సాక్షి, ఢిల్లీ: వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ విజయసాయిరెడ్డి సంసద్ మహారత్న అవార్డు అందుకున్నారు. ఎంపీ విజయసాయిరెడ్డికి తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హాన్స్‌రాజ్ అహిర్, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ అవార్డును ప్రదానం చేశారు.
కాగా, టూరిజం, రవాణా, సాంస్కృతిక శాఖ పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్‌గా విజయసాయిరెడ్డి అత్యుత్తమ పనితీరుకు గాను అవార్డు దక్కింది. ఇక, మాజీ చైర్మన్ టీజీ వెంకటేష్‌తో కలిపి ఎంపీ విజయసాయి రెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. అలాగే, మహారాష్ట్ర సదన్‌లో జరిగిన కార్యక్రమంలో అవార్డులను ఎంపీలు అధిర్ రంజన్ చౌదరి, సుప్రియ సులే, శ్రీకాంత్ ఏక్ నాథ్ షిండే, హీనా గవిట్, జయంత్ సిన్హా తదితరులు ఈ అవార్డులను అందుకున్నారు.
ఈ సందర్బంగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మాట్లాడుతూ..‘మహిళలకు అన్ని రంగాల్లో సరైన అవకాశాలు కల్పించాలి. చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్ పాస్ చేయడం చరిత్రాత్మకం. పార్లమెంట్‌లో జరిగే చర్చల ఆధారంగా చట్టాల ఉద్దేశం తెలుస్తుంది. తెలంగాణ కొత్త రాష్ట్రానికి యంగ్ గవర్నర్ ఎలా పని చేస్తారని నా మీద విమర్శలు వచ్చాయి. కానీ, నా పనితీరుతో రెండో రాష్ట్రానికి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అవకాశం వచ్చింది. గైనకాలజిస్ట్‌గా కొత్త శిశువు డెలివరీ చేసినట్లుగా తెలంగాణ కొత్త రాష్ట్రాన్ని కూడా సరిగ్గా నిర్వహించాను. పురుషులతో పాటు మహిళలకు సమాన ప్రాతినిధ్యం కల్పించాలి. అప్పుడే దేశం మరింత అభివృద్ది చెందుతుంది అని కామెంట్స్ చేశారు.
జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్సరాజ్ ఆహిర్ మాట్లాడుతూ.. పార్లమెంట్‌లో వివిధ పద్దతుల్లో ప్రజా సమస్యలు లేవనెత్తాలి. ప్రభుత్వాన్ని సరైన దిశలో నడిపేందుకు ఎంపీలు నిరంతరం ప్రశ్నించాలి అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment