రాజ్యసభకు చేరిన చాపరాయి ఘటన | vijaya sai reddy raised chaparai incedent in rajyasabha | Sakshi

రాజ్యసభకు చేరిన చాపరాయి ఘటన

Jul 26 2017 3:10 PM | Updated on Aug 9 2018 2:42 PM

రాజ్యసభకు చేరిన చాపరాయి ఘటన - Sakshi

రాజ్యసభకు చేరిన చాపరాయి ఘటన

గిరిజనుల మృతికి ఫుడ్‌పాయిజనే కాదు, ఇతర కారణాలు ఉన్నాయి..

  • గిరిజనుల మృతిపై కేంద్రం జోక్యం చేసుకోవాలి
  • పెద్దలసభలో ఎంపీ విజయసాయిరెడ్డి
  • న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ను కుదిపేసిన చాపరాయిలో గిరిజనుల మృతి ఘటనను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి బుధవారం రాజ్యసభలో లేవనెత్తారు. గిరిజనుల మృతికి ఫుడ్‌పాయిజనే కాదు, ఇతర కారణాలు ఉన్నాయని ఆయన సభ దృష్టికి తీసుకొచ్చారు. చాపరాయి ఏజెన్సీ ప్రాంతంలో రక్షిత తాగునీరు, రోడ్డుసౌకర్యం వంటివి అందుబాటులో లేవని తెలిపారు. గత ఏడాది కూడా ఆంధ్రప్రదేశ్‌లో గిరిజనులు మృత్యువాత పడ్డారని ఆందోళన వ్యక్తం చేశారు. చాపరాయి ఘటనపై కేంద్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో గిరిజన సలహా మండలి ఏర్పాటు చేయకపోవడం రాజ్యాంగ ఉల్లంఘనేనని ఆయన స్పష్టం చేశారు.

    కేంద్రమంత్రి సలహా ఇచ్చి మూడేళ్లైనా గిరిజన మండలిని ఏర్పాటు చేయలేదని విజయసాయిరెడ్డి తెలిపారు. ఈ అంశంపై కేంద్ర గిరిజనశాఖ మంత్రి జుయల్‌ ఓరం సమాధానమిస్తూ.. గిరిజన సలహా మండలి ఏర్పాటుచేయడం ముఖ్యమంత్రి బాధ్యత అని స్పష్టం చేశారు. సీఎం చంద్రబాబే చైర్మన్‌గా సలహా మండలి తర్వగా ఏర్పాటుచేయాలని తాము సూచించామని చెప్పారు. తూర్పు గోదావరి జిల్లా రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలోని చాపరాయి గ్రామంలో 16 మంది గిరిజనులు ఆకస్మికంగా మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement