ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఆవశ్యతకను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి సోమవారం లోక్ సభలో వివరించారు. పార్లమెంట్లో ఇచ్చిన హామీలు అమలు కాకపోతే చట్టాలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చి 26 నెలలు గడిచాయని, 5కోట్లమంది ప్రజలు హోదా కోసం ఆందోళనగా ఉన్నారన్నారు.