సాక్షి, అమరావతి: వైఎస్ జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టాక ప్రకృతి వైపరీత్యాలు, అవాంతరాలు, కష్టాలు ఎదురైనా మొక్కవోని ధైర్యంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను నిరాటంకంగా కొనసాగిస్తున్నారని, జనరంజక పాలన సాగిస్తున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.
వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ విజయం సాధించడానికి వైఎస్సార్‌సీపీ ముందుకు సాగుతోందని ఆయన బుధవారం తాడేపల్లిలో విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. నవ్యాంధ్రప్రదేశ్‌లో శాసనసభ ఎన్నికల్లో కేవలం పనితీరుతో ప్రజల మనసుల్ని గెల్చుకునే మొదటి రాజకీయపక్షంగా వైఎస్సార్‌సీపీ కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టబోతోందని తెలిపారు.
ఆ ప్రకటనలో ఆయన ఏమన్నారంటే..
సీఎం వైఎస్ జగన్ రైతులు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను ఎన్నో విధాలుగా ఆదుకుంటున్నారు. రాజ్యసభకు నలుగురు బీసీలను పంపించారు. ఇంకా 17 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఎమ్మెల్సీ పదవులిచ్చారు. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఆ పదవులు కూడా ఇచ్చారు. గతంలో పాలకులు పేదలను ఓటర్లుగానే చూశారు. అదే సీఎం జగన్ పాలనలో సచివాలయ, వలంటీరు వ్యవస్థలతో ప్రజలకు ఊళ్లోను, ఇళ్లవద్దే పథకాలు అందుతున్నాయి.
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుని ప్రజల్లో పూర్తి విశ్వాసం కలిగించిన నేత జగన్. తన పాలనతో అందరి కుటుంబాల్లో వెలుగులు నింపుతున్నారు. ఈ నాలుగేళ్లలో డీబీటీ ద్వారా రూ.2.11 లక్షల కోట్లు.. పైసా లంచం లేకుండా పారదర్శకంగా లబ్ధిదారుల ఖాతాల్లో జమచేశారు. 31 లక్షల ఇళ్లపట్టాలు ఇవ్వడంతో పాటు దాదాపు 22 లక్షల ఇళ్లు కట్టించి ఇస్తున్నారు.
ఇది కూడా చదవండి: కేంద్ర చట్టం పాటించం.. రాష్ట్ర చట్టం వర్తించదు.. రామోజీ తీరు..
Comments
Please login to add a commentAdd a comment