
శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే (ఫైల్‌ఫోటో)
సాక్షి, న్యూఢిల్లీ : రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి ఈనెల 9న జరిగే ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతిస్తామని శివసేన బుధవారం ప్రకటించింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిగా జేడీ(యూ)కు చెందిన హరివంశ్ నారాయణ్ సింగ్‌ను ఎన్డీఏ బరిలో నిలిపింది.కాగా ఎన్డీఏ అభ్యర్థికే తాము మద్దతిస్తామని శివసేన ఎంపీ అనిల్ దేశాయ్ స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత నెలలో విపక్షం లోక్‌సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు శివసేన దూరంగా ఉన్న విషయం తెలిసిందే.
గత కొన్నేళ్లుగా బీజేపీపై పలు సందర్భాల్లో అంశాల ప్రాతిపదికన విరుచుకుపడుతున్న శివసేన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధికి మద్దతిస్తామని ప్రకటించడంతో బీజేపీ వర్గాలు ఊపిరిపీల్చుకున్నాయి.
మరోవైపు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ విపక్ష అభ్యర్ధిగా కాంగ్రెస్‌కు చెందిన బీకే హరిప్రసాద్ రంగంలో నిలిచారు. వీరిరువురూ నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు. ఎన్డీఏ అభ్యర్థి హరివంశ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు కాంగ్రెస్ సహా ఇతర పార్టీలతో ఎన్డీఏ సంప్రదింపులు జరుపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment