
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ నేత, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో ఆమరణ దీక్ష చేసి నెల్లూరు నగరానికి వస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లోక్‌సభ నేత, నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డికి సోమవారం పార్టీ నాయకులు ఘనస్వాగతం పలకనున్నారు. విజయవాడ నుంచి సోమవారం ఉదయం పినాకినీ ఎక్స్‌ప్రెస్‌లో నెల్లూరు నగరానికి చేరుకుంటారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఘనస్వాగతం పలకటానికి అన్ని ఏర్పాట్లు చేశారు.
రైల్వే స్టేషన్లో స్వాగతం పలికి అక్కడి నుంచి భారీ ర్యాలీగా మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం ర్యాలీగా పార్టీ కార్యాలయానికి చేరుకోనున్నారు. ఈ ర్యాలీకి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలిరావాలని నెల్లూరు నగర, రూరల్ ఎమ్మెల్యేలు పి.అనిల్‌కుమార్ యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి పిలుపునిచ్చారు. మరోవైపు జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు కూడా స్వాగతం పలకనున్నారు. ఇప్పటికే పార్టీ ముఖ్య నేతలు నగరంలో భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. స్వాగత ఏర్పాట్లు పూర్తి చేశారు.