్లు చెబితే అది నిజమవుతుందనేది చంద్రబాబు సిద్ధాంతం.
  • ఎంత మంది కలిసివచ్చినా.. ఎన్ని హామీలు ఇచ్చినా సీఎం జగన్‌ను ఏమీ చేయలేరు.
  • సీఎం జగన్‌కు ప్రజలే స్టార్‌ క్యాంపెయినర్లు.
  • ఎంత మంది కలిసి వచ్చినా వైఎస్సార్‌సీపీ విజయాన్ని ఆపలేరు. 
  • ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని విష ప్రచారం చేస్తున్నారు. 
  • మనల్ని ఎదుర్కొనే బలం లేక గుంపులుగా వస్తున్నారు. 
  • చంద్రబాబు పులివెందులలో అడుగుపెట్టిన తర్వాత వర్షాలే లేవు. 

 

10:20 AM, Apr 25, 2024
ఎవరెన్ని విమర్శలు చేసినా.. ప్రజలే మాకు ముఖ్యం: కైలే అనిల్ కుమార్

  • సీఎం జగన్‌ ఆశీర్వాదంతో రెండోసారి ప్రజలకు సేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నా 
  • సమాజంలో ఆర్ధికంగా, సామాజికంగా వెనుకబడిన వారిని ఎలా ముందుకు తీసుకురావాలో సీఎం ఆలోచన చేశారు
  • అందుకు అనుగుణంగానే ముందుకు వెళ్లాం
  • మరో అవకాశం ఇస్తే మరింత మంచి చేస్తామని చెప్పి ఓటడుగుతున్నాం 
  • మాపై చంద్రబాబు విమర్శలు చేస్తున్నారు
  • మా సోదరి షర్మిల విమర్శలు చేస్తున్నారు
  •  సీఎం జగన్‌ నాయకత్వంలో నేను పనిచేస్తున్నా
  • నాపట్ల సీఎం జగన్‌కు పూర్తి విశ్వాసం ఉంది 
  • ఎవరు ఎన్ని విమర్శలు చేసినా ప్రజలు.. సీఎం జగన్‌ మాత్రమే మాకు ముఖ్యం
  • గత ఎన్నికల్లో జిల్లాలోనే అత్యధిక మెజార్టీ నాకు వచ్చింది 
  • ఈసారి అంతకంటే ఎక్కువ మెజార్టీతో గెలిపించి ప్రజలు నన్ను అసెంబ్లీకి పంపిస్తారని నమ్ముతున్నా

 

 

9:45 AM, Apr 25, 2024
చంద్రబాబుకు స్వామిదాస్‌ కౌంటర్‌

  • ఎన్టీఆర్ జిల్లా..
  • తిరువూరు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నల్లగట్ల స్వామిదాస్ కామెంట్స్..
  • నవరత్నాల పథకాలు ప్రతీ ఒక్క కుటుంబానికి చేరాయి, పేదవారందరూ సంతోషంగా ఉన్నారు.
  • మేనిఫెస్టోను 99% అమలుచేసి సీఎం జగన్ సింగిల్‌గా సింహంలా వస్తున్నారు.
  • మీ కుటుంబంలో మేలు జరిగితేనే ఓటు వేయమని అడుగుతున్నాడు. 
  • భారతదేశంలోని  29 రాష్ట్రాల్లో దమ్మున్న ఏకైక నాయకుడు సీఎం జగనే.
  • గుంటూరు జిల్లా నుండి తిరువూరుకు ఒక అభ్యర్థిని తీసుకొచ్చారు.
  • 70వేల మంది ఎస్సీలున్న నియోజకవర్గంలో డాక్టర్లు, ఇంజనీర్లు, మేధావులు మీ పార్టీకి కనపడలేదా?.
  • విశ్వసనీయతకు మారుపేరు సీఎం జగన్.. విశ్వాస ఘాతానికి మాటతప్పిన వ్యక్తి చంద్రబాబు.
     

 

8:45 AM, Apr 25, 2024
ఏపీలో ఇప్పటి వరకు నామినేషన్ల లిస్ట్‌ ఇదే..

  • అమరావతి 
  • ఏపీలో ఆరు రోజుల్లో పార్లమెంట్ సెగ్మెంట్లకు  555 మంది  653 సెట్ల నామినేషన్లు  దాఖలు.
  • తొలి రోజు 43 సెట్ల నామినేషన్లు దాఖలు 
  • రెండో రోజు 68 సెట్ల నామినేషన్లు దాఖలు
  • మూడో రోజు 40 సెట్ల నామినేషన్లు దాఖలు
  • నాలుగో రోజు 112 సెట్ల నామినేషన్లు దాఖలు 
  • ఐదో రోజు 124 సెట్ల నామినేషన్లు దాఖలు 
  • ఆరో రోజు  236 సెట్ల నామినేషన్లు దాఖలు.


అసెంబ్లీ ఎన్నికల కోసం 3701 సెట్ల నామినేషన్లు దాఖలు.. 

  • ఆరు రోజుల్లో  అసెంబ్లీ సెగ్మెంట్లకు 3057 మంది  3701 సెట్ల నామినేషన్లు దాఖలు
  • తొలి రోజు  236 సెట్ల నామినేషన్లు దాఖలు 
  • రెండో రోజు  413 సెట్ల నామినేషన్లు దాఖలు
  • మూడో రోజు 263 సెట్ల నామినేషన్లు దాఖలు
  • నాలుగో రోజు 610 సెట్ల నామినేషన్లు దాఖలు
  • ఐదో రోజు  702 సెట్ల నామినేషన్లు దాఖలు
  • ఆరో రోజు 1344 సెట్ల నామినేషన్లు దాఖలు

 

8:15 AM, Apr 25, 2024
టీడీపీతో పొత్తు మోదీకి ఇష్టం లేదు: మేకపాటి రాజమోహన్

  • నెల్లూరు..
  •  మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కామెంట్స్..
  • మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వయసు పైబడి మతిభ్రమించి మాట్లాడుతున్నాడు.
  • 2024 ఎన్నికల తరువాత తెలుగుదేశం పార్టీ షెడ్డుకి వెళ్ళడం ఖాయం.
  • నారా లోకేష్ ఒక సోంబేరి.. సీఎం జగన్‌పై హత్యాయత్నం జరిగిన ఘటనపై ఆయన స్పందించిన తీరు గర్హనీయం.
  • టీడీపీతో పొత్తు పెట్టుకోవడం ప్రధాని నరేంద్ర మోదీకి ఇష్టం లేదు.
  • రాష్ట్ర ముఖ్యమంత్రిని ఉద్దేశించి పిల్ల బచ్చా అనడం చంద్రబాబు తల బిరుసుకు నిదర్శనం.
  • ఆ పిల్ల బచ్చే దెబ్బకే చంద్రబాబు ఒనికి పోతున్నాడు. మోదీ కాళ్లు పట్టుకొని పొత్తు పెట్టుకున్నాడు.
  • చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకుంటేనే మంచిది.
  • రాజకీయాల నుంచి తప్పుకుంటే చంద్రబాబుకి గౌరవం మిగులుతుంది.
  • వచ్చే ఎన్నికల్లో 175 కి 175 స్థానాలను కైవసం చేసుకుంటాం.
  • సీఎం జగన్‌లో ఉండే నాయకత్వ లక్షణాలు మరెవ్వరికీ లేవు.
     

 

7:42 AM, Apr 25, 2024
పులివెందుల బయల్దేరిన సీఎం జగన్‌

  • తాడేపల్లి నుంచి పులివెందుల బయలుదేరిన సీఎం వైఎస్ జగన్
  • కాసేపట్లో‌ పులివెందుల వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా నామినేషన్ వేయనున్న సీఎం జగన్
  • నామినేషన్‌కు ముందు బహిరంగ సభలో ప్రసంగించనున్న సీఎం జగన్‌
  • ఇప్పటికే సీఎం జగన్‌ తరఫున ఒక సెట్‌ నామినేషన్‌ దాఖలు
  • నామినేషన్‌ పత్రాలు సమర్పించిన మున్సిపల్ వైస్ ఛైర్మన్ వైఎస్ మనోహర్ రెడ్డి

 

 

7:21 AM, Apr 25, 2024
ఏపీలో బీజేపీకి బాబే లీడర్‌..

  • దేశమంతా మోదీ కా పరివారే.. ఏపీలో మాత్రం చంద్రబాబుకు అప్పగించిన పురందేశ్వరి
  • సొంత పార్టీ నేతలను కాదని బాబు అద్దె నాయకులకు పార్టీలో సీట్లు 
  • కూటమి కట్టినా బీజేపీ సీట్లూ టీడీపీ నేతలకే
  • బద్వేలు నుంచి అనపర్తి దాకా ఇదే పరిస్థితి
  • టీడీపీ నుంచి బీజేపీలో చేరిన వారి కోసమే ఈ పొత్తులా అంటున్న కమలం నాయకులు


7:10 AM, Apr 25, 2024
పవన్‌ ఆస్తులు మాయ.. పెళ్లాల లెక్కలూ మాయే..

  • పవన్‌ ఎన్నికల అఫిడవిట్‌లో అడుగుకో అబద్ధం
  • పవన్‌ అఫిడవిట్‌లో వివరాలపై విచారణ చేయించాలి
  • ఈసీకి వైఎస్సార్‌సీపీ నేత పోతిన మహేశ్‌ విజ్ఞప్తి

 

7:00 AM, Apr 25, 2024
నేడు కడపలో చంద్రబాబు ప్రచారం

  • నేడు కడపలో ప్రతిపక్ష నేత చంద్రబాబు ఎన్నికల ప్రచారం
  • రాజంపేట, కోడూరులో చంద్రబాబు ప్రజాగళం బహిరంగ సభలు
  • సభల్లో బాబుతో పాటు పాల్గొననున్న పవన్‌ కల్యాణ్‌
  • కూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్న ఇరు పార్టీల అధినేతలు

6:55 AM, Apr 25, 2024

పచ్చ పార్టీ ప్రలోభాలు..

  • ఓటమి భయంతో అడ్డదారులు తొక్కుతున్న టీడీపీ అభ్యర్థులు  
  • ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘిస్తూ భారీ తాయిలాలతో ఓటర్లకు గాలం 
  • ఓవైపు మద్యం.. ఇంకోవైపు మనీ.. మరోవైపు గిఫ్ట్‌ బాక్సులు పంపిణీ 
  • పచ్చనేతల కనుసన్నల్లో భారీగా కర్ణాటక మద్యం డంప్‌లు  
  • చిత్తూరు, తిరుపతిలో పచ్చ పార్టీ నేతల ఓవరాక్షన్‌. 

 

6:50 AM, Apr 25, 2024
కూటమిలో అంతా చంద్రబాబు మనుషులే: సజ్జల రామకృష్ణారెడ్డి

  • చంద్రబాబు కోసమే పవన్‌ తాప్రతయం
  • కూటమిలో అంతా చంద్రబాబు మనుషులే
  • ఎదుటివారిపై నిందలు వేయడం చంద్రబాబుకు అలవాటు
  • కూటమి డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారు
  • 2024లో చంద్రబాబు హామిలిచ్చి మోసం చేశారు
  • పవన్‌ ఆత్మపరిశీలన చేసుకోవాలి
  • చంద్రబాబు, పవన్‌లకు ప్రస్టేషన్‌ పెరుగుతోంది
  • వైఎస్సార్‌సీపీ విజయం వారికి అర్థమైంది
  • విమర్శలు ఎన్నాయినా చేయొచ్చు.. వాటికి ఆధారాలుండాలి
  • రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసింది ఎవరు?
  • కాపుల ఓట్లు టీడీపీకి వేయించేందుకే పవన్‌ ప్రయత్నం
  • 2014లో ఇదే కూటమి పోటీ చేసింది. అప్పుడు ప్రజలను ఎలా మోసం చేసిందో అందరికి తెలుసు
  •  వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాబోతుందనే వారికి కోపం
  • చిరంజీవిని ఉద్దేశించి నేను ఏమి అనలేదు
  • చిరంజీవి మద్దతు ఇవ్వడం మంచిదే కానీ.. ఇంకా ఎవ్వరూ కలిసి వచ్చినా ఇబ్బంది లేదని చెప్పా
  • చిరంజీవిని నేను విమర్శించానని చెప్పడం ద్వారా కొంత మందినైనా దగ్గర చేసుకోవచ్చని మూడు పార్టీల నేతలు భావిస్తున్నారు
  • చంద్రబాబును సీఎం చేయడం కోసం రకరకాల కుయుక్తులు పన్నుతున్నారు.
  • 2014లో బీజేపీ, జనసేన, టీడీపీకి మద్దతు ఇచ్చాయి. అప్పుడు రాచి రంపాన పెట్టారు
  • మళ్లీ ఇప్పుడు పొత్తు పెట్టుకొని వస్తున్నారు
  • వాంటెడ్ లేబర్ కంటే అన్యాయంగా బీజేపీ, జనసేన టీడీపీకి సాగిలపడ్డాయి
  • ఆత్మాభిమానం వదిలేసి రెండు పార్టీలు టీడీపీతో జత కట్టాయి
  • ఒడిపోతున్నాం అని  తెలిసి నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు
  • డ్వాక్రా మహిళల గురించి చంద్ర బాబు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే నవ్వొస్తుంది
  • డ్వాక్రా మహిళలను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది
  • రుణ మాఫీలు చేస్తానని మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది
  • పవన్ కళ్యాణ్, చంద్రబాబుకు సంస్కారం లేదు
  • చంద్రబాబుకు కుటుంబ విలువలు తెలుసా?
  • చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు ఎక్కడ ఉన్నాడు.?
  • చంద్రబాబు చెల్లెళ్లు ఎక్కడ ఉన్నారు?

 

6:40 AM, Apr 25, 2024
కుప్పంలో ఓటమి భయం చంద్రబాబును వెంటాడుతోంది: వైఎస్సార్‌సీపీ అభ్యర్థి భరత్‌

  • టీడీపీ అంటేనే కుట్ర, కుతంత్రాలకు మారు పేరు
  • ఓటమి భయంతో 35 ఏళ్లుగా కుప్పంపై లేని ప్రేమ ఇప్పుడు చంద్రబాబు చూపిస్తున్నారు
  • ఆయన సతీమణి భువనేశ్వరి నేరుగా కుప్పంలో తిష్ట వేశారు
  • కుప్పంలో ఓటమి భయం చంద్రబాబును వెంటాడుతోంది
  • కుప్పంలో  టీడీపీ పాలిటిక్స్ చేస్తోంది
  • కుప్పం ప్రజలకు ఎలా అభివృద్ధి చేయాలి అనేది మినిమం గ్యారంటీ చంద్రబాబు ఇవ్వడం లేదు
  • కుప్పం సింగపూర్ చేస్తా అని 35 ఏళ్లుగా మోసం చేస్తున్నాడు చంద్రబాబు
  • కుప్పం ఎలా అభివృద్ధి చేస్తాడో చెప్పడం లేదు.. ఎస్.ఈ.జడ్‌లు తీసుకు వస్తాను అనేది చెప్పడం లేదు
  • రానున్న 5 ఏళ్లలో కుప్పం నియోజకవర్గంలో పాలారు ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం, రెండు రిజర్వాయర్‌లు నిర్మాణం చేసి, నీరు తీసుకు వస్తాం
  • కృష్ణా జలాలు పూర్తి స్థాయిలో కుప్పానికి అందిస్తాం
  • రెండు మూడు కమర్షియలో జోన్ లు తయారు చేస్తాం
  • 35 ఏళ్లలో చేయలేనివి రానున్న 5ఏళ్లలో చేస్తాను అని  అంటున్నాడు చంద్రబాబు
  • కుప్పంకు  ఏమి చేయలేదు అని చంద్రబాబు స్వయంగా ఒప్పుకున్నాడు
  • కుప్పం ప్రజలు ఆలోచనల్లో మార్పు వచ్చింది.. కచ్చితంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తాం

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement