
కేంద్ర సమాచార సాంకేతికశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్
సాక్షి, న్యూఢిల్లీ: కొన్ని వందల రూపాయలు చెల్లించి ఇతరుల ఆధార్ సమాచారం సులువుగా సేకరించవచ్చునంటూ ప్రతిపక్ష నేతలు చేసిన ఆరోపణల్ని కేంద్ర సమాచార సాంకేతికశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్
ఖండించారు. ఆధార్ డేటా ఎప్పుడూ భద్రంతగానే ఉంటుందని, ఇతరుల చేతుల్లోకి వ్యక్తిగత సమాచారం వెళ్లే పరిస్థితులు లేవని ఆయన స్పష్టం చేశారు. ఆధార్ డేటాకు గోపత్య లేదని, దీనిపై వివరణ ఇవ్వాలంటూ
రాజ్యసభలో సమాజ్‌వాదీ పార్టీ నేత నీరజ్ శేఖర్ అని ప్రశ్నకు మంత్రి రవిశంకర్ ఈ విధంగా వివరణ ఇచ్చారు. ఈ ఏడాది జనవరి 4న యూఐడీఏఐ (ఆధార్ సంస్థ) ఓ వ్యక్తిపై ఫిర్యాదు చేయగా ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్, సైబర్
విభాగం పోలీసులు ఆధార్ చట్టం, ఐటీ చట్టాల కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు తెలిపారు.
'విపక్ష నేతలు ఆధార్ పై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారు. కానీ ఇప్పటివరకూ డబ్బు చెల్లించి ఆధార్ సమాచారాన్ని చోరీ చేసినట్లు దేశంలో ఎక్కడా కేసులు నమోదు కాలేదు. దీన్ని బట్టి చూస్తే ఆధార్ వివరాలపై గోప్యత ఉంటుందని అర్థమవుతోంది. ఆధార్ సంస్థ స్వయంగా ఓ వ్యక్తిపై డేటా దుర్వినియోగం చేశాడని ఫిర్యాదు చేయగా ఢిల్లీ సైబర్ విభాగం విచారణ చేపట్టింది. ఆధార్ డేటాపై అభద్రత భావాన్ని దూరం చేసుకోవాలి. రూ.500 చెల్లించి ఇతరుల ఆధార్ డేటా వ్యక్తిగత సమాచారాన్ని పొందడం తేలికంటూ ప్రతిపక్ష పార్టీల నేతలు చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు. ఆధార్‌పై పుట్టకొస్తున్న వదంతులను నమ్మవద్దని' మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు.
ఒకవైపు ఆధార్ డేటాను ఎవరూ హ్యాక్ చేయలేరని యూఐడీఏఐ పదే పదే స్పష్టం చేస్తున్నప్పటికీ.. ప్రపంచవ్యాప్తంగా ఇంటర్నెట్‌పై అమెరికా పెట్టిన నిఘా గుట్టును రట్టుచేసిన ఎడ్వర్డ్ స్నోడెన్ ఆధార్ గోప్యతపై ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. వంద కోట్ల భారతీయుల ఆధార్ డేటాను హ్యాక్ చేయడం చాలా సులువని సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ప్రతిక్షాల వాదనకు, ఆరోపణలకు బలం
చేకూర్చినట్లయింది. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఆధార్ వల్ల ఎన్నో ప్రయోజనాలున్నాయని చెబుతుండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment