deputy chairman
-
రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడలకు షాక్.. ప్రసంగానికి డిప్యూటీ ఛైర్మన్ బ్రేక్
సాక్షి, ఢిల్లీ: రాజ్యసభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ప్రసంగానికి డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ బ్రేక్ వేశారు. షెడ్యూల్ ట్రైబ్స్ రాజ్యాంగ సవరణ బిల్లుపై ఏపీ విషయాలను జోడించి కనకమేడల అసందర్భంగా మాట్లాడారు. కనకమేడల ప్రసంగంపై ఎంపీ విజయసాయిరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. కనకమేడల ప్రసంగాన్ని రికార్డుల నుంచి తొలగిస్తామని డిప్యూటీ ఛైర్మన్ తెలిపారు. కాగా, రాష్ట్రంలో విదేశీ పెట్టుబడులను రాబట్టే విషయంలో సీఎం జగన్ ప్రభుత్వం విఫలమైందని చూపేందుకు గతంలో కూడా ప్రతిపక్ష టీడీపీ చేసిన ప్రయత్నం బెడిసికొట్టిన సంగతి తెలిసిందే. 2019 నుంచి రాష్ట్రానికి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వివరాలు చెప్పాలని వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సోమ్ ప్రకాష్‌ను రాజ్య సభలో టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ కోరారు. కనకమేడల ప్రశ్నకు కేంద్ర మంత్రి సోమ్ ప్రకాశ్ ఊహించని రీతిలో సమాధానం ఇచ్చారు. ఏపీకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎక్కడా తగ్గలేదని, ఇంకా చెప్పాలంటే 2022-23 ఆర్థిక సంవత్సరంలో ‘ఆల్ టైమ్ రికార్డ్’ స్థాయిలో పెరిగాయని చెప్పారు. చదవండి: ‘బాబువి గాలి కబుర్లు.. ఈయన్ని చూసి తెలుసుకోండి’ -
సీఐఐ సదరన్ రీజియన్ చైర్మన్‌గా కమల్ బాలి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: 2023–24 సంవత్సరానికి గాను పరిశ్రమల సమాఖ్య సీఐఐ సదరన్ రీజియన్ చైర్మన్‌గా కమల్ బాలి, డిప్యుటీ చైర్‌పర్సన్‌గా ఆర్ నందిని ఎన్నికయ్యారు. 2022–23కి గాను సీఐఐ సదరన్ రీజియన్ చైర్‌పర్సన్‌గా భారత్ బయోటెక్ సహ వ్యవస్థాపకురాలు సుచిత్రా ఎల్లా వ్యవహరిస్తున్నారు. వోల్వో గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్‌గా ఉన్న కమల్ బాలికి సీఐఐతో చిరకాల అనుబంధం ఉంది. 2022–23కి గాను ఆయన సీఐఐ సదరన్ రీజియన్ డిప్యుటీ చైర్మన్‌గా ఉన్నారు. పరిశ్రమలోని పలు సంస్థలు, ఇన్వెస్ట్ కర్ణాటక ఫోరం మొదలైన వాటిలో ఆయన వివిధ హోదాల్లో సేవలు అందిస్తున్నారు. అటు నందిని .. చంద్ర టెక్స్టైల్స్ సంస్థకు ఎండీగా ఉన్నారు. ఆమె సీఐఐ కార్యకలాపాల్లో చురుగ్గా పాలుపంచుకుంటున్నారు. సీఐఐ సదరన్ రీజనల్ కౌన్సిల్లో సభ్యురాలిగా, సీఐఐ నేషనల్ కౌన్సిల్ టాస్క్ ఫోర్స్ (గ్రామీణాభివృద్ధి, వలస కార్మికులు)కు కో–చైర్‌పర్సన్‌గా ఉన్నారు. అలాగే పలు సంస్థల్లో డైరెక్టరుగా కూడా వ్యవహరిస్తున్నారు. మరోవైపు, హైదరాబాద్‌లోని టీ–హబ్‌లో ఇన్నోవేషన్, ఎంట్రప్రెన్యూర్షిప్ అండ్ స్టార్టప్స్ (సీఐఈఎస్) సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను సీఐఐ ప్రారంభించింది. తెలంగాణ ప్రభుత్వం, ప్రతీక్షా ట్రస్ట్స్‌తో కలిసి ఏర్పాటు చేసిన ఈ ప్లాట్‌ఫాం .. ఔత్సాహిక వ్యాపారవేత్తలకు అవసరమైన తోడ్పాటు అందించేందుకు ఉపయోగపడగలదని తెలిపింది. తెలంగాణ పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, సీఐఐ సీఐఈఎస్ చైర్మన్ క్రిస్ గోపాలకృష్ణన్ తదితరులు ఇందులో పాల్గొన్నారు. -
మండలి డిప్యూటీ ఛైర్మన్ పదవికి బండ ప్రకాశ్ నామినేషన్
-
‘మండలి’ డిప్యూటీ చైర్మన్‌గా బండా ప్రకాశ్!
సాక్షి, హైదరాబాద్: సుమారు ఏడాదిన్నరగా ఖాళీగా ఉన్న శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఈ ఎన్నికకు సంబంధించి శుక్రవారం నోటిఫికేషన్ వెలువడనుండగా, 11వ తేదీన నామినేషన్ల స్వీకరణ, పరిశీలన తదితరాలు పూర్తి చేస్తారు. 12న ఉదయం 10 గంటలకు శాసన మండలి ప్రారంభమైన అనంతరం డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ప్రక్రియను పూర్తి చేసి బాధ్యతలు అప్పగిస్తారు. కాగా శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ ముదిరాజ్ ఎన్నిక దాదాపు ఖాయమైంది. ఆయన పేరును బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఖరారు చేశారు. దీంతో ఈ నెల 11న శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు సంబంధించి నామినేషన్ పత్రాలు దాఖలు చేసేందుకు బండా ప్రకాశ్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం నుంచి శాసన మండలి డిప్యూటీ చైర్మన్‌గా వ్యవహరించిన నేతి విద్యాసాగర్ 2021 జూన్ 3న ఎమ్మెల్సీగా తన పదవీ కాలం పూర్తి చేసుకున్నారు. అప్పటి నుంచి శాసన మండలి డిప్యూటీ చైర్మన్ పదవికి ఎన్నిక జరగకపోవడంతో సుమారు ఏడాదిన్నరగా ఖాళీగా ఉంది. ఇదిలా ఉంటే 2018 మార్చిలో బీఆర్ఎస్ తరపున రాజ్యసభకు ఎన్నికైన బండా ప్రకాశ్ ఎంపీగా ఆరేళ్ల పదవీ కాలం పూర్తి చేయకుండానే 2021 నవంబర్‌లో ఎమ్మెల్యే కోటాలో శాసన మండలికి ఎన్నికయ్యారు. అనంతరం 2021 డిసెంబర్ మొదటి వారంలో బండా ప్రకాశ్ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్‌తో పాటు ప్రభుత్వ చీఫ్‌విప్, మరో రెండు విప్ పదవులు కూడా ఖాళీగా ఉన్నాయి. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ ఒక్కరే ప్రస్తుతం మండలిలో ప్రభుత్వ విప్‌గా వ్యవహరిస్తున్నారు. డిప్యూటీ చైర్మన్ ఎన్నిక ముగిశాక మండలి చీఫ్ విప్, విప్ పదవుల భర్తీ జరుగుతుందని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. -
AP: మండలి డిప్యూటీ చైర్ పర్సన్‌గా జకియా ఖానమ్ నామినేషన్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ పదవికి నామినేషన్ దాఖలు అయింది. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ జకియా ఖానమ్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు. తొలిసారి మైనారిటీ మహిళకు డిప్యూటీ చైర్మన్ పదవి అవకాశం దక్కనుంది. శుక్రవారం డిప్యూటీ చైర్మన్ ఎన్నిక జరగనుంది. చదవండి: అల్పపీడనం: భారీ వర్షాలు! సోషల్ మీడియా వార్తలు నమ్మొద్దు ఈ సందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ.. జకీయా ఖానమ్‌కు మండలి వైఎస్ చైర్మన్ పదవి ఇవ్వడం హర్షదాయకమని అన్నారు. ఒక మైనారిటీ మహిళను ఎంపిక చేయడం కీలక నిర్ణయమని పేర్కొన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మైనారిటీలపై సీఎం జగన్‌కు ఉన్న ప్రేమ స్పష్టమైందని పేర్కొన్నారు. -
ధర్మేగౌడ మృతి.. దర్యాప్తుకు ఆదేశం
సాక్షి, బెంగళూరు: కర్ణాటక శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ ధర్మేగౌడ ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇటీవల సొంతింటి నిర్మాణానికి పూజ చేసిన ఆయన ఆకస్మికంగా మృతి చెందడంపై పలువురు రాజకీయ నేతలు దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా సైతం ఆయన మృతికి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. (చదవండి: ఆ..వేదనే అంతు చూసిందా? ) ధర్మేగౌడ మృతి దురదృష్టకమరమని, ఆయన మరణ వార్త తనను ఎంతగానో బాధించిందంటూ ఓం బిర్లా ఆవేదన వ్యక్తం చేశారు. అదే విధంగా మండలిలో ధర్మేగౌడకు జరిగిన అవమానం ప్రజాస్వామ్యమంపై దాడి అన్నారు. చట్టసభల హుందాతనం, స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. అనంతరం ఆయన మృతి కేసును ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశించినట్లు ఆయన ప్రకటించారు. చదవండి: కర్ణాటక శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ ఆత్మహత్య -
ఆ..వేదనే అంతు చూసిందా?
సాక్షి, బెంగళూరు: సొంతూరు చిక్కమగళూరు జిల్లా కడూరు తాలూకా సక్కరాయపట్టణ సమీపంలో రెండురోజుల క్రితం కొత్త ఇంటి నిర్మాణానికి పూజ చేశారు. ఇంతలోనే ఏమైందో రైలు పట్టాల వద్ద విగతజీవిగా మారారు. రాష్ట్ర రాజకీయాల్లో సోమవారం అర్ధరాత్రి విషాదఘట్టం సంభవించింది. విధాన పరిషత్ ఉప సభాపతి ఎస్ఎల్ ధర్మేగౌడ (65) సక్కరాయపట్టణ వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. విషయం తెలిసి పలువురు మంత్రులు, నేతలు హుటాహుటిన సంఘటనాస్థలానికి చేరుకుని తదుపరి కార్యక్రమాలను పర్యవేక్షించారు. జేడీఎస్ నేతగా సౌమ్యుడు, వివాదరహితునిగా పేరున్న ధర్మేగౌడ మరణం నేతలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ఆనాటి నుంచి మౌనంగా ఈ నెల 15వ తేదీన విధాన పరిషత్‌లో బీజేపీ– జేడీఎస్‌లు ఉమ్మడిగా ఆయనను చైర్మన్‌సీట్లో కూర్చోబెట్టగా కాంగ్రెస్ ఎమ్మెల్సీలు నానా యాగీ చేసి ధర్మేగౌడను గెంటేయడం తెలిసిందే. ఆనాటి అవమానాన్ని తలుచుకుని ఆయన తీవ్ర మనోవేదనకు గురైనట్లు సమాచారం. అప్పటి నుంచి బయటకు రావడం తగ్గించారు. నేతల రాజకీయ చదరంగంలో పావుగా మారి, ఈ ఎదురుదెబ్బను దిగమింగలేక తీవ్ర నిర్ణయం తీసుకున్నారని సమాచారం. నువ్వెళ్లిపో అన్నారు: డ్రైవర్ ధర్మేగౌడ కారు డ్రైవర్ మాట్లాడుతూ సోమవారం సాయంత్రం 6.30 గంటల సమయంలో రైలు పట్టాల వద్దకు తీసుకెళ్లమన్నారన్నారు. ఆ సమయంలో వేరే వారితో ఫోన్లో రైలు వచ్చే సమయాల గురించి అడిగారు, నేను కొందరిని కలవాలి, నువ్వెళ్లిపో అని చెప్పడంతో వెళ్లిపోయాను. ఆయన రైలు కిందపడి ఆత్మహత్యకు చేసుకోవడం బాధాకరం అన్నారు. ‘నేను ఆత్మహత్య చేసుకుంటున్నా.. పిల్లలను బాగా చూసుకో. ఇంట్లో అందరూ బాగుండాలి’ అని డెత్ నోట్లో పేర్కొన్నట్లు బీజేపీ నేత సీటీ రవి మీడియాకు తెలిపారు. సీఎం యడియూరప్ప, జేడీఎస్ అధినేత దేవెగౌడ, కుమారస్వామి తదితరులు ధర్మేగౌడ భౌతికకాయానికి నివాళులరి్పంచారు. మంచి నేతను కోల్పోయాం సాక్షి, బెంగళూరు: విధాన పరిషత్ ఉప సభాపతి ఎస్ఎల్ ధర్మేగౌడ ఆత్మహత్య చేసుకున్న సమాచారం తెలుసుకున్న మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ కన్నీరు పెట్టారు. రాష్ట్రం ఓ మంచి నాయకుడిని కోల్పోయిందన్నారు. ఆయన కల్మషం లేని వ్యక్తి అన్నారు. డెత్‌నోట్ రహస్యం: సీఎం పోలీసులకు లభించిన డెత్ నోట్ వివరాలను బహిరంగ పరచడం సాధ్యం కాదని సీఎం యడియూరప్ప అన్నారు. ధర్మేగౌడ మరణం బాధాకరం అన్నారు. ► ధర్మేగౌడ ఆత్మహత్య బాధాకరమని పరిషత్తు చైర్మన్ ప్రతాప్‌చంద్రశెట్టి అన్నారు. ఆయన మరణవార్త దిగ్భ్రాంతికి గురి చేసిందని అసెంబ్లీ స్పీకర్ విశ్వేశ్వరహెగడే కాగేరి పేర్కొన్నారు. ► శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎస్ఎల్ ధర్మేగౌడది ఆత్మహత్య కాదని, రాజకీయ హత్య అని మాజీ సీఎం హెచ్డీ కుమారస్వామి ఆరోపించారు. ఆయన మరణం వెనుక అసలు నిజాలపై విచారణ చేయాలని డిమాండ్ చేశారు. ► ఎస్ఎల్ ధర్మేగౌడ ఆత్మహత్య వార్త షాక్‌కు గురి చేసిందని, చాలా చింతిస్తున్నామని మాజీ సీఎం సిద్ధరామయ్య, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్ అన్నారు. మొదట మెగ్గాన్ ఆస్పత్రికి శివమొగ్గ: సంఘటనాస్థలం నుంచి ధర్మేగౌడ మృతదేహాన్ని అంబులెన్స్‌లో శివమొగ్గ నగరంలోని మెగ్గాన్ అస్పత్రికి తరలించారు. వైద్యులు మంగళవారం ఉదయం శవపరీక్ష చేశారు. ఆ సమయంలో కలెక్టర్ కే.బీ.శివకుమార్, ఎస్పీ కాంతరాజు ఉండి భద్రతను పర్యవేక్షించారు. శివమొగ్గ, చిక్కమగళూరు నుంచి పెద్దసంఖ్యలో జనం తరలిరావడంతో ఆస్పత్రి ముందు బారికేడ్లను పెట్టారు. శివమొగ్గలోనే ఉన్న ఎంపీ రాఘవేంద్ర, పలువురు మంత్రులు నివాళులర్పించారు. పల్లె నుంచి పదవులకు వన్నె సాక్షి, బెంగళూరు: విధాన పరిషత్ డిప్యూటీ చైర్మన్ ఎస్ఎల్ ధర్మేగౌడ పంచాయతీ సభ్యుని నుంచి పరిషత్తు వరకు పలు పదవులను అలంకరించారు. చిక్కమగళూరు జిల్లా కడూరు తాలూకా సఖరాయపట్టణ సమీపంలోని సరపనహళ్లి గ్రామంలో 1955 డిసెంబరు 16వ తేదీన ధర్మేగౌడ జని్మంచారు. బీలేకళ్లహళ్లి తాలూకా పంచాయతీ సభ్యునిగా 1987లో రాజకీయాల్లో అడుగుపెట్టారు. ఆయన సతీమణి మమత కాగా, కొడుకు, కూతురు ఉన్నారు. జిల్లాస్థాయిలో పలు పదవులను అధిష్టించారు. రాష్ట్ర మార్కెట్ మహామండలి అధ్యక్షునిగా, రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ ఉపాధ్యక్షుడిగా, న్యూఢిల్లీ క్రిబ్కో డైరెక్టర్‌గా, నాఫెడ్ సంస్థ డైరెక్టర్‌గా పలు పదవుల్లో పనిచేశారు. బీరూరు నుంచి ఎమ్మెల్యేగా గత 2004లో జేడీఎస్ నుంచి బీరూర్ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. తరువాత చిక్కమగళూరులో 2018 ఎన్నికల్లో బీజేపీ నేత సీటీ రవి చేతిలో ఓడిపోయారు. కాంగ్రెస్ – జేడీఎస్ ప్రభుత్వ సమయంలో 2018 జూన్‌లో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. -
కర్ణాటక శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ ఆత్మహత్య
బెంగళూరు: కర్ణాటక శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ మృతి చెందారు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. చిక్‌మంగ్‌ళూర్ వద్ద డిప్యూటీ ఛైర్మన్ ధర్మేగౌడ మృతదేహం లభ్యమయింది. సంఘటనా స్థలంలో పోలీసులకు సూసైడ్ నోట్ లభించింది. సోమవారం సాయంత్రం ధర్మేగౌడ ఒంటరిగా కారులో వెళ్లినట్లు తెలుస్తోంది. ఈనెల 15న కర్ణాటక శాసనమండలిలో రభస జరిగిన విషయం తెలిసిందే. పలువురు కాంగ్రెస్ సభ్యులు ధర్మేగౌడను సీటులో నుంచి లాగేశారు. మండలిలో ఘటనతో డిప్యూటీ ఛైర్మన్ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ధర్మేగౌడ ఆత్మహత్యకు మరేదైనా వ్యక్తిగతమైన కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డిప్యూటీ ఛైర్మన్ ధర్మేగౌడ మృతిపై మాజీ ప్రధాని దేవెగౌడ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. -
ఫలించని టీ దౌత్యం : నిరాహార దీక్ష
సాక్షి,న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ బిల్లుల ఆమోదంపై రాజ్యసభలో రగడ, ప్రతిపక్ష సభ్యుల నిరవధిక నిరసన కొనసాగుతుండగా కొన్ని ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. పార్లమెంట్ ఆవరణలోని పచ్చిక బయళ్లలో రాత్రంతా నిరసన కొనసాగించిన ఎంపీలను రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ మంగళవారం పరామర్శించారు. టీకప్పులతో దౌత్యం చేయడానికి ప్రయత్నించారు. అయితే రైతులకోసం ఉద్యమిస్తాం.. పార్లమెంటు హత్యకు గురైందనే ప్లకార్డులతో నిరసన కొనసాగిస్తున్న ఎంపీలు మాత్రం "టీ దౌత్యాన్ని" నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. రైతు వ్యతిరేకి అంటూ ఆయనను దుయ్యబట్టారు. దీంతో తాను కూడా ఒకరోజు నిరసన దీక్ష చేస్తానని డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ ప్రకటించడం విశేషం. (ఎంపీల నిరసన : ఢిల్లీ పోలీసుల ఓవర్ యాక్షన్) వ్యవసాయ బిల్లులపై జరిగిన చర్చలో విపక్ష ఎంపీలు అనుచితంగా ప్రవర్తించారని హరివంశ్ ఆరోపించారు. ఎంపీల ప్రవర్తనకు నిరసనగా తాను ఇవాళ ఉదయం నుంచి 24 గంటలు నిరాహార దీక్ష చేపడుతున్నట్టు వెల్లడించారు. దీనికి సంబంధించి ఆయన రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడుకు లేఖ రాశారు. సభలో పరిణామాలు తనను మానసిక వేదనకు గురిచేశాయనీ, దీంతో రాత్రి నిద్ర కూడా పట్టలేదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం పేరిట గౌరవ సభ్యులు హింసాత్మకంగా వ్యవహరించారంటూ ఆరోపించారు. తన నిర్ణయం వారిలో “స్వీయ శుద్దీకరణ” భావనను ప్రేరేపిస్తుందని భావిస్తున్నానన్నారు. మరోవైపు తనపై దాడిచేసి, అవమానించిన వారికి వ్యక్తిగతంగా టీ ఆఫర్ చేయడం గొప్ప విషయమంటూ హరివంశ్‌పై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రశంసలు కురిపించారు. ఆయన ఔదార్యం, శైలి ఆదర్శప్రాయం, ప్రజా స్వామ్యానికి ఇది చక్కటి సందేశం అంటూ ట్వీట్ చేశారు. यह हरिवंश जी की उदारता और महानता को दर्शाता है। लोकतंत्र के लिए इससे खूबसूरत संदेश और क्या हो सकता है। मैं उन्हें इसके लिए बहुत-बहुत बधाई देता हूं। — Narendra Modi (@narendramodi) September 22, 2020 -
8 మంది ఎంపీల సస్పెన్షన్
న్యూఢిల్లీ: రాజ్యసభలో సోమవారం కూడా గందరగోళం కొనసాగింది. వ్యవసాయ బిల్లుల ఆమోదం సందర్భంగా ఆదివారం పలువురు విపక్ష సభ్యులు పోడియం వద్దకు దూసుకెళ్లి, డెప్యూటీ చైర్మన్ హరివంశ్‌తో అనుచితంగా ప్రవర్తించడం తెల్సిందే. బిల్లులను సభాసంఘానికి పంపించాలన్న తీర్మానంపై డివిజన్ ఓటింగ్ నిర్వహించాలన్న తమ డిమాండ్‌ను తోసిపుచ్చడంతో ఆయన ముఖంపై రూల్ బుక్‌ను విసిరేయడం తెల్సిందే. సభామర్యాదలకు భంగం కలిగించిన 8 మంది విపక్ష సభ్యులను సోమవారం సస్పెండ్ చేశారు. ఈ వర్షాకాల సమావేశాలు ముగిసే వరకు వారిపై సస్పెన్షన్ కొనసాగుతుందని రాజ్యసభ చైర్మన్ వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. టీఎంసీ సభ్యుడు డెరెక్ ఓబ్రీన్, ఆప్ సభ్యులు సంజయ్ సింగ్, డోలాసేన్, కాంగ్రెస్ ఎంపీలు రాజీవ్ సత్వ, సయ్యద్ నాజిర్ హుస్సేన్, రిపున్ బోరా, సీపీఎం సభ్యులు కేకే రాగేశ్, ఎలమారమ్ కరీన్‌లను సస్పెండ్ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించగా, మూజువాణి ఓటుతో సభ ఆమోదం తెలిపింది. అంతకుముందు, హరివంశ్‌పై విపక్షపార్టీలు ఇచ్చిన అవిశ్వాస నోటీసును చైర్మన్ వెంకయ్య తోసిపుచ్చారు. జీరో అవర్ అనంతరం వెంకయ్య మాట్లాడుతూ.. ఆదివారం సభలో చోటు చేసుకున్న ఘటనలపై ఆవేదన చెందానన్నారు. ‘కొందరు సభ్యులు రాజ్యసభ సెక్రటరీ జనరల్ టేబుల్‌పైకి ఎక్కి, గట్టిగా అరుస్తూ, డాన్స్‌లు చేశారు. పేపర్లు చింపి, మైకులు విరగ్గొట్టి, డెప్యూటీ చైర్మన్ విధులకు ఆటంకం కలిగించారు. మార్షల్స్ అడ్డుకోకుంటే, డెప్యూటీ చైర్మన్‌పై దాడి కూడా జరిగేది. ఇదేనా పార్లమెంటరీ సంప్రదాయం? ఆత్మ విమర్శ చేసుకోండి’ అని ప్రతిపక్ష సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీమీ స్థానాలకు వెళ్లండి. డివిజన్ ఓటింగ్ చేపడ్తామ’ని డెప్యూటీ చైర్మన్ చెప్పినా విపక్షసభ్యులు పట్టించుకోలేదన్నారు. వెంకయ్యనాయుడు ప్రసంగిస్తున్న సమయంలో విపక్ష సభ్యులు పాయింట్ ఆఫ్ ఆర్డర్‌ను లేవనెత్తి, ఆయన ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీనిపై వెంకయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్ష సభ్యుల సస్పెన్షన్‌పై సహచర ఎంపీలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. వేటు పడిన సభ్యులు ఆ తరువాత బయటకు వెళ్లేందుకు నిరాకరిస్తూ, సభలోనే కూర్చుని నిరసన కొనసాగించారు. వారికి ఇతర విపక్ష సభ్యులు జతకలవడంతో సభా కార్యక్రమాలు స్తంభించాయి. ఈ నేపథ్యంలో పలుమార్లు వాయిదా పడిన సభ.. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో మంగళవారానికి వాయిదా పడింది. విపక్ష సభ్యుల ధర్నా: తమపై విధించిన సస్పెన్షన్‌కు నిరసనగా ఆ 8 మంది సభ్యులు పార్లమెంట్ కాంప్లెక్స్‌లో నిరవధిక ధర్నాకు దిగారు. నిరవధిక నిరసనకు వీలుగా దుప్పట్లు, దిండ్లు తెచ్చుకున్నారు. ఇతర విపక్ష ఎంపీలతో కలిసి గాంధీజీ విగ్రహం ముందు నిరసన తెలిపారు. నినాదాలు, పాటలతో ఆ ప్రాంతాన్ని హోరెత్తించారు. శివసేన, సీపీఐ, ఎస్పీ, జేడీఎస్ తదితర ప్రతిపక్ష పార్టీల ఎంపీలు వారికి మద్దతుగా నిలిచారు. ప్రభుత్వ నియంతృత్వ ధోరణికి ఈ సస్పెన్షన్ ఒక ఉదాహరణ అని టీఎంసీ అధినేత్రి మమత బెనర్జీ విమర్శించారు.వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా భారీ స్థాయిలో ప్రజా ఉద్యమం నిర్వహిస్తామని, రెండు కోట్లమంది రైతుల సంతకాలతో రాష్ట్రపతికి వినతిపత్రం సమర్పిస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఈ బిల్లులకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 25న జరిగే దేశవ్యాప్త నిరసనలకు మద్దతు తెలుపుతూ సీపీఐ, సీపీఎం, సీపీఐ(ఎంఎల్), ఆర్ఎస్పీ, ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. సభ్యులను సస్పెండ్ చేయడం అప్రజాస్వామికమని కాం గ్రెస్ మండిపడింది. ఇది ప్రజాస్వామ్య భారత్ గొంతు నొక్కడమేనని రాహుల్ అన్నారు. ఆరోగ్య సిబ్బంది భద్రత బిల్లు: కరోనాపై పోరాడే ఆరోగ్య సిబ్బందిపై దాడులకు పాల్పడే వారికి ఐదేళ్ల జైలు శిక్ష విధించేందుకు ఉద్దేశించిన ఎపిడెమిక్ డిసీజెస్(సవరణ)బిల్లును సోమవారం పార్లమెంట్ ఆమోదించింది. రాజ్యసభ ఇప్పటికే ఆమోదించిన ఈ బిల్లుకు లోక్‌సభ మూజువాణి ఓటుతో ఆమోదించింది. -
రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌పై అవిశ్వాసం
సాక్షి, న్యూఢిల్లీ : రాజ్యసభలో విపక్షాల ఆందోళన మధ్య వ్యవసాయ బిల్లులకు ఆమోదం లభించిన నేపథ్యంలో పెద్దల సభలో రేగిన దుమారం కొనసాగుతోంది. విపక్ష పార్టీలు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. హరివంశ్‌పై అవిశ్వాస తీర్మానానికి ఆదివారం 12 విపక్ష పార్టీలు నోటీసు ఇచ్చాయి. ప్రజాస్వామిక విలువలను, సంప్రదాయాలను పరిరక్షించాల్సిన హరివంశ్ ప్రజాస్వామిక విలువలకు తూట్లుపొడిచారాని, ఆయనకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని తాము నిర్ణయించామని రాజ్యసభ ఎంపీ, కాంగ్రెస్ నేత అహ్మద్ పటేల్ వెల్లడించారు. విపక్షాల ఆందోళనలను విస్మరిస్తూ రైతు వ్యతిరేక వ్యవసాయ బిల్లులను ఆమోదించడం ద్వారా పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వం ఖూనీ చేసిందని తృణమూల్ ఎంపీ డెరెక్ ఓబ్రెన్ ఆరోపించారు.విపక్ష ఆందోళనలను కప్పిపుచ్చేందుకు ప్రత్యక్ష ప్రసారాన్ని నిలిపివేసి ప్రభుత్వం బిల్లులను ఆమోదింపచేసుకుందని విమర్శించారు. ఇక గురువారం లోక్‌సభ ఆమోదించిన వ్యవసాయ బిల్లులను విపక్షాల ఆందోళన మధ్య ఆదివారం రాజ్యసభ ఆమోదించింది. -
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్ ఎన్నిక
సాక్షి, న్యూఢిల్లీ : రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్డీయే అభ్యర్థి జేడీ(యూ)కి చెందిన హరివంశ్ నారాయణ్ సింగ్ సోమవారం ఎన్నికయ్యారు. హరివంశ్ సింగ్ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైనట్టు రాజ్యసభ చీఫ్ ఎం వెంకయ్యనాయుడు ప్రకటించారు. వాయిస్‌ఓట్ ద్వారా రాజ్యసభ ఛైర్మన్ ఎన్నిక నిర్వహించారు. ఆర్జేడీ అభ్యర్థి మనోజ్ ఝాపై హరివంశ్ నారాయణ్ సింగ్ విజయం సాధించారు. హరివంశ్ సింగ్ అట్టడుగు వర్గం నుంచి వచ్చిన మేథావి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. పెద్దల సభ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైన హరివంశ్ సింగ్‌ను ఆయన అభినందించారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా హరివంశ్ వరుసగా రెండోసారి ఎన్నికయ్యారు. విపక్ష నేతలు సైతం హరివంశ్‌ను అభినందించారు. ఇక అంతకుముందు హరివంశ్‌కు మద్దతుగా బీజేపీ చీఫ్ జేపీ నడ్డా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మనోజ్ ఝాను బలపరుస్తూ విపక్ష నేత గులాం నబీ ఆజాద్ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. గత రెండేళ్లుగా పెద్దల సభను హరివంశ్ నడిపించిన తీరుతో పార్టీలకు అతీతంగా పలువురు సభ్యుల నుంచి ఆయనకు ప్రశంసలు లభించాయి. మరోవైపు 245 మంది సభ్యులు కలిగిన రాజ్యసభలో ఎన్డీయేకు 113 మంది సభ్యులుండగా, హరివంశ్ ఎన్నికకు అనుకూలంగా విపక్ష ఎంపీల మద్దతు కూడగట్టడంలో బీజేపీ విజయవంతమైంది. చదవండి : పెద్దల సభ : ఎథిక్స్ కమిటీ బలోపేతం -
కాంగ్రెస్-టీడీపీ మధ్య బలపడుతున్న బంధం
-
జర్నలిస్టు నుంచి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా..
సాక్షి, న్యూఢిల్లీ : రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ కోసం జరిగిన ఎన్నికల్లో అధికార ఎన్డీఏ విజయం సాధించింది. రాజ్యసభలో గురువారం జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ తరపున బరిలోకి దిగిన జనతాదళ్(యునైటెడ్) ఎంపీ హరివంశ్ నారాయణ్ సింగ్ గెలుపొందారు. జర్నలిస్టుగా పనిచేసి డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైన తొలి వ్యక్తిగా గుర్తింపు పొందిన హరివంశ్ నారాయణ్ సింగ్‌కు అన్ని పార్టీలు అభినందనలు తెలియజేస్తున్నాయి. హరివంశ్ సింగ్ ప్రస్థానం... ‘లోక్ నాయక్’ జయ ప్రకాశ్ నారాయణ్ అనుచరుడిగా గుర్తింపు పొందిన హరివంశ్ జూన్ 30, 1956లో ఉత్తరప్రదేశ్‌లోని బలియా జిల్లా సితాబ్ డయారా గ్రామంలో జన్మించారు(బిహార్‌లోని సరన్, ఉత్తరప్రదేశ్‌లోని బలియా జిల్లాల్లో విస్తరించి ఉన్న ఈ గ్రామంపై హక్కు వదులుకోవడానికి రెండు రాష్ట్రాలు ఇప్పటికీ పోటీ పడుతున్నాయి). బెనారస్ హిందీ యూనివర్సిటీలో డిగ్రీ చదివిన హరివంశ్ హిందీ దినపత్రిక ప్రభాత్ ఖబర్‌లో ఎడిటర్ ఇన్ చీఫ్‌గా పనిచేశారు. ఆ తర్వాత రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా హైద్రాబాద్ బ్రాంచ్‌లో కొన్నాళ్లు బాధ్యతలు నిర్వర్తించిన హరివంశ్.. మాజీ ప్రధాని చంద్రశేఖర్‌కు మీడియా సలహాదారుగా కూడా వ్యవహరించారు. మొదటిసారి ఎంపీగా.. బిహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరొందిన హరివంశ్ జేడీయూ తరపున 2014, ఏప్రిల్‌లో ఎంపీగా తొలిసారిగా రాజ్యసభలో అడుగుపెట్టారు. బిహార్‌కు ప్రత్యేక హోదా అనే డిమాండ్‌ను తెరపైకి తేవడంలో కూడా ఆయన కీలకంగా వ్యవహరించారు. బిహార్ రాజకీయాల్లో పట్టు సాధించేందుకు జేడీయూతో చేతులు కలిపిన బీజేపీ.. రాజ్యసభ డిప్యూటీ పదవిని తమ పార్టీ ఎంపీకే కట్టబెట్టాలని జేడీయూ పట్టుబట్టడంతో.. ఎన్డీయే అభ్యర్థిగా హరివంశ్‌ను బరిలో దింపింది. తమ ఎంపీ గెలుపు కోసం సీఎం నితీష్ కుమార్ వివిధ పార్టీల మద్ధతు కూడగట్టడంలో సఫలమయ్యారు. ఫలితంగా రసవత్తరంగా సాగిన ఈ ఎన్నికలో ప్రత్యర్థి, కాంగ్రెస్ ఎంపీ హరిప్రసాద్ నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ హరివంశ్ విజయం సాధించారు. 1992 తర్వాత తొలిసారిగా.. గురువారం రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైన హరివంశ్.. 1992 తర్వాత తొలిసారిగా ఓటింగ్ ద్వారా ఎన్నికైన వ్యక్తిగా నిలిచారు. 1992లో జరిగిన ఎన్నికలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రేణుకా చౌదరిపై కాంగ్రెస్ అభ్యర్థి నజ్మా హెప్తుల్లా విజయం సాధించారు. ఆమె తర్వాత కె. రహమాన్ ఖాన్, పీజే కురియన్లు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్లుగా పని చేశారు. -
ఎన్డీఏ అభ్యర్థికే సేన మద్దతు
సాక్షి, న్యూఢిల్లీ : రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి ఈనెల 9న జరిగే ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థికి మద్దతిస్తామని శివసేన బుధవారం ప్రకటించింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ అభ్యర్థిగా జేడీ(యూ)కు చెందిన హరివంశ్ నారాయణ్ సింగ్‌ను ఎన్డీఏ బరిలో నిలిపింది.కాగా ఎన్డీఏ అభ్యర్థికే తాము మద్దతిస్తామని శివసేన ఎంపీ అనిల్ దేశాయ్ స్పష్టం చేశారు. మోదీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గత నెలలో విపక్షం లోక్‌సభలో ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు శివసేన దూరంగా ఉన్న విషయం తెలిసిందే. గత కొన్నేళ్లుగా బీజేపీపై పలు సందర్భాల్లో అంశాల ప్రాతిపదికన విరుచుకుపడుతున్న శివసేన రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్ధికి మద్దతిస్తామని ప్రకటించడంతో బీజేపీ వర్గాలు ఊపిరిపీల్చుకున్నాయి. మరోవైపు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ విపక్ష అభ్యర్ధిగా కాంగ్రెస్‌కు చెందిన బీకే హరిప్రసాద్ రంగంలో నిలిచారు. వీరిరువురూ నామినేషన్ పత్రాలను అధికారులకు సమర్పించారు. ఎన్డీఏ అభ్యర్థి హరివంశ్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు కాంగ్రెస్ సహా ఇతర పార్టీలతో ఎన్డీఏ సంప్రదింపులు జరుపుతోంది. -
విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కాంగ్రెస్ ఎంపీ
సాక్షి, న్యూఢిల్లీ : రాజ్యసభ డిప్యూటీ చైర్పర్సన్ పదవికి విపక్షాల అభ్యర్ధిగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ బీకే హరిప్రసాద్ పేరును ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ సినియర్ నేత, ఎంపీ బీకే హరిప్రసాద్ కర్ణాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా ఆయన పేరును ప్రతిపాదిస్తూ సీపీఐ నేత డీ. రాజా ప్రకటించారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి ఆగస్ట్ 9న ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. ఆ మేరకు పార్టీల మద్దతు కోరేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. కాంగ్రెస్ అభ్యర్ధికి ఆమ్ ఆద్మీ పార్టీ, తృణమూల్ కాంగ్రెస్, టీడీపీ మద్దతు ఇచ్చే అవకాశం ఉందని ఉందని కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు తెలిపారు. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో విపక్షాలకు ఈ ఎన్నిక కీలకం కానుంది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్‌ను మద్దతు కోరారు. దీనిపై స్పందించిన నవీన్.. తాము ఇదివరకు జేడీయూ అభ్యర్ధికి మద్దతు ఇస్తామని నితీష్‌కు మాట ఇచ్చినట్లు తెలిపారు. ఎన్డీయే అభ్యర్ధిగా జేడీయూకి చెందిన హరివంశ్ నారాయణ్ సింగ్‌ను బరిలో నిలిపిన విషయం తెలిసిందే. బిహార్ సీఎం నితీష్ కుమార్ తమ పార్టీ అభ్యర్థికి మద్దతు ఇవ్వాలని తెలంగాణ సీఎం కేసీఆర్‌కి, ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్‌కు ఫోన్ చేసిన విషయం తెలిసిందే. బీజేపీకి బలం లేదు రాజ్యసభలో బీజేపీకి తగిన సంఖ్యా బలం లేదని, తమ అభ్యర్థి హరి ప్రసాద్ విజయానికి తగిన బలం ఉందని కాంగ్రెస్ పక్ష ఉప నేత ఆనంద్ శర్మ తెలిపారు. ఏకగ్రీవ ఎన్నిక కోసం బీజేపీ తమను సంప్రదించలేదని, తమతో సంప్రదించకుండానే అధికార పార్టీ అభ్యర్థిని నేరుగా ప్రకటించిందని ఆయన తెలిపారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా చాలా మంది పేర్లను పరిశీలించిన తనంతరం హరి ప్రసాద్‌ను ఎంపిక చేసినట్లు ప్రకటించారు. సభలో బలబలాలెంత ప్రస్తుతం 244 మంది సభ్యులున్న రాజ్యసభలో డిప్యూటీ చైర్మన్‌గా గెలిచేందుకు 123 సభ్యుల మద్దతు కావాలి. ప్రస్తుతం ఎన్డీయే కూటమికి 90 మంది సభ్యుల మద్దతు ఉంది. మరోవైపు ప్రతిపక్షాలు 112 మంది ఎంపీలతో రాజ్యసభలో బలంగా కన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తటస్థంగా ఉన్న అన్నాడీఎంకే(12), బీజేడీ(9), ఇండియన్ నేషనల్ లోక్‌దళ్(1), పీడీపీ(2), శివసేన(3), టీఆర్ఎస్(6), వైఎస్సార్సీపీ(2)లపై ఇరు పక్షాలు దృష్టిసారించాయి. -
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక షెడ్యూల్
న్యూఢిల్లీ : రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి ఈ నెల 9న ఎన్నిక జరగనుంది. ఈ మేరకు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు సోమవారం సభలో ప్రకటన చేశారు. అభ్యర్థులు ఆగస్టు 8వ తేదీ మధ్యాహ్నంలోపు తమ నామినేషన్‌ను సమర్పించాలని తెలిపారు. డిప్యూటీ చైర్మన్‌గా పీజే కురియన్ పదవీకాలం జూన్ 30వ తేదీన ముగిసిన సంగతి తెలిసిందే. బీజేపీ సభలో అతిపెద్దగా పార్టీగా ఉన్నప్పటికీ.. పూర్తి స్థాయి మెజారిటీ లేకపోవడంతో ఎన్డీయే తరఫున అభ్యర్థిని నిలిపే విషయంలో సమాలోచనలు చేస్తోంది. ఒకవేళ అభ్యర్థిని నిలిపితే ఇతర ప్రాంతీయ పార్టీల మద్దతు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో పలు పార్టీలతో బీజేపీ అధినాయకత్వం సంప్రదింపులు జరుపుతోంది. మరోవైపు ప్రతిపక్షాలు కూడా తమ అభ్యర్థిని బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ విషయంపై చర్చిండానికి ఢిల్లీలో ఈ రోజు సాయంత్రం విపక్షాలు సమావేశం కానున్నాయి. ప్రతిపక్షాల తరఫున ఉమ్మడి అభ్యర్థిగా ఎవరు నిలుచున్న వారికి మద్దతు తెలుపడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ నేతలు బీజేడీ, తృణమూల్ కాంగ్రెస్‌లతో మంతనాలు జరుపుతున్నట్టు సమాచారం. -
బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటేస్తాం
-
పార్టీ నేతలతో వైఎస్ జగన్ భేటీ.. కీలక నిర్ణయం
-
పార్టీ నేతలతో వైఎస్ జగన్ భేటీ.. కీలక నిర్ణయం
సాక్షి, అనపర్తి : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర శిబిరం వద్ద వైఎస్సార్సీపీ రీజనల్ కో ఆర్డినేటర్స్, పార్టీ కీలక నేతలతో భేటీ అయ్యారు. దాదాపు మూడు గంటలపాటు ఈ సమావేశం కొనసాగింది. ఈ భేటీలో రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక విషయంపై పార్టీ నేతలతో చర్చించి వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. సమావేశం అనంతరం వైఎస్సార్సీపీ నేత ధర్మాన ప్రసాదరావు మీడియాతో మాట్లాడారు. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేయాలని వైఎస్సార్సీపీ నిర్ణయం తీసుకుందని ధర్మాన ప్రసాదరావు తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను బీజేపీ నేరవేర్చనందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. పార్లమెంట్ వర్షకాల సమావేశాలు జరిగినంత కాలం పార్లమెంట్ ఆవరణలోనే నిరసన తెలపాలని వైఎస్సార్సీపీ నిర్ణయం తీసుకుంది. రాజీనామా చేసిన వైఎస్సార్సీపీ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలోనే నిరసన తెలపనున్నారని ధర్మాన పేర్కొన్నారు. -
ఏకాభిప్రాయానికి రావాలి
న్యూఢిల్లీ: రాజ్యసభకు తదుపరి డిప్యూటీ చైర్మన్ ఎన్నికపై ఏకాభిప్రాయానికి రావాలని ఉపరాష్ట్రపతి, రాజ్యసభ అధ్యక్షుడు వెంకయ్య నాయుడు అధికార, ప్రతిపక్ష పార్టీలను ఆదివారం కోరారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఆదివారం పదవీ విరమణ పొందిన పీజే కురియన్‌కు వీడ్కోలు పలికేందుకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వెంకయ్య ఈ విజ్ఞప్తి చేశారు. వీడ్కోలు కార్యక్రమానికి పార్టీలకతీతంగా పలువురు నేతలు హాజరయ్యారు. వెంకయ్య మాట్లాడుతూ ‘తదుపరి డిప్యూటీ చైర్మన్‌గా ఎవరు ఉండాలనేదానిపై అధికార, ప్రతిపక్ష పార్టీలు ఏకాభిప్రాయానికి వస్తాయని నేను ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు. కురియన్ తనకు మంచి సహోద్యోగిగా ఉన్నారనీ, ఎంతో ఉత్సాహంతో సభను నడిపేవారని వెంకయ్య కొనియాడారు. అనంతరం కురియన్ మాట్లాడుతూ పెద్ద ఆటంకాలు లేకుండా సభ సజావుగా సాగేలా చూడాలని సభ్యులను కోరారు. ఏదైనా సమస్య ఉంటే ఇరుపక్షాలు కలసి కూర్చొని పరిష్కరించుకోవాలి తప్ప అస్తమానం సభా కార్యకలాపాలకు అడ్డుతగలకూడదని హితవు చెప్పారు. ప్రతిపక్ష నేత గులాం నబీ ఆజాద్, కేంద్ర మంత్రులు రవి శంకర్ ప్రసాద్, పియూష్ గోయల్, విజయ్ గోయెల్, వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, సీపీఐ నేత డి.రాజా తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. -
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా కేకే?
సాక్షి, హైదరాబాద్ : రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా తమ పార్టీ సీనియర్ నేత, ఎంపీ కె.కేశవరావు ఎన్నికయ్యే విధంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పావులు కదుపుతున్నారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ఉన్న కురియన్ స్థానంలో కేకేను ఎన్నుకునే అంశంపై ప్రధాని మోదీతో కేసీఆర్ చర్చించినట్టుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి. రాజ్యసభకు డిప్యూటీ చైర్మన్‌గా బీజేపీయేతర పార్టీకి అవకాశం ఇస్తే టీఆర్ఎస్కు చాన్స్ దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల ఢిల్లీ పర్యటనలో ప్రధానితో కేసీఆర్ భేటీ సందర్భంగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక అంశం కూడా చర్చకు వచ్చినట్టుగా తెలిసింది. రాజ్యసభలో బీజేపీకి పూర్తి మెజారిటీ లేదు. సభాపతిగా ఆ పార్టీకి చెందిన వెంకయ్యనాయుడు పదవిలో ఉన్నారు. ఇక డిప్యూటీ చైర్మన్‌గా బీజేపీయేతర పార్టీకి అవకాశం ఇవ్వడం ద్వారా ప్రతిపక్షాలకు సరైన ప్రాతినిధ్యం కల్పించామన్న సంకేతాలు పంపినట్టు అవుతుందని బీజేపీ భావిస్తోంది. అటు లోక్‌సభలోనూ స్పీకర్‌గా బీజేపీకి చెందిన సుమిత్రా మహాజన్ ఉండగా, డిప్యూటీ స్పీకర్‌గా అన్నా డీఎంకేకు చెందిన తంబిదురైని ఎన్నుకున్నారు. ఇదే సంప్రదాయాన్ని రాజ్యసభలోనూ అనుసరించాలనే యోచనలో బీజేపీ జాతీయ నాయకత్వం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇందులో భాగంగానే టీఆర్ఎస్కు రాజ్యసభ అవకాశం ఇవ్వాలనే యోచనలో ఉన్నట్టుగా సమాచారం. సభలో బలాబలాలు ఇలా.. ప్రస్తుతం రాజ్యసభలో (ఖాళీలు పోను) 241 మంది సభ్యులున్నారు. తన అభ్యర్థిని డిప్యూటీ చైర్మన్‌గా నెగ్గించుకోవాలంటే బీజేపీ కూటమికి 122 మంది కావాలి. ప్రస్తుతం సభలో ఆ కూటమికి 87 మంది సభ్యులున్నారు. అంటే 35 మంది తక్కువగా ఉంటారు. ఇక యూపీఏకు 58 మంది సభ్యులున్నారు. ఈ కూటమి కూడా సొంతంగా అభ్యర్థిని నెగ్గించుకోలేని పరిస్థితి. ఈ లెక్కలను బేరీజు వేసుకున్న సీఎం కేసీఆర్.. మిత్రపక్షాల సాయంతో ఆ పదవిని పొందేందుకు కసరత్తు చేస్తున్నారు. వాస్తవానికి ప్రాంతీయ పార్టీల్లోనూ టీఆర్ఎస్ కంటే ఎక్కువ రాజ్యసభ సభ్యులున్న పార్టీలు ఉన్నాయి. తృణమూల్ కాంగ్రెస్‌కు 13 మంది, సమాజ్‌వాదీ పార్టీకి 13 మంది రాజ్యసభ సభ్యులున్నారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి ప్రతిపక్షాల నుంచే ఎన్నుకోవాలని నిర్ణయం తీసుకుంటే ఈ రెండు పార్టీలూ పోటీపడే అవకాశమున్నట్టుగా టీఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అన్నా డీఎంకేకు సైతం 13 మంది సభ్యులు ఉన్నా.. లోక్‌సభ డిప్యూటీ స్పీకరుగా అవకాశాన్ని తీసుకున్న ఆ పార్టీకి మరోసారి జాతీయస్థాయి పదవిని ఇవ్వకపోవచ్చునని భావిస్తున్నారు. బిజూ జనతాదళ్(బీజేడీ)కు కూడా 9 మంది సభ్యులున్నా.. డిప్యూటీ చైర్మన్ పదవిపై ఆ పార్టీ పెద్దగా ఆసక్తిని ప్రదర్శించడం లేదని సమాచారం. ఆ తర్వాతి స్థానంలో ఉన్న టీఆర్ఎస్కు ఆరుగురు సభ్యులున్నారు. ఆరుగురు రాజ్యసభ సభ్యులతోనే రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవిని కైవసం చేసుకోగలిగితే జాతీయస్థాయిలో టీఆర్ఎస్ పేరు చర్చకు వస్తుందని పార్టీ వర్గాలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. తృణమూల్ పోటీ పడుతుందా? రాజ్యసభ డిప్యూటీ చైర్మన్‌గా ప్రతిపక్షాలకే ఇవ్వాలని నిర్ణయిస్తే తమకు తృణమూల్ నుంచి అంతర్గతంగా పోటీ ఉండే అవకాశముందని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. అయితే తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీతో టీఆర్ఎస్కు చెందిన కేకేకు రాజకీయంగా మంచి సంబంధాలున్నాయి. దీంతో ఆ పార్టీతోపాటు మిగత పార్టీల మద్దతు కూడగట్టడంపై కేసీఆర్ దృష్టి సారించినట్టుగా పార్టీ నేతలు చెబుతున్నారు. గుణాత్మక మార్పు కోసం జాతీయస్థాయిలో ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదిస్తున్న కేసీఆర్.. వివిధ పక్షాల మద్దతు కూడగట్టి బీజేపీ సాయంతో డిప్యూటీ చైర్మన్ పదవిని సాధిస్తారని పేర్కొంటున్నారు. కేకేనే ఎందుకు? ప్రస్తుతం టీఆర్ఎస్ నుంచి కె.కేశవరావు, డి.శ్రీనివాస్, కెప్టెన్ వి.లక్ష్మీకాంతరావు, జె.సంతోష్‌రావు, బి.లింగయ్యయాదవ్, బండా ప్రకాశ్ రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. రాజకీయాల్లో సీనియర్ అయిన కేకే ఎంపిక సరైనదేనని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. మూడున్నర దశాబ్దాల క్రితమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు మంత్రిగా కేకే పనిచేశారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లో కొంతకాలం తెరమరుగైనట్టుగా కనిపించినా.. అనూహ్యంగా పీసీసీ అధ్యక్ష పదవిని పొందారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలోనే పీసీసీకి చీఫ్‌గా వ్యవహరించారు. అదే సమయంలో రాజ్యసభ సభ్యుడిగా అవకాశం పొందారు. అనంతరం జరిగిన రాజకీయ పరిణామాల్లో భాగంగా టీఆర్ఎస్లో చేరి మళ్లీ రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. -
ఆడంబరంగా ‘నేతి’ ప్రమాణం
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ నేతి విద్యాసాగర్‌రావు రెండోసారి శాసన మండలి డిప్యూటీ చైర్మన్ పదవి చేపట్టారు. మండలి డిప్యూటీ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన ఆయన మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్, బీజేపీ, మజ్లిస్‌లు కూడా సహకరించడంతో మండలి డిప్యూటీ చైర్మన్‌గా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో జిల్లా నేతకు రెండోసారి ఈ పదవి చేపట్టే అవకాశం లభించింది. డిప్యూటీ చైర్మన్‌గా ఎన్నికైన నేతి విద్యాసాగర్‌ను సీఎం కేసీఆర్‌తో పాటు ఇతర మంత్రులు సంప్రదాయ పద్ధతిలో చైర్మన్ స్థానం వరకు తోడ్కొని వచ్చారు. సీఎంతో పాటు డిప్యూటీ సీఎంలు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి, ఇతర మంత్రులు సాదరంగా ఆయనను డిప్యూటీ చైర్మన్ స్థానంలో కూర్చోబెట్టారు. అనంతరం సీఎంతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్సీలు అభినందనలు తెలిపారు. రెండోసారి.. నేతి విద్యాసాగర్‌కు వరుసగా రెండోసారి మండలి డిప్యూటీ చైర్మన్ పదవి చేపట్టే అవకాశం లభించింది. అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలిసారి ఆ పదవి చేపట్టిన ఆయన అనంతరం తెలంగాణ శాసనమండలిలోనూ తొలి డిప్యూటీ చైర్మన్‌గా అధికారికంగా బాధ్యతలు స్వీకరించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికైన నేతి ఇటీవల టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం సమయంలో డిప్యూటీ చైర్మన్ హోదాలోనే ఆయన పనిచేశారు. ఆ సమయంలో మండలిలో ఆయన వ్యవహరించిన తీరు పలువురి ప్రశంసలు అందుకుంది. అనంతరం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆయన టీఆర్ఎస్లో చేరారు. తెలంగాణ శాసనమండలి కొలువుదీరిన తొలిరోజు నుంచి ఆయన టీఆర్ఎస్ సభ్యుడిగానే ఉన్నారు. ఆ తర్వాత ఆయన పదవీకాలం ముగి యడం, కొన్ని రోజుల తర్వాత ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీగా ఎన్నిక కావడం తెలిసిందే. మీ పాత్ర ప్రశంసనీయం: సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సమయంలో మండలి డిప్యూటీ చైర్మన్ హోదాలో నేతి విద్యాసాగర్ పోషించిన పాత్రను ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించారు. చైర్మన్ స్థానంలో నేతిని కూర్చోబెట్టిన అనంతరం మండలిలో ఇతర సభ్యులనుద్దేశించి సీఎం మాట్లాడుతూ తెలంగాణ సమాజం ఎదరుచూసిన రీతిలోనే నేతి విద్యాసాగర్ వ్యవహరించి ఆ సమయంలో తెలంగాణ పౌరుడిగా తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించారని ప్రశంసించారు. జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లా రాజకీయ సమీకరణల నేపథ్యంలో తనకు రావాల్సిన అవకాశాలు రాకపోయినా నమ్ముకున్న పార్టీలోనే ఉండి సేవ చేయడం నిజంగా గొప్పతనమన్నారు. రాజకీయ నాయకుడిగా ఎదిగేందుకు విద్యాసాగర్ ఎన్నోకష్టాలు పడాల్సి వచ్చిందని, అయినా తన స్వశక్తితో ఈ స్థాయికి ఎదిగారని అన్నారు. జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పూల రవీందర్, కర్నె ప్రభాకర్‌లు కూడా నేతి విద్యాసాగర్‌ను అభినందించారు. -
తెలంగాణ శాసనమండలి ఉపాధ్యక్షుడిగా విద్యాసాగర్
-
‘డిప్యూటీ’కి ఇప్పుడే..
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్‌కు మరోమారు ఎమ్మెల్సీ హోదా ఖరారైంది. ఆయన గురువారం ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవి కోసం తన నామినేషన్‌ను హైదరాబాద్‌లో శాసనసభ కార్యదర్శికి అందజేశారు. జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్‌రెడ్డి, విప్ గొంగిడి సునీతలు వెంట రాగా ఆయన తన నామినేషన్‌ను శాసనసభ కార్యదర్శి రాజాసదారాంకు అందజేశారు. అయితే, నేతి విద్యాసాగర్‌ను తొలుత ఆయనను గవర్నర్ కోటాలో మండలికి పంపాలని టీఆర్ఎస్ అధిష్టానం భావించినా చివరి నిమిషంలో నిర్ణయాన్ని మార్చి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ పదవికి నామినేషన్ వేయించడం చర్చనీయాంశమైంది. గవర్నర్ కోటాలో పంపితే ఎలాంటి ఉత్కంఠ లేకుండా సునాయాసంగా మండలికి వెళ్లవచ్చని, డిప్యూటీ చైర్మన్ హోదాలో ఆయన పార్టీలోకి వచ్చినందున ఆ కోటాలోనే ఆయన్ను మండలికి పంపుతారని మొదటి నుంచి చర్చ జరిగింది. అయితే, అందరి అంచనాలను భిన్నంగా ఎమ్మెల్యే కోటాలో నేతిని టీఆర్ఎస్ నామినేషన్ వేయించింది. బుధవారమే ఆయన చేత నామినేషన్ పత్రాలపై సంతకాలు చేయించినా, అది లాంఛనంగానే చేయించారని, విద్యాసాగర్‌ను గవర్నర్ కోటాలోనే నామినేట్ చేస్తారని ప్రచారం జరిగింది. అయినా, గురువారం మాత్రం విద్యాసాగర్‌ను ఎమ్మెల్యే కోటాలోనే నామినేషన్ వేయించడం గమనార్హం. ఎన్నిక జరిగితే... వాస్తవానికి ఎమ్మెల్యేల కోటాలో కేవలం నాలుగు స్థానాలు మాత్రమే గెలుచుకునేందుకు తగిన బలం టీఆర్ఎస్కు ఉంది. అయితే, ఆ పార్టీ తరఫున ఐదుగురు అభ్యర్థులు నామినేషన్లు వేయడం గమనార్హం. ఈ ఐదుగురిలో విద్యాసాగర్ ఒకరు కావడంతో ఈ ఎమ్మెల్సీ పదవులు ఏకగ్రీవం కాకుండా ఎన్నిక అనివార్యమైతే కొంత ఉత్కంఠకు గురికాక తప్పదు. ఎందుకంటే టీఆర్ఎస్ తరఫున నామినేషన్లు వేసిన ఐదుగురిలో తుమ్మల నాగేశ్వరరావు, కడియం శ్రీహరిలిద్దరూ మంత్రులు. కాబట్టి వారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంటుంది కనుక ఆ ఇద్దరి తొలి ఇద్దరు అభ్యర్థులుగా ప్రకటించనున్నారు. అయితే, ఇక మిగిలిన ముగ్గురిలో నేతితో పాటు మాజీ ఎమ్మెల్సీలు యాదవరెడ్డి (రంగారెడ్డి), బోడకూటి వెంకటేశ్వర్లు (వరంగల్) ఉన్నారు. వీరి ముగ్గురిలో ఇద్దరు ఖచ్చితంగా గెలుస్తారు. మరో వ్యక్తి గెలవాలంటే ఇతర పార్టీల మద్దతు టీఆర్ఎస్కు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఎన్నిక జరగాల్సి వస్తే జిల్లాకు చెందిన నేతి విద్యాసాగర్‌ను మూడో అభ్యర్థిగా, నాలుగో అభ్యర్థిగా పార్టీ ప్రకటిస్తే ఇబ్బందేమీ ఉండదు. కానీ ఐదో అభ్యర్థిగా బరిలో దింపితే మాత్రం ఫలితాలు వచ్చేంతవరకు జిల్లా పార్టీ శ్రేణులకు ఉత్కంఠ తప్పదని పార్టీ వర్గాలే అంటున్నాయి.