
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాల్లో విద్యార్థుల ఆందోళనలతో పాటు చెలరేగిన హింసపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని కేంద్రం పార్లమెంటుకు తెలిపింది. ‘విశ్వవిద్యాలయాలు స్వతంత్ర సంస్థలు. ధర్నాలు, ఆందోళనలు చెలరేగినప్పుడు వాటి నియంత్రణకు స్థానిక అధికారుల సాయంతో చర్యలు తీసుకునే పూర్తి అధికారం వారికుంది’ అని కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ సహాయమంత్రి సత్యపాల్ సింగ్ లోక్‌సభకు రాతపూర్వకంగా తెలియజేశారు. ఈ విషయాన్ని లోక్‌సభ అధికారిక వెబ్‌సైట్‌లో సోమవారం అప్‌లోడ్ చేశారు.
నేడు రాజ్యసభకు ట్రిపుల్ తలాక్ బిల్లు:
ఉన్నపళంగా ముమ్మారు తలాక్ చెప్పి ముస్లిం భర్తలు తమ భార్యలకు విడాకులిచ్చే పద్ధతిని నేరంగా పరిగణిస్తూ కేంద్రం తీసుకొచ్చిన బిల్లును మంగళవారం రాజ్యసభలో ప్రవేశపెట్టనున్నారు.