
ప్రకటన సవరించుకున్న రాజ్యసభ డిప్యూటీ చైర్మన్
న్యూఢిల్లీ: రాజ్యసభలో ప్రతిపక్ష బిజెపి నేత అరుణ్ జైట్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లు (తెలంగాణ బిల్లు)కు సంబంధించి ఇచ్చిన నోటీస్ను డిప్యూటీ చైర్మన్ పిజె కురియన్ తప్పుగా చదివారు. ఆ తరువాత ఆయనే తప్పుగా చదివానని తన ప్రకటనను సవరించుకున్నారు.
బిల్లుకు రాజ్యాంగ బద్ధతలేదని, దీనిపై సూచన చేస్తానంటూ అరుణ్ జైట్లీ నోటీసు ఇచ్చారు. అయితే కురియన్ సభ్యులు ఇచ్చిన నోటీసులు చదివే సమయంలో అరుణ్ జైట్లీ బిల్లును వ్యతిరేకిస్తారని చెప్పారు. ఆ తరువాత అరుణ్ జైట్లీ ఇచ్చిన నోటీస్ను తాను తప్పుగా చదివానని కురియన్ సభకు చెప్పారు.