హోదా బంద్‌ విజయవంతం | YSRCP Bandh Success Says MLA Kakani Govardhan Reddy Nellore | Sakshi
Sakshi News home page

హోదా బంద్‌ విజయవంతం

Published Wed, Jul 25 2018 12:07 PM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

YSRCP Bandh Success Says MLA Kakani Govardhan Reddy Nellore - Sakshi

బైక్‌ర్యాలీలో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి

వెంకటాచలం(నెల్లూరు): వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో హోదా కోసం మంగళవారం నిర్వహించిన బంద్‌ విజయవంతమైంది. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి నాయకత్వంలో వెంకటాచలంలోని సర్వేపల్లి క్రాస్‌రోడ్డు వద్ద నుంచి మోటారు బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి మోటారు బైక్‌ను నడుపుతూ ముందుకు సాగగా ఆయన వెంట పార్టీ నాయకులు, కార్యకర్తలు మోటారుబైక్‌లలో బయలుదేరారు. ఈ ర్యాలీ కసుమూరు రోడ్డు మీదుగా టోల్‌ప్లాజా వరకు సాగి అక్కడ నుంచి సర్వేపల్లి క్రాస్‌రోడ్డు వరకు జాతీయ రహదారిపై సాగింది. వైఎస్సార్‌సీపీ నాయకులు ‘‘ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు, హోదాకు చంద్రబాబే అడ్డు’’ అంటూ నినాదాలు చేశారు.

అనంతరం జాతీయ రహదారిపై మానవహారంగా నిలబడి వాహనాలను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డిని అరెస్ట్‌ చేసే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేను పోలీసులు అరెస్ట్‌ చేయకుండా వైఎస్సార్‌సీపీ నాయకులు అడ్డుకున్నారు. పోలీసులకు, పార్టీ నాయకుల మధ్య తోపులాట జరిగింది. చివరకు పోలీసులు ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డిని అరెస్ట్‌చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించి అనంతరం సొంతపూచీకత్తు మీద వదిలేశారు. వైఎస్సార్‌సీపీ చేపట్టిన బంద్‌ కారణంగా ప్రభుత్వ కార్యాలయాలు, దుకాణాలు, బ్యాంకులు మూతపడ్డాయి.

బంద్‌లో వైఎస్‌ఆర్‌సీపి జిల్లా కార్యదర్శి కనుపూరు కోదండరామిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు మందల వెంకటశేషయ్య, వైఎస్సార్‌సీపీ యువజన విభాగం రాష్ట్రకార్యదర్శి కోడూరు ప్రదీప్‌కుమార్‌రెడ్డి, ఎస్సీసెల్‌ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రౌతు మల్లికార్జున, పార్టీ మం డల కన్వీనర్‌ కె.చెంచుకృష్ణయ్య, యువజన విభాగం మండల అధ్యక్షులు ఈపూరు రజనీకాంత్‌రెడ్డి, మం డల ఉపాధ్యక్షులు శ్రీధర్‌నాయుడు, జిల్లా, మండల కో–ఆçప్షన్‌ సభ్యులు అక్బర్‌బాష, హుస్సేన్, వైఎస్సార్‌సీపీ నాయకులు మోహన్‌నాయుడు, వెలి బోయిన వెంకటేశ్వర్లు, సుమంత్‌రెడ్డి, నాటకం శ్రీని వాసులు, ఆరుగుంట ప్రభాకర్‌రెడ్డి, పోచారెడ్డి సుధాకర్‌రెడ్డి, షాజహాన్, నరసయ్య, కోసూరు సుబ్బయ్యగౌడ్, డక్కిలి రమణయ్య, మందా కృష్ణ పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

మానవహారంగా నిలబడిన వైఎస్సార్‌సీపీ నాయకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement