
సాక్షి,ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల అనంతరం హింస పెచ్చరిల్లుతోందని, టీడీపీ శ్రేణులు ప్రణాళికబద్ధంగా దాడులకు పాల్పడుతున్నాయని వైఎస్‌ఆర్‌సీపీ రాజ్యసభ ఎంపీ మేడా రఘునాథ్‌రెడ్డి అన్నారు. సోమవారం(జులై1) రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో వైఎస్‌ఆర్‌సీపీ తరపున రఘునాథ్‌రెడ్డి మాట్లాడారు.
‘వైఎస్‌ఆర్‌సీపీ కాంగ్రెస్ కార్యకర్తలను టార్గెట్ చేసుకుని దాడులు చేస్తున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ అభిమానులు, సానుభూతిపరులపై హింసకు తెగబడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ అంశంలో జోక్యం చేసుకోవాలి. ఏపీలో ప్రజలందరి భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలి. ప్రజల ప్రాథమిక హక్కులను పరిరక్షించాలి.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి. ప్రత్యేక హోదా నిరాకరించడం మా రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడమే. పార్లమెంటులో ఇచ్చిన ప్రత్యేక హోదా వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలి. ప్రత్యేక హోదా కోసం వైఎస్‌జగన్ అనేకసార్లు ప్రధానికి విజ్ఞప్తి చేశారు.
ప్రత్యేక హోదా వల్ల రాయితీలు, నిధులు ఏపీకి వస్తాయి. ఏపీలో మీడియా ఛానల్స్ ను అణిచి వేస్తున్నారు. వైఎస్ జగన్ హయాంలో ఏపీ మారిటైమ్ రంగం చాలా అభివృద్ధి చెందింది. అనేక ఫిషింగ్ హార్బర్లు ఏర్పాటు చేశారు’అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment