ఎల్లో ‘కుల’ మీడియాపై విజయసాయి రెడ్డి సీరియస్‌ | YSRCP MP Vijaya Sai Reddy Serious Comments On Yellow Media, Tweet Inside | Sakshi
Sakshi News home page

ఎల్లో ‘కుల’ మీడియాపై విజయసాయి రెడ్డి సీరియస్‌

Published Wed, Aug 14 2024 3:31 PM | Last Updated on Wed, Aug 14 2024 6:54 PM

YSRCP MP Vijaya Sai Reddy Serious Comments On Yellow Media

సాక్షి, ఢిల్లీ: ఏపీలో ఎల్లో కుల మీడియాపై ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. సీఎం చంద్రబాబు తృప్తిపరిచి ఆయన మెప్పు పొందేందుకు స్వార్థంతో నీచంగా పవిత్రమైన పాత్రికేయ వృత్తికే కళంకం చేస్తున్నారని మండిపడ్డారు. అత్యంత దుర్మార్గంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని ఆరోపించారు.

కాగా, ఎంపీ విజయసాయి రెడ్డి ట్విట్టర్‌ వేదికగా..‘చంద్రబాబును సంతృప్తిపరచి మెప్పు పొంది, ఆర్థిక, రాజకీయ ప్రయోజనాలు సాధించుకునేందుకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, టీవీ5, మహా న్యూస్, ఈటీవీ, ఆర్ టీవీ, వంటి కుల మీడియా యజమానులు తీవ్రంగా పోటీపడుతున్నాయి. ఈ క్రమంలో నీతిబాహ్యమైన రీతిలో దుష్ట పన్నాగాలతో బరితెగించి వైఎస్సార్‌సీపీ నాయకులపై విషం చిమ్ముతూ అబద్దపు వార్తలతో దాడికి పాల్పడుతున్నాయి.

వాస్తవాలను పట్టించుకోకుండా అత్యంత దుర్మార్గంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడుతూ జర్నలిజం నిబద్ధతను గాలికొదిలి కట్టుకథలను ప్రసారం చేస్తున్న క్రమంలో పవిత్రమైన పాత్రికేయ వృత్తికే కళంకం తెస్తూ చరిత్రహీనులుగా మిగిలిపోతున్నారు. నిస్సిగ్గుగా అబద్ధాలనే నిజాలుగా చిత్రీకరిస్తూ విలువలకూ తిలోదకాలు ఇచ్చి సత్యానికి పాతరేస్తున్నారు. ఈ కుల మీడియా యజమానుల దుర్మార్గమైన ప్రవర్తన పాత్రికేయ సూత్రాలను మంటగలుపుతూ రాజకీయ వాతావరణాన్ని స్వార్ధంతో నీచానికి ఒడికడుతూ కలుషితం చేస్తున్నారు.

పచ్చ పత్రికలు, ఛానల్స్ కు గడ్డి పెట్టిన ఢిల్లీ హైకోర్టు

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement