
సాక్షి, నెల్లూరు: వైఎస్‌ఆర్‌సీపీ విద్యార్ధి విభాగం ఆధ్వర్యంలో ప్రత్యేక హోదాపై నెల్లూరులో సదస్సు జరిగింది. ఈ కార్యక్రమంలో ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాకాణి గోవర్ధన్ రెడ్డి, అనిల్‌కుమార్ యాదవ్‌లు పాల్గొన్నారు. ఈ సదస్సులో ఎంపీ మేకపాటి మాట్లాడుతూ.. ప్రత్యేక హోదాతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమన్నారు. ప్రత్యేక హోదాపై సీఎం చంద్రబాబు నాయుడి వైఖరి సరికాదని ఎంపీ అన్నారు.
ఎమ్మెల్యే అనిల్‌కుమార్ మాట్లాడుతూ.. రాజకీయ విలువలను వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాటిస్తున్నారని అన్నారు. వైఎస్ జగన్‌కు ఒక్కసారి అవకాశం ఇవ్వడని ఆయన అన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు రాష్ట్రానికి పది కాదు 15 ఏళ్లు ప్రత్యేక హోదా కావాలన్నారు. ప్రస్తుతం కేసుల నుంచి బయటపడేందుకు ఇప్పడు ప్యాకేజీ అంటున్నారని ఎమ్మెల్యే కాకాణి ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment