April 24th AP Elections 2024 News Political Updates..
7:51 PM, Apr 24, 2024
కూటమిలో అంతా చంద్రబాబు మనుషులే: సజ్జల రామకృష్ణారెడ్డి
- చంద్రబాబు కోసమే పవన్ తాప్రతయం
- కూటమిలో అంతా చంద్రబాబు మనుషులే
- ఎదుటివారిపై నిందలు వేయడం చంద్రబాబుకు అలవాటు
- కూటమి డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారు
- 2024లో చంద్రబాబు హామిలిచ్చి మోసం చేశారు
- పవన్ ఆత్మపరిశీలన చేసుకోవాలి
- చంద్రబాబు, పవన్‌లకు ప్రస్టేషన్ పెరుగుతోంది
- వైఎస్సార్‌సీపీ విజయం వారికి అర్థమైంది
- విమర్శలు ఎన్నాయినా చేయొచ్చు.. వాటికి ఆధారాలుండాలి
- రుణమాఫీ పేరుతో రైతులను మోసం చేసింది ఎవరు?
- కాపుల ఓట్లు టీడీపీకి వేయించేందుకే పవన్ ప్రయత్నం
- 2014లో ఇదే కూటమి పోటీ చేసింది. అప్పుడు ప్రజలను ఎలా మోసం చేసిందో అందరికి తెలుసు
- వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రాబోతుందనే వారికి కోపం
- చిరంజీవిని ఉద్దేశించి నేను ఏమి అనలేదు
- చిరంజీవి మద్దతు ఇవ్వడం మంచిదే కానీ.. ఇంకా ఎవ్వరూ కలిసి వచ్చినా ఇబ్బంది లేదని చెప్పా
- చిరంజీవిని నేను విమర్శించానని చెప్పడం ద్వారా కొంత మందినైనా దగ్గర చేసుకోవచ్చని మూడు పార్టీల నేతలు భావిస్తున్నారు
- చంద్రబాబును సీఎం చేయడం కోసం రకరకాల కుయుక్తులు పన్నుతున్నారు.
- 2014లో బీజేపీ, జనసేన, టీడీపీకి మద్దతు ఇచ్చాయి. అప్పుడు రాచి రంపాన పెట్టారు
- మళ్లీ ఇప్పుడు పొత్తు పెట్టుకొని వస్తున్నారు
- వాంటెడ్ లేబర్ కంటే అన్యాయంగా బీజేపీ, జనసేన టీడీపీకి సాగిలపడ్డాయి
- ఆత్మాభిమానం వదిలేసి రెండు పార్టీలు టీడీపీతో జత కట్టాయి
- ఒడిపోతున్నాం అని తెలిసి నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారు
- డ్వాక్రా మహిళల గురించి చంద్ర బాబు మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే నవ్వొస్తుంది
- డ్వాక్రా మహిళలను మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది
- రుణ మాఫీలు చేస్తానని మోసం చేసిన చరిత్ర చంద్రబాబుది
- పవన్ కళ్యాణ్, చంద్రబాబుకు సంస్కారం లేదు
- చంద్రబాబుకు కుటుంబ విలువలు తెలుసా?
- చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు ఎక్కడ ఉన్నాడు.?
- చంద్రబాబు చెల్లెళ్లు ఎక్కడ ఉన్నారు?
6:18 PM, Apr 24, 2024
చంద్రబాబుకు ఓటేస్తే.. పథకాలన్నీ ముగింపే: టెక్కలి సభలో సీఎం జగన్
- మీ బిడ్డకు ఓటేస్తేనే.. పథకాలు కొనసాగుతాయి
- కూటమి మోసాలకు చెంప చెళ్లుమనిపించాలి
- 175కు 175 అసెంబ్లీ, 25కు 25 ఎంపీ సీట్లు గెలవాల్సిందే..
- డబుల్ సెంచరీ కొట్టేందుకు మీరంతా సిద్ధమా?
- పేద ప్రజల గుండె చప్పుళ్లే ఈ సిద్ధం సభలు
- 58 నెలల్లో గ్రామ స్వరాజ్యం సిద్ధం
- విద్యారంగంలో విప్లవాత్మక మార్పులతో ప్రభుత్వ బడులు సిద్ధం
- వైద్యరంగంలో విప్లవాత్మక మార్పులతో ప్రభుత్వాస్పత్రులు సిద్ధం
- ఇంటింటికి పౌరసేవలందిస్తున్న వాలంటీర్ల వ్యవస్థ సిద్ధం..
- 600లకుపైగా సేవలందిస్తున్న గ్రామ, వార్డు సచివాలయాలు సిద్ధం
- మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు మీరే సైనికులుగా నిలబడండి..
- మేనిఫెస్టోలోని 99 శాతం హామీలు నెరవేర్చాం..
- అక్కాచెల్లెమ్మలకు ఆర్థికంగా, రాజకీయంగా తోడుగా ఉన్నాం..
- కరోనా కష్టకాలంలోనూ ప్రతి ఇంటికి సంక్షేమం అందించాం..
- చంద్రబాబు పేరు చెప్తే ఒక్క మంచిపనైనా గుర్తుకొస్తుందా?
- సాధ్యం కానీ హామీలను మీ బిడ్డ ఎప్పుడూ ఇవ్వడు..
- మీ జగన్ మార్క్.. ప్రతి పేదింట్లో కనిపిస్తోంది
- మీ జగన్ మార్క్.. అక్కాచెల్లెమ్మల చిరునవ్వులో కనిపిస్తోంది
- మీ జగన్ మార్క్.. ప్రతి గ్రామంలోనూ కనిపిస్తోంది..
- మాట మీద నిలబడే మీ జగన్ కావాలా?
- మోసం, దగా చేసే చంద్రబాబు కావాలా? ఆలోచన చేయండి
- 2014లో ఇదే కూటమి చేసిన మోసాలు గుర్తున్నాయా?
- రైతు రుణమాఫీ చేస్తానన్నాడు.. చేశాడా?
- పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తానన్నాడు.. చేశాడా?
- ఆడబిడ్డ పుడితే రూ.25వేలు డిపాజిట్ చేస్తానన్నాడు.. చేశాడా?
- ఇంటికో ఉద్యోగం అన్నాడు.. ఇచ్చాడా?
- ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి అన్నాడు.. ఇచ్చాడా?
- అర్హులకు మూడు సెంట్ల స్థలం ఇస్తానన్నాడు.. ఇచ్చాడా?
- రూ.10వేల కోట్లతో బీసీ సబ్‌ప్లాన్ అన్నాడు.. చేశాడా?
- సింగపూర్‌ని మించి అభివృద్ధి చేస్తానన్నాడు.. చేశాడా?
- ప్రతి నగరంలో హైటెక్ సిటీ నిర్మిస్తానన్నాడు.. నిర్మించాడా?
- మళ్లీ ఇదే కూటమి కొత్త కొత్త మోసాలతో వస్తుంది..
- ప్రతి ఇంటికి కేజీ బంగారం, బెంజ్ కారు ఇస్తారంట.. నమ్ముతారా?
- ఈ మోసగాళ్ల నుంచి రాష్ట్రాన్ని కాపాడేందుకు మీరంతా సిద్ధమా?
4:00 PM, Apr 24, 2024
కుప్పంలో ఓటమి భయం చంద్రబాబును వెంటాడుతోంది: వైఎస్సార్‌సీపీ అభ్యర్థి భరత్
- టీడీపీ అంటేనే కుట్ర, కుతంత్రాలకు మారు పేరు
- ఓటమి భయంతో 35 ఏళ్లుగా కుప్పంపై లేని ప్రేమ ఇప్పుడు చంద్రబాబు చూపిస్తున్నారు
- ఆయన సతీమణి భువనేశ్వరి నేరుగా కుప్పంలో తిష్ట వేశారు
- కుప్పంలో ఓటమి భయం చంద్రబాబును వెంటాడుతోంది
- కుప్పంలో టీడీపీ పాలిటిక్స్ చేస్తోంది
- కుప్పం ప్రజలకు ఎలా అభివృద్ధి చేయాలి అనేది మినిమం గ్యారంటీ చంద్రబాబు ఇవ్వడం లేదు
- కుప్పం సింగపూర్ చేస్తా అని 35 ఏళ్లుగా మోసం చేస్తున్నాడు చంద్రబాబు
- కుప్పం ఎలా అభివృద్ధి చేస్తాడో చెప్పడం లేదు.. ఎస్.ఈ.జడ్‌లు తీసుకు వస్తాను అనేది చెప్పడం లేదు
- రానున్న 5 ఏళ్లలో కుప్పం నియోజకవర్గంలో పాలారు ప్రాజెక్ట్ పూర్తి చేస్తాం, రెండు రిజర్వాయర్‌లు నిర్మాణం చేసి, నీరు తీసుకు వస్తాం
- కృష్ణా జలాలు పూర్తి స్థాయిలో కుప్పానికి అందిస్తాం
- రెండు మూడు కమర్షియలో జోన్ లు తయారు చేస్తాం
- 35 ఏళ్లలో చేయలేనివి రానున్న 5ఏళ్లలో చేస్తాను అని అంటున్నాడు చంద్రబాబు
- కుప్పంకు ఏమి చేయలేదు అని చంద్రబాబు స్వయంగా ఒప్పుకున్నాడు
- కుప్పం ప్రజలు ఆలోచనల్లో మార్పు వచ్చింది.. కచ్చితంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేస్తాం
3:54 PM, Apr 24, 2024
వైఎస్ జగన్ సింహంలా సింగిల్‌గానే వస్తున్నారు: పోతిన మహేష్
- కూటమిది కుమ్మక్కు రాజకీయం
- సీఎం జగన్ ప్రజల మనిషి
- వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించబోతుంది
- ఓటమి భయంతోనే పవన్ మాట్లాడుతున్నారు
- పవన్ కాపులను అవమానించేలా పవన్ దిగజారిపోయి మాట్లాడుతున్నాడు
3:07 PM, Apr 24, 2024
గుంటూరులో టీడీపీ నేతల ఓవరాక్షన్
- మంత్రి విడదల రజిని ఇంటి వద్ద టీడీపీ శ్రేణుల హల్‌చల్
- రజని ఇంట్లోకి చొచ్చుకెళ్లే ప్రయత్నం చేసిన టీడీపీ శ్రేణులు
- ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడికి యత్నం
2:56 PM, Apr 24, 2024
చంద్రబాబు మహిళలను మోసం చేస్తున్నారు: వాసిరెడ్డి పద్మ
- రుణాలను మాఫీ చేస్తాననీ, కొత్తగా రుణాలు ఇప్పిస్తాననీ చెప్తున్నారు
- గతంలో సీఎంగా ఉన్నప్పుడు ఏం చేశారు?
- చంద్రబాబు పుణ్యమా అని డ్వాక్రా గ్రూపులు రోడ్డున పడ్డాయి
- బ్యాంకులు రుణాలు కూడా ఇవ్వని పరిస్థితి తెచ్చారు
- జగన్ సీఎం అయ్యాకనే మళ్లీ డ్వాక్రా రుణాలను మాఫీ చేశారు
- మహిళలకు జగన్ సీఎం అయ్యాకే స్వర్ణయుగం ప్రారంభమైంది
- సంవత్సరానికి లక్ష రూపాయల ఆదాయం 14 లక్షల మంది మహిళలకు పెరిగింది
- మహిళలకు ఎందులో నైపుణ్యం ఉంటే అందులో మరింత శిక్షణ ఇప్పించారు
- రెండు లక్షల కోట్ల రుణాన్ని మహిళలకు జగన్ అతి తక్కువ రుణాలను ఇప్పించారు
- ప్రతి పేద మహిళ అరవై వేల ఆదాయం పొందేలా చేశారు
- మద్యం గురించి మహిళలతో చంద్రబాబు మాట్లాడటం సిగ్గుచేటు
- పెట్రోలు, డీజిల్ రేట్లు కేంద్రం చేతిలో ఉంటుంది
- మరి చంద్రబాబు పొత్తు పెట్టుకొని కూడా బీజేపీని ఎందుకు నిలదీయటం లేదు?
- మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ఇవ్వాలన్న ఆలోచన చంద్రబాబుకు ఎందుకు రాలేదు?
- జగన్ మాత్రమే ఎలా చేయగలిగారు?
- చంద్రబాబుకు దమ్ముంటే టీడీపీలో కూడా యాభై శాతం రిజర్వేషన్ మహిళలకు అమలు చేస్తామని చెప్పగలరా?
- గంజాయి సాగును సీఎం జగన్ పూర్తిగా నాశనం చేశారు
- ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో నిర్మూలించారు
- చంద్రబాబు చేయలేని పని జగన్ చేసి చూపించారు
- చంద్రబాబు, పవన్ ఈ రాష్ట్రానికి అవసరం లేదు
2:15 PM, Apr 24, 2024
మాజీ మంత్రి నారాయణపై ఎంపీ విజయసాయిరెడ్డి ఫైర్
- చంద్రబాబుతో కలిసి అమరావతిలో కబ్జా చేసిన నిరుపేదలకు చెందిన 1100 ఎకరాల అసైన్డ్ భూముల గురించి మీరు చెబితే నెల్లూరు తెలుసుకోవాలని కోరుకుంటున్నారు.
- రూ.4,400 కోట్ల ఈ స్కామ్లో మీకు సగం వాటా ఉన్నది నిజం కాదా?
- పేదలను బెదిరించి బినామీల పేరుతో వారి భూములను కబ్జా చేయడాన్ని జనం మర్చిపోలేదు
- ఇందులో మీ ప్రమేయం ఉన్నట్టు తెలిపే వివరాలన్నీ పబ్లిక్ డొమెయిన్లోనే ఉన్నాయి
- బుకాయించాలని చూస్తే మేమే ఇంటింటికి తిరిగి బయట పెడతాం.
చంద్రబాబుతో కలిసి అమరావతిలో కబ్జా చేసిన నిరుపేదలకు చెందిన 1100 ఎకరాల అసైన్డ్ భూముల గురించి మీరు చెబితే నెల్లూరు ప్రజలు తెలుసుకోవాలని కోరుకుంటున్నారు నారాయణ గారూ! రూ.4,400 కోట్ల ఈ స్కామ్ లో మీకు సగం వాటా ఉన్నది నిజం కాదా? పేదలను బెదిరించి బినామీల పేరుతో వారి భూములను కబ్జా…
— Vijayasai Reddy V (@VSReddy_MP) April 24, 2024
2:00 PM, Apr 24, 2024
సీఎం రమేష్‌కు సవాల్
- సీఎం రమేష్‌కు బూడి ముత్యాలనాయుడు ఛాలెంజ్.
- మాడుగుల నియోజకవర్గ అభివృద్ధిని నేను చూపించడానికి సిద్ధం.
- మీడియా సమక్షంలో సీఎం రమేష్ వస్తే చూపిస్తాను.
- ప్రతీ గ్రామానికి మౌలిక వసతులు కల్పించాం.
- మాడుగుల నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని నిరూపిస్తే నేను నామినేషన్ విత్ డ్రా చేసుకుంటా.
- దేశంలోనే బాగా అభివృద్ధి చెందిన నియోజకవర్గం మాడుగుల.
1:40 PM, Apr 24, 2024
బోండా ఉమాకు ప్రజలే బుద్ధిచెబుతారు: వెల్లంపల్లి
- టీడీపీ నేతలపై ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కామెంట్స్
- చంద్రబాబు అరాచకాలు అభివృద్ధి పనులు రాష్ట్ర ప్రజలకు తెలుసు
- రాబోయే రోజుల్లో అన్ని రాష్ట్రాల కన్నా అభివృద్ధిలో ఆంధ్ర రాష్ట్రం ముందు ఉంటుంది
- 'గుండా' ఉమా చేసిన భూకబ్జాలు ప్రజలందరికీ తెలుసు.
- బోండా ఉమా లాంటి వ్యక్తిని ప్రజలు ఎప్పుడో తిరస్కరించారు.
- బోండా ఉమా రౌడీయిజమే లక్ష్యంగా పాలన సాగించాడు.
- బోండా ఉమాను ఓడిస్తామని స్థానిక ప్రజలే చెప్తున్నారు.
1:00 PM, Apr 24, 2024
బుచ్చయ్య చౌదరిని ప్రజలు నమ్మరు: మంత్రి చెల్లుబోయిన
- వేణుగోపాలకృష్ణ కామెంట్స్..
- రాష్ట్రంలో జనం ప్రతి అభ్యర్థులోనూ సీఎం జగన్‌నే చూస్తున్నారు.
- దేశంలో ఎక్కడా లేని అద్భుతమైన సోషల్ ఇంజనీరింగ్‌ను సీఎం జగన్ రాష్ట్రంలో అమలు చేశారు
- ప్రజలు మంచి కోరే వాడికి స్థానికతతో సంబంధం లేదు
- టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి తన హయంలో రాజమండ్రి రూరల్ నియోజకవర్గాన్ని భ్రష్టు పట్టించారు
- బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకున్నారు
- బుచ్చయ్య చౌదరిని ప్రజలు నమ్మరు
- రాజమండ్రి రూరల్ స్థానంలో వైఎస్సార్‌సీపీ విజయ కేతనం ఎగరవేస్తుంది
12:00 PM, Apr 24, 2024
వైఎస్సార్‌సీపీలోకి భారీగా చేరికలు..
- శ్రీకాకుళం జిల్లా..
- శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల నియోజకవర్గం అక్కివలస నైట్ స్టే పాయింట్ వద్ద వైఎస్సార్‌సీపీలోకి చేరికలు.
- సీఎం జగన్ సమక్షంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు వైఎస్సార్‌సీపీలో చేరిక.
- వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలకు కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించిన ముఖ్యమంత్రి జగన్.
- ఎచ్చర్ల నియోజకవర్గం రణస్ధలం ఎంపీటీసీ మజ్జి గౌరి, టీడీపీ ఉపాధ్యక్షుడు మజ్జి రమేష్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిక.
- ఎచ్చర్ల నియోజకవర్గం రణస్ధలం మండలం మాజీ ఎంపీపీ గొర్లి విజయకుమార్, సీనియర్ నేత రామారావు వైఎస్సార్‌సీపీలో చేరిక.
- పాతపట్నం నియోజకవర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన హిరమండలం మాజీ జడ్పీటీసీ లోలుగు లక్ష్మణరావు.
- పార్వతీపురం నియోజకవర్గం నుంచి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన టీడీపీ సీనియర్ నేత, మహిళా కమిషన్ మాజీ సభ్యురాలు కొయ్యాన శ్రీవాణి.
11:45 AM, Apr 24, 2024
నామినేషన్ వేసేందుకు బయలుదేరిన మంత్రి అమర్నాథ్..
- విశాఖ:
- నామినేషన్ వేసేందుకు బయలుదేరిన మంత్రి గుడివాడ అమర్నాథ్
- జింక్ గేట్ నుంచి వందలాది మంది అభిమానులు, కార్యకర్తలతో కొనసాగుతున్న ర్యాలీ
- దారిపోడువునా ఘనస్వాగతం పలుకుతున్న ప్రజలు
- కార్పొరేటర్లు, ఇంచార్జ్‌లు నాయకుల డ్యాన్సులతో కొనసాగుతున్న ర్యాలీ
- ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకటరామయ్య, గురుమూర్తి రెడ్డి, ఊరుకుటి అప్పారావు, దామ సుబ్బారావు, రాజాన రామారావు, ధర్మాల శ్రీను, ఇమ్రాన్.
11:25 AM, Apr 24, 2024
వైఎస్సార్‌సీపీ అభ్యర్థి భారీ ర్యాలీ..
- పశ్చిమ గోదావరి..
- పాలకొల్లు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గుడాల శ్రీహరి గోపాలరావు భారీ ర్యాలీ
- ఎంపీ అభ్యర్థి ఉమాబాలతో పాటు ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే అభ్యర్థి గోపాలరావు
- సుమారు 20వేల మందితో నామినేషన్ వేసేందుకు ర్యాలీగా వచ్చిన గోపాలరావు
- మున్సిపల్ కార్యాలయంలో రెండు సెట్ల నామినేషన్ దాఖలు
- భారీగా తరలివచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు
11:00 AM, Apr 24, 2024
కుప్పంలో పోటెత్తిన వైఎస్సార్‌సీపీ అభిమానులు..
- చిత్తూరు
- కుప్పంలో పోటెత్తిన వైఎస్సార్‌సీపీ అభిమానులు
- మరి కాసేపట్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా భరత్ నామినేషన్
- హాజరవుతున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ రెడ్డప్ప, జడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, కుప్పం మున్సిపల్ చైర్మన్ డాక్టర్ సుధీర్
10:45 AM, Apr 24, 2024
కాసేపట్లో దేవినేని అవినాష్ నామినేషన్..
- విజయవాడ
- తూర్పు నియోజకవర్గ అభ్యర్థిగా దేవినేని అవినాష్ నామినేషన్ సందర్భంగా భారీ ర్యాలీ
- భారీఎత్తున హాజరైన తూర్పు నియోజకవర్గ ప్రజలు, వైసీపీ అభిమానులు, కార్యకర్తలు
- దేవినేని అవినాష్ కామెంట్స్..
- మా నామినేషన్ ర్యాలీలు విజయ యాత్రలను తలపిస్తున్నాయి
- టీడీపీ నామినేషన్ ర్యాలీలు శవయాత్రలను తలపిస్తున్నాయి
- నాకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరుతున్నాను
- తూర్పు నియోజకవర్గంలో సీఎం జగన్ చేసిన అభివృద్దే మమ్మల్ని గెలిపిస్తుంది
- పదేళ్లపాటు ఎమ్మెల్యేగా ఉన్న గద్దె రామ్మోహన్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదు
- నామినేషన్ ర్యాలీకి పెద్దఎత్తున తరలివచ్చి నన్ను ఆశీర్వదించారు
10:30 AM, Apr 24, 2024
కేతిరెడ్డి పెద్దారెడ్డి నామినేషన్ దాఖలు..
- అనంతపురం..
- తాడిపత్రి వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కేతిరెడ్డి పెద్దారెడ్డి నామినేషన్ దాఖలు
- ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ కార్యకర్తల భారీ ర్యాలీ..
10:00 AM, Apr 24, 2024
బీజేపీ ఎస్టీ మోర్చా కార్యదర్శికి పదవికి శ్రీనివాస్ రాజీనామా..
- ఏలూరు పార్లమెంట్ స్థానంలో గారపాటి సీతారామాంజనేయలుకు నో సీటు
- ఏటూరు టికెట్ బడేటి రాధాకృష్ణకు కేటాయింపు.
- నకిలీ ఎస్టీ కొత్తపల్లి గీతకు అరకు ఎస్టీ ఎంపీ టికెట్
- గారపాటికి టికెట్ ఇవ్వకపోవడంపై నిరసన.
- రాష్ట్ర బీజేపీ ఎస్టీ మోర్చా ప్రధాని కార్యదర్శి పదవికి మొడియం శ్రీనివాస రావు రాజీనామా.
- జేపీ నడ్డాకు శ్రీనివాసరావు లేఖ
- రాష్ట్ర పార్టీలో ఆదివాసీలంటే చాలా చులకన భావం ఉంది.
- నైతిక విలువలకు తావులేదని, భావ ప్రకటన స్వాతంత్ర్యం లేదని ఘాటు వ్యాఖ్యలు.
- అరకు ఎస్టీ పార్లమెంటు బీజేపీ టికెట్ కొత్తపల్లి గీతకు ఇవ్వొద్దని కామెంట్స్.
9:00 AM, Apr 24, 2024
టీడీపీ నేతలపై కేసులు నమోదు..
- గుడివాడ టీడీపీ నేతలపై కేసులు నమోదు
- నిన్న గుడివాడ టీడీపీ అభ్యర్ధి వెనిగండ్ల రాము నామినేషన్ సమయంలో నిబంధనలు ఉల్లంఘన
- నామినేషన్ ర్యాలీలో బారీకేడ్లు తొలగించి అధికారుల ఆదేశాలను ధిక్కరించిన టీడీపీ నేతలు
- టీడీపీ నేతలు మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, తులసి, రమేష్‌తో పాటు మరో 10 మందిపై సెక్షన్ 188 కింద కేసులు నమోదు.
8:10 AM, Apr 24, 2024
ఏపీలో భారీగా నామినేషన్ల దాఖలు..
- అమరావతి
- ఐదురోజుల్లో అసెంబ్లీ సెగ్మెంట్లకు 1934 మంది 2357 సెట్ల నామినేషన్లు దాఖలు
- తొలిరోజు 236 సెట్ల నామినేషన్లు దాఖలు
- రెండోరోజు 413 సెట్ల నామినేషన్లు దాఖలు
- మూడోరోజు 263 సెట్ల నామినేషన్లు దాఖలు
- నాలుగో రోజు 610 సెట్ల నామినేషన్లు దాఖలు
- ఐదోరోజు 702 సెట్ల నామినేషన్లు దాఖలు
7:55 AM, Apr 24, 2024
జనసేన, టీడీపీ నేతల మధ్య వాగ్వాదం..
- విశాఖ..
- భీమిలి నియోజకవర్గంలో జనసేన, టీడీపీ నేతల మధ్య గొడవ
- గంటా శ్రీనివాసరావు ప్రచారంలో గొడవకు దిగిన టీడీపీ, జనసేన కార్యకర్తలు.
- జనసేన కార్యకర్తలు తమపై దాడి చేశారంటూ పీఎం పాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన టీడీపీ కార్యకర్తలు.
- ప్రచారానికి పిలిచి తమను అవమానించారంటూ జనసేన కార్యకర్తలు ఆగ్రహం.
- తమ త్యాగంతోనే గంటాకు సీటు వచ్చిందనే విషయాన్ని మర్చిపోవద్దని హెచ్చరిస్తున్న జనసేన కార్యకర్తలు.
7:30 AM, Apr 24, 2024
టీడీపీ నుంచి బీజేపీలోకి నల్లిమిల్లి జంప్..
- విజయవాడ
- టీడీపీ నుంచి బీజేపీలో చేరిన అనపర్తి టీడీపీ ఇన్‌ఛార్జ్ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి
- ఏపీ బీజేపీ ఆఫీసులో పార్టీ కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించిన పురందేశ్వరి, అరుణ్ సింగ్, సిద్దార్థ్ నాథ్ సింగ్
- నల్లిమిల్లి చేరిక కార్యక్రమంలో పాల్గొన్న అనపర్తి బీజేపీ ఇన్‌చార్జ్ శివరామకృష్ణంరాజు
7:00 AM, Apr 24, 2024
చంద్రబాబుపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘానికి సిఫార్సు చేసిన సీఈవో ముఖేష్ కుమార్ మీనా
అమరావతి:
- బహిరంగ సభల్లో సీఎం జగన్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని 18 సార్లు సీఈఓకి ఫిర్యాదు చేసిన వైఎస్సార్‌సీపీ
- వివరణ ఇవ్వాలంటూ చంద్రబాబుకు పలుమార్లు నోటీసులు జారీ చేసిన సీఈవో ముఖేష్ కుమార్ మీనా
- కొన్ని నోటీసులకు మాత్రమే సమాధానం ఇచ్చిన చంద్రబాబు
- కొన్ని నోటీసులకు స్పందించని చంద్రబాబు .
- చంద్రబాబు ఇచ్చిన సమాధానంపై సంతృప్తి చెందని సీఈవో మీనా.
- వైసీపీ ఇచ్చిన వీడియో క్లిప్పులను పరిశీలించిన సీఈవో మీనా.
- చంద్రబాబుపై తదుపరి చర్యలు తీసుకోవాలంటూ ఈసీఐ ముఖ్య కార్యదర్శి అవినాష్ కుమార్‌కు లేఖ
- వీడియో క్లిప్పులను కూడా జత చేస్తూ లేఖ పంపిన సీఈవో
6:45 AM, Apr 24, 2024
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు.
- నామినేషన్ సందర్భంగా జరిగిన ర్యాలీలో జాతీయ పతాకాన్ని వినియోగించిన పవన్ కళ్యాణ్
- దీనిపై అభ్యంతరం తెలుపుతూ పవన్ ఎన్నికల నింబంధనలు ఉల్లంఘించారని బాపట్ల జిల్లా వేట్లపాలెం కు చెందిన జర్నలిస్ట్ నాగర్జున రెడ్డి.
- నామినేషన్ సందర్భంగా రిటర్నింగ్ అధికారి కార్యాలయం వద్ద 100 మీటర్ల నిబంధనలు ఉల్లంగించిన కూటమీ సభ్యులు
- రిటర్నింగ్ అధికారి కార్యాలయం వరకు చొచ్చుకు వచ్చిన కూటమీ కార్యకర్తలు
6:30 AM, Apr 24, 2024
చంద్రబాబు మాటలు నమ్మి ఎన్నారైలు బలి కావొద్దు: మంత్రి జోగి రమేష్
- ఎన్నారైలు స్వచ్ఛందంగా ప్రజా సేవ చేస్తే ఎవరికి అభ్యంతరం ఉండదు
- చంద్రబాబు మాటలు నమ్మి డబ్బులు తరలిస్తే మనీలాండరింగ్ కేసులు అవుతాయి
- ఎన్నారైలు చంద్రబాబును నమ్మితే కుక్కతోక పట్టుకుని గోదారి ఈదినట్టే
- కండ కావరంతోనే ఎన్నారై సభ్యుడు ఓటర్లను వెదవలు అన్నాడు
- మంచి చేస్తున్న జగనన్న వైపే ఎన్నారైలు ఉండాలి
- ఎవరు మంచి చేస్తున్నారో ఎన్నారైలు ఆలోచించుకోవాలి
- దొంగ ఓట్లు వేసే ఉద్దేశాలను టీడీపీ మానుకోవాలి
- మరోసారి వైఎస్ జగన్ గెలవబోతున్నారు
- 2019లో ఓటు వేయనివారు కూడా ఇప్పుడు జగన్ వైపు నిలబడుతున్నారు
- పేదవారే కాకుండా అగ్రవర్ణాలన్నీ జగన్‌కు మద్దతు ఇస్తున్నాయి
- కుప్పంలోనే చంద్రబాబు గెలుస్తాడో లేదో డౌట్
- అన్ని సర్వేల్లోనూ వైఎస్సార్‌సీపీదే విజయంగా కనిపిస్తోంది
Comments
Please login to add a commentAdd a comment