బెంగళూరు: కర్ణాటక శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ మృతి చెందారు. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. చిక్‌మంగ్‌ళూర్ వద్ద డిప్యూటీ ఛైర్మన్ ధర్మేగౌడ మృతదేహం లభ్యమయింది. సంఘటనా స్థలంలో పోలీసులకు సూసైడ్ నోట్ లభించింది. సోమవారం సాయంత్రం ధర్మేగౌడ ఒంటరిగా కారులో వెళ్లినట్లు తెలుస్తోంది. ఈనెల 15న కర్ణాటక శాసనమండలిలో రభస జరిగిన విషయం తెలిసిందే. పలువురు కాంగ్రెస్ సభ్యులు ధర్మేగౌడను సీటులో నుంచి లాగేశారు. మండలిలో ఘటనతో డిప్యూటీ ఛైర్మన్ తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ధర్మేగౌడ ఆత్మహత్యకు మరేదైనా వ్యక్తిగతమైన కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. డిప్యూటీ ఛైర్మన్ ధర్మేగౌడ మృతిపై మాజీ ప్రధాని దేవెగౌడ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment