వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి
సాక్షి, నెల్లూరు : పార్లమెంట్ సాక్షిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసం బయటపడిందని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అంగీకారంతోనే ఏపీకి ప్యాకేజీ ఇచ్చామంటూ ప్రధాని నరేంద్ర మోదీ లోక్‌సభలో కుండబద్దలు కొట్టారని అన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నాలుగేళ్లుగా చెబుతున్న దాన్నే తెలుగుదేశం ఎంపీ గల్లా జయదేవ్ లోక్‌సభలో చెప్పారని పేర్కొన్నారు. హోదాపై బాబుకు చిత్తశుద్ధి ఉంటే ఎంపీలతో రాజీనామాలు చేయించాలని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment