ఏపీ ప్రభుత్వం తగిన భవనం నిర్మిస్తే హైకోర్టు ఏర్పాటు చేస్తామని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.
భవనం నిర్మిస్తే హైకోర్టు ఏర్పాటుకు చర్యలు
Published Wed, Mar 22 2017 8:29 PM | Last Updated on Fri, Aug 31 2018 8:31 PM
న్యూఢిల్లీః ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తగిన భవనం నిర్మిస్తే హైకోర్టు ఏర్పాటు చేసేందుకు వేగవంతంగా చర్యలు తీసుకుంటామని కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. బుధవారం ఉదయం ప్రశ్నోత్తరాల సమయంలో టీడీపీ లోక్‌సభాపక్ష నేత తోట నరసింహం అడిగిన ఓ ఉప ప్రశ్నకు రవిశంకర్‌ప్రసాద్ జవాబు ఇచ్చారు. ‘కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు అక్కడ ఒక హైకోర్టు కూడా ఉండాలి. తెలంగాణ కొత్త రాష్ట్రం. పునర్ వ్యవస్థీకరణ చట్టం ప్రకారం హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా పదేళ్లపాటు కొనసాగుతుంది. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సంప్రదింపులు జరుపుతున్నాను. ఆంధ్రప్రదేశ్‌లో త్వరితగతిన భవనాన్ని నిర్మిస్తే హైకోర్టు ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేస్తాం..’ అని పేర్కొన్నారు.
Advertisement
Advertisement