
సాక్షి, న్యూఢిల్లీ: విపక్షాల నిరసలన మధ్యే వ్యవసాయ బిల్లులు రాజ్యసభ ముందుకు వచ్చాయి. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ ఆదివారం ఉదయం రెండు వ్యవసాయ బిల్లులను రాజ్యసభలో ప్రవేశపెట్టారు. వ్యవసాయ బిల్లులు చారిత్రాత్మకమని, రైతుల జీవితాల్లో విప్లవాత్మక మార్పులకు పునాది పడతాయని ఆయన పేర్కొన్నారు. ఎంఎస్‌పీతో ఈ బిల్లులకు ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. రైతులు తమ పంటలను ఎక్కడైనా అమ్ముకోవచ్చని తోమర్ తెలిపారు. (కేంద్రమంత్రి హర్‌సిమ్రత్ కౌర్ రాజీనామా)
అయితే వ్యవసాయ బిల్లును సెలక్ట్ కమిటీకి పంపాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. కేంద్రం తీసుకొచ్చిన బిల్లు వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం కలిగించే విధంగా, రైతుల ప్రయోజనాలను దెబ్బ తీసే విధంగా ఉందని విమర్శించింది. కాగా వ్యవసాయ రంగానికి సంబంధించిన బిల్లులను రాజ్యసభలో ఆమోదం పొందించేందుకు మోదీ సర్కార్ పట్టుదలతో ఉంది. రైతులకు నష్టం కలిగించేలా బిల్లులు ఉన్నాయంటూ విపక్షాలతో పాటు స్వపక్షంలోనూ అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. అయినా నరేంద్ర మోదీ ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఇప్పటికే ఆ బిల్లులకు లోక్‌సభలో ఆమోదం లభించింది. కాగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ రంగానికి సంబంధించిన బిల్లులకు వ్యతిరేకంగా బీజేపీ చిరకాల భాగస్వామి అయిన శిరోమణి అకాలీదళ్ఎంపీ హర్ సిమ్రత్ కౌర్ బాదల్ కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసిన విషయం విదితమే. (ఆ బిల్లు తేనె పూసిన కత్తి లాంటిది : సీఎం కేసీఆర్)
Comments
Please login to add a commentAdd a comment