
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలి: మేకపాటి
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఆవశ్యతకను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి సోమవారం లోక్ సభలో వివరించారు. పార్లమెంట్లో ఇచ్చిన హామీలు అమలు కాకపోతే చట్టాలు ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చి 26 నెలలు గడిచాయని, 5కోట్లమంది ప్రజలు హోదా కోసం ఆందోళనగా ఉన్నారన్నారు.
రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి అనేక హామీలు ఇచ్చారని మేకపాటి ఈ సందర్భంగా సభలో గుర్తు చేశారు. హామీలు అమలు చేయకపోతే ప్రజాస్వామ్యంపై నమ్మకం పోతుందని ఆయన అన్నారు. ప్రజాస్వామ్యం గౌరవాన్ని అందరూ కాపాడాలని మేకపాటి విజ్ఞప్తి చేశారు. పార్టీ మారినవారిని మూడు నెలల సమయం ఇచ్చి, వారిపై అనర్హత వేటు వేసే అధికారం ఎన్నికల కమిషన్కు ఇవ్వాలని ఆయన కోరారు.