
సాక్షి, న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం మధ్యాహ్నం ఢిల్లీ చేరుకున్నారు. కేంద్ర ప్రభుత్వంలోని పలువురు ఉన్నతాధికారులు, వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు సీఎంను ఆయన అధికారిక నివాసంలో కలిసి పలు అంశాలపై చర్చించారు. అలాగే, పలువురు వైఎస్సార్‌సీపీ ఎంపీలు కూడా వైఎస్ జగన్‌తో సమావేశమయ్యారు.
వీరిలో వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వి. విజయసాయిరెడ్డి, లోక్‌సభ పక్ష నేత మిథున్‌రెడ్డి, ఎంపీలు బాలశౌరి, ప్రభాకర్‌రెడ్డి, రఘురామకృష్ణంరాజు, వైఎస్ అవినాష్ రెడ్డి, లావు శ్రీకృష్ణదేవరాయలు, మార్గాని భరత్ తదితరులు ఉన్నారు.
కాగా, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం కేంద్ర న్యాయ, ఐటీ శాఖల మంత్రి రవిశంకర్ ప్రసాద్‌తో సమావేశం కానున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా కలవనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment